అఖిల భారతీయ శృంగ ఘోష్ శిబిర్, స్వరాంజలి- 2016, బెంగళూరు

FacebookTwitter

సంగీతం భారతీయ సమాజం లో విడదీయరాని అనుబంధం, అదే విధంగా సంఘ్ లో గోష్ వాయిద్యకారులు లేని పథ సంచలన కూడా అంతే. సంఘ్ యొక్క 90సంవత్సరాల చరిత్రలో మొట్ట మొదటి సారిగా కేవలం ఘోష్ వాయిద్యకారులతో “అఖిల భారతీయ శృంగ ఘోష్ శిబిర్ స్వరాంజలి 2016” శిబిరం నాలుగు రోజుల పాటు (7-జనవరి నుండి 10-జనవరి, 2016) రెవ యూనివర్సిటీ , యెలహంక, బెంగళూరు లో నిర్వహించడం జరిగింది. ఈ శిబిర సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఇస్రో (ISRO) చైర్మన్ డాక్టర్ కే. రాధాకృష్ణన్, ప్రధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ సరసంఘచలాక్ మోహన్ భగవత్ గారు పాల్గొన్నారు.

ghosh 10

కర్నాటకలోని ఈ నాలుగు రోజుల శిబిరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుండి 2169 ఘోష్ వాయిద్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వయంసేవకులకు కొత్త సంగీత పరికరాలు అయిన నాగంగా (సాక్సోఫోన్), స్వరాద్ ( క్లారియోనాట్), గోముఖ ( ఎఫోనియం), తుర్యా ( ట్రంపెట్) వాటి మీద అభ్యాసం, కొన్ని కొత్త స్వరాలు నేర్పడం, ఘోష్ వాయిద్య నైపుణ్యాన్ని పెంచడం, కొత్త పరికరాల పరిచయం, శాఖ లను ఘోష్ ద్వార ఎ విధంగా పటిష్టం చేయడం అనేవి కొన్ని ముఖ్య ఉద్దేశాలు.

శనివారం, 9-జనవరి, నాడు బెంగళూరు పట్టణంలో కొన్ని వీదులగుండా కేవలం ఘోష్ వాయిద్యకారులతో రెండు భాగాలుగా పథ్ సంచలన నిర్వహించాబడ్డది. ఈ కార్యక్రమం లో అఖిల భారతీయ శారీరఖ్ ప్రముఖ్ సునీల్ కులకర్ణి, సహా శారీరఖ్ ప్రముఖ్ జగదీశ్ ప్రసాద్, అఖిల భారతీయ సహా వ్యవస్థ ప్రముఖ్ మరియు ఘోష్ నిపుణులు అయిన అనిల్ ఓక్, క్షేత్ర సంఘచలాక్ వి నాగరాజు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

gosh8

gosh1

ghosh8

FacebookTwitter