Inspiration

ఫతేహ్ దివస్

Posted
FacebookTwitter

ఢిల్లీ సిక్కులు – బాబా బఘెల్ సింగ్

అది 1783 సంవత్సరం. సిక్కు నాయకుడు బాబా బఘెల్ సింగ్ మొగల్ రాజు షా ఆలం నుండి ఢీల్లీని జయించారు. మార్చ్ 11, 1783 లో సిక్కు సైన్యం గుర్రాలు ఏనుగులపై ధైర్యముగా ఢిల్లీకి వెళ్లి యెర్ర కోట పై సిక్కు జెండాను ఎగురవేశారు. ఈ రోజున వేలమంది సిక్కులు ఫతేహ్ దివస్ అన్న పేరుతో పండుగలా జరుపుకుంటారు.

అయితే ప్రతీ సంవత్సరము ఈ తేదీ గ్రెగోరియన్ క్యా లెండర్ ప్రకారము వేరే రోజు వస్తుంది.
అమృత్ సర్ లోని ఝాబాల్ కలాన్ అనే గ్రామంలో దిల్లోన్ జాట్ కుటుంబంలో జన్మించిన ఇతని పూర్వీకులు 1580 లోగురు అర్జున్ సాహిబ్ కాలంలో సిక్కు మతం పుచ్చుకున్నారు. మొదటిసారి బఘెల్ సింగ్ జనవరి 8, 1774 లో ఢిల్లీ పై దాడి చేసి షాదార ప్రాంతం వరకు స్వాధీనం చేసుకున్నారు. జులై 17, 1775 లో చేసిన రెండవ దాడిలో సిక్కులు పహార్ గంజ్ మరియు జై సింఘపురా చుట్టుపక్కల ప్రాంతాలను(నేటి ఢిల్లీ) స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు, ఇతర సరఫరా కొరతవల్ల సిక్కులు తాత్కాలికంగా తమ దాడిని ఆపవలసి వచ్చింది. కానీ వారి తుది లక్ష్యం మాత్రం ఎర్ర కోటే. మార్చ్ 11, 1783 న ఢిల్లీ లో ఎర్ర కోటలోకి ప్రవేశించి ముఘల్ చక్రవర్తి షా ఆలం II ఉన్న దివాన్ – యి – ఆమ్ ను స్వాధీనం చేసుకున్నారు.
చక్రవర్తి షా ఆలం IIసిక్కులతో ఒప్పందం చేసుకొని, సిక్కుల చారిత్రాత్మక ప్రదేశాలలో గురుద్వారాల నిర్మానంతోపాటు అన్నీ షరతులు అంగీకరించాడు. మొఘల్ రాజు ఔరంగజేబు ఆదేశం ప్రకారము గురుతేగ్ బహదూర్ ని ఉరితీసిన గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురువుకు దహన సంస్కారాలు చేసిన గురుద్వారా రెకాబ్ సింగ్ సాహిబ్ ఇతను నిర్మించినవే. అంతేకాదు గురుద్వారా బంగ్లా సాహిబ్, గురుద్వారా బాల సాహిబ్, గురుద్వారా మజ్నుక తిల్లా, గురుద్వారా మోతి బాగ్, గురుద్వారా మాతా సుందరి, బాబా బందాసింగ్ బహదూర్ గురుద్వారాలను నిర్మించిన ఘనత ఇతనికే దక్కుతుంది.
ఈనాటికీ ఢిల్లీ బాబా బఘెల్ సింగ్ ధైర్యసాహసాలకు సాక్షిగా నిలబడి ఉంది. బాబా భాగేల్ సింగ్ ఢిల్లీలో ఏ ప్రదేశంలో తన ౩౦,౦౦౦ మంది సైనికదళాలతో ఆగిఉన్నాడో ఆ ప్రదేశం ఇప్పుడు తీస్ హజారీ గా ప్రసిద్ధి చెందినది. ఎప్పుడైతే మొఘల్ చక్రవర్తికి సిక్కులు ఢిల్లీ పైకి దాడి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసిందో అతను ఎర్ర కోట అన్ని ద్వారాలు మూసివేయమని, ముఖ్యంగా ఆహార సరఫరా జరిగే ద్వారాలు మూసివేయడం ద్వారా సిక్కులు ఆహారపదార్ధాల కొరతవల్ల మరలిపోయెట్లు చేయాలని ఆదేశించాడు. కొంతమంది సిక్కులు అనుకోకుండా ఒక కార్మికుడిని కలిసినప్పుడు అతను కోట గోడలో కొంత భాగము లోపలికి పోయినట్లు, వెలుపలి భాగము మాత్రము చెదరలేదని వారికి తెలియచేసాడు.సిక్కులు కార్మికుడి సహాయంతో ఆ ప్రదేశానికి చేరుకొని కర్ర దుంగతో గోడను పడగొట్టి లోపలి ప్రవేశించారు. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని మోరి గేట్ గా అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఇంటర్ స్టేట్ బస్సు టెర్మినస్ ఉంది. ఎర్ర కోట విజయం తరువాత సిక్కులు అందరికి మిఠాయిలు పంచారు. మిఠాయిలు పంచిన ఆ ప్రదేశాన్నే ఇప్పుడు మిఠాయి ఫుల్ అని పిలుస్తున్నారు.
ఢిల్లీ ఫతేహ్ దివస్ ఈ సంవత్సరం మార్చ్ 21 వ తేదీన జరిపారు.

భారత చరిత్ర ముఖ్యంగా బ్రిటిష్ ముందు కాలం గురించి మాట్లాడుతున్నప్పుడు సిక్కుల అద్భుతమైన చరిత్రను మనం ఎందుకు పెద్దగా గుర్తుచేసుకోము? బలవంత మతమార్పిడిని వ్యతిరేకించి నిలబడిన వీరి ధైర్యాన్ని, అనాగరికులైన మొఘలులు సిక్కుల పట్ల చూపిన క్రూరత్వం గురించి ఎందుకు మాట్లాడము? ఎందువల్ల రక్తసిక్తమైన మొఘల్ చరిత్రకు రంగు పూసి ఇప్పటికి దేశమంతటా పాఠశాలలలో బోధిస్తున్నారు? సిక్కుల చరిత్రను పక్కకు పెట్టారు? కనుక ఈ పరిస్తితి మారాలంటే మనం మన వీరుల గురించి ఎక్కువగా చదివి, వారి గురించి నలుగురికి చెపుతామని ప్రమాణం తీసుకోవాలి. లేదంటే ఈ చరిత్ర మరుగున పడిపోతుంది.

Download Samachara Bharati App for more such inspirational incidents – www.swalp.in/SBApp

FacebookTwitter