ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, వ్యాపారవేత్త అయిన గాజుల లక్ష్మీ నరసు చెట్టి జీవిత విశేషాలపై కూర్చిన తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాల ఆవిష్కరణకు వేదిక సిద్ధమైంది. సమాచార భారతి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరుగనున్న ఈ కార్యక్రమం వివరాలు…
1 సెప్టెంబర్ 2024న ఉదయం 10.30 గం II లకు హైదరాబాదులోని ఖైరతాబాద్‌లో ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా (లేక్ వ్యూ పార్క్ పక్కన) ఉన్న శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో పుస్తక ఆవిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సంగనబట్ల భరత్ కుమార్ ( చీఫ్ ఎడిటర్ – జీ తెలుగు న్యూస్), గౌరవ అతిథిగా శ్రీ బి జగన్నాథ్ ( పుస్తక రచయిత & లాయర్ మద్రాస్ హైకోర్టు) సీనియర్ జర్నలిస్ట్ & పుస్తక అనువాదకులు శ్రీ వేదుల నరసింహం పాల్గొంటారు. వివరములకు: 9394733441 / 9989441562 నంబర్లలో సంప్రదించవచ్చు.
More Stories
భిన్నమైన ఆలోచనలు, దూర దృష్టితో డాక్టర్జీ సంఘ స్థాపన చేశారు: మన్మోహన్ వైద్య
సమాజంలో జాతీయవాద జర్నలిజం.. పాత్రికేయులకు నారదుడు ఆదర్శం
నారద జయంతి 2024: జాతీయవాదులు పూర్తిగా సంఘటితం కావాలి