భారత ఉప ఖండంలో ఇస్లాం విసురుతున్న సవాళ్ళు

FacebookTwitter

భారత దేశం లోని పంజాబ్, బెంగాల్ ప్రాంతాలను ప్రధానంగా చీల్చుకుంటూ 1947 ఆగష్టు 14నాడు  ప్రపంచ పటం లో పాకిస్తాన్ పేరుతో ఒక కొత్త దేశం ఏర్పడింది. అది ఏర్పడటానికి ప్రధాన కారణం ముస్లింలు ప్రచారం చేసిన ద్విజాతి సిద్ధాంతం. ఆ రోజుల్లో ముస్లిం లీగ్ నాయకులు ఏమి దాచుకోకుండా ముస్లిం మెజారిటీ కలిగిన దేశంగా మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని ప్రకటించారు. ముస్లిం లీగ్ ప్రారంభం అయిన 1906 నుండి బెంగాల్ మరియు పంజాబ్ లలో విపరీతమైన మాత మార్పిడులు, ముస్లింల అక్రమ వలసలు జరిగాయి. ఏ భుభాగాలలోనయితే ముస్లింల ఆక్రమణ  ఎక్కువగా జరిగిందో, ఆ భూభాగాలు ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా మారిపోయి విభజన సమయంలో పాకిస్తాన్ లో చేర్చబడ్డవి. అప్పటి నుండి ఆ దేశంలో ముస్లిం జనాభాను విపరీతంగా పెంచే ప్రయత్నం జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం.

బంగ్లాదేశ్ లోని  కొంత మంది నాయకులు 1971 లో స్వతంత్ర  బంగ్లాదేశ్ కోసం పోరాటం ప్రారభించారు. దానికి భారత్ పూర్తిగా సహకరించి పాకిస్తాన్ తో యుద్ధం చేసి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయించింది.  ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రారంబంలో తమ రాజ్యాంగంలో లౌకిక వాదానికి ప్రత్యేక చోటు కల్పించింది. 1988 జూన్ 8 నాడు 8 వ రాజ్యాంగ సవరణలో భాగంగా బంగ్లాదేశ్ ను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించారు. అప్పటి నుండి బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది. షేక్ హసీనా నేతృత్వం లోని అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2011 జూన్ ౩౦ నాడు చేసిన రాజ్యాంగ సవరణలో లౌకిక వాదాన్ని రాజ్యాంగ ప్రధాన సూత్రాలలో ఒకటిగా ప్రకటించింది, అంత మాత్రాన అ దేశం ఇస్లాం రాజ్యం అనే పదాన్ని  తొలగించలేదు. రాజ్యాంగం లోని 2 (A) అధికరణ, ఇస్లాం ను అధికారిక మతం గా పేర్కొంటుంది. మరో పక్క అదే రాజ్యాంగ ప్రధాన సూత్రాలలో 12 వ అధికరణం ప్రకారం లౌకిక వాదం గూడా ఉంది. పరస్పర విరుద్ధమయిన ఈ రెండు విషయాలను పేర్కొనడం గమనార్హం. ఇది పోసిగేది కాదు. బంగ్లాదేశ్ ఏర్పడిన నాటి నుండి  ఆ దేశాన్ని ఇస్లామీకరణ చేయటం జరుగుతూనే ఉంది.

ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళుతున్న బంగ్లాదేశ్ యువత అక్కడ ఇస్లాం ప్రభావానికి లోనవుతుంది. దాని ప్రభావం కారణంగా ఇస్లామిక్ సంస్థ అయిన ఐ.ఎస్.ఐ.ఎస్ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారికీ చేరువ అవుతూ విసృతంగా పెరుగుతోంది. ఇది రెండు రకాల ప్రభావాన్ని చూపిస్తుంది. 1. బంగ్లాదేశ్ లో లౌకిక వాదులు, హేతు వాదులుపై ముస్లింలు అయినప్పటికీ వారిపై దాడులు, హత్యలు పెరుగుతూనే  ఉన్నాయి. అందుకు తాజా ఉదాహరణ రాజ్ షాహీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు సిద్దికి ని హతమార్చడం. దానికి తమదే బాధ్యత అని బహిరంగంగా ప్రకటించుకోవడం. 2. బంగ్లాదేశ్ లోని హిందువులు మరియు ఇతర మతస్తుల పై  దాడులు చేస్తూ వారిని నిర్ములించడమో, వెళ్ళగోట్టడమో, ఇస్లాం లోకి మాత మార్పిడి చెయ్యడమో బంగ్లాదేశ్ ఏర్పడిన నాటి  నుండి కొనసాగుతూనే ఉంది.

బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో అ దేశ జనాభాలో ౩౦ నుండి 40 శాతం వరకు హిందువులు, ఇతర మతస్థులు ఉండేవారు. కాని అది కాల క్రమేణ క్షీణిస్తూ బంగ్లాదేశ్ లో ప్రస్తుతం 90 శాతం ముస్లింలు, 10 శాతం మైనారిటీలు మిగిలారు. వీరిలో 8.5 శాతం హిందువులు, మిగితా 1.5 శాతం క్రైస్తవులు, బౌద్ధులు ఉన్నారు.  ప్రస్తుతం దానికి గల కారణాలు కొద్దిగా విశ్లేషిస్తే విషయం మనకు అర్ధం అవుతుంది. భారత దేశ సరహద్దులలోని ఛిట్టగాంగ్, బరిశల్, ఢాకా, రంగపూర్, సిల్హాట్, రాజషాహి, ఖుల్నా, నిల్ఫమరి తదితర జిల్లాలలో హిందువుల సంఖ్య అధికంగా ఒకప్పుడు ఉండేది. కాని క్రమంగా నిర్ములించబడుతు వచ్చింది. దానితో ఆ జిల్లాలలో ఉన్న హిందువుల సంఖ్య క్రమేపి తగ్గుతూ వచ్చింది. 1974 లో హిందువుల సంఖ్య 13.5 శాతం, 1981 లో 12.3  శాతం, 1991 లో 11.62 శాతం, 2001 లో 9.2 శాతం, 2011 నాటికీ 8.5 శాతం గా తగ్గింది. 2016 గనుక గమనిస్తే అది ఇంకా తగ్గి ఉంటుంది.

ఒక పక్క ఇస్లామిక్ దేశాలు అయిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో హిందువులు తగ్గిపోతూ ఉంటె, భారత దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింల, క్రైస్తవుల జనాభా పెరుగుతూ వస్తుంది. భారతలోని ఉదారవాదులు, అతి ఉదారవాదులు మైనారిటీల సంరక్షకులుగా అవతారమెత్తి వాళ్ళ జనాభా పెరుగుదలకు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దాని పరిణామంగా భారతలో హిందువుల జనాభా 80 శాతం కు పడిపొయింది.

ఇక్కడ ఒక విషయాన్నీ మనం అర్ధం చేసుకోవాల్సిన అవరసం ఉంది. ప్రపంచంలో ఎక్కడ అయిన ముస్లింలు మెజారిటీగా ఉన్న చోట అక్కడి మైనారిటీలను నిర్ములించడమో, వెళ్ళగొట్టడమో లేదా మాత మార్పిడి చెయ్యటమో నిరాటంకంగా సాగిపోతు ఉంటుంది అనేది శతాబ్దాల చరిత్ర చెప్పుతున్న సాక్షం. ఇది మన ఉదారవాదులకు, సెక్యులరిస్టులకు అర్థం అవుతున్నదో కాదో మనకు తెలియదు.

దేశ విభజన తరువాత భారత్ కు రెండు పక్కల రెండు ఇస్లామిక్ దేశాలు ఏర్పడి ప్రతినిత్యం మనకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఇంకో ప్రక్క భారతలో అంతర్బాగం అయిన కాశ్మీర్ ప్రాంతం లోని కాశ్మీర్ లోయను, పూర్తి ఇస్లామీకరణ చేసి దేశం నుండి విడగొట్టేటందుకు, దశాబ్డులుగా ప్రయత్నం జరుగుతున్నది అనేది ఒక నగ్న సత్యం. ఇది మనకు అర్ధం అవుతున్నదా?

ఇస్లాం ఆక్రమణ స్వభావాన్ని అర్ధం చేసుకొని దాని నుండి కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యకపోతే నిత్య సంఘర్షణ తప్పదు. ఈ విషయాన్నీ మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, అప్పుడు మాత్రమే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.

FacebookTwitter