Inspiration

రాజమణి-ఒక స్ఫూర్తి

Posted
FacebookTwitter

ఆవిడకి కేవలం 16 ఏళ్ళ వయస్సులో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా బోసు గారు నిధుల కొరకు, ఐ.ఎన్‌.ఏ వాలంటీర్ల కొరకు రంగూన్‌ కు వచ్చారు. ఆయన స్ఫూర్తివంతమైన మాటలకి ముగ్ధురాలై రాజమణి తన ఒంటిపైన గల ఖరీదైన వజ్రాల మరియు బంగారు నగలను ఐ.ఎన్‌.ఏ కు దానం చేసారు. ఆ మర్నాడే రాజమణి తండ్రిని కలుసుకొని ‘మీ అమ్మాయి అమాయకత్వం వలన నగలన్నీ దానం చేసింది.

నేనవి తిరిగి ఇచ్చేయటానికి వచ్చాను’ అన్నారు. అదే మీటింగులో ఆ 16 ఏళ్ళ బాల తనని సైన్యంలో తీసుకోమని బోసు గారిని కోరింది. ఆమె పట్టుదల చూసి బోసు గారు ఆవిడని ఇంకో 4 మిత్రులని ఐ.ఎన్‌.ఏ గూఢచారి విభాగంలో గూఢచారులుగా నియమించారు.
ఆ ఆడపిల్లలందరు మగపిల్లల వేషాలు వేసుకొని బ్రిటిష్‌ సైనిక క్యాంపులోని అధికారుల ఇళ్ళలోను పనివారుగా చేరి ప్రభుత్వ ఉత్తర్వులను, బ్రిటిషు అధికా రుల రహస్య సమాచారం సంగ్రహించి ఐ.ఎన్‌.ఏ కు అందించటం వారి పని. రాజమణి (మగపిల్లాడిగా ఆమె పేరు మణి) ఆమె మిత్రులు మారువేషాలలో రెండేళ్ళపాటు బ్రిటీషు వారి కదలికల రహస్య సమా చారం సేకరించారు. ఎట్టి పరిస్థితులలోను పట్టుబడకూడదని తెలిసినా ఒకసారి ఒక అమ్మాయి బ్రిటిషు వారికి పట్టుబడిపోయింది. ఆ ధీశాలి నర్తకి వేషం వేసుకొని జైలు అధికారులకు మత్తుమందు ఇచ్చి తన సహచరిని రక్షించింది.ఆ యువతులు తప్పించుకుంటుండగా బ్రిటిషు వాళ్ళు పేల్చిన ఒక గుండు రాజమణి కుడికాలును గాయపరిచింది. బ్రిటిషు వాళ్ళు గాలిస్తున్నా, రక్తం కారుతున్నా రాజమణి, ఆమె మిత్రురాలితో ఒక చెట్టు ఎక్కి 3 రోజులు గడిపారు. ఆ బుల్లెట్‌ గాయం వల్ల అమెకి శాశ్వతంగా అవిటితనం వచ్చినా ఆమె బాధపడలేదు.
తరువాతి రోజులలో ఆ సాహసకత్యాన్ని రాజమణి ఎప్పుడూ గుర్తుచేసుకునేవారు. జపాను చక్రవర్తి తనకి ఇచ్చిన మెడల్‌, ఐ.ఎన్‌.ఏ రాణీ ఆఫ్‌ ఝాన్సీ బ్రిగెడ్‌ లో లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ మొదలైనవన్నీ ఆమె స్మృతుల్లో మిగిలిపోయాయి.
FacebookTwitter