1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో స్వయంసేవక్ బలిదానం

Posted Posted in Inspiration

 

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా .మోహన్ జి భాగవత్ 25 ఫిబ్రవరి నాడు మీరట్ లో జరిగిన రాష్ట్రోదయ సమాగం లో మాట్లాడుతూ బంగ్లాదేశ్ యుద్ద సమయంలో ఒక స్వయంసేవక్ చేసిన బలిదానాన్ని గురించి ప్రస్తావించారు. (more…)

జల సంరక్షణ విషయములో లాటూరు వాసుల ఉద్యమము దేశానికి ఆదర్శం – డా. మోహన్ భాగవత్ జీ

Posted Posted in News

లాతూరు (వి.సం.కే) ప్రకృతి విపత్తుల సమయములలో చేతులు ముడుచుకొని కూర్చొనకుండా పూర్తి ధైర్య సాహసాలతో మరియు జన సహకారంతో పరిస్ధితులను ఎదుర్కొనగలమనడానికి లాతూరు ప్రజలు ఒక అద్వితీయ ఉదాహరణ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలకులు డా. మోహన్ భాగవత్ గారు అన్నారు. ఈ సంఘటన దేశమంతటికీ దిశానిర్దేశము చేయగలదని విశ్వసిస్తున్నానంటూ జలయుక్త లాతూరు కార్యక్రమాన్నిప్రశంసించారు.

‘సార్వజనిక్ జలయుక్త లాతూరు వ్యవస్థాపన సమితి’ వారు తలపెట్టిన జన భాగీదారిత కార్యక్రమము ద్వార నిర్జీవంగా మారిన మంజర  నది యొక్క పునరుధ్ధారణ కార్యక్రమము చివరి దశలో ఉన్నది.  ఈ సందర్బంగా నాగేశ్వర మందిర ప్రాంగణం లో జలపూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.

latur1

లాతూరు జలయుక్త సమితి అధ్యక్షులు డా. అశోక్ రావు జీ కుక్డే కాకా వేదికపై ఉపస్థితులైనారు. మంజరా నదిపై సాయీ నండి నాగఝరీ వరకు గల 15 కి.మీ. దూరము ప్రజల సహకారంతో పూర్తి చేయబడినది. సర్ సంఘ్ చాలక్ జీ, దుర్భిక్షమును ఎదుర్కొనుటకు లాతూరువాసుల పరిశ్రమను అభినందించడానికి ఇక్కడకు విచ్చేశారు. వైదిక మంత్రోచ్ఛారణతో జలపూజ కార్యక్రమము సంపన్నమైనది. ‘గంగా మాతాకీ జై’, ‘భారత్ మాతాకీ జై’ అన్న నినాదాలతో దిక్కులు మార్మోగాయి.

మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ జలయుక్త లాతూరుని ఉద్దేశించిచేసిన అసమానమైన కార్యక్రమము ను అభినందిస్తూ దానిని నిర్వహించిన డా. కుక్డే కాకా గారిని  సర్ సంఘ్ చాలక్ జీ ప్రశంసించారు. సమాజములో బేధాభిప్రాయాలు ఉండవచ్చును. కానీ విపత్తుల గురించి ఆలోచించినప్పుడు మనందరమూ ఒకే త్రాటి పై నిలిచి దానిని అధిగమించే ప్రయత్నము చేస్తాము. లాతూరులో ఇదే జరిగింది. సంఘ్ ఇటువంటి ఐకమత్యమే కోరుకుంటుంది. లాతూరులో జల సమస్య ఉత్పన్నమైనప్పుడు జనులు పలాయన మార్గము ఎంచుకోకుండా, దానిని ఎదుర్కొనడానికి సిద్ధపడ్డారు. “एकमेका साह्य करू अवघे धरू सुपंथ” అన్న సూక్తిని దృష్టిలో వుంచుకొని అందరూ ఐకమత్యముతో ఎదుర్కొన్నారు. ఇది దేశానికే దిశానిర్దేశం చేయగల విషయము.

లాతూరు వ్యవస్థాపన సమితి యొక్క 11 మంది సభ్యులను, డా. అశోక్ రావ్ కుక్డే పరిచయం చేశారు. వారు మాట్లాడుతూ  లాతూరు కార్యక్రమము గురించి వివరించారు. లాతూరు పాణీ అన్న మాటలే అందరిని ఒకటిగా చేశాయి అని అన్నారు. ఈ కార్యక్రమము ప్రజల సహకారంతోనే సాధ్యమయ్యింది. ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు జరుపబడినది అని అందరిని కొనియాడారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కు చెందిన మకరంద్ జాధవ్ మరియు నీలేష్ జీ ఠక్కర్ లాతూరులో జరిగిన ఈ ప్రకల్పము యొక్క ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని జోగేంద్ర సింఘ్ బిసేన్ నిర్వహించారు, సునీల్ జీ దేశ్ పాండే వందన సమర్పణచేశారు. అరుణ్ జీ డంకే గారి శాంతి మంత్రముతో కార్యక్రమము సంపన్నమైనది.