ఈ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆమ్లా బృందం గ్రామాల్లో చెక్‌డ్యాంల నిర్మాణాన్ని తలపెట్టింది. మొట్టమొదట మండవార్ గ్రామంలో రెండు చెక్‌డ్యాంలు నిర్మించారు. వాటి ద్వారా లభించిన నీటితో అద్భుతమైన మార్పు కనిపించింది. రైతుల వార్షిక ఆదాయం ఒకేసారి 12కోట్ల రూపాయలకు పెరిగింది. ఆ తరువాత 2 లక్షల గ్రామస్థుల కోసం ఏడాదిలో 300 కోట్ల రూపాయల నిధులు సేకరించారు. ఇందులో గ్రామస్థులతోపాటు స్థానిక బృందాలను కూడా భాగస్వాములను చేశారు.
చెక్‌డ్యాంల నిర్మాణంతోపాటు ఆమ్లా బృందం జలసంరక్షణ ప్రాధాన్యతను కూడా గ్రామస్థులకు తెలియజెప్పారు. దానివల్ల గ్రామస్థులు డ్యాంల నిర్మాణంతోపాటు, నిర్వహణలో కూడా పాలుపంచుకునేందుకు ముందుకువచ్చారు. ఒకప్పుడు సంవత్సరానికి ఒక పంట వేయడానికే ఎంతో కష్టపడిన రైతులు చెక్‌డ్యాంల పుణ్యమా అని మూడుపంటలు వేయగలిగే స్థితికి వచ్చారు. ఆదాయం పెరగడంతో పశుపోషణపైన కూడా దృష్టిసారించారు. ఒక్కో ఇంటిలో 8 నుండి 10 పాడి పశువులు ఉన్నాయి. వాటి ద్వారా పాల వ్యాపారం అభివృద్ధి చెందింది.
రాజస్థాన్ గ్రామాలకు జలకళ తెచ్చిన ఆమ్లా బృందం మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్రల్లో కూడా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాలో ఈ బృందం పనిచేస్తోంది.
ప్రదాయ జలసంరక్షణ పద్ధతుల ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించిన ఆ మహిళే ఆమ్లా రుయా. 17 ఏళ్లక్రితం తీవ్ర కరవుతో అల్లాడుతున్న గ్రామీణుల పరిస్థితి చూసి చలించిపోయిన ఆమ్లా వారి నీటికష్టాలు తీర్చాలని సంకల్పించింది. గ్రామాలలో చెక్ డ్యాంలు నిర్మించడం ప్రారంభించింది. ‘ఖాదిన్’ అని కూడా పిలిచే ఈ డ్యాంలు ఎక్కువగా మట్టితో నిర్మించినవే. పర్వత ప్రాంతాల్లో నీటి నిల్వకు ఎంతగానో ఉపయోగపడే సులభమైన ఈ పద్ధతి చాలా ప్రాచీన కాలం నుంచీ తెలిసినదే. ఇప్పుడు ఆ సంప్రదాయ పద్ధతిని అనుసరించి ఆమ్లా అనేక గ్రామాలకు జలకళ తీసుకురాగలిగింది.