వాస్తవికత, విశ్వసనీయతే సోషల్ మీడియా గొంతు – సోషల్ మీడియా సంగమంలో శ్రీ మిలింద్ ఓక్

Posted Posted in Press release, Social Media, Workshop
ఆడియో మరియు వీడియో రూపంలో వ్యాప్తి చెందుతున్న సమాచారమే నేటి మీడియాకు ప్రధాన వనరుగా మారిందని, వాస్తవికత, విశ్వసనీయతల మూలంగానే సోషల్ మీడియా సమాచారానికి ఆదరణ ఏర్పడుతుందని భారతి వెబ్ సీఈఓ శ్రీ మిలింద్ ఓక్ అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో విశ్వసంవాద కేంద్ర ఆదివారం నగరంలో నిర్వహించిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమంలో ప్రధాన వక్తగా శ్రీ మిలింద్ ఓక్ పాల్గొన్నారు. భారత్ వ్యతిరేక శక్తులు ఇక్కడి సాంస్కృతిక విలువలను, చిహ్నాలను ధ్వంసం చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్న ప్రయత్నాన్ని అరికట్టడానికి సోషల్ మీడియాను సమాజానుకూలంగా ఉపయోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
సమాచార భారతి కన్వీనర్ శ్రీ ఆయుష్ నడింపల్లి మాట్లాడుతూ జాతీయవాద భావజాలం కలిగిన ఔత్సాహిక కార్యకర్తలను సోషల్ వేదికగా సామజిక అంశాల్లో భాగస్వామ్యం చేసేందుకు చేస్తున్న కృషిని వివరించారు.
‘సోషల్ మీడియా ద్వారా భారతీయ సంస్కృతి, చరిత్ర పట్ల అవగాహన’ అంశం మీద జరిగిన సమాలోచనలో భాగంగా మాట్లాడిన ప్రముఖ సోషల్ మీడియా కార్యకర్త శ్రీమతి పద్మ పిళ్ళై, చరిత్ర వక్రీకరణ వంటి సోషల్ మీడియా దాడులను ఎదుర్కోవాలంటే అందరూ నిజమైన చరిత్ర పట్ల అవగాహనా కలిగి ఉండాలని, అప్పుడే ఈ విధమైన దాడులకు సరియైన ఆధారాలతో సహా ధీటైన సమాధానాలు ఇవ్వగలుగుతామని తెలిపారు.
మై ఇండ్ మీడియా సంస్థ సభ్యురాలు శ్రీమతి పద్మిని భావరాజు మాట్లాడుతూ.. మన సంస్కృతీ సాంప్రదాయాలకు సంబంధించిన స్పష్టమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం సోషల్ మీడియాలోని యూజర్లు ఎంతో అతృతతో ఎదురుచూస్తూ ఉంటారని వివరించారు. ఈ లక్ష్యంతో తమ మై ఇండ్ మీడియా సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల కోసం చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాలను గురించి వివరించారు.
ఐటీ నిపుణులు శ్రీ రత్నాకర్ సదస్యుల మాట్లాడుతూ.. ప్రాచీన దేవాలయాలు మరియు ఇతర చారిత్రక కట్టడాల సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికి చేరేవిధంగా ఎలా వివిధ రూపాల్లో ఎలా పోస్ట్ చేయవచ్చు అనే విషయంపై సలహాలు అందించారు.
‘సామాజిక అవగాహన కోసం సోషల్ మీడియా’ అంశం మీద జరిగిన రెండవ రౌండ్ సమాలోచనలో ఐటీ నిపుణులు శ్రీ ప్రభల రామ్మూర్తి మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలను కలిపేందుకు తాము బాలికల సంక్షేమం, రక్షణ పేరిట నిర్వహించిన కాంపెయిన్ ఎలా ఉపయోగపడిందో వివరించారు.
హైదరాబాద్ పాఠశాలా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు శ్రీ ఆశిష్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా తాము చేసిన పోరాట ఫలితంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు ఎలా లాబీయింగ్ ఎలా వణికిపోయిందనేది వివరించారు.
అడ్వొకేట్ శ్రీ కరుణాసాగర్ ప్రసంగిస్తూ సామాజిక అంశాలపై అవగాహన కోసం సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సమాచారం పరిశోధనాత్మకంగా, ఎలాంటి అసభ్యతకూ తావు లేకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ డేటా సైన్స్ నిపుణులు శ్రీ గౌరవ్ ప్రధాన్ తెలిపారు .

Social Media Workshop: Secundrabad

Posted Posted in Social Media
Social Media Workshop: 10th September 2017 
 
Social Media Workshop was conducted on 10th September 2017 in Hindu Womens College, Sanathnagar, Secundrabad.
It was a daylong workshop from morning to evening with focus on the following subjects:
  • Trends in Social Media
  • Twitter
  • Content Management using Google Drive
  • Google Search for a better content management
  • Content Circulation
  • Facebook Algorithm
  • Images Making
  • Introduction to Video Making
  • Samaroop
46 people attended the workshop. Sri Nadimpally Ayush Ji,General Secretary of Samachara Bharati addressed in the Samarop . Sri Sattiraju Ji, Vibhag Prachar Pramukh was also present.

భారతీయ సంస్కృతి ని భావితరానికి అందివ్వడంలో మహిళలదే కీలక పాత్ర

Posted Posted in Press release, Seminar

భారతీయ సంస్కృతి దృడంగా ఉన్నపుడే మనతో పాటు  ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది అని విశ్వసించి, తాను పుట్టిన దేశాన్ని (ఐర్లాండ్) వదిలి భారత దేశాన్ని కన్న తల్లిగా భావించి జీవితాన్ని ధారపోసిన నిస్వార్ధ మహిళ సోదరి నివేదిత. ఆమె జీవితం అందిరికి స్పూర్తిదాయకం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న ప్రతీకుల పరిస్తితులకు సైతం ఎదుర్కొని  మహిళా చైతన్యం కొరకు విద్య, సేవ ప్రధానం అని ఆ దశలో పని చేసిన గొప్ప దేశ భక్తురాలు అని, ఆచార్య పి. సుమతి నాగేంద్ర గారు తెలిపారు.

సోదరి నివేదిత 150 జయంతి ఉత్సవాలలో ‘సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్’ వారు  29 అక్టోబర్  నాడు హైదరాబాద్, ఖైరతాబాద్  లోని ఇండియన్  ఇన్స్టిట్యూట్  అఫ్  కామెర్స్  అండ్  మానేజిమెంట్’   ప్రాంగణంలో   “పాత్రికేయలు,  రచయితలు,  సోషల్మీడియా  ఆక్టివిస్ట్ -మహిళల  సమావేశం ”  అని కార్యక్రమంలో పి. సుమతి గారు ముఖ్య అతిధి పాల్గొని గా ప్రసంగించారు.

 

పి. సుమతి గారు మాట్లాడుతూ సమాజంలో   నాలగవ  మూల  స్థంభంగా  కొనియాడే  పాత్రికేయ వృత్తిలో  ఉన్న  మహళలది  కీలక  పాత్ర  అని,  దాన్ని  సమర్ధవంతంగా  పోషించి దేశానికి  మార్గదర్శనం ఇవ్వడంలో ముందు ఉండాలి అని సూచించారు.

కార్యక్రమ మరో ముఖ్య అతిధిగా పాల్గొన్న రచయిత డాక్టర్  పుట్టపర్తి  నాగ  పద్మిని  గారు  మాట్లాడుతూ “సంస్కృతీ అనేది  ఒక  తరం  నుండి  మరొక  తరానికి  అందించగల  వారు  మహిళలు అని,  ఒక  విదేశీరాలు  అయినా  సోదరి  నివేదిత  స్వామివివేకానంద  బోధనల ద్వారా ప్రభావితమై హిందుత్వాన్ని స్వీకరించి  భారత మాత సేవలో  లీనