Inspiration

వీరనారీమణులకు వందనం!!

Posted
FacebookTwitter
మనదేశం రత్నగర్భ. ప్రపంచానికి జ్ఞానభిక్షనుపెట్టింది. కానీ మన సమైక్యతను దెబ్బతీసేలా పాశ్చాత్యులు మనదేశాన్ని దోచుకున్నారు. వారు మనకు మేకులై, పాలకులై మనలను బానిసలుగా చేసి అనేక కష్టనష్టాలపాలు చేశారు. ఆ క్రమంలో మనదేశాన్ని మనమే ఏలుకోవాలి అనే భావన భారతీయులందరికీ కలిగింది. ఆసమయంలోనే అనేక మంది నాయకుల నేత త్వంలో భారత స్వాతంత్య్రానికై అనేక పోరాటాలు జరిగాయి.

ఆ క్రమంలో పురుషులతో పాటు మహిళలూ ధైర్య స్థైర్యాలతో పోరాటం జరిపారు.  ఆ పోరాటంలో వీరవనితలైన కొందరు మాతమూర్తుల గురించి చెప్పుకుందాం!

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ :
‘కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ- కోమటై పుట్టితేనేమి మా గాంధీ-‘ అంటూ పాడుతున్న ఆ చిన్నపాప దేశభక్తిని చూసిన వారందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఆ పాప ఎవరో కాదు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌. 1909 సంవత్సరం తూర్పుగోదావరి జన్మించిన దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ 12వ ఏటనే రాజమండ్రిలో గాంధీమహాత్ముని పిలుపుకు ఉత్తేజితురాలై ఖద్దరు ధరించింది. 1930 లో మద్రాసులో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించింది.1920న పిఠాపురం రాష్ట్ర మహిళా సభలో కంఠమెత్తి ఆవేశంగా ఆమె పాడిన పాటలు భారతీయులందరిని ఉద్వేగంతో ఊపేసాయి.
దువ్వూరి సుబ్బమ్మ :
స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగింటి ప్రథమ మహిళామణి ‘దువ్వూరిసుబ్మమ్మ’. ఆ రోజుల్లో బ్రిటిష్‌ కలెక్టర్‌, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు క్షమాపణ చెప్పమంటే ‘నా కాలి గోటికి సైతం నువ్వంటే అసహ్యం’ అని చెప్పిన సాహసి ఆమె. 1932లో శాసనోల్లంఘనం, 1940లో వ్యక్తి సత్యాగ్రహం, 1942లలో క్విట్‌ఇండియా కార్యకలాపాలలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నది. జైళ్లకు వెళ్లింది. ఆమె చివరిరోజుల్లో ఎంతో దుర్భరమైన దారిద్య్రాన్ని అనుభవించింది. అయినా సరే ఎవరి దగ్గరా తలవంచలేదు. మహిళల సంక్షేమం కోసం రాజమండ్రిలో సనాతన స్త్రీ విద్యాలయాన్ని నెలకొల్పింది. స్వతంత్ర సమరంలో ముఖ్యభూమికను పోషించిన ఆమెను ప్రజలు ‘దేశబాంధవి’ గా గౌరవించారు.
చేబియ్యం యశోదమ్మ :

1932లో శాసన ధిక్కారం చేసి, తన చూలింతతనాన్ని సైతం లెక్కచేయక రామచంద్రాపురం సబ్‌ జైలు లో శిక్షను అనుభవిస్తూ, అక్కడే మగపిల్ల వాణ్ణి కన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించాలనే ధ్యేయంతో రాజమండ్రి ఇన్నీసుపేటలో ఉన్న సొంత ఇంట్లో ‘గాంధీ హరిజన హాస్టల్‌’ ను ప్రారంభించింది. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటమే కాకుండా పోలవరంలో ‘స్వరాజ్య ఆశ్రమాన్ని’ స్థాపించి అస్ప శ్యతా నివారణ, అక్షరాస్యత, ఖాదీ ప్రచారం కోసం విశేషంగా పనిచేసింది. శాసన ధిక్కారం చేసి వెల్లూరు, కన్ననూరు జైళ్లలో కఠిన కారాగార శిక్షను అనుభవించిన అకుంఠిత స్వాతంత్య్ర పిపాసి. స్వాతంత్య్రోద్యమంలో ప్రథమ శ్రేణి నాయకులు జైల్లో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకురాళ్లతో పెద్దాపురం తోటల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బ్రిటిషు పోలీసుల లాఠీ దెబ్బలను చవి చూసినప్పటికీ మడమ త్రిప్పక ముందుకు సాగిన సాహసవంతురాలు.

