
Yuva Columnist-2018
సమాచార భారతి మరియు జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో ‘యువరచయితల కార్యశాల’ (వర్క్ షాప్) మార్చ్ 4 ,2018 న జరిగింది. కార్యశాలకు యువరచయితల స్పందన విశేషంగా లభించింది. రచయితలు,పాత్రికేయులు,బ్లాగర్లు మరియు ఔత్సాహిక రచయితలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యశాలలో భాగంగా ముఖాముఖీ, చర్చాగోష్టులను నిర్వహించటం వలన వక్తల అనుభవాలు, మార్గదర్శనం యువరచయితలకు లభించాయి.
కార్యశాలలో ప్రధాన వక్తలుగా పాల్గొన్న శ్రీ సత్యదేవ ప్రసాద్, శ్రీ ప్రసన్న దేశ్ పాండే, డాక్టర్ భాస్కర్ యోగి మరియు శ్రీ హెబ్బార్ నాగేశ్వర రావు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై ప్రసంగించారు.
జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ వేణుగోపాలరెడ్డి , సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాలరెడ్డి ప్రారంభ ఉపన్యాసాలను చేశారు.
సమాచారభారతి ప్రధాన కార్యదర్శి శ్రీ నడింపల్లి ఆయుషు యువరచయితలకు జాతీయ అంశాలపై రచనలు చేయడానికి ఉన్న విస్తృత అవకాశాలను తెలియజేసారు.
డా. అన్నదానం సుబ్రమణ్యం ముగింపు ఉపన్యాసంతో సమావేశం విజయవంతంగా ముగిసింది.
More Stories
Narada Jayanti 2022- Invitation English
Narada Jayanti 2022 Invitation Telugu
Freedom struggle, current narratives and securing the future