లచిత్ దివస్

Posted Posted in Inspiration
FacebookTwitter

 

భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్

ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్ లో  ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ ఫూకన్, ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు.లచిత్ బోర్ ఫూకన్  అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయిఘాట్  యుద్ధంలో రామసింగ్ I నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూప్ ని తిరిగి సాధించిన  ఘనత లచిత్  దే.

పదిహేడో శతాబ్దం మధ్యలో మొఘల్ సామ్రాజ్య వైభవం పరాకాష్టలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన మొఘల్ సామ్రాజ్యం కింద అంతే  శక్తిమంతమైన  సైన్యం ఉండేది.  దౌర్జన్యంతో కానీ,  రాజీతో కానీ భారత్ లో  అత్యధిక శాతాన్ని ఆక్రమించుకున్న మొఘల్ రాజులు మతపరమైనహింసకు, అత్యాచారాలకు పాల్పడడంతో  వరుసగా తిరుగుబాటులు, విప్లవాలు  వెల్లువెత్తి చివరకి మొత్తం  సామ్రాజ్యం చరిత్ర చెత్తబుట్టలోకి కుప్పకూలింది.

మోమాయ్ తమూలి రాజా ప్రతాప సింహ హయాంలో అహోం దళాలకు మొదటి బోర్ బారువా సైనికాధిపతిగా ఉండేవారు. తన కుమారుడు  లచిత్రాచరికానికి అవసరమైన అన్ని విద్యల్లో సరైన అభ్యాసం  పొందేలా తమూలీ శ్రద్ధ పెట్టారు.  విద్యాభ్యాసం ముగించుకున్న  లచిత్ ను  అహోం స్వర్గదేవ్  కి ప్రైవేటుకార్యదర్శి హోదాలో  రుమాలు మోసేవాడిగా నియమించారు.

దేక్సోట్ కోయి ముమై దంగోర్ నోహోయ్” – మా మామయ్య మా దేశం కంటే గొప్ప కాదు.

అచంచలమైన కర్తవ్య పాలన, విశ్వాసం, శ్రద్ధ లచిత్ తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు.  యుద్ధానికి పూర్తిగా సన్నద్ధం  కావడం ప్రారంభించాడు. ఎంతోకఠినమైన  నాయకుడైన లచిత్ తన కర్తవ్యం పట్ల ఎంత  శ్రద్ధ కలిగినవాడు అంటే, యుద్ధంలో ఒక  ముఖ్యమైన ఘట్టంలో తన విధుల్లో నిర్లక్ష్యం చూపినకారణంగా తన సొంత మామనే తల నరకడానికి వెనుదీయలేదు.

అహోం భూభాగ విముక్తి 

1667 ఆగస్ట్ లో లచిత్, అటన్ బుర్హాగోహిన్ వెంట రాగా, అహోం యుద్ధవీరులను గౌహతి వైపు నడిపించాడు. 1667 నవంబర్ లో ఇటాఖులి కోటను స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత ఫౌజ్ దార్ ఫిరుజ్ ఖాన్ ను బందీగా పట్టుకుని మొఘల్ దళాలను మానస్ అవతలకి తరిమికొట్టాడు.
1667 డిసెంబర్ లో అహోం వీరుల చేతుల్లో మొఘల్ దళాలు ఓడిపోయిన విషయం నిరంకుశ రాజు ఔరంగజేబుకి తెలిసింది. కోపోద్రిక్తుడైన ఔరంగజేబు రాజా రామ్ సింగ్ నేతృత్వంలో ఒక భారీ సైన్యం అహోం ల పైన దాడి చేసి, వారిని ఓడించాలని ఆదేశించాడు. అదనంగా తన సైన్యానికి 30,000 మంది పదాతి దళాలు, 21 మంది రాజ్ ఫుట్ అధిపతులు, వారి సైన్యాలు, 18,000 మంది అశ్విక దళం, 2,000 మంది విలువిద్యా నిపుణులు, 40 నౌకలను రామ్ సింగ్ 4,000 మంది చార్ హజారీ మన్సబ్, 1500 మంది ఆహాదీ, 500 మంది బర్ఖ్అందేజే  దళాలకు చేర్చాడు. 

రణ స్థలం ఎంపిక 

మొఘల్స్ ఇటువంటి చర్య తీసుకుంటారని బోర్ ఫ్యూకం ముందే ఊహించాడు. అందువల్ల, గౌహతి మీద అదుపు సాధించిన వెంటనే అతను అహోం భూభాగం చుట్టూ రక్షణ వలయాన్ని పటిష్టం చేశాడు. బ్రహ్మపుత్ర నదిని ఒక సహజ రక్షణ కవచంగా వాడుకుని, నది గట్లను పటిష్టం చేశాడు. మైదాన ప్రాంతంలో మొఘల్స్ తో పోరాటం అసంభవమని అతనికి తెలుసు. అందువల్ల తెలివిగా  గౌహతి వెలుపల అహోం యుద్ధవీరులకు అనువుగా ఉండే కొండ, అటవీ ప్రాంతాలను ఎంచుకున్నాడు.

