Inspiration

త్యాగానికి ఒకసాటిలేని ఉదాహరణ బాలసాహెబ్ జీ

Posted
FacebookTwitter

మధుమేహవ్యాధితో బాధపడుతున్నప్పటికీ 1994 వరకు బాలసాహెబ్ జీ సంఘ సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వర్తించారు . ఎప్పుడైతే శరీరం పర్యటనలకు సహరించటంలేదో అప్పుడు ప్రముఖకార్యకర్తలందరిని సంప్రదించి ఆ బాధ్యతను రజ్జుభయ్యగారికి అప్పగించి, పక్కకు తప్పుకున్నారు. కార్యనిష్టకు ఒకసాటిలేని ఉదాహరణను మనముందుంచారు .

అంతేకాదు 1996 లో చనిపోయే ముందు తనకు బహిరంగ శ్మశానవాటికలోనే దహనసంస్కారాలు జరగాలని కోరారు. ఆ విధంగా తనకు ఎలాంటి స్మారకచిహ్నాలు నిర్మించవద్దని చెప్పారు.
ఆయన రాసిన ఒక లేఖలో రెండు ముఖ్యాంశాలు పేర్కొన్నారు. తనకు ఏ స్మృతిమందిరం నిర్మించవద్దన్నది మొదటి విషయం. రెండవది, ప్రథమసరసంఘచాలక్ డాక్టర్ జీ, రెండవ సర్ సంఘచాలక్ గురూజీల చిత్రపటాలు తప్ప ఏ ఇతర సర్ సంఘచాలక్ చిత్రాలను పెట్టరాదని అందులో రాసారు.
1996 జూన్ 17న బాలాసాహెబ్ జీ ఈ లోకాన్నివిడిచిపెట్టారు. ఆయన ఇష్టానుసారం రేషమ్ బాగ్ బదులుగా నాగపూర్ లోని సాధారణ శ్మశానవాటికలో దహనసంస్కారాలు జరిగాయి.

FacebookTwitter