ABPS-పత్రికా నివేదిక-2018

Posted Posted in Document
FacebookTwitter

దేశం మొత్తం నుండి ఎన్నికైన ప్రతినిధులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. వీటిలో దేశం మొత్తంలో సంఘ కార్యం, వివిధ క్షేత్రాలకు సంబంధించిన పని గురించి సమీక్ష జరుగుతుంది. అలాగే దేశానికి సంబంధించిన ప్రధాన అంశాలపై చర్చ, తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది.  ఈ సంవత్సరం ఈ సమావేశాలు నాగపూర్ లో జరిగాయి. సమావేశాలలో `భారతీయ భాషల పరిరక్షణ’ పై తీర్మానం ఆమోదించారు. మా.సర్ కార్యవాహ్ సురేశ్ జోషిజీ వార్షిక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక సారాంశం . (more…)

FacebookTwitter

సంస్కృతి పదాల చిత్ర కోశం ‘లోకార్పణం’ పుస్తకావిష్కరణ

Posted Posted in News
FacebookTwitter

అత్తలూరి గిరిహరినత గారు రచించిన సంస్కృతి పదాల చిత్ర కోశం ‘లోకార్పణం’ అనే పుస్తకాన్ని భార్కత్ పుర జాగృతి భవన్ లో ద్రావిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉప కులపతి ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లుడుతూ ప్రజలు తమ మాతృ బాష తెలుగు తో పాటు సంస్కృత బాష ను కూడా చదవి అర్ధం చేసుకోవడానికి ‘లోకార్పణం’  లాంటి పుస్తకాలు ఇప్పటికి తరానికి చాల అవసరం అన్నారు. సంసృతం నేర్చోవడం వలన దేశ బాషలతో పాటు, తెలుగు పై గట్టి పట్టు  సాదించవచ్చు అని అన్నారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ సాంస్కృత పరిషత్ సభ్యులు డాక్టర్ రమణ మూర్తి గారు,, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎన్ ఎఫ్ సి విశ్రాంత శాస్త్రవేత్త డా. సోమయాజులు గారు, తెలుగు సంస్కృతి పీఠం ఆచార్య మురళీధర్ శర్మ, జాగృతి పూర్వ సంపాదకులు వడ్డీ విజయ సారథి గారు పాల్గొన్నారు.

FacebookTwitter

గిన్నిస్‌ గూటిలోకి గాన కోకిల

Posted Posted in News
FacebookTwitter

దక్షిణభారత సినీ గానకోకిల పి.సుశీలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అత్యధిక సంఖ్యలో పాటలు పాడినందుకు ఆమెకు ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కింది. సుశీల ఆరుకు పైగా భాషల్లో 17,695 సోలో, యుగళ, బృంద గీతాలు పాడారని ఆమెకు ప్రదానం చేసిన ధ్రువపత్రంలో గిన్నిస్‌ ప్రశంసించింది. ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంతో ఆమె ఆలపించిన యుగళగీతాల సంఖ్య.. రికార్డు స్థాయిలో 1,336 ఉండటం విశేషం.

కొత్తతరం గాయనులకు సుశీల ఒక రోల్‌మోడల్‌, స్ఫూర్తి. ఏ పాటకైనా ప్రాణం పోసే అద్భుత గాయని ఆమె. విడిగా చూస్తే… మామూలుగా అనిపించే గీతాలెన్నో ఆమె గళమాధుర్యంతో జీవం పోసుకున్నాయి.

సుశీల పాటంటే తరగని మాధుర్యం… ఆహ్లాదపరిచే శ్రావ్యత! పాటలోని ప్రతి పదం చక్కగా వినపడేంత స్పష్టత ఆమె ముద్ర. సన్నివేశానుగుణంగా భావయుక్తంగా, సహజంగా, తీయగా పాడటంలో ఆమెది తిరుగులేని ప్రజ్ఞ. ఏ హీరోయిన్‌కు పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించే గానం మరో విశిష్టత.

ఏ రకమైన పాటకైనా ఒదిగే గొంతు ఆమెది. అల్లరి పాటలైనా, హాయి పాటలైనా, హాస్యం, విషాదం, వలపు, తలపు… వేటినైనా సరే, ఆ కంఠం అలవోకగా అనువదించుకుంటుంది. అనుపమానంగా ఆలపిస్తుంది. దైవభక్తి, దేశభక్తి గేయాలు, జానపద గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ గీతాలు, పిల్లల జోల పాటలూ, పండగల పాటలూ, క్లబ్‌ పాటలూ… ఇలా వైవిధ్యభరితమైన వేల పాటలు! తరతరాల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షక శ్రోతలను తన గానామృతంతో ఓలలాడించారు.

తొలి పాట…: ఆమె సినీరంగ ప్రవేశం చేసింది 1952లో. అప్పటికే బాలసరస్వతీదేవి, జిక్కి, పి.లీల, ఎం.ఎల్‌. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులైన గాయనులుండేవారు. వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు. దాన్ని ఆమె కొద్దికాలంలోనే సాధించగలిగారు.

ఆమె మొదటి పాట ‘కన్నతల్లి’ చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ‘ఎందుకు పిలిచావెందుకు’ అన్న ఆ పాటను ఎ.ఎం. రాజాతో కలిసి పాడారు.

1956వ సంవత్సరం సుశీల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. అంతవరకు చిన్నచిన్న పాత్రలకు తన కంఠాన్నిస్తూ వచ్చిన సుశీల మొదటిసారిగా కథానాయిక (సావిత్రి) పాత్రకు ‘తోడికోడళ్ళు’ చిత్రంలో పాడారు. ఆ పాటతో సుశీల ప్రాచుర్యం ఎంతగానో ఇనుమడించింది.

అందుకే తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ ఆమె పాట లేని సినిమా దాదాపు లేదని చెప్పొచ్చు. 1960ల నుంచి 1970ల తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతాభిమానులు భావిస్తారు.

పన్నెండు భాషల్లో…: ఆరు దశాబ్దాల్లో 12 భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, పడుగు, సింహళీస్‌, మరాఠీ) ఆమె పాటలు పాడారు. విజయనగరం మహారాజా కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద అభ్యసించిన శాస్త్రీయ సంగీతం దీనికి పునాదిగా పనిచేసింది.

ఒకే కుటుంబంలోని రెండు తరాలతో కలిసి సుశీల పనిచేశారు. నటి జయచిత్రకూ, ఆమె తల్లి అమ్మాజీకీ నేపథ్యగానం అందించారు. ఎస్పీ బాలుతో, ఆయన కొడుకు చరణ్‌తో; కె.జె. ఏసుదాసుతో, ఆయన కుమారుడు విజయ్‌ ఏసుదాస్‌తో కలిసి పాడారు. ఇళయరాజా, ఆయన కొడుకు కార్తీక్‌రాజా… ఇద్దరి సంగీత దర్శకత్వంలో పాడారు. సహ గాయని ఎస్‌. జానకితో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింహళీస్‌ భాషల్లో పాడారు. తెలుగులో వీరిద్దరూ కలిసి పాడిన పాటలు 90కి పైగా ఉన్నాయి.

ఏమీ తెలియని భాషలోని పాటలో కవి పొదిగిన భావం సంపూర్ణంగా వ్యక్తమయ్యేలా, ఆ భాషలోని శ్రోతలను మైమమరిపించేలా పాడటం ఎంత కష్టం! అరుదైన ఆ ఫీట్‌ను సుశీల అలవోకగా సాధించారు.

పురస్కారాలెన్నో: 2008లో సుశీలను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించారు. 2001లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య పురస్కారం పొందారు. ఐదుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికయ్యారు. 1969, 1971లలో తమిళ పాటలకు ఆ పురస్కారం వచ్చింది. 1978లో ‘ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), 1982లో ‘ప్రియే చారుశీలే’ (మేఘసందేశం), 1983లో ‘ఎంత బీదవాడే గోపాలుడు వేణుగోపాలుడు’ (ఎం.ఎల్‌.ఎ. ఏడుకొండలు) పాటలకు జాతీయ అవార్డును అందుకున్నారు.

తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రలో సుశీలది ఘనతర అధ్యాయం!

– సిహెచ్‌. వేణు
(ఈనాడు సౌజన్యం తో)

 

FacebookTwitter

మంచికోసం ఓ మార్పు అదే సంక్రాంతి

Posted Posted in Articles, News
FacebookTwitter

sankranthi

అంద‌రూ బాగుండాలి. అంతా మంచే జ‌ర‌గాలి అనేది ప్ర‌తి ఒక్క‌రి ఆశ‌. గ‌త కొంత‌కాలంగా ఎన్నో ఆటుపోట్లు, మ‌రెన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల మధ్య భ‌యంతో గ‌డిపిన రైత‌న్న పంట‌చేతికొచ్చి సేద‌తీరే స‌మ‌య‌మిది.  ప్ర‌క్రుతికి చీర క‌ట్టిన‌ట్లు ఉండే పంట‌ను చూస్తూ , అభ్యుద‌య‌పు సూర్యోద‌యాన్ని ఆస్వాదిస్తూ రైత‌న్న సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాడు. అస‌లు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా!! చ‌ల్ల‌ని గాలుల న‌డుమ‌, ప‌చ్చ‌నిపైరుల‌తో ప్ర‌తీ ఊరు, ప్ర‌తీ ఇల్లూ ధాన్య‌పు రాశుల‌తో ఆనందంతో ఉండ‌గా..వారి ముఖాల్లో సంతోషం క‌నిపిస్తుంటే గంగిరెద్దుల విన్యాసాలు, హ‌రిదాసు చేసే భ‌జ‌న చ‌ప్పుళ్లు, జంగ‌ర‌దేవ‌ర‌ల మాట‌ల మూట‌లు, వివిధ వేషాల‌తో హాస్యాన్ని పండించే ప‌గ‌టి వేష‌గాల్లు…మా ఇంటికి రండీ అని స్వాగ‌తించ‌డానికి అనేక మెలిక‌ల రంగ‌వ‌ళ్లిక‌ల‌తో రంగుల‌తో శోభాయ‌మానంగా మెరిసే ముగ్గులు. వాటిపైన పువ్వులు పూచాయా అన్న‌ట్లు ఉండే గొబ్బెమ్మ‌లు. వాటి చుట్లూ న్రుత్యం చేసే అమ్మాయిలు..గాలిప‌టాల‌తో సంద‌డి చేసే అబ్బాయిలు..పకోడి పందాలు..భోగిమంట‌లు…బొమ్మ‌ల కొలువులు అబ్బో ఒక‌టా రెండా ఇలా ఎన్నెన్నో శోభాయ‌మానంగా క‌నిపిస్తుంది సంక్రాంతి. అంద‌రూ సంతోషాల‌తో ఉంటూ ప్ర‌తి ఇల్లు హ‌రివిల్లులా మారితే అదే అస‌లైన సంక్రాంతి.

సంక్రాంతి అంటే సంక్ర‌మ‌ణం అని అర్థం. అంటే మార్పు చెంద‌డం. సంవత్స‌రానికి ప‌న్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయితే ముఖ్యంగా రెండు సంక్రాంతుల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణంలోకి తీసుకుంటారు. వాటిలో ఒక‌టి మ‌క‌ర సంక్రాంతి, రెండోది వేస‌వి కాలంలో వ‌చ్చేక‌ర్క సంక్రాంతి.  సూర్య‌డు మ‌క‌ర రాశిలో ప్ర‌వేశించ‌డాన్నేమ‌క‌ర సంక్ర‌మ‌ణం అంటారు. ఇలా ప్ర‌తి నెల మారుతూనే ఉంటాయి. రాశి మారిన ప్ర‌తి సారి దాన్ని సంక్రాంతి అనే అంటారు. ఈ మార్పు కార‌ణంగానే మ‌న జీవితాల పాల‌న‌, పోష‌ణ  జ‌రుగుతున్నాయి. ఈ క‌ద‌లిక ఆగిన‌ట్ల‌యితే మ‌నం అనేది కూడా ఆగిపోతుంది. ఈ భావ‌న అర్థం చేసుకోవాల‌నేది కూడా సంక్రాంతి పండుగ‌లో అంత‌రార్థం.

ఈరోజు ఎంతో ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్త‌రాయ‌ణ ప‌థంలోకి ప‌య‌న‌మ‌వుతాడు. అందుకే ఈరోజు నుంచి స్వ‌ర్గ ద్వారాలు తెరిచే ఉంటాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు   రోజులుగా చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగా అని కూడా పిలుస్తారు, మూడు రోజుల పండగలో మొదటిగా భోగి, త‌ర్వాత సంక్రాంతి, ఆ త‌ర్వాత క‌నుమ‌గా జ‌రుపుకుంటారు. కొన్ని చోట్ల నాలుగోరోజు ముక్క‌నుమ అని కూడా జ‌రుపుకుంటారు. మొదటి రోజు భూమికి పూజ చేస్తారు. రెండ‌వ రోజున పండుగ‌ను ఇంట్లోవారు జ‌రుపుకుంటే మూడోరోజు పాడి ప‌శువులను అందంగా అలంక‌రించి పండుగ చేసుకుంటారు. మ‌న సంస్ర్కుతిలో ప్ర‌క్రుతికి ప్రాముఖ్యం ఇవ్వ‌బ‌డింది. ఎందుకంటే ప్ర‌క్రుతి లేనిదే మ‌నం లేము. ఈ గొప్ప భావ‌న‌ని ప్ర‌జ‌ల‌కు క‌లిగించ‌డానికి ఆచారం పేరుతో చేసుకునే ప్ర‌ముఖ పండుగే సంక్రాంతి.

భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. 

మూడురోజుల్లో మొద‌టి రోజును భోగి అంటాఉ. ఉద‌యాన్నే లేచి ఇంట్లోని పాత వ‌స్తువులన్నింటినీ స‌మ‌కూర్చుకుని, కొత్త వాటితో నిత్య నూత‌న జీవితం ఆరంభించ‌డానికి గుర్తుగా వాటిని భోగి మంట‌ల్లో వేస్తారు. ఇక సాయంత్రం వేళ బొమ్మ‌ల కొలువు పెట్టి ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ గ‌డుపుతారు. ఇంట్లో చిన్న పిల్ల‌లుంటే  అంద‌రూ క‌లిసి రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. తెలంగాణా ప్రాంతంలో స‌కినాలు అనే పిండి వంట‌ను చేసుకుంటారు.

మకర సంక్రాంతి

రెండవ రోజు, అసలైన పండుగ రోజు సంక్రాంతి. ఈరోజు తెల్ల‌వారు జామునే లేచి ఇంటిని అలంక‌రించి కొత్త బ‌ట్ట‌లువేసుకుని బంధుమిత్రులంద‌రితో క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు. మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం  ఈ రోజున “హరిలో రంగ హరీ” అంటూ కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. మ‌హారాష్ట్ర , తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల‌లో ఈరోజు గౌరీదేవి పూజ చేసి, నువ్వుల‌తో చేసిన ల‌డ్డూల‌ను నైవేద్యంగా పెడుతారు. ముత్త‌యిదువుల‌ని పిలిచి వారికి బ‌హుమ‌తుల‌తో పాటు నువ్వుల ల‌డ్డూల‌ను తినిపించి, తీపి తినితీయ‌గా మాట్లాడు..నువ్వులు తిని ముత్త‌యిదువుగా ఆరోగ్యంగా ఉండూ అంటూ దీవిస్తారు.

చివరిదైన కనుమ రోజు. 

ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు, ఈరోజు ఆడ పిల్లలందరు, గొబ్బెమ్మలు పెడతారు, గొబ్బెమ్మ అంటే గోపి+బొమ్మ, అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం, వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. క‌నుమ రోజు ప్ర‌యాణం చేయ‌రు.

ఇలా మూడు రోజుల పాటు శోభాయమానంగా జ‌రుపుకునే పండుగ నేడు కాంక్రీటు జీవ‌న విధానంకి అల‌వాట ప‌డి సంక్రాంతిలోని కాంతి త‌గ్గిస్తున్నాం. ఆనాటి కాలంనాటి గంగిరెద్దులు, హ‌రిదాసు కీర్త‌న‌లు, క‌నీసం రంగ‌వ‌ల్లిక‌లు కూడా లేకుండా అన్నీ ఫాస్ట్‌ఫుడ్ త‌ర‌హా జీవ‌న విధానానికి అల‌వాటు ప‌డి,  అప్ప‌టిక‌ప్ప‌డు త‌యార‌య్యేవాటిపై ఆధార‌ప‌డుతున్నాం.  అస‌లైన పండుగ మాధుర్యాన్ని మ‌నం కోల్పూతూ మ‌న పిల్ల‌ల‌కు కూడా తెలియ‌చేయ‌ట్లేద‌నేది అక్ష‌ర స‌త్యం. ఇక‌నైనా పండుగ విశేష‌త‌ను భావిత‌రాల‌కు చెబుతూ సంక్రాంతి మ‌న అంద‌రిజీవితాల్లో సుఖ సంతోషాల‌ను క‌లిగించి కాంతిప‌థంలో మ‌న జీవితాలు విర‌బూయాల‌ని కోరుతూ పాఠ‌కులంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు.

– ల‌తాక‌మ‌లం

FacebookTwitter