గౌహతి పై దాడి, అలబోయ్ 

యుద్ధం
మొఘల్ దళాలు 1669 మార్చ్ లో గౌహతిపై దాడి చేసి, ఏడాది పాటు ఆ నగరమైన తమ పట్టు కొనసాగించారు. ఆ మొత్తం కాలంలో కూడా అహోం ప్రజలు గట్టి భద్రతా ఏర్పాటు చేసుకోవడంతో మొఘల్ సైన్యం ఏమీ చేయలేకపోయింది. అలవాటు లేని వాతావరణం, పరిచితమైన భూభాగం వల్ల వారు దెబ్బతిన్నారు. అహోం లు ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనువుగా వాడుకుని, మొఘల్ దళాలపై గెరిల్లా దాడులు నిర్వహించేవారు.

అప్పుడు మొఘల్ నాయకులు మోసపూరితంగా అహోం ల మధ్య అసమ్మతి తీసుకొచ్చి, చీలిక కోసం ప్రయత్నించారు. లచిత్ ని ఉద్దేశించిన ఒక లేఖతో  ఒక బాణాన్ని వారు అహోం శిబిరంలోకి ప్రయోగించారు. లచిత్ గౌహతి ఖాళీ చేయిస్తే లక్ష రూపాయలు ఇస్తామని అందులో ఉంది. ఈ సంఘటన గురించి తెలిసిన అహోం రాజుకి లచిత్ విశ్వాసపాత్రత గురించి సందేహం వచ్చింది. అయితే, అటన్ బుర్హాగోహైన్ ఆ సందేహాలను పటాపంచలు చేశాడు.

ఆ ప్రయత్నం విఫలం కావడంతో మొఘల్స్ మైదానంలో పోరాటానికి అహోం లను మోసపూర్తితంగా రప్పించారు. ఇదొక సవాల్ గా తీసుకోవాలని అహోం రాజు లచిత్ ని ఆదేశించాడు. మీరు నవాబ్ నేతృత్వంలో మొఘల్ సైన్యంలో ఒక చిన్న దళం, అలబోయ్ లో అహోం సైన్యంతో తలపడాలి. అహోం వీరులు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుని తమ అదనపు దళాలను, ఆయుధాలను కందకాల్లో దాచిపెట్టారు. దీనితో అహోం లు మీరు నవాబ్ పైన విజయం సాధించగలిగారు. దీనితో ఆగ్రహించిన మొఘల్ నాయకులు తమ సైన్యం యావత్తునూ రంగంలోకి దించడంతో పది వేళా మంది అహోం సైనికులను ఊచకోత కోశారు.

ఈ పరాజయంతో లచిత్ తన సైనికులను ఇటాఖులీ వరకు ఉపసంహరించాడు. ఇంకా యుద్ధం జరుగుతూ ఉండగా, అహోం రాజు చక్రద్వాజా సింహ మరణించాడు. ఆయన కుమారుడు ఉదయాదిత్య సింహ గద్దెనెక్కాడు.  మొఘల్ పన్నాగాలేవి ఫలించకపోవడంతో రామ్ సింగ్ గౌహతి విడిచిపెట్టి 1639లో సంతకాలు చేసిన పాత ఒప్పందానికి మళ్ళీ కట్టుబడేందుకు అహోం లకు 300,000 లక్షల రూపాయలు ఇస్తానని బేరం పెట్టాడు. అయితే ఢిల్లీలో నిరంకుశ ప్రభువు ఈ ఒప్పందానికి కట్టుబడడు అన్న తీవ్ర అనుమానంతో అటన్ బుర్హాగోహైన్  ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు.

ఇదిలా ఉండగా, మొఘల్ నౌకాదళ అధిపతి మునావర్ ఖాన్ రామ్ సింగ్ ని కలిసి అహోం లతో యుద్ధం చేయాలి కానీ మైత్రి కాదన్న ఔరంగజేబు మందలింపు సందేశాన్ని అందించాడు. దీనితో రామ్ సింగ్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగవలసి వచ్చింది. అంధారు బాలి వద్ద నది గాట్లు తెగినట్లు అతనికి సమాచారం అందింది. ఆ సమయంలో లచిత్ తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి, యుద్ధానికి ఏర్పాట్లు పర్యవేక్షించలేకపోయాడు.

ఓటమి కోరల నుంచి విజయం

అలబోయ్ లో తమ పోరాటంలో మొఘల్స్ చేతిలో ఓటమి కారణంగా అహోం సైన్యం నిరుత్సాహంతో కుంగిపోయింది. శత్రువులకు చెందిన పెద్ద పడవలు తమ వైపు వస్తుంటే చూసి వారు భయకంపితులై, అక్కడ నుంచి పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఇది చూసి, లచిత్ వెంటనే తన కోసం ఏడు పడవలను సిద్ధం చేయమని, మంచం మీద నుంచి బలవంతంగా లేచి, పడవ ఎక్కాడు. ఏది ఏమైనా, ఏం జరిగినా తానూ తన దేశాన్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశాడు. తమ అధిపతి లేచి, శక్తి కూడగట్టుకుని నిలబడడం అహోం సైన్యానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. సైనికులందరూ లచిత్ వెంట వెళ్లి నిలబడడంతో, మళ్ళీ సైన్యం పరిమాణం పెరిగింది.

అహోం లు తమ చిన్న పడవలను తీసుకుని ముందుకి సాగగా, లచిత్ వారిని మొఘల్ సైన్యంతో నది మధ్యలో ముఖాముఖి పోటీకి తీసుకుని వెళ్ళాడు.  మొఘల్ సైన్యానికి చెందిన పెద్ద నౌకల కంటే, చిన్న అహోం పదవులకి నది నీటిలో వెసులుబాటు ఎక్కువ ఉండడంతో, పెద్ద నౌకలు చిక్కుకుని పోయాయి. అప్పుడు జరిగిన పోరాటంలో మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. మొఘల్ నౌకాదళాధిపతి మునావర్ ఖాన్, అనేకమంది కమాండర్లు, పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారు.

అహోం లు తమ భూభాగానికి పశ్చిమ సరిహద్దు అయినా మానస్ వరకు మొఘల్స్ ని తరిమికొట్టారు. మొఘల్స్ నుంచి ఎదురు దాడుల కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని లచిత్ తన సైనికులను హెచ్చరించాడు. ఈ సంఘటనలన్నీ కూడా 1671 మార్చ్ మాసంలో జరిగి ఉంటాయని భావిస్తున్నారు.

మొఘల్ దళాలపై యుద్ధం గెలిచి, అహోంల వైభవాన్ని పునరుద్ధరించిన లచిత్ మాత్రం యుద్ధం తాలూకు దుష్ప్రభావాలతో కుంగిపోయారు. అప్పుడు అస్వస్థతకు గురైన లచిత్ 1672 ఏప్రిల్ లో మరణించాడు.

వారసత్వం

హూలంగాపారాలో మహారాజ ఉదయాదిత్య సింగ్ నిర్మించిన లచిత్ మైదానంలో 1672లో ఆయనకు తుది విశ్రాంతి కల్పించారు. ఆయన విగ్రహాన్ని 2000 సంవత్సరంలో అప్పటి అసోం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ SK సిన్హా  ఖడక్ వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఆవిష్కరించారు. ప్రతి ఏడాది పాస్ అవుట్ అయ్యే అత్యుత్తమ క్యాడెట్ కు లచిత్ పతకాన్ని బహుకరిస్తారు. భారతమాత ముద్దుబిడ్డ అయిన లచిత్ ని గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ 24ను లచిత్ దివస్ గా జరుపుకుంటారు.

  • తెలుగు అనువాదం ఉషా తురగా రేవెల్లి
FacebookTwitter

Decolonize Journalism – Narada Jayanti 2017

Posted Posted in Narada Jayanti
FacebookTwitter
For the last 10 years, Vishwa Samvad Kendra , Samachara Bharati Cultural Association has been conducting Narada Jayanti as World Journalists Day.
We are happy that over the years, this program has caught up in other parts of the country and is being celebrated with lots of enthusiasm.
Each year we felicitate some senior journalists too. This year 4 senior journalists Sri SankaraNarayana of Eenadu, Smt. Aruna Ravi Kumar of Gemini TV were felicitated with Sri Vadlamudi RamMohan Rao Smaarak Puraskar. Sri Shiv Kumar (formerly with The Hindu )  and Sri Vidyaranya of Hindi Milap were felicitated with Sri Bhandaru Sadasiva Rao Smaaraka Puraskar. All of them shared their insights on this occasion.
Sri Vijay Babu, State Information Commissioner  was the chief guest. Speaking on the occasion, he recollected the special association he has with all the 4 senior journalists who were felicitated. He said that these 4 have stood against a lot of pressure to present truth as it stands. He mentioned Narada has been demeaned by films as a comedian and therefore the nation does not know of the great knowledge as a mass communicator that Narada shared.

State Information Commissioner Sri Vijay Babu

Sri Nanda Kumar, Akhil Bharateeya Samyojak of Pragna Pravaah recalled his life as a journalist in Kerala. He said there is a difference between having a Successful life and having Meaningful Life . People have begun to compare success with how high in the ladder one has climbed whereas a meaningful life is built on values. Journalism has to be saved by journalists themselves from the falling standards by standing for Truth.
He said there is a need for de-colonising the entire education system including history and Media education. If Narada Sutras are included in journalism courses, the journalist fraternity and thereby the nation as a whole will stand enlightened. He said the journalists are the soul, the Aatma of the nation.
The program was attended and appreciated by over 200 journalists and friends from the mass communication fraternity.
FacebookTwitter

ఘనంగా నారద జయంతి ఉత్సవం – 2017

Posted Posted in Narada Jayanti
FacebookTwitter
గత 10 సంవత్సారులుగా విశ్వా సంవాద్ కేంద్ర, సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నారద జయంతి ని ప్రపంచ పాత్రికేయ దినోత్సవముగ నిర్వహిస్తుంది . ఈ సంవత్సరము నారద జయంతి కార్యక్రమాలు దేశ వ్యాప్తముగా జరుగుతున్నాయి.
    సమాచార భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నాంపల్లి లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో   నారద జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది.
సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ పి. విజయ బాబు ప్రసంగిస్తూ, ‘పాత్రికేయులు విలువలకు ప్రాధాన్యమిస్తూ, క్షీర నీర న్యాయాన్ని పాటించాలని కొంగ మాదిరి కాకుండా హంసలా పాత్రికేయ జీవితాన్ని సాగించాల’ని హితవు పలికారు.
State Information Commissioner Sri Vijay Babu
Sri Nandakumar
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన కేసరి పత్రిక మాజీ సంపాదకులు, ప్రజ్ఙాప్రవాహ్ అఖిల భారతీయ సంయోజకులు జె. నందకుమార్ మాట్లాడుతూ, ‘పరాయి పాలన నుండి బయటపడి దశాబ్దాలు గడిచినా అన్ని రంగాల్లో మాదిరిగానే పాత్రికేయ వృత్తిలోనూ భావదాస్యం కనిపిస్తోంద’ని అన్నారు. ‘కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలను హతమార్చుతున్నా అక్కడి మీడియా ఆ విషయాన్ని పెద్దంతగా పట్టించుకోవడం లేద’ని ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘నిజాలను నిర్భయంగా వెలికితీసే మనస్తత్వం పాత్రికేయులు అలవర్చుకోవాలని, దేశానికి వారు ఆత్మవంటి వార’ని అన్నారు. ‘విజయవంతమైన జీవితానికి, అర్థవంతమైన జీవితానికి ఎంతో తేడా ఉందని, పాత్రికేయలు రెండో కోవకు చెందిన వారైతే సమాజానికి మేలు కలుగుతుంద’ని తెలిపారు. సమాజహితాన్ని కాంక్షించిన పురాణ పురుషుడు నారదుడి జయంతిని ప్రపంచ పాత్రికేయ దినంగా జరపడంలో ఎంతో ఔచిత్యం ఉందని నందకుమార్ అన్నారు.
నారద జయంతిలో భాగంగా స్వర్గీయ వడ్లమూడి రామమోహన్ రావు స్మారక పురస్కారాన్ని  సీనియర్ పాత్రికేయులు     డా. శంకర నారాయణ, శ్రీమతి అరుణ రవికుమార్ అందుకున్నారు. అలానే స్వర్గీయ భండారు సదాశివరావు స్మారక పురస్కారాన్ని శ్రీ విద్యారణ్య, ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ కు అందచేశారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులను అందుకోవడం ఆనందంగా ఉందని బహుమతి గ్రహీతలు తెలిపారు.
FacebookTwitter

దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత సాధించటమే స్వాతంత్రం యొక్క సఫలత

Posted Posted in News
FacebookTwitter
The Prime Minister, Shri Narendra Modi addressing the Nation on the occasion of 70th Independence Day from the ramparts of Red Fort, in Delhi on August 15, 2016.
The Prime Minister, Shri Narendra Modi addressing the Nation on the occasion of 70th Independence Day from the ramparts of Red Fort, in Delhi on August 15, 2016.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15కి 69 సం॥లు పూర్తి చేసుకొని 70 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ 69 సం॥ కాలఖండంలో భారతదేశం అనేక మైలురాళ్ళు దాటి ప్రపంచంలోని శక్తివంత దేశాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. దేశంలో ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తూ కూడా నిలకడగా ఉంది. దేశాభివృద్ధి గమనిస్తే అభివృద్ధి-బీదరికం పోటీపడి పెరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో అభివృద్ధికి నమూనంగా రష్యా కనబడింది. మనదేశంలో మనదేశానికి అనుగుణమైన విధానాలను వదిలిపెట్టి రష్యాను అనుకరించిన కారణంగా దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ వ్యవస్థను గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి కాని అది అంతగా ఫలితం కనబడలేదు. దానికారణంగా గ్రామాల నుండి బ్రతుకుదెరువుకోసం విపరీతమైన వలసలు కొనసాగుతున్నాయి. దానితో పట్టణాలు అపరిమితమైన జనాభాతో సతమతమవుతున్నయి. గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో చెప్పిన మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఇంకా రావాల్సింది గ్రామ స్వరాజ్యం, గ్రామం యొక్క స్వయంసమృద్ధి దానికోసం మనం పనిచేయాలని చెప్పారు. కాని మన పాలకులు ఆ రెండు విషయాలను వదిలిపెట్టి పట్టణాల అభివృద్ధి కోసం పథకారచన చేసుకొంటూ పోయారు. గ్రామాలను కూడా పట్టణీకరణ చేయటానికి ప్రయత్నించారు కాని గ్రామాలను స్వయంసమృద్ధి దిశలో అభివృద్ధి చేయలేకపోయినారు. దాని పరిణామము నేడు మనం చూస్తున్నాము. ఈ పరిస్థితులలో మార్పు తీసుకొని వచ్చి గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధి దిశగా వేగంగా అడుగు వేయవలసిన అవసరం ఉంది.

దేశంలో ఈరోజు ఉన్న పరిస్థితులకు కారణం మన ఆలోచనలో వచ్చిన మార్పు. ఆ మార్పు ఫలితం దేశంలో పరస్పర విబేధాలు, సంఘర్షణలు చోటుచేసుకొన్నాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం సోషలిజం, కమ్యూనిజం ప్రభావం. సోషలిజం, కమ్యూనిజం ప్రభావం మనదేశంలో చాలా మంది ప్రముఖులైన రాజకీయ నాయకులపైన, మేధావులపైన పడింది. సోషలిజం, కమ్యూనిజం పుట్టిన దేశాలలో, అవి మెట్టిన దేశాలలో అవి ఎట్లా తిరోగమనంలో ఉన్నాయో, ఎట్లా ఆ ఆలోచనలు విఫలమైనాయో గమనిస్తూ కూడా పునరాలోచన చేసుకోలేని స్థితికి చేరిపోయిన మన మేధావులు దేశంలో సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేపారు. అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు గమనిస్తూ కూడా ఆ ఆలోచనలను సమీక్షించుకోవాలనే ఆలోచనలు కనబడడం లేదు. ఆ ఆలోచనలు ఇప్పటికే దేశానికి ఎంతో నష్టం కలిగించింది, ఇంకా కలిగిస్తూనే ఉంది.

సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంత ప్రభావం పరంపరాగతంగా వస్తున్న ఈ దేశ సాంస్కృతిక జాతీయ భావాలకు తీవ్రమైన ఆఘాతం కలిగించింది. రాజకీయాలు కేంద్రంగా ఈ దేశంలో సంస్కృతి వికసించాలి, దేశానికి రాజకీయాలే సర్వస్వం. దేశంలో ప్రతి మార్పు రాజకీయాలతోనే వస్తుందని వారు విశ్వసిస్తున్నారు.  దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చిన తరువాత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మన నాయకులు మేధావులకు మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా రూపొందుతున్నాము అనే ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచన ప్రభావం మన రాజ్యాంగం మీద పడింది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలను పరిశీలించాలి. మన రాజ్యాంగం రచన చేసేటప్పుడు ఈ దేశానికి ఏమి పేరు పెట్టాలి అని అనేక తర్జనబర్జనలు జరిగాయి. రాజ్యాంగంలో ఈదేశానికి ఇండియా అని పేరు పెట్టారు. ఈ దేశానికి వేల సం॥ చరిత్ర ఉంది. వేల సం॥ నుండి ఈ దేశానికి భారత్‌ అని ఉంది. ప్రపంచంలో ఈ దేశానికి గుర్తింపు భారత్‌ లేక హిందుస్థాన్‌ దీనిని వదిలిపెట్టి రాజ్యాంగ రచన చేసిన మన పెద్దలకు ఈ దేశానికి ఇండియా అని పేరుపెట్టాలని ఎందుకు అనిపించింది అంటే దానికి ప్రధాన కారణం జాతికి మౌలిక ఆధారం రాజ్యం అనే భావనే. కాని మన దేశంలో వేల సం॥ నుండి మన జాతికి మౌలిక ఆధారం సంస్కృతి. భారతదేశం వేల సం॥ నుండి ఈ సంస్కృతి ఆధారంగానే ప్రపంచంలో ఒక మంచి దేశంగా గుర్తింపు పొందింది. ఈవిషయాలను ప్రక్కకు పెట్టి రాజ్యమే సర్వస్వం అనుకొనే స్థితికి చేరుకొన్నాము దాని పరిణామం ఈ దేశం పేరు ఇండియాగా గుర్తించటం. దానిపైన గొడవలు జరిగిన కారణాన మన అదృష్టం బాగుండి రాజ్యంగంలో ఇండియా దటీజ్‌ (India that is Bharat) భారత్‌ అని వ్రాసారు. దట్‌ వజ్‌ భారత్‌ (India that was bharat‌) అనలేదు. ఆ ఆలోచనలే ఈ దేశంలో సంఘర్షణ కారణమయ్యింది. అది మన జాతీయ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది. ఒక నూన్యతా భావం కలిగించింది. దానివల్ల ఏర్పడిన శూన్యంలో నైతికవిలువలు పతనం. లంచగొండితనం, అవినీతి విశృంఖలంగా సిగ్గులజ్జ లేకుండా పెరిగిపోయింది. అదే నేడు రాజ్యమేలుతున్నది. క్రొత్త క్రొత్త రూపాలు సంతరించుకొని స్వైరవిహారం చేస్తున్నది. ఆ కాలంలో తప్పుడు పనులు చేసేందుకు ఎవరైనా భయపడేవారు. కాని ఈ రోజు బహిరంగంగా చేస్తున్నారు. దానితో అనేక సమస్యలు  దేశం ఎదుర్కొంటున్నది. ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ప్రజలు అసహనానికి కూడా గురి అవుతున్నారు. వ్యక్తిగత స్వార్థాలు కూడా పెరిగాయి. అందుకే ఈ రోజుల్లో కుల, మతపర విబేధాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపిస్తున్నారు. అందుకే రాజకీయ విషయాలకు నిర్దిష్ట విలువలు కనబడడం లేదు అవి మాట్లాడే వారిమీద ఆధారపడి ఉంటున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకు కొన్ని విలువలు ఉండేవి ఈరోజు అటువంటి వారు ఎవరు ఉన్నారని వెతుక్కోవలసి వస్తున్నది.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మన నాయకులకు భారత్‌ ఒక ఆధ్యాత్మిక ప్రేరణ. అది ఒక భావాత్మకమైన ప్రేరణ. అటువంటి నాయకత్వం నేడు మనకు కనబడటం లేదు. ఈ ఆలోచనలు అధునాతనమైనవి కావు ఇవి మూఢనమ్మకంతో కూడుకున్నవనే భావం కనబడుతున్నది. ఇది ఇంకా ఎక్కువకాలం కొనసాగటం చాలా ప్రమాదకరమైనది, ప్రమాదకర రాజకీయాలకు తెరలేపుతుంది. స్వాతంత్య్రం అనేది రాజకీయాలకంటే కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. స్వాతంత్య్రం సత్యం కోసం స్వేచ్ఛా స్వాతంత్రంతో, మన జాతీయ ఆత్మను శక్తివంతం చేయటం అంటే మానవత్వాన్ని వికశింపచేయటం. ప్రపంచంలో మానవత్వాన్ని వికశింపచేయటంలో తనవంతు పాత్ర పోషించుటకు తనను తాను వికశింపచేసుకోవటం, అంతే కాని విబేధాలు సృష్టించటానికి, విలాసాలకు దారితీసే అంతర్జాతీయ వినియోగదారి విధానం కాదు. ఈ దేశం తిరిగి జాగృతమవటంలోనే ప్రపంచంలో మానవతా వికాసం ఆధారపడి ఉంది. ఆర్థిక సంక్షోభాలు, సామాజిక సమస్యలు, ఇస్లాం సామ్రాజ్యవాదం ప్రంపంచాన్ని సతమతం చేస్తున్నాయి. దానిని సరిగా ఎదుర్కొని ప్రపంచానికి ఒక ఆదర్శం చూపించవలసిన అవసరం ఈ రోజు చాలా ఎక్కవగా ఉన్నది దానిని మనం గుర్తించాలి. మారుతున్న ప్రపంచ పరిస్థితులలో ప్రపంచానికి సరియైన దిశానిర్దేశం చేయగల నాయకత్వం కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నది.

స్వాతంత్య్ర పోరాట కాలంలో మన దేశంలో ప్రారంభమైన క్రొత్త క్రొత్త సిద్ధాంతాలు ఈ దేశంలో ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తేరలేపాయి. ఆ సిద్ధాంతాలు బలహీనమైన సంఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. ఈమధ్య కాలంలో దేశంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు గమనించినట్లయితే సంఘర్షణ స్వరూపం మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌యూనివర్సిటీలో, ఢల్లీలోని జెఎన్‌యూలో కాశ్మీర్‌కు సంబంధించిన విషయంపై సంఘర్షణ జరిగింది. అప్జల్‌గురును ఉరితీయటాన్ని నిరసిస్తూ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ దృష్ట్యా అప్జల్‌గురు ఒక స్వాతంత్య్ర యోధుడు, అట్లాగే బుర్హన్‌వని ఎదురుకాల్పులలో చనిపోయాడు. అతనిని కూడా ఒక షహీద్‌గా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలను అక్కడ పనిచేస్తున్న కొన్ని సంస్థలు వ్యతిరేకించాయి, దాని కారణంగా ఘర్షణలు జరిగాయి. ఒకే దేశంలో దేశం కోసం పనిచేస్తున్న సంస్థలో ఇటువంటి మౌలిక విబేధాలకు కారణాలు ఏమిటి? ఢల్లీ యూనివర్శీటీ విద్యార్థి నాయకుడు కన్హయ్య హైదరాబాద్‌లో, దేశంలో మరికొన్ని చోట్ల మాట్లాడుతూ (India is a Nation of Nation) ఇండియా ఈజ్‌ ఏ నేషన్స్‌ ఆఫ్‌ నేషన్‌ అని అన్నాడు. ఇట్లా ఎందుకు అన్నాడు. అతడి సిద్ధాంతం అతనితో అట్లా మాట్లాడిస్తున్నది. రాజ్యాంగ నిర్మాతలు మన దేశంలో మనం ఇప్పుడే ఒక జాతిగా, దేశంగా రూపొందుతున్నాము అనే భావం వ్యక్తం చేస్తే, కమ్యూనిస్టుల భావాజాలం కలిగిన వారు భారత్‌ జాతుల సమూహారము అని మాట్లాడుతారు. ఇదే ఈ దేశంలో అసలైన మౌలిక సమస్య. అందుకే కమ్యూనిస్టులు కాశ్మీర్‌ను ఒక జాతిగా భావిస్తూ ఉంటే జాతీయవాద సంస్థ కాశ్మీర్‌ను ఒక రాజ్యంగా భావిస్తారు. Nation, State ఆలోచనలో ఎంత అంతరం ఉంటుందో మనకు తెలుసు. ఇందులో సత్యాసత్యాలు ఏమిటి? భారత్‌దేశం వేల సం॥సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికంగా, శాస్త్ర, సాంకేతికపరంగా ఒకే విధంగా, ఒక జాతిగా ఉంది. రాజ్యాధికారంగా చూస్తే దేశం మొత్తం 56 రాజ్యాలు ఉండేవి. బ్రిటీష్‌ పాలనకు ముందు వాటిని రాజ్యాలే అనే వారు. ఆలోచనలోనే దేశం వేల సం॥లు ఒక్కటిగా ఉంది. ఎ.కె.గోపాలన్‌ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు భారత్‌ ఒకే దేశం కాకపోతే ఆదిశంకరాచార్యులకు దేశమంతా తిరగాలనే  ప్రేరణ  ఎందుకు కలిగి ఉంటుంది? అందుకే ఇది ఒకే దేశం అన్నారు. రెండువందల సంవత్సరాలకు పూర్వం మన దేశ చరిత్రలో, సాహిత్యంలో లేని కొన్ని గందరగోళ సిద్ధాంతాలు గడిచిన రెండువందల సం॥లకు పైగా ఈ దేశంలో తలెత్తాయి. దానిలో ఆర్య`ద్రావిడ సిద్ధాంతం, వివిధ జాతుల సిద్ధాంతాలు వచ్చి దేశంలో ఒక గందరగోళవాతావరణం నిర్మాణం చేశాయి. అదే ఈ రోజున జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణ. ఇది ఒకే దేశం అనే సత్యాన్ని అందరం గుర్తించినప్పుడు ఈ సంఘర్షణకు తెరపడుతుంది.

ఇక్కడ మనం ఇంకో విషయం కూడా ఆలోచించవలసి ఉంది. ఆ విషయాన్ని ఆలోచించేముందు డా॥ అంబేద్కర్‌ 1950 జనవరి 26 నాడు పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది ఇంకా దేశంలో రావలసింది సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఒక జీవనవిధానం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఈ మూడు అంశాలు జీవనానికి అవసరమైనవి. ఈ మూడు ఒకదానితో ఒకటి మమేకమైనవి. వీటిని విడదీస్తే సామాజిక ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. వీటిలో ఏ ఒక్క దానిని విడదదీసిన ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది, స్వేచ్ఛలేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదరభావంలేని స్వేచ్ఛ, సమానత్వం సహజంగా ఉండలేవు. అంబేద్కర్‌ ఈ మాటలు చెప్పి 66 సం॥లు గడిచిపోయినాయి. ఈ 66 సం॥లో సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. సామాజిక ప్రజాస్వామ్యం కోసం అనేక సంస్థలు వ్యక్తులు పనిచేసుకొంటూ వస్తున్నారు. ఆ పనుల యొక్క సకారాత్మకమైన ప్రభావం సమాజం మీద కూడా పడుతున్నది. అంబేద్కర్‌ కాలంలో లేని క్రొత్త సమస్య ఈ రోజులలో చోటుచేసుకున్నది. అదే రాజకీయ ఆధిపత్యం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి రాజకీయ అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో ఈ సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నాలు అనేకం జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజల మధ్య పరస్పర అవిశ్వాసం, విద్వేషం నిర్మాణం చేయటం ఈ దేశంలోని రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. సమాజంలో మతం మార్పిడులు, విద్వేషభావాలు, తీవ్రవాదం, ప్రజలను రెచ్చగొట్టటం ప్రధానంగా పనిచేస్తున్న సంస్థలు అనేకం కనబడుతున్నాయి. దానితో వాళ్ళు ఏమి సాధించదలుచుకొన్నారు అంటే రాజ్యాధికారం, అటువంటి రాజ్యాధికారం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది. దేశంలో జరుగుతున్న మంచి పనులను ప్రజల ముందు ఉంచి ఆ మార్గంలో దేశాన్ని నడిపేందుకు ప్రయత్నించాలి కాని, మన దేశంలో మీడియా చిన్న పెద్ద గొడవను పతాక శీర్షికకు ఎక్కించి దేశమంతా ఇట్లాగే ఉంది అని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. హింసా, ఉన్మాదంతో పనిచేస్తున్న సంస్థలను ఎండగట్టేందుకు పనిచేయటం లేదు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకొని దేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరుచుకోవలసి ఉంది. గడిచిన 1,000, 1200 సం॥ కాలఖండంలో దేశంలో చోటుచేసుకున్న సమస్యలను శాశ్వతంగా రూపుమాపుకొని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ట పరచుకోవాలి. దేశంలో ఒక సామాజిక సమైక్యతను సాధించాలి. రాజకీయ స్థిరత్వం నెలకొల్పుకోవాలి అదే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పెద్ద ఆశయం, ఆకాంక్షలు వాటిని సాకారం చేసుకునేందుకు పనిచేయటమే దేశ స్వాతంత్య్రం మనకు ఇచ్చే సందేశం.

– రాంపల్లి మల్లికార్జునరావు

FacebookTwitter

సుహృద్భావనను పాడుచేస్తున్న శక్తుల పట్ల జాగరూకులై ఉండాలి: ఆర్.ఎస్.ఎస్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి

Posted Posted in Articles, News, Submit News
FacebookTwitter

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి గారి పత్రికా ప్రకటన

ప్రస్తుతము దేశవ్యాప్తంగా షెడ్యూలు కులాల బంధువులపైన జరుగుతున్న అత్యాచారాలు మరియు ఉత్పీడన కలిగించే సంఘటనలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా గర్హిస్తున్నది మరియు వ్వతిరేకిస్తున్నది. చట్టమును తమ చేతిలోకి తీసికొని తమ సమాజములోని వ్యక్తుల పట్ల చేస్తున్న ఇటువంటి చర్యలు అన్యాయమే కాకుండా అమానుష చేష్టలుగా ప్రకటిస్తాయి.

bhayya ji joshu

ప్రసార మాధ్యమాలు ఇటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొన్న విషయాలను ఆధారం చేసికొని సమాజంలో సుహృద్భావనను పెంపొందించడానికి బదులుగా అవిశ్వాసము, అశాంతి మరియు సంఘర్షణ పెంచడానికే పని చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ పరిస్థితి శోచనీయము. విభిన్న రాజకీయ దళాలు, జాతి, కుల ప్రాతిపదిక మీద తమతమ అవకాశవాదముతో అసంపూర్ణమైన విషయాలను తెలిపి సమాజములో అల్లకల్లోలములను రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సమాజ సమరసతకు అహితము. రాజకీయ దళాలు మరియు కుల పెద్దలు సమాజములో ప్రస్తుతము వున్న ఇటువంటి పరిస్థితులను జన సహకారంతో చక్కదిద్ది అటువంటి పీడిత ప్రజలపట్ల సంవేదన వ్యక్తంచేసి అటువంటి సంఘటనలు పునరావృత్తము కాకుండా చూడవలసినదని సంఘ్ విజ్ఞప్తి చేస్తున్నది.

FacebookTwitter