

12వ తరగతికి మించి చదువుకోలేకపోయిన రాజేష్ తన ముగ్గురు కుమార్తెలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి కృషి చేస్తున్నారు.
మేయరుగా తన ముందున్న సవాల్
తన కొడుకు సాధించిన ఘన విజయం గురించి వివరిస్తూ రాజేష్ తండ్రి కుందన్ లాల్ ”నా కొడుకు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవాడు. మేయర్ ఎన్నికల విజయం ద్వారా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని సామాన్యుల కోసం కష్టపడమని చెప్పాను. ఇందులో భాగంగా తమ కుటుంబానికి ఆశ్రయమిచ్చిన చండీగఢ్ నగరాన్ని దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా తీర్చిసిద్ధేందుకు కృషి చేయమని తన నా కొడుకుకి చెప్పాను” అంటారాయన.
తండ్రి నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తానని రాజేష్ ప్రకటించారు. దాన్ని ఒక సవాలుగా తీసుకుని చండీగఢ్ నగరాన్ని దేశంలోనే పరిశుభ్రమైనదిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.
‘స్వచ్ఛ సర్వేక్షణ’ ప్రకారం ప్రస్తుతం చండీగఢ్ దేశంలో మూడవ పరిశుభ్రమైన నగరం.