మన సినిమాలలో చూపించిన విధంగా నారదుడు కలహ ప్రియుడు, హాస్యం అందించే జోకర్ కాదని అద్భుతమైన విజ్ఞాన ఖని అని, త్రిలోక సంచారంతో ధర్మ రక్షణ, లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించిన గొప్ప పాత్రికేయుడు అని సమాచార భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన నారద జయంతి ఉత్సవంలో పలువురు కొనియాడారు.
భక్తికి, విజ్ఞానానికి, న్యాయసూత్రాలకు పెట్టింది పేరని, పలువురు రాజులు, ఋషులు, సాధువులు, చివరకు దేవుళ్ళకు సహితం ధర్మం, న్యాయం గురించి వివరణ ఇచ్చి లోక కళ్యాణం కోసం పనిచేసిన నారదుడు అద్భుతమైన సమాచారం అందించిన వ్యక్తి అని, ప్రపంచంలో తొలి పాత్రికేయుడు అని వివరించారు.
ప్రజ్ఞ ప్రవాహ జాతీయ సంయోజక్ నంద కుమార్ ప్రధాన వక్తగా మాట్లాడుతూ స్వతంత్రంకు ముందు కేవలం సేవా భావంతో ఉండే పత్రికా రచన నేడు పూర్తి వ్యాపారంగా మారిపోయినదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అనేకమంది పాత్రికేయులు అంకితభావంతో, తమ వృత్తిధర్మం పట్ల నిబద్దతతో పనిచేస్తున్నారని కొనియాడారు. నారద జయంతి సందర్భంగా అటువంటి కొందరు జర్నలిస్ట్ లను గౌరవించుకోవడం జరుగుతున్నదని అన్నారు.
సమాచార కమీషనర్ పి విజయబాబు ముఖ్యఅతిధిగా పాల్గొంటూ నేటి పత్రికారంగంలో తరిగిపోతున్న విలువల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార భారతి అధ్యక్షులు గోపాల రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయులు డా. సంకర నారాయణ (ఈనాడు) , అరుణ రవి కుమార్ (జెమినీ టివి) లను వడ్లమూడి రామమోహన్ రావు స్మారక పురస్కార్, శివ కుమార్ (గతంలో ది హిందూ), విద్యారణ్య (హిందీ మిలాప్) లను బండారు సదాశివరావు పురస్కార్ లతో సత్కరించారు.
More Stories
భాగ్యనగర్ సోషల్ మీడియా సంగమం – సంఘటనా స్ఫూర్తికి ప్రతిబింబం
జాతీయవాదంతో ప్రతిబింబించిన సోషల్ మీడియా సంగమం
స్ఫూర్తిదాయకంగా గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణ