జర్నలిస్టులతోనే సమాజ మార్పు

బాలసముద్రం, మే16: వృత్తి నిబద్ధతతో, ఆత్మవిశ్వా సంతో పనిచేసే పాత్రికేయుల ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని భారత్‌టుడే చీఫ్ ఎడిటర్, ఆంధ్రప్రదే శ్ మాసపత్రిక పూర్వ సంపాదకులు జీ వల్లీశ్వర్ అన్నారు. నారద జయంతిని పురస్కరించుకుని సమాచార భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాలసముద్రం లోని సామాజగన్‌మోహన్‌రెడ్డి స్మారకభవనంలో ప్రపంచ పాత్రికేయ దినోత్సవం నిర్వహించారు.
FacebookTwitter

ప్రపంచ పాత్రికేయ దినోత్సవంలో పలువురు వక్తలు

బాలసముద్రం, మే16: వృత్తి నిబద్ధతతో, ఆత్మవిశ్వా సంతో పనిచేసే పాత్రికేయుల ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని భారత్‌టుడే చీఫ్ ఎడిటర్, ఆంధ్రప్రదే శ్ మాసపత్రిక పూర్వ సంపాదకులు జీ వల్లీశ్వర్ అన్నారు. నారద జయంతిని పురస్కరించుకుని సమాచార భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాలసముద్రం లోని సామాజగన్‌మోహన్‌రెడ్డి స్మారకభవనంలో ప్రపంచ పాత్రికేయ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్బంగా పత్రికా రంగంలో విశేష సేవలు అందిస్తున్న నలుగురు పాత్రికేయులను సన్మానించారు. ఈసందర్భంగా వల్లీశ్వర్ మాట్లాడుతూ నేటితరం జర్నలిస్టులు నారద మహర్షిలాగే అన్ని రంగాల్లో నిష్ణాతులన్నారు. సమాజ సంక్షేమం కోసం నేటి జర్నలిస్టులు తమ వార్తల ద్వారా ఎలాంటి పాత్రను పోషిస్తున్నారో అదే పాత్రను నారదమహర్షి నిర్వహించార న్నారు.

ఈ సందర్భంగా ది హిందూ సీనియర్ పాత్రికేయు లు గొల్లపూడి శ్రీనివాస్‌రావు, జెమినీ టీవీ సీనియర్ పాత్రి కేయురాలు కోటిణి వీణావాణి, సాక్షి సీనియర్ పాత్రికే యులు కంజర్ల నర్సింహరాములును సమాచారభారతి పక్షాన సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్ర మంలో సమాచార భారతి తెలంగాణ కార్యదర్శి నడింపెల్లి ఆయూష్, సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పానుగంటి విశ్వనాథ్, ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చిల కమారి సంజీవ, సమాచార భారతి వరంగల్ శాఖ ప్రతిని ధులు దాస్యం రామానుజం, ఆర్ లక్ష్మణసుధాకర్ తదిత రులు పాల్గొన్నారు.

https://www.ntnews.com/district/Warangal/article.aspx?contentid=732530

FacebookTwitter