డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు

సుబ్బారావు గారు ఎప్పుడు ప్రేక్షకుల మధ్యలో కూర్చుని తన సహోద్యోగులను, సహకరించిన వారిని ముందుకు తోసి తన పరిశోధనల యొక్క పురస్కారాలను ప్రజల ద్వారా అందుకునేలా చేసేవారు.తరువాత పాత్రికేయులతో ముఖాముఖిలో , జాతీయ స్థాయిలో ప్రసంగిస్తూ కనిపించేవారు.
FacebookTwitter
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు జనవరి 12 ,1895వ సంవత్సరంలో ,ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో జన్మించారు. లీడర్లే మందుల కంపెనీ లో ఆయన వివిధ రకములైన జబ్బులనునివారించేందుకు పెన్సిలిన్,సెస్టిమేసిన్ లాంటి అనేక యాంటీబయాటిక్స్ ను కనుగొన్నారు. పశు దాణా లోఉపయోగించే పాలీ మిక్సిన్ అనే పదార్థాన్ని కనుగొన్నది వీరి పరిశోధనలోనే.ఇది విటమిన్ b9 వేరుచేసే ఆలోచనాధోరణ కి పునాది వేసింది.1945లో లో లూసి విల్సె చేసినటువంటి పరిశోధనకు అనుగుణంగా రక్త హీనత కు సంబంధించిన వ్యతిరేక వినాశనమునకు కూడా ఇది దోహద పడింది.వీరుచేసిన ప్రయోగాల ఆధారంగా డాక్టర్ సిడ్నీ హార్బర్ అనే శాస్త్రవేత్త క్యాన్సర్ నివారణ కు methotrexate అనే మందును కనుగొన్నారు.ప్రస్తుతం  ప్రపంచం మొత్తం దీనిని ఉపయోగిస్తున్నారు.లీడర్లే కంపెనీ తయారు చేసిన ఫైలేరియా నివారణ మందు కూడా ఈయన కనుగొన్నదె. ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతోంది.
  ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.ఈయన నిర్దేశకత్వంలో బెంజమన్ డర్గర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి టెట్రాసిలిన్ అనే యాంటీబయాటిక్ ను కనుగొన్నారు.యారోమేసిన్ అదే సంవత్సరం లో కనుగొనబడింది.ఇది అతిపెద్ద వైజ్ఞానిక పరిశోధన గా నేటికి కూడా నిలిచింది.ఇప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులు యుద్ధం చేసిన ప్రాంతంలోని మట్టిని నమూనాగా తీసుకొని, వాటిలోని ఫంగయిని కను గొందుకు పైన తెలిపిన మందులు ఉపయోగిస్తారు.లీడర్లీ  కంపెనీలొ పరిశోధన చేయబడిన ఈ నమూనాలను  వ్యతిరేక  బ్యాక్టీరియా ఏజెంట్ కింద ఉపయోగిస్తారు. వీరు కనుగొన్నదే మరియొక మందు ఐనోసికోటనిన్ హైడ్రాజ్.ఇది క్షయ వ్యాధి నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.సుబ్బారావు గారు స్వభావరీత్యా సిిగ్గరి.అకుంఠిత దీక్షతో పనిచేసి ఇన్ని అద్భుతాలు సృష్టించినప్పటికీ, సుబ్బారావు గారు తన పనిని వ్యాపారం చేయాలి అనుకోలేదు.ప్రశంసలకు ,అభినందనలకు చాలా దూరంగా ఉండేవారు.సుబ్బారావు గారు ఎప్పుడు ప్రేక్షకుల మధ్యలో కూర్చుని తన సహోద్యోగులను, సహకరించిన వారిని ముందుకు తోసి తన పరిశోధనల యొక్క పురస్కారాలను ప్రజల ద్వారా అందుకునేలా చేసేవారు.తరువాత పాత్రికేయులతో ముఖాముఖిలో , జాతీయ స్థాయిలో ప్రసంగిస్తూ కనిపించేవారు.”అమెరికన్  సైనమిన్ “అనే సంస్థ సుబ్బారావుగారి మీద గౌరవంతో  తమ కొత్త ఫంగస్ కు  “సుబ్బారోమైసిస్ స్పైలండన్స్” అనే పేరు పెట్టారు.
FacebookTwitter