కనుపర్తి వరలక్ష్మి :
1896 బాపట్లలో జన్మించిన కనుపర్తి వరలక్ష్మి స్వయంకషితో తెలుగుసాహిత్యాన్ని ,సంస్క తం, హిందీ భాషలను అభ్యసించారు. సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్న ఆ రోజుల్లో వరలక్షమ్మగారు ఆమె సహచర మహిళలందరు ‘స్వరాజ్యం లక్ష్మీ వ్రతం,’ ‘రాజ్య లక్ష్మీ’ పూజలు చేసి స్వదేశీ దీక్షా సూత్రాలు కట్టుకున్నారు. నాటి నుంచి ఆమె గాంధీగారి సూచన మేరకు ఖద్దరు ధరించి, బాపట్లలో ‘హితైషిణీ మండలి’ అనే సంస్థను 1931లో స్థాపించి మహిళలకు ఆధ్యాత్మిక సాహిత్య విషయాలతో పాటు రాజకీయ క్రియాశీలతను ప్రబోధించారు.
బత్తుల కామాక్షమ్మ:

ఆంధ్రా అనిబిసెంటుగా పేరుగాంచిన శ్రీమతి బత్తుల కామాక్షమ్మ, బాలగంగాధర తిలక్‌ అనుచరుడు ఉన్నవ లక్ష్మీనారాయణను పెళ్లి చేసుకుని సంఘ సేవలో, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని ఉప్పును గ్రామాలలో వండి శాసనధిక్కారం చేశారు. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 3వసారి ఈమెను అరెస్టు చేసి రాయవేలూరు జైలులో 3 నెలలు ఉంచారు.

సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవమ్మ
తెలుగు మహిళలకు గుంటూరు ఝాన్సీరాణీగా కీర్తి పొందిన సూర్యదేవర రాజ్యలక్ష్మీ దేవమ్మ, పత్రికారచయితగా పేరు పొందారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు సంవత్సరంపాటు జైలు శిక్ష విధించింది తెల్లప్రభుత్వం. క్విట్‌ఇండియా ఉద్యమం లో పాల్గొన్నందుకు 1932 నుండి నెల్లూరు, మద్రాసు జైళ్లలో శిక్ష అనుభవించారు.
శివరాజుసుబ్బమ్మ

క్విట్‌ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. బారు అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో క షి చేశారు. అలహాబాద్‌లో కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన జాతీయ నాయకురాలు. .

కొడాలి కమలమ్మ:

భారత స్వతంత్య్ర సమరంలో పాల్గొన్న మరో వీరవనిత కొడాలి కమలమ్మ. ఖైదీగా రాయవెల్లూరు సెంట్రల్‌ జైలులోవుంటూ, బ్రిటిష్‌ కాపలాదార్ల కళ్లుగప్పి జాతీయ జెండాను ఎగువేశారు. భూదానోద్యమంలో పాల్గొన్నారు. హరిజనవాడలలో గ్రంథాలయాలు స్థాపించారు. హరిజన మహిళలకు ఉచితంగా రాట్నాలు పంచారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు..

వీరే కాదు, ఇంకెందరో మహిళామణులు మన దేశ స్వాతంత్య్రం కోసం క షి చేశారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ వీరనారీమణులందరికీ మన హదయ పూర్వక అంజలి ఘటించి క తజ్ఞతలు తెలుపుకుందాం.
FacebookTwitter