మహాభాతం పైని దుష్ప్రచారానికి అడ్డుకట్టగా సప్రమాణాత్మక మహాభారత విశ్లేషణ – మహేతిహాసం

FacebookTwitter

సంవిత్ కేంద్ర సరికొత్త గ్రంధమ్ – మహేతిహాసం

చదువులచెట్టు,సంస్కృతిఎందుకు సమర్థభారతి,ఇల్లలికిన‌ఈగ,స్వర్ణభారతి వంటి అద్భుతమైన గ్రంధాల ద్వారా మనకు చిరపరిచితులయిన ఖండవల్లి సత్య దేవ ప్రసాద్ గారి విశ్లేషణాత్మక‌వ్యాసాలు. మహాభారతంలోని అనేక విషయాలను గురించి వివరిస్తారు. మూల గ్రంధాన్ని అధ్యయనమ్ చేయకుండా కొంతమంది కల్పించిన అపోహలను అసత్యాలను ఎండగట్టి వ్యాస భారతమ్ లోని శ్లోకాల ఆధారంగా పరిశిలించి వ్రాయబడిన ఈ పుస్తకం మూల మహాభారత అద్యయనానికి ప్రేరణ ఇస్తుంది, మహేతిహాసం.

ఈ గ్రంధమ్ లో 13 వ్యాసాలు సంప్రదాయ జ్ఞానమ్,సమకాలీన విషయాలపై కూడా చర్చించటమ్ వల్ల స్పూర్తి దాయకంగా ఉంటాయి.సాధికరిక సప్రమాణ వివరణ వీరి ప్రత్యేకత.ఈ గ్రంధానికి సామవేదమ్ షణ్ముఖ శర్మ గారు ముందుమాట వ్రాయటమ్,అందమైన రూపమ్ లో చదువరికి అనుకూలమైన (Reader friendly)ముద్రణ పాఠకుడిని ఆకర్షిస్తుంది.200 పేజీలు గల ఈ గ్రంధమ్ సంవిత్ ప్రకాశన్  26 వ ప్రచురణ  kavatకాకతాళీయం. వారికి అభినందనలు. శ్రీపంచమి మరియు భారతగణతంత్రదినోత్సవమ్ రోజు ప్రముఖపాత్రికేయులు,అధ్యయనశీలి,వక్త రాకాలోకమ్ ద్వారా మనకు సుపరిచితులయిన రాకాసుధాకర్ గారు ఆవిష్కరించారు.

వివరాలకు.

రాజగోపాల్,
సాహిత్యనికేతన్,

04027563236(Ph), +919290127329(M).

FacebookTwitter