ఆచార్య వినోబాభావే
ఎవరికైనా అవసరానికంటే ఎక్కువ భూమి ఉందా అని అడిగే వారు. ఎవరైనా ఈ భూమి లేని వారికి భూమి ఇవ్వగలరా అని తర్వాతి ప్రశ్న వేసేవారు అలా ప్రతి గ్రామంలో ప్రయత్నం చేసి దాదాపు రెండున్నర లక్షల ఎకరాల భూమిని తెలంగాణలో సేకరించారు. దీనిలో కేవలం పాలమూరు జిల్లాలోని 40 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. కమ్యూనిస్టులు దశాబ్దాలుగా వర్గ శత్రు నిర్మూలన, బూర్జువా, పెట్టుబడిదారీ, భూస్వాములు, అని మాట్లాడుతూ ఒక్క ఎకరం భూమి కూడా పేదవాళ్లకు ఇప్పించ లేకపోయారు. ఈ పనిని రక్తపు చుక్క చిందించకుండా మనస్ఫూర్తిగా ఆ ఊర్లో ఉన్న పేదవాళ్లను ఊర్లో ఉన్న భూస్వాముల ద్వారా ఆదుకునే ప్రయత్నాన్ని చేసి చూపించారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు చేయలేని పనిని హిందూ ఆధ్యాత్మిక కోణం ద్వారా చేసి చూపించారు. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని సర్వోదయ ఉద్యమాన్ని జయప్రకాశ్ నారాయణ తో కలిపి ముందుకు తీసుకెళ్లారు. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు ప్రతి గ్రామంలో దీనులకు హాస్టల్, గ్రామ స్వరాజ్య కేంద్రాలు, సర్వోదయ మండలి, హరిజన సేవక్ సంఘ్, గిరిజన సేవ సంఘం, హిందీ ప్రచార సమితి, రచనాత్మక సమాజ , గాంధీ జ్ఞాన ప్రతిష్టన్, ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్లారు ఒక రకంగా చెప్పాలంటే నేడు సంఘము వివిధ సామాజిక జీవన రంగాల్లో చేస్తున్నట్టుగానే నాడు భారతదేశంలో గాంధేయవాదం ఆధారంగా హిందూ జీవన విలువల ఆధారంగా వివిధ రకాల సంస్థలను, నిర్వహించారు చనిపోవడానికి అంటే ముందు దేశంలో గో రక్షణ చట్టం తీసుకు రావడానికి ఉపవాస దీక్ష కూడా వినోభా చేశారు. గోవులు అంటేఆయనకు అమితమైన ప్రేమ. నాగపూర్ పక్కన వార్ధా లో ఉన్న సేవాగ్రం కేంద్రంగా ప్అని చేస్తూ 1980లో శుభా స్వర్గస్తులయ్యారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కొరకే పాటు పడ్డ వారు మనకు నిత్య స్మరనీయులు.