యుద్దాలను నిర్వచించినట్టు, ఉగ్రవాదాన్ని నిర్వచించని ఐక్యరాజ్య సమితి

FacebookTwitter

భారత ప్రధాని మార్చ్ ౩౦ నాడు తన బెల్జియం పర్యటన సందర్బంగా అక్కడ స్థిరపడ్డ భారతీయ సముదాయం తో మాట్లాడేటపుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పై ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి పోషిస్తున్న పాత్ర ను ప్రశ్నించడం జరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం లో ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన ప్రపంచ యుద్దాల నేపద్యంలో పురుడు పోసుకున్నది. దాంట్లో యుద్ధం అంటే ఏంటిది, ఎందుకు చెయ్యాలి? దానితో వచ్చే లాభ నష్టాలు గురుంచి నిర్దిష్టంగా లిఖిత పూర్వకంగా ఉన్నది. కాని 21 శతాబ్దంలో ప్రపంచం ఎదురుకుంటున్న ఉగ్రవాదానికి సంబంధించి ఎలాంటి నిర్వచనం, వివరణ గాని లేదు అని అన్నారు.

భారత్ దేశం ఎన్నో సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితిని తీవ్రవాదాన్ని నిర్వచించమని కోరుతూ ఉన్నది. తీవ్రవాది అంటే ఎవరు? ఏ దేశం దీన్ని ప్రోత్సహిస్తుంది? ఎవరు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు,  సమర్ధించే వాళ్ళు ఎవ్వరు? ఇలాంటి వాళ్ళను ఎవరు అండగా ఉంటున్నారు? ఒక్కసారి ఈ లాంటి విషయాలు బ్లాక్ అండ్ వైట్ పేపర్ గా బయటికి వస్తే ప్రజలు వాటికీ దూరంగా ఉంటారు అని మోడీ పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి ఎప్పుడు దీనిపై స్పందిస్తుంది, ఎట్లా స్పందిస్తుంది అని పక్కన పెడితే, వీటికీ సమాదానం చెప్పకుండా ఆలస్యం చేయడం వలన నష్టం పెరుగుతూనే ఉంటుంది మరియు అది కాలక్రమేనా ఒక అసంబద్దమయిన సంస్థ గా మిగిలే ప్రమాదం కూడా ఉన్నది అని హెచ్చరించారు.

ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రపంచంలోని  చాల దేశాలు తీవ్రవాదాన్ని అమెరికా లో 9/11 దాడుల తరువాతనే గుర్తించనారంబించాయి. కాని భారత దేశం మాత్రం గత 40 సంవత్సరాలుగా ఉగ్రవాదం తో పోరాడుతూనే ఉన్నది అని అన్నారు.

గత సంవత్సరం 90 దేశాలు ఎదో ఒక రూపంలో ఉగ్రవాదానికి గురయినాయి. ఎన్నో వందల వేల మంది తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు, ఇది మొత్తం మానవాళికి దాని మనుగడకు సమస్యగా మారిపోయింది. దీన్ని ఎదుర్కువడానికి ప్రపంచం లోని అన్ని శక్తులు ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమయినది అని అన్నారు.

FacebookTwitter