Seminar

భారత్ ను భారత్ గా  నిలబెట్టాలి – దీనదయాల్ ఉపాద్యాయ

Posted
FacebookTwitter

దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఒక పాత్రి కేయుడు, ఒక దార్శనికుడు, ఒక ఆర్థికవేత్త, ఒక రాజనీతిజ్ఞుడు. దేశభవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కలిగిఉన్నవారు. ఈ సంవత్సరం వారి శతజయంతి ఉత్స వాలు జరుగుతు న్నాయి. ఆ సందర్భంగా సమాచార భారతి ”భారత్‌ అంటే ఏమిటి?” అనే అంశంపై ఒక సంగోష్టి కార్యక్రమం 27 ఫిబ్రవరి 2016 శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు వల్లీశ్వర్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు (చీఫ్‌ సెక్రటరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (రి) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వా నితులుగా శ్రీ రామచంద్రరాజు ఐపిఎస్‌ (రి), శ్రీ సురేంద్ర (భారతీయ మజ్దూర్‌సంఘ్‌ అఖిల భారత సహసంఘటన కార్యదర్శి), విచ్చేశారు. కీలకో పన్యాసం డా||భజరంగలాల్‌ గుప్త (రిటైర్ట్‌ ప్రొఫెసర్‌, దిల్లీ యూనివర్సిటీ) చేశారు. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ఆశీః ప్రసంగంచేశారు. ఇద్దరు యువ జర్నలిస్టులు కూడా ప్రసంగించారు. ప్రసంగంలు సంక్షిప్తంగా…

ఈ రోజున సమాజంలో మానవతా విలువలు పడిపోతున్నాయి. కుటుంబాలు ఛిన్నాభిన్నమ వుతున్నవి. ఈ రెండింటిని కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయగారు వ్యష్టి- సమిష్టి ఈ రెండింటి మధ్య సమన్వయం అవసరము అని చెప్పారు. గతంలో మన దేశంలో ఈ సమన్వయం ఉండేది. ఎక్కడో మనం దాన్నుండి దూరంగా జరిగాము. దాని దుష్పరిణామాలు ఇప్పుడు అనుభవిస్తున్నాము. మళ్ళీ ఆ సమన్వయాన్ని సాధించాలని దీనదయాళ్‌ ఉపా ధ్యాయగారు ఏకాత్మ మానవతా దర్శనాన్ని బోధిం చారు. ఈ ప్రపంచంలో భారతీయులమైన మనం భారతీయులు గానే జీవించాలని దీనదయాళ్‌జీ చెప్పారని రామచంద్ర రాజు వివరించారు. ఈ రోజున భారత్‌ అస్తిత్వమే ఒక సవాలుగా ఉందని ముఖ్యఅతిథి ఐవైఆర్‌ కృష్ణారావు చెప్పారు. ఈ సవాలు విసురుతున్నది భావస్వేచ్ఛా ప్రకటన పేరుతో. ఈ దేశంలో భావ స్వేచ్ఛా ప్రకటన కావాలంటూ అంతర్జాతీయవాదులుగా గుర్తించబడాలని కొందరు మేధావులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటివారికి ఈ దేశంతో ఏమి సంబంధం ఉంటుంది? ఇక్కడ సమస్యలు మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో కాలిఫోర్నియా విశ్వవిద్యాల యంలోని విద్యార్థులు అర్థం చేసుకున్నారం టూ మాట్లాడు తుంటారు. కాని అర్థం చేసుకోవాల్సింది ఇక్కడి విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులు. ఇటువంటి గందరగోళ వాతావరణం లో మనం ఉన్నాం. మన నాయకులు మనల్ని ఎటు తీసు కెళ్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితి. ప్రపంచంలో మిగతా దేశాలకు మనకు తేడా ఉన్నది. ప్రపంచంలో అనేక దేశాలలో ఆ దేశాల అస్థిత్వాలే పూర్తిగా తుడిచి వేయబడ్డాయి. కాబట్టి అక్కడ ఎవరు ఏది చెపితే అదే నడుస్తుంటుంది. కాని మన దేశంలో మన దేశ సంస్కృతి సంప్రదాయా లువేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి మన దేశంలో చర్చలు జరుగుతుంటాయి.ఈ చర్చలు తులనాత్మకంగా ఉండాలి. చర్చలను మనం ప్రోత్సహించాలి. చర్చించటం తప్పుకాదు. ఆరువేల సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగినటువంటి విషయాలను ప్రస్తా విస్తూ ఇప్పుడూ మాట్లాడుతూ సమాజంలో సంఘర్షణ నిర్మాణం చేయాలని కొందరు ప్రయత్ని స్తున్నారు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనదయాళ్‌ ఉపాధ్యాయ 1964 నుండి 68వరకు ఈ దేశం ఎట్లా ఉండాలో ఆలోచిం చారు. దేశమంటే మట్టికాదో య్‌ దేశమంటే మనుషు లోయ్‌ అంటుంటారు. కాని దేశమంటే మట్టి మనుషు లూ, సంస్కృతి, విజ్ఞానము ఇవన్నీ కలిస్తేనే దేశం అని వివరించారు శ్రీ సురేంద్ర.

ఆధునిక భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుం దని చెప్తుంటారు. అభివృద్ధి ఉండవచ్చు కాని పశ్చిమ బెంగా ల్‌లో ప్లానిటోరియంలో పనిచేస్తున్నవారు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరా లైనా ఈ పరిస్థితులలో మార్పు రాలేదు. మన దేశంలో దేశాభివృద్ధికి కొలబద్ధగా పాశ్చాత్యుల అంశాలను తీసుకున్నారు. అవి అసంపూర్ణమైనవి- అసంబద్ధమైన వి. మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవా లంటే మనదైన కొలమానం ఏర్పాటు చేసుకోవాలని దీనదయాళ్‌ ఉపాధ్యాయ చెప్పారు. మన దేశాభివృద్ధికి మనదైన విధానాలను వికసింపజేసుకొని ముందుకు పోవటమే సరైనదని దీనదయాళ్‌జీ వివరించేవారు.ఈ సందర్భంగా భజరంగలాల్‌ గుప్తా మాట్లాడుతూ దీనదయాళ్‌ ఉపాధ్యాయ భారతదేశం గురించి నాలుగు కీలకమైన ఉపన్యాసాలు ఇచ్చారు. స్వతంత్య్రం వచ్చి 18 సంవత్సరాల తర్వాత అప్పటి దేశ పరిస్థితిని చూసి చాలా ఆవేదన చెందారు. ఆ ఆవేదనతో మన దేశాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాలమీద నాలుగు ఉపన్యాసాలు ఇచ్చారు. దీనదయాళ్‌జీ చెప్పిన ప్రకారం మనిషి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మల సమగ్ర వికాసమే వ్యక్తి వికాసం.ఈ నాలుగు పరస్పర పూరకాలు. పాశ్చా త్యుల ఆలోచనప్రకారం ఈ నాలు గు విడి విడిగా ఉంటాయి.ఇది తప్పు. ఈ దేశంలో వేలసంవత్సరా లనుండి ఈ దేశప్రజల ముందు జీవనలక్ష్యాలుగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలుండేవి. ఈరోజు ప్రపం చం ముందున్న క్యాపి టలిజమ్‌, కమ్యూ నిజమ్‌ ఇవేవీ వ్యక్తి సమగ్ర వికాసం గురించి చెప్పలేవు. ఈ రెండు ఆలోచనలో మధ్యలో వ్యక్తి సమగ్ర వికాసం కోసం దీనదయాళ్‌జీ ఏకాత్మ మానవతా దర్శనంను వివరించారు. రాజకీయంగా అధికారం కోసం సిద్ధాంత వైరుధ్యాల మధ్య కూడా కూటములు ఏర్పడుతు న్నాయి. ఆ కూటములు దేశ అభివృద్ధికి పాశ్చాత్యుల ఆలోచన లనే ప్రమాణంగా తీసుకొని ఆలోచిస్తున్నా యి. ఇప్పటి కైనా మనం వాటినుండి బయటపడి మనదైన విధానా లను వికసింపజేసు కోవాలి. దీనదయాళ్‌జీ ఏకాత్మ మానవదర్శనంలో ఇవే విషయాలను సవివరంగా వివరించారు. ఈ రోజు మన దేశంలో అసహనం అనే ఒక భయంకర మైన జబ్బు వ్యాపిస్తోంది. ఆ పేరెత్తిన వారికి తక్షణం చికిత్స అందించాలి. లేదంటే అది ఈ దేశానికి ప్రమాదకరమని స్వామి పరిపూర్ణానంద వివరించా రు. భారత్‌ అంటే జ్ఞానాన్ని పంచే వెలుగు కాని, ప్రపంచంలో మరే దేశానికి లేన్నట్లుగా మన దేశానికి మాత్రమే ఇండియా అనే రెండో పేరు ఉండటం దౌర్భాగ్యం. కుహనా మేధావులు వక్రీకరిం చిన చరిత్రను జనంపై బలంగా రుద్దుతున్నారు. సెక్యులరి జం పేరిట దేశంలో హిందుత్వంపై దాడి జరుగుతుం దని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వమ నేది ఒక మతం కాదు ధర్మమని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. అసహనం అనే వారికి తక్షణం చికిత్స అందించకుంటే యూనివర్సిటీలు, ఇతర సంస్థలలో ఈ వైరస్‌ పాకే ప్రమాదముందని పరిపూర్ణానంద హెచ్చరించారు. ప్రస్తుతం కాషాయ తీవ్రవాదం అనే విష ప్రచారం జరుగుతోంది. ఇటువంటి విషయాలను తిప్పికొట్టాలి. సమాజాన్ని సరిగ్గా నడిపించడంలో గురుతరమైన బాధ్యత పాత్రికేయుల కు ఉన్నది. పాత్రికేయులు తమ పాత్రను సరిగా పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ తిగుళ్ళ కృష్ణమూర్తి స్వాగతం పలుకగా, చివర్లో గోపరాజు నారాయణరావు వందన సమర్పణ, జనగణమన జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది.

 

 

FacebookTwitter