కార్ల్ మార్క్స్ – భారతీయ గ్రామీణ వ్యవస్థ

FacebookTwitter

4063769723_0f28afd9d8

నిన్నటి రోజున సాక్షి దిన పత్రికలో ‘కత్తి అంచున కలంతో కవాతు’  అనే శీర్షికతో వచ్చిన వ్యాసంలో కమ్యునిజం సిద్దాంతకర్త కార్ల్ మార్క్స్ ఒక పాత్రికేయుడుగా అయన చేసిన విశ్లేషణలు, పనుల గురుంచి చెప్పిన వివరాలు బాగున్నాయి. కార్ల్ మార్క్స్ తన సిద్దాంత కోణం నుండి రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ఈ సందర్బంగా వ్యాసకర్త ప్రస్తావించారు. కాని మనం ఒక విషయాన్నీ గమనించాల్సిన అవసరం ఉన్నది. కార్ల్ మార్క్స్ జన్మించిన సమయానికి ఐరోపా ఖండం పారిశ్రామిక విప్లవంతో పరుగులు తీస్తున్నది. ఆ విప్లవంలో పెట్టుబడిదారులు, కార్మికులు మరియు అప్పటి పరిస్థితులు ఇవన్ని చూసిన తరువాత తాను కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడాడు. అ రోజుల్లో అయన ఐరోపా ఖండంలోని కొన్ని దేశాలు తిరిగినప్పుడు అయన దృష్టికి వచ్చిన విషయాలు రాసాడు.

భారతీయులు బ్రిటిష్ వాళ్ళపై 1857 లో జరిపిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం గురుంచి కార్ల్ మార్క్స్ వ్యాసాలు రాసాడు. ఆ వ్యాసాలు అప్పట్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి విషయాలను ఆధారం చేసుకొని మాత్రమే కార్ల్ మార్క్స్ రాయడం జరిగి ఉండవచ్చు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ భారత దేశానికి ఎప్పుడు రాలేదు. 1857 సం|| జరిగిన యుద్ధంలో ఓడిపోయేటందుకు గల కారణాలు విశ్లేషిస్తూ “అప్పుడు ప్రజల మధ్య ఉన్న విభేధాల వల్లే ఆ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా లేకుండా పోయింది అని పేర్కొన్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బ్రిటిష్ వారికీ సహకరించారు అని, దానితో బ్రిటిష్ వాళ్ళకు తిరుగుబాటును అణిచివేయడం సాధ్యం అయింది అని విశ్లేషించారు.

వాస్తవంగా 1857 సంవత్సరంలో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో ఆ కాలంలో ఉన్న సంస్థానాదీశులు, రాజులూ కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పై పోరాటం చేసారు. ఆ పోరాటంలో ఒక పక్క విజయం సాదించారు, మరో పక్క భారత దేశం బ్రిటిష్ పార్లమెంట్ చేతిలోకి వెళ్లి పోయింది. ఇక్కడ మన విషయం జ్ఞపకం చేసుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారత దేశంలో క్రైస్తవీకరణకు చేస్తున్న ప్రయత్నమే 1857 నాటి సంగ్రామం. అందుకే బ్రిటిష్ రాణి స్వయంగా భారత దేశానికి వచ్చి మీ మతం విషయాలలో మేం ఎలాంటి జోక్యం చేసుకోము, మేము పరిపాలన వరకు మాత్రమే పరిమితం అవుతాం అని ప్రకటన చేసింది. ఇది గమనించదగిన అంశం.

ఈ వ్యాసంలో భారతదేశంలో ఉన్న కులాలు, మతాల వ్యత్యాసాలను సంక్షిప్తంగా ప్రస్తావించారు, అదే విధంగా దేశంలో ఏ గ్రామానికి ఆ గ్రామం విసిరేసినట్టు ఉండి, చీకట్లో మగ్గుతున్నాయి అని, బ్రిటిష వాళ్ళు ఏర్పరిచిన రైల్వేలు, రోడ్డు మార్గాల కారణంగానే గ్రామాల మధ్య సంబంధాలు పెరిగాయి, సామజిక అంతరాలు తగ్గాయి అని విశ్లేశించినట్టు అర్థం అవుతుంది. భారత దేశం యొక్క గ్రామీణ, భౌగోళిక వ్యవస్థ, వృత్తుల వ్యవస్థ గురుంచి కార్ల్ మార్క్స్ రాసిన విషయాలను ఈ రోజు పత్రికలో రాసిన వ్యాసకర్త ప్రస్తావించలేదు.

భారతీయ గ్రామీణ వ్యవస్థ గురుంచి చాల ఆసక్తికరమైన విషయాలను 1857 కు సంబంధించిన వ్యాసాలలో వ్రాసాడు. భారతీయ గ్రామీణ వ్యవస్థ అద్బుతమయింది అని, ఏ వృత్తుల వాళ్ళు గ్రామంలో ఎంత మంది ఉండాలో, ఎంత భూమి ఆ గ్రామ పరిధిలో ఉండాలో నిర్ణయించి ఆ వ్యవస్థను నిర్మాణం చేసారు, అటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు అని వ్రాసారు. ఒక వేళ కార్ల్ మార్క్స్ భారత దేశాన్ని ప్రత్యక్షంగా చూసి ఉన్నట్లయితే అయన ప్రతిపాదించిన సిద్ధాంతంలో గ్రామీణ వ్యవస్థ గురుంచి, దాని ప్రాముఖ్యత గురుంచి ప్రస్తావించి ఉండేవారమో? అయన ఎప్పుడు భారత దేశానికి రాలేదు కాబట్టి, అట్టి విషయాలను ప్రస్తావించలేదు.

మొత్తం మీద ఈ వ్యాసం చదువుతుంటే వలసవాద సిద్దాంతాలు, మార్క్స్, మావోవాదుల సిద్దాంతాల కోణం నుండే భారత దేశాన్ని విశ్లేశించినట్టు గా అర్ధం అవుతున్నది, ఆ కోణాల నుండి చూసేవాళ్ళకు భారత దేశం ఎప్పుడు అర్ధం కాదు. ఈ వ్యాసం లో ప్రస్తావించిన అంశాలు ఆ కోణంలో నుండే ఉన్నావి, అంత కన్నా గొప్పగా ఏమి లేవు.

ఈ రోజు భారతదేశం ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య వలసవాదుల, మార్క్స్, మావోవాదుల  సిద్దాంతాలకు ఈ దేశం యొక్క మూల సిద్దాంతాలకు మద్య జరుగుతున్న సంఘర్షణనే. ఈ దేశంలో కమునిస్టులు, మావోయిస్టులు వాళ్ళ సిద్దాంతాల కోణం నుంచి ఈ దేశం లో విద్వేషాలు నిర్మాణం చేయటం  పని గా పెట్టుకున్నారు, దీంతో వాళ్ళు ఏమి సాదించ దలుచుకున్నారో అర్ధం కాని ఒక ప్రశ్న? విద్వేషాలతో ఎప్పుడు సమ సమాజం నిర్మాణం చేయలేము అనేది ఒక కఠోర సత్యం.

FacebookTwitter