బాలసముద్రం, మే16: వృత్తి నిబద్ధతతో, ఆత్మవిశ్వా సంతో పనిచేసే పాత్రికేయుల ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని భారత్‌టుడే చీఫ్ ఎడిటర్, ఆంధ్రప్రదే శ్ మాసపత్రిక పూర్వ సంపాదకులు జీ వల్లీశ్వర్ అన్నారు. నారద జయంతిని పురస్కరించుకుని సమాచార భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాలసముద్రం లోని సామాజగన్‌మోహన్‌రెడ్డి స్మారకభవనంలో ప్రపంచ పాత్రికేయ దినోత్సవం నిర్వహించారు.
Events and Seminars
మన సినిమాలలో చూపించిన విధంగా నారదుడు కలహ ప్రియుడు, హాస్యం అందించే జోకర్ కాదని అద్భుతమైన విజ్ఞాన ఖని అని, త్రిలోక సంచారంతో ధర్మ రక్షణ, లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించిన గొప్ప పాత్రికేయుడు అని సమాచార భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన నారద జయంతి ఉత్సవంలో పలువురు కొనియాడారు.