Narada JayantiPress release

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ – ఒక పరిచయం

Posted
FacebookTwitter

ఆవిర్భావం

ప్రపంచ వ్యాప్తంగా రానున్న నాగరికతల సంఘర్షణ భారతదేశంలోనూ జాడలు విప్పుతోంది. భారత జాతీయ సమగ్రతను విఛిన్నం చేసేందుకు ఇంటా….బయిటా ఎన్నో విఛిన్న శక్తులు వందల రూపాలలో సవాళ్లు విసురుతున్నాయి.

ఈ సవ్వాళ్లు దీటుగా ఎదుర్కొనేందుకు వేయి మార్గాలలో కృషి జరగవలసి వుంది. అందులో ఒకటి – ఎంతో ప్రముఖమైనది సైద్ధాంతిక సంఘర్షణ. జాతీయ భావాన్ని పరిపుష్టం చేసే విధంగా వివిధ రంగాలలో సైద్ధాంతిక పునర్నిర్మాణం జరగవలసి వుంది. దానికి అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని జోడించవలసివుంది.

దేశభద్రత, సమగ్రతలకు పొంచివున్న ముప్పు ఒకవైపు; సామాజిక సామరస్యానికి ఏర్పడుతున్న విఘాతాలు మరోవైపు; జాతీయ అభివృద్ధికి, వికాసానికి అనువైన వ్యవస్ధ లోపం ఇంకోవైపు; వీటిన్నింటికీ సమాధానంగా..

ఒక విశిష్ట ప్రయత్నంగా ‘సమాచార భారతి ’ 1998 లో ఆవిర్భవించింది.

మార్గం

‘సమాచార భారతి’ ప్రధానంగా ఒక సైద్ధాంతిక శక్తి. జాతీయ హితానికి అనువైన పరిష్కారాలను కనుగొనడానికి అధ్యయనం, విశ్లేషణలతో నూతన ప్రతిపాదనలు చేస్తుంది. నవనిర్మాణానికి అవసరమైన ఆచరణ పద్ధతులను రూపొందిస్తుంది. వాటిలో నిర్వహణాపరమైన శిక్షణనిస్తుంది.

ఆయా విషయాలలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకై అన్నిరకాల ప్రచార, ప్రసార మాధ్యమాలను వినియోగించుకుంటుంది. అందుకొరకై అన్నివిధాలైన సమాచార సాంకేతిక విధానాలను ఉపయోగించు కుంటుంది. ఆయా పరికరాలను,వ్యవస్థలను,కార్యకర్తల బృందాలను, నైపుణ్యాన్ని సమకూర్చుకుంటుంది.

లక్ష్యం

భారత జాతీయ పునరుజ్జీవన మహాయజ్ఞంలో ఒక మేధో సమిధగా ‘సమాచార భారతి’ రూపొందింది.

జాతీయ సమగ్రతా సంరక్షణకు,జాతీయ వైభవ సాధనకు సవాళ్లు విసురుతున్న విఛిన్నశక్తులతో కొనసాగిపోతున్న సైద్ధాంతిక సంఘర్షణకు అవసరమైన శక్తి యుక్తులను ‘సమాచార భారతి’సమకూరుస్తుంది.

ఈదిశలో…కొన్ని తక్షణ లక్ష్యాలను ‘సమాచార భారతి’ తన ముందుంచుకున్నది.

విశ్వా సంవాద్ కేంద్ర

జాతీయభావాల సమగ్ర సమాచార స్రోతస్వినిగా ఒక నాషనలిస్టిక్ రిపోర్ట్ సెంటర్ ను నెలకొల్పడం, అందుకొరకు ఇంటర్నెట్ వెబ్ సైట్స్ ను, కంప్యూటర్ డేటా బ్యాంకులను ఏర్పరచడం.

ఈ కేంద్రము, పాత్రికేయుల మధ్యలో కూడా పని చేస్తుంది. వివిద్ రాష్ట్రాలలో ఉన్న విశ్వా సంవాద్ కేంద్రాల తో సమాచారము పంచుకోవడం.

జాతీయ భావ వ్యాప్తికై పనిచేస్తున్న కార్యకర్తల బృందాలకు అస్త్రాలుగా ఉపకరించే రక- రకాల విషయాల పై కరపత్రాలను అందుబాటులో ఉంచడం. జాతికి ఉపయోగ పడే వివిద్ విశేయాలను వ్రాయించడం మరియు అనువదించడం.

“లోకహితం”జాగరణ పత్రిక

ప్రపంచమంతటి నుంచి వస్తున్న సమాచారాన్ని వింగడించి జాతీయ భావ ప్రభోదకమైన సమాచారాన్ని ఏర్చికూర్చిన ఒక చిన్న పత్రిక రూపంలో చివరి గ్రామం వరకు చేర్చడం.

చిత్ర భారతి

లఘు చిత్రాల మాద్యమముగా జాతీయ భావ ప్రసారము చేయడము. “కాకతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్” ద్వారా యువతి యువకుల లో సేవ మరియు దేశభక్తి భావ ప్రబోధన.

ఆడియో వీడియో పధకాలు

జాతీయ భావస్ఫోరకమైన వివిధ అంశాలపై ఆడేవు వీడియో చిత్రాల తయారీ.

ప్రశిక్షణా కేంద్రం

వివిధ సేవా, సామాజిక, మధ్యన పథకాలకు అవసరమైన బహుముఖ పరిరక్షణ కేంద్రం నిర్వహణ.

అధ్యయన పధకాలు

వివిధ విద్యా, వైజ్ఞానిక అంశాలపై నిపుణులచే అధ్యయన పత్రాలు తాయారు చేయించడం, సంబంధిత విశేషజ్ఞులచే వాటిని చర్చించడం; తుది పత్రాన్ని రూపొందించి వేయి కేంద్రాలకు పంపడం.

ప్రజా స్పందన

వర్తమాన సామాజిక సమస్యలపై on the spot అధ్యయనానికి నిపుణుల బృందాలను పంపి నిజ నిర్ధారణ చేయడం; వాస్తవాలను వెలుగులోకి తేవడం.

పరిశోధనా పధకాలు

వివిధ సామాజిక అంశాలపై వ్యక్తిగతంగానూ, బృందములతోనూ, ప్రత్యక్ష పరిశోధన జరిపించడం; ఏయే సామాజిక వర్గాలు ఎలా పనిచేస్తున్నాయి? మీడియా ఎలా పనిచేస్తోంది, ప్రభుత్వ విధానాల ప్రభావం? మాజిక సమరసతకు సవాళ్ళ? ఇత్యాది అంశాలపై పరిశోధనలు నిర్వహించి, వాటి నివేదికలను సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం.

విన్నపం

ఒక కీలకమైన, అత్యంత ప్రాముఖ్యమైన, ప్రత్యేక కార్యరంగాన్ని ‘సమాచార భారతి’ తనకోసం ఎంపిక చేసుకుంది. వ్యక్తులు, వ్యవస్థలను అభివృద్ధి

పరచి వాటి ఫలాలను జాతీయ హితంతో సమ్మిళితం చెయ్యాలనే మనోభూమికతో ‘సమాచార భారతి’ ఆవిర్భవించింది.

సమాచార భారతిని ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకై మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం. సమాచార భారతి సంయోజనలో భాగస్వాములుకండి!. ‘సమాచార భారతి’ కార్యక్రమాలు, పధకాల నిర్వహణకై భూరి విరాళాల నందించండి. ‘సమాచార భారతి’ రూపొందించిన వివిధ కార్యక్రమాలలో ఎదో ఒక దానిని స్పాన్సర్ చేయండి.

‘సమాచార భారతి’ వివిధ భాగాలకు అవసరమైన పరికరాలను, సామాగ్రిని అందించండి, అన్నింటికన్న మిన్నగా ‘సమాచార భారతి’కి మీ మిత్రులను పరిచయం చేయండి.

FacebookTwitter