Inspiration

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మాతృమూర్తులు చేసిన త్యాగం

Posted
FacebookTwitter

అది 1931 మార్చ్ 23, మధ్యాహ్న సమయం. అదే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను చూడగలిగిన, కలుసుకోగలిగిన చివరి రోజు.

రాజ్ గురు తల్లి, చెల్లెలు మహారాష్ట్ర నుండి లాహోర్ వచ్చారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ముగ్గురు విప్లవ వీరులను చివరిసారిగా కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు జైలుకి వచ్చారు. అక్కడకు చేరుకున్న తరువాత భగత్ సింగ్ ను కలిసేందుకు కేవలం అతని తల్లిదండ్రులకు మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిసింది. ఇతరులకు ఆ అనుమతి లేదు. ఈ అమానుష ధోరణికి నిరసనగా తముకూడా భగత్ సింగ్ ను కలుసుకోమని అతని తల్లిదండ్రులు నిరసన తెలిపారు. జైలు లోపలికి వెళ్ళేందుకు రాజ్ గురు తల్లి, చెల్లెలు, సుఖ్ దేవ్ తల్లికి అనుమతి లభించింది. అయినా వాళ్ళు తమ వారిని చూడటానికి వెళ్లకుండా భగత్ సింగ్ తల్లిదండ్రుల నిరసనలో పాలుపంచుకున్నారు. లోపలకి వెళ్ళేందుకు నిరాకరించారు. అంటే తమ ప్రియతమ పుత్రులను ఆఖరిసారి చూసి, మాట్లాడే అవకాశాన్ని కూడా వదులుకున్నారన్నమాట.

మన దేశ చరిత్రలో ఎందరో వీరులు అపూర్వమైన త్యాగాలు చేశారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మాతృమూర్తులు చేసిన త్యాగం వాటికంటే ఏం తక్కువ ?’’

– శ్రీమతి వీరేంద్రజీ సంధు వ్రాసిన `యుగద్రష్ట భగత్ సింగ్’ అనే పుస్తకం నుంచి…

FacebookTwitter