మన రాష్ట్రంలో ఎన్నో సంచార జాతులు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి తమ తమ విశిష్టత, గౌరవం, పురాణం కథలు, వైవిధ్యమైన జీవన విధానం ఉన్నాయి. ప్రస్తుతం మారుతున్న పరిస్తుతలకు అనుగుణంగా వారి జీవన శైలి లో మార్పు వస్తున్నపటికి వారు తమ మూలాలను సగర్వంగా సమాజానికి చాటి చెప్పడానికి ఎల్లపుడు ముందుగా ఉన్నారు.
ధర్మ జాగరణ సంస్థ ఆధ్యర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో 15-మార్చ్ -2016 నాడు సచార జాతుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రంలో బుడగ జంగాల,బాలసంతు,బుడబుక్కల,దాసరి, దొమ్మర,గంగిరెద్దుల,జోగి,కాటిపాపల,మేదరి, వంశరాజులు,వీరముష్టి,ఒడ్డెర,పూసల,తోలుబొమ్మల, ఎరుకల,డెక్కలి మొ,, 20కులాల నుండి 300మంది సమ్మేళనంలో పాల్గొని తమ కళలను ప్రదర్శించినారు.
ఈ సందర్బంగా పాల్గొన్న కళాకారులూ, మరియు వారి వారి కుల పెద్దలు సమాజం తమలను ఆదరించి తమ కళలను కాపుడుకుంటూ ముందు తరాల వాళ్ళకు అందించే విధింగా సహాయపడాలి అని కోరుకున్నారు.





More Stories
Samachara Bharati Social Media Sangamam 2025
గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణకు వేదిక సిద్ధం
సమాజంలో జాతీయవాద జర్నలిజం.. పాత్రికేయులకు నారదుడు ఆదర్శం