దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కర్యవాహ, నల్గొండలో జరిగిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో కోరారు.
శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు సమాచార భారతి నల్లగొండ జిల్లా వారు లయన్స్ క్లబ్ లో 24 ఏప్రిల్ నాడు నిర్వహించిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో ముఖ్య వక్త గ పాల్గొన్నారు. వారు మాట్లాడూతూ పాత్రికేయుల రచనలు సమాజ హితం కొరకు అయినప్పుడే అవి ఒక దిక్సూచి గా పని చేస్తాయన్నారు. పాత్రికేయులు నిర్బయంగా, ఒక వర్గానికో లేదా ప్రభుత్వానికి పక్షపాతం లేకుంటా సమాజ హితం కొరకు పని చేయాలని కోరారు.
పాత్రికేయ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ప్రజలకు ఒక గౌరవ ప్రదమైన భాద్యతాయుతమైన వారధిగా ఉండాలని ఆశించారు.
తెలంగాణ ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కర్నాటి విజయ్ కుమార్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేవర్షి నారదుడు విశ్వ వ్యాప్త మొట్ట మొదటి పాత్రికేయుడు అని , ఏ పని చేసిన ధర్మం కోసం, లోకకళ్యాణం కోసం చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు నారదుడి ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో క్రిష్నయ్య, రవీందర్ రెడ్డి, బొబ్బిలి హరి కృష్ణ రెడ్డి, దుర్గాచారి, ప్రదీప్, అనిల్, ప్రకాష్, భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు.
More Stories
స్ఫూర్తిదాయకంగా గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణ
భిన్నమైన ఆలోచనలు, దూర దృష్టితో డాక్టర్జీ సంఘ స్థాపన చేశారు: మన్మోహన్ వైద్య
సమాజంలో జాతీయవాద జర్నలిజం.. పాత్రికేయులకు నారదుడు ఆదర్శం