సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలి – శ్రీ చలసాని నరేంద్ర

Posted Posted in Narada Jayanti, Press release
FacebookTwitter

నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిచేవారు వాటిని జాతీయత దృష్టితో వివరించే వారు అవసరం అని అందుకు ప్రతి ఒక్కరు ఒక సిటిజన్ జర్నలిస్ట్ గా మారి,  జాతీయత, సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలని సేనియర్ జర్నలిస్ట్ శ్రీ చలసాని నరేంద్ర గారు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

నరేంద్ర గారు ఆదివారం నాడు విశ్వ సంవాద్ కేంద్రం, సమాచార భారతి ఇందూర్ ( Nizamabad) అధ్వర్యంలో నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో దేవర్షి నారద జయంతి – ప్రపంచ పాత్రికేయ దినోత్సవంలో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

జాతీయత, సమాజహితం కోసం రచనలు చేసే వారిని ఏకం చేసే ప్రయత్నం విశ్వ సంవాద్ కేంద్ర చేస్తుందన్నారు.  రచనలు చేయడంలో ఉత్సాహవంతులు అయిన వారి కోసం కార్యశాలలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని కూడా నరేంద్ర గారు వివరించారు.

నారద జయంతి కార్యక్రమానికి సభాధ్యుక్షులుగా వ్యవహరించిన శ్రీ టి శ్రీనివాస్ , ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, నాగారం, మాట్లడుతూ మీడియాకి స్వేఛ్చ అవసరమని, స్వేచ్చగా సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చే వాతావరణాన్ని మీడియా యాజమాన్యాలు ఏర్పరచాలని, సామాన్య ప్రజల భావాలకు పత్రికలల్లో అవకాశం కల్పించాలని కోరారు. సమాజంలోని పాత్రికేయులు, పాఠకుల సమాజ హితం కొరకు  పాటు పడాలని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమ నిర్వాహకులు శ్రీ దిగ్గాయి ఆనంద్ గారు మాట్లాడుతూ సమాచార భారతి లక్షలను, అదే విధంగా విశ్వ సంవాద్ కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సనాతన సంప్రదాయంలో దేవర్షి నారదుడు లోకహితం కొరకు సమాచారాన్ని అందరికి తెలియ పరచారని  వారి జయంతి ని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినోత్సవం నిర్వహించడం ఒక ఆనవాయతి అని అన్నారు.

ఈ సందర్బంగా పలువురు విలేఖరులకు జ్ఞాపిక, శాలువా తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీమన్నారాయణ, నాగ శ్రీనివాస్,  సురేందర్, శ్రీనివాస్, చక్రధర్, సత్యం  తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

FacebookTwitter

మీడియా శక్తి ని దేశ హితం కొరకు వినియోగించాలి – శ్రీ రాక సుధాకర్

Posted Posted in Narada Jayanti, Press release
FacebookTwitter

 

నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు పనిచేస్తున్నారని శ్రీ రాక సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్, జమ్మూ & కాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి, అభిప్రాయపడ్డారు.

విశ్వ సంవాద్ కేంద్రము, సమాచార భారతి అద్వర్యంలో బుధవారం 2 మే నాడు హన్మకొండ బాల సముద్రంలోని సామ జగన్ మోహన్ స్మారక భవనంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినోత్సవం నిర్వహించారు.

కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీ సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో అత్యంత ప్రభావవంతమైన రంగం మీడియా రంగమని, ప్రజల్లో తాము అనుకున్న భావాన్ని కల్పించగలిగే శక్తి పత్రిక రంగానికి ఉన్నదన్నారు. మీడియా యాజమాన్య ప్రతిబందకాలు వలన పాత్రికేయులలో కొంత  ఇబ్బంది ఉన్నపటికీ వార్తలను నిర్బయంగా రాయడం వలన ప్రభుత్వాలలో ప్రజలలో సమాజ హితం కొరకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు.

ముఖ్యంగా పాత్రికేయ బాష అంటూ కుంభకోణం, స్వాహా, శఠగోపం, కైంకర్యం, చెవిలో పూలు లాంటి  హిందూ ఆద్యాత్మిక పదాలను వక్రీకరించటం జరుగుతుంది అని, వీటి వాడుకలో పాత్రికేయులు, పాఠకులు ఇద్దరు జాగ్రత్త పడాలని కోరారు.

సత్యం ఆధారంగా వెలువడే వార్తలకే ప్రజలలో ఆదరణ ఉంటుంది అనడానికి నేటి సోషల్ మీడియా ప్రత్యక్ష అనుభవమని గుర్తు చేసారు. నియంతృత్వంగా వ్యవహరించే ప్రభుత్వాల పీఠాలు  సహితం మీడియా చైతన్యం కారణంగా కుప్పకూలయన్నారు. సోషల్ మీడియా రాకతో సిటిజన్ జర్నలిజం ప్రారంభమై మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు పాత్రికేయులుగా మార్పు చెందుతున్నారన్నారు. పత్రిక/టి వి నిర్వహణ కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన కారణంగా ఇప్పుడు వెబ్ చానల్స్ ప్రారంభమయ్యాయన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ సంవాద కేంద్రం సంయోజకులు ప్రొఫెసర్ చిలకమారి సంజీవ మాట్లాడుతూ పాత్రికేయులు నారద మహర్షి లాగా మానవాళి శ్రేయస్సు కోసం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం కృషి చేయాలన్నారు.

ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో పాత్రికేయ వృత్తి లో విశేషంగా కృషి చేస్తున్న దూరదర్శన్ అల్ ఇండియా రేడియో స్టాఫ్ రిపోర్టర్ శ్రీ పి వి మదన్ మోహన్, ఆంద్రజ్యోతి  వరంగల్ ఎడిషన్ ఇంచార్జ్ శ్రీ శంకర్ రావు శెంకేసి, తెలంగాణ టుడే వరంగల్ ప్రత్యేక కరస్పాండెంట్ శ్రీ పి లక్ష్మా రెడ్డి లను ఘనంగా సన్మానించారు.

సమాచార భారతి నిర్వాహకులు శ్రీ దాస్యం రామానుజం, శ్రీ ఆర్ లక్ష్మణ్ సుధాకర్, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం శాఖ విద్యార్థులు, రచయితలు , కవులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

 

FacebookTwitter

ప్రజాభిప్రాయ నిర్మాణంలో, సేకరణలో పాత్రికేయుల పాత్ర కీలకం – శ్రీ రాంపల్లి మల్లికార్జున్

Posted Posted in Narada Jayanti, Press release
FacebookTwitter

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం చేసిన మహానుభావులు ప్రపంచ మొదటి పాత్రికేయుడు నారదుడు అని, శ్రీ రాంపల్లి మల్లికార్జున్ రావు, లోకహితం మాస పత్రిక మాజీ ఎడిటర్, పేర్కొన్నారు.

మల్లికార్జున్ గారి 2 మే నాడు కరీంనగర్ లోని స్థానిక ఫిలిం భవన్ లో జరిగిన విశ్వ సంవాద్ కేంద్ర , సమాచార భారతి ఆధ్యర్యంలో నిర్వహించిన నారద జయంతి సంద్భార్బంగా  ప్రధాన వక్త గా లోకకల్యాణం గురుంచి నారదుడు వివిధ సందర్బాలలో ఏ ఏ విధంగా సమస్యలను పరిష్కరించారో వివరించారు.

ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో విదేశీ పత్రికలూ దారుణమైన బానిస భావజాలాన్ని వ్యాప్తి చేసాయని, అయితే మనదైన భావజాలం లో స్వదేశీ పత్రికలు ప్రారంభించి దేశ పౌరులలో స్వాతంత్ర్య కాంక్ష్య ను రగిలించి స్వతంత్ర సముపార్జనకు ప్రధాన భూమిక మన దేశీయ పత్రికలి పోషించాయని తెలిపారు. ఈనాడు పత్రికలూ విదేశీ భావ జాలపు మోహంలో కొట్టుకొని పోతున్నాయని అది భవిషత్తు కు మంచిది కాదని వివరిస్తూ, ఈ దేశ ధార్మిక, సాంస్కృతిక, సామజిక విలువలతో కూడిన పాత్రికేయ విలువలను పెంపొందింప చేసుకొని ముందుకు పోవాలని దేశ భక్తీ నిర్మాణంలో పత్రిక రంగం కీలక పాత్ర పోషిస్తుందని, పాత్రికేయులు ఆ దిశగా కృషి చేయాలని కోరారు.

సభాధ్యక్షులు గా పాల్గొన్న డా గండ్ర లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నారదుడు ఆనాటి గొప్ప పాత్రికేయుడు అని, వారి పాత్రికేయత్వం సమాజ సంక్షేమం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వినియోగించబడిందని నేటి పత్రికలూ  నారదుడుని స్పూర్తిగా తీసుకొని సమాజ హితమే లక్ష్యంగా పని చేయాలనీ పిలుపునిచ్చారు.

ఆత్మీయ అతిధి గా పాల్గొన్న శ్రీ బూర్ల దక్షిణ మూర్తి గారు మాట్లాడుతూ ఒక పత్రిక వేల సైన్యం తో సమానమని అందువలన పత్రిక పూర్తి సమాచారం లో సమ్యక్ దిశలో నడువాల్సిన అవసరం ఉందని వార్తలు రాయడంలో నిజాయితితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసారు.

గౌరవ అతిధి టి యు డబ్ల్యు జే అధ్యక్షులు శ్రీ తాడూరి కరుణాకర్ గారు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిదిని విలేఖరులు నిత్య సంరక్షనతో నిజాయితిగా వార్తలను అందిస్తూ సమాజ జగరణలో పాలు పంచుకుంటున్నారని , పత్రికలూ ఎవరికీ వత్తాసు పలకకుండా కేవలం వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తాయని, ఇలాంటి విషయాలో నారదుడు ఉత్తమ పాత్రికేయుడని  కొనియాడారు.

టి యు డబ్ల్యు జే కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో పత్రికల పాత్ర ఎనలేనిదని  నేడు పత్రికలు అత్యంత ప్రభావశీలమైనదని వారు పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రీ పింగిలి వెంకట రమణ రెడ్డి, శ్రీ ఎలగందుల సత్యనరయన్, శ్రీ గాజుల రవీందర్, శ్రీ కొట్టే మురళి కృష్ణ, కుమ్మరి కుంట సుధాకర్, బొంతుల కల్యంచంద్ర, కట్టి శ్రీకాంత్, మల్లోజుల కిషణ్ జి, గార్ల సంపహ్ట్ , గుండు రమేష్, నవీన్, సంజీవ్ రెడ్డి, కుంటు మల్లేష్, తోట రాజేందర్ తో పాటు వివిధ పత్రికల పాత్రికేయులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

FacebookTwitter

నారదుడి లక్షం లోక కళ్యాణమే – శ్రీ వేదుల నరసింహం

Posted Posted in Narada Jayanti, Press release
FacebookTwitter

శ్రీ నారద ముని ప్రపంచంలోనే మొట్ట మొదటి పాత్రికేయుడని, వారిని కొందరు కలహాల మాంత్రికుడిగా చేశారని, కానీ నిజానికి వారు సమాజ హితం, ధర్మ రక్షణ, సమస్యల పరిష్కారం కోసమే అందరి మధ్య వారధిలా పని చేసారని, సమాచార భారతి సబ్యులు శ్రీ వేదుల నరసింహం గారు తెలిపారు.

నరసింహం గారు విశ్వ సంవాద్ కేంద్ర, సమాచార భారతి అద్వర్యంలో సంగారెడ్డి నగరంలోని బికెఎస్  భవన్ లో నిర్వహించిన నారద జయంతి, ప్రపంచ పాత్రికేయు దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నారదడు లోకకళ్యాణం గురుంచి ఏ విధంగా తాపత్రయ పడేవారో వివరిస్తూ, నేటి సమాజంలో అలాంటి భాద్యతలోనే ఉన్న పాత్రికేయులు ఆయనను స్పూర్తిగా తీసుకొని పని చేయాలని కోరారు.

 

స్వాతంత్ర్య సమరంలోనూ లాలా లజపతి రాయ్, వీర సావర్కర్, అరవింద ఘోష్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి తదితర మహానుభావులెందరో పత్రికలను నడిపారని గుర్తు చేసారు. అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా పాత్రికేయ రంగం నుంచే వచ్చారన్నారు. జర్నలిజం విలువలు పడిపోవడం లేదని, పెడ ధోరణిలో పడకుండా  వాటిని కాపాడుకోవాల్సిన భాద్యత అందరి పై ఉన్నదన్నారు.

సీనియర్ పాత్రికేయుడు టి యు డబ్ల్యు జే జిల్లా అద్యక్షుడు శ్రీ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని వాస్తవాలను వేలికితీయల్సిన అవసరం ఉన్నదన్నారు. జాతీయత, దేశ భక్తిని పెంపొందించేదందుకు ప్రసార మాధ్యమాల కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. గుడ్డిగా జాతీయతను ప్రశ్నించే స్థాయి పెరిగితే ప్రమాద పరిస్థితులు  ఎదురయ్యే అవకాశం ఉన్నదన్నారు. సుస్థిర సమాజ ఏర్పాటులో మీడియా పాత్ర కీలకమన్నారు, ఇటీవల వికిలీక్స్ అనేక రహస్యాలను బహిర్గతం చేసినదిని, ఆధునిక కాలంలో ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు.

కార్యక్రమంలో పాత్రికేయలను మేమెంటోలతో సన్మానించారు. సీనియర్ పాత్రికేయులు అవధాని, బాల కృష్ణ, వెంకటేశం, దయనందం, రాజు గౌడ్, శివ తో పాటు స్థానిక పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు, ఆర్ ఎస్ ఎస్ జిల్లా సంఘ్ చాలక్ శ్రీ ఎన్ సి రామకృష్ణ, ఆర్ ఎస్ ఎస్ జిల్లా కార్యవాహ శ్రీ బొల్లి నర్సింలు, సమాచార భారతి సభ్యులు శ్రీ మద్దూరి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

 

FacebookTwitter

దేశ నిర్మాణంలో పాత్రికేయులది కీలక పాత్ర – శ్రీ అన్నదానం సుబ్రమణ్యం

Posted Posted in Narada Jayanti, Press release
FacebookTwitter

దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కర్యవాహ, నల్గొండలో జరిగిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో కోరారు.

శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు సమాచార భారతి నల్లగొండ జిల్లా వారు లయన్స్ క్లబ్ లో 24 ఏప్రిల్ నాడు నిర్వహించిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో ముఖ్య వక్త గ పాల్గొన్నారు. వారు మాట్లాడూతూ పాత్రికేయుల రచనలు సమాజ హితం కొరకు అయినప్పుడే అవి ఒక దిక్సూచి గా పని చేస్తాయన్నారు. పాత్రికేయులు నిర్బయంగా, ఒక వర్గానికో లేదా ప్రభుత్వానికి పక్షపాతం లేకుంటా సమాజ హితం కొరకు పని చేయాలని కోరారు.

పాత్రికేయ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ప్రజలకు ఒక గౌరవ ప్రదమైన భాద్యతాయుతమైన వారధిగా ఉండాలని ఆశించారు.

తెలంగాణ ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కర్నాటి విజయ్ కుమార్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేవర్షి నారదుడు విశ్వ వ్యాప్త మొట్ట మొదటి పాత్రికేయుడు అని , ఏ పని చేసిన ధర్మం కోసం, లోకకళ్యాణం కోసం చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు నారదుడి ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమం లో క్రిష్నయ్య, రవీందర్ రెడ్డి, బొబ్బిలి హరి కృష్ణ రెడ్డి, దుర్గాచారి, ప్రదీప్, అనిల్, ప్రకాష్, భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు.

FacebookTwitter