భారత్ గొప్పతనాన్ని చూసి ప్రపంచం మొత్తం “భారత్ మాత కి జై” అని నినాదాలు ఇవ్వాలి అని ఆకాంక్షిస్తున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘచాలాక్ శ్రీ మోహన్ భగవత్ గారు కోల్ కతా లోని ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నారు. ఫ్రెండ్స్ అఫ్ ట్రైబల్ సొసైటీ సహ వ్యవస్థాపకుడు మదన్ లాల్ అగర్వాల్ జీవితం పై రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ ఆర్.ఎస్.ఎస్ భారత దేశాన్ని “దోపిడీ రహిత, ఆత్మాభిమానం కలిగిన ఒక గొప్ప దేశంగా చూడాలి” అని అనుకుంటుంది. అందుకు మనం అందరం భారత్ అనే పదానికి అనుగుణంగా జీవించాలి అన్నారు.
భారత్ అనే పదాన్ని కేవలం ఒక దేశ సరిహద్దులుగ కాకుండా, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయ విలువలను చూసి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంత గుర్తించే విదంగా ఉండాలి అని తెలియ చేసారు. ఈ దేశ విభజన తరువాత దేవ బాష అయిన సంస్కృతం, వేదాలు, పురుడు పోసుకున్న గడ్డ ప్రస్తుతం పాకిస్తాన్ భూభాగం లోకి వెళ్లి పొయింది. భారత్ అనే పదాన్ని మనకు వదిలివేసి, ఆ దేశానికి పాకిస్తాన్ అని వాళ్ళు నామకరణం చేసుకున్నారు.
ఒక్కప్పుడు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా కనపడుతూ ఉండేవి, కాని ఈ రోజున కేవలం మన దేశంలోనే మిగిలి ఉన్నాయి. భారతీయ సంసృతి విలువల ఆధారంగా ప్రపంచం భారత్ దేశం యొక్క గొప్ప తనాన్ని గుర్తించి “భారత్ మాత కి జై” అనే నినాదం ఇవ్వగలగాలి.

More Stories
Samachara Bharati Social Media Sangamam 2025
గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణకు వేదిక సిద్ధం
సమాజంలో జాతీయవాద జర్నలిజం.. పాత్రికేయులకు నారదుడు ఆదర్శం