Tritiya Varsh -2018

Posted Posted in Gallery
FacebookTwitter
FacebookTwitter

సంఘ శిక్షా వర్గ అంటే భారత్ ను సమగ్రంగా చూసే అవకాశం- శ్రీ దత్తాత్రేయ హోస్ బోలె గారు

Posted Posted in News
FacebookTwitter

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించే ఈ తృతీయ సంఘ శిక్షా వర్గ భారత్ ను అర్ధం చేసుకోవడానికి, అనుభూతి పొందడానికి, గ్రహించడానికి స్వయంసేవకులందరికీ ఒక చక్కని అవకాశం అని ఆర్ ఎస్ ఎస్ సహ సర్కార్యవాహ, శ్రీ దత్తాత్రేయ హోస్ బోలె గారు అన్నారు.  ఈ విషయాన్నీ వారు డా. హెడ్గెవార్ స్మ్రితి భవన్ పరసరాలలో 25 రోజుల పాటు వేసవి లో జరిగే సంఘ తృతీయ శిక్షా వర్గ ప్రారంభోపన్యాసంలో చెప్పారు. వేదిక పైన వర్గ సర్వాధికారి శ్రీ డా. వన్య రాజన్ గారు, వర్గ కర్యవాహ శ్రీ హరీష్ కులకర్ణి గారు, వర్గ పాలక్ శ్రీ స్వంత్ రంజన్ గారు, సహ-సర్కార్యవాహ వి. భాగయ్య గారు కూడా ఉన్నారు. దేశం లో ని ప్రతి రాష్ట్రము నుండి వచ్చిన 800 కు పైగా యువ స్వయం సేవకలు ఈ శిక్షణ వర్గ లో పాల్గొంటున్నారు.

RSS,

హోస్ బోలె గారు మాట్లాడుతూ ఈ వేసవి శిబిరం ఒక చిన్న భారత్ స్వరూపాన్ని అందిస్తుంది అని, వివిధ ప్రాంతాల నుండి, వేరు వేరే బాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు కలవారు ఒక దగ్గరికి చేరి ఈ 25 రోజులలో పరస్పరం మాట్లాడుకుంటూ, నేర్చుకుంటూ, నిజమైన భారత దేశాన్ని అర్ధం చేసుకోవడానికి ఒక అవకాశం అని అన్నారు.

ఆర్.ఎస్.ఎస్ కేవలం వేషధారణకు, ప్రార్ధనకే కాదు, ఒక సమగ్రమైన, సంపూర్ణమయిన భావానికి భారత లో ఉన్న భిన్నత్వం లో ఏకత్వాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది అని అందరు గుర్తిస్తారు అని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఆర్.ఎస్.ఎస్ సాహిత్యం ప్రతి భారతీయ భాషలో లభిస్తుంది, సంఘ శిక్షా వర్గ పద్ధతి కూడా దేశం మొత్తం ఒకే రకంగా ఉంటుంది, అయినప్పటికీ ఇది వివిధ ప్రాంతాల యొక్క విశిష్టమైన అంశాలతో తన మాధుర్యాన్ని విస్తరిస్తుంది. ఈ శిక్షా వర్గ ద్వార స్వయంసేవకలు భారత్ యొక్క  భిన్నమైన విశిష్టతలు, వాటి ప్రత్యేకతను ఇక్కడ అనుభూతి పొందవచ్చు అని అన్నారు.

Shiksha Varga 2

తమ ప్రసంగం లో స్వామి రామతీర్థ గారిని గుర్తు చేస్తూ, “ భారత్ నా దేహం, కన్యాకుమారి నా పాదాలు, హిమాలయాలు నా శిరస్సు, నా వెంట్రుకలు గంగా ప్రవాహం, బ్రహ్మపుత్ర, సిందు నా చేతుల నుండి ఉద్బవించినాయి, వింద్యాచలం నా నడుము, కోరమండలం నా కుడి కాలు, మలబారు ఎడమ కాలు, నేను సంపూర్ణమయిన భారతం”  అని చెప్తూనే స్వయంసేవకలు అందరిని స్వామి జీ లాగ అనుభూతి చెందుతున్నారా, అని అడిగారు.

వేసవి కాల శిక్షణ శిభిరాలు ఆర్.ఎస్.ఎస్ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంటాయి అని, ఇంతకు ముందు 40 రోజుల పాటు ఉండే శిభిరాలు కాల క్రమం లో ఒక నెల, ఆ తరువాత 25 రోజలకు కుదించడం జరిగింది అని అన్నారు. ఆర్.ఎస్.ఎస్  1925 లో ప్రారంభం అయినప్పటికిని 1926 నుండి దైనందిన శాఖ, 1929 శిక్షణ శిభిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కాలంలో వీటినే ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంపు (OTC) వ్యవహిరించేవారు. నాగపూర్ లో ప్రారంభం అయిన  ఈ శిబిరాలు కాలక్రమేణ దేశం లోని మిగితా పట్టణాలకు విస్తరించింది, పూణే ఈ విషయం లో రెండవ స్థానంలో ఉంది.  ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. కేశవ్ బలిరాం హెడ్గెవార్ గారు ఈ రెండు వర్గ స్థలాలను సందర్శించేవారు.

ఆర్.ఎస్.ఎస్ 90 వసంతాలు పూర్తి చేసుకున్నపటికిని, 1948-49 లో మొదటి సారి సంఘం నిషేదించ బడినప్పుడు, 1975-77 లోఅత్యవసర పరిస్థితిలలో నిషేధించబడినపుడు, మూడో సారి అయోధ్య లోని వివాదాస్పద కట్టడాన్ని 1992-93 లో కూల్చి నపుడు మాత్రం శిబిరాలు నిర్వహించబడలేదు అని తెలిపారు. స్వయంసేవకులు ఎవరికీ ఈ శిక్ష వర్గ పూర్తి అయిన తరువాత ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వబడవు, కాని ఈ శిక్షణ తరువాత స్వయంసేవకలు తమ పాత్రలను ఇంకా సమర్ధవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది అని, ఈ శిక్షణ పొందిన వాళ్ళు సదా ఆర్ ఎస్ ఎస్ ఆశయాలకు నిబద్దులయి తమ జీవితాంతం కట్టుబడి  ఉంటారు అని ఆశిస్తాం అని చెప్పారు.

ఈ శిక్ష వర్గ ద్వార స్వయం సేవకులు పొందే సాధన, తపస్య ద్వార తమ జీవితాలలో ఉన్నతి సాధిస్తూ ఆర్.ఎస్.ఎస్ ఆశయాలను జీవితాంతం పాటిస్తామని ప్రతిజ్ఞా తీసుకోమని కోరారు. ఈ శిభిరంలో సంఘ పెద్దలు అయిన సరసంఘచాలక్ డా మోహన్ భాగవత్ జి, సర్కార్యవాహ భయ్యాజి జోషి, లాంటి వాళ్ళు స్వయంసేవకులకు ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతం పైన, తాత్వికత పైన  మార్గ నిర్దేశనం చేస్తూ ఉంటారు.

thr 2

FacebookTwitter