హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు రెండు నెలల సెలవుల తరువాత తిరిగి విధుల లోకి చేరడం తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది. ప్రభుత్వం వెంటనే రోహిత్ వేముల ఆత్మ హత్య పై ఆరోపణలు ఎదుర్కుంటున్న వైస్ ఛాన్సలర్ ని సస్పెండ్ చేయాలి అనే డిమాండ్ తో వి.సి ఛాంబర్ లోకి వెళ్లి ఫర్నిచర్ ద్వంసం చేయడం జరిగింది. పరిస్థితి లో మార్పు ను గమనించిన యూనివర్సిటీ అధికారులు పోలీస్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం తో అక్కడకు చేరుకొని ఉద్త్రిక్త వాతావరణాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్తులు ఘర్షణకు దిగడం తో పోలీస్ లో లాఠి ఛార్జ్ చేసారు. ఈ ఆందోళన మద్య ఒక పోలీస్ అధికారికి తలకు గాయం జరిగింది. పోలీస్ వాళ్ళు రక్షణగా ఉండి వైస్ ఛాన్సలర్ అక్కడనుండి తప్పించి, కొంత కాలం పాటు యూనివర్సిటీ కి దూరంగా ఉండాలి అని సలహా ఇచ్చినట్టు సమాచారం.

More Stories
Samachara Bharati Social Media Sangamam 2025
గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణకు వేదిక సిద్ధం
సమాజంలో జాతీయవాద జర్నలిజం.. పాత్రికేయులకు నారదుడు ఆదర్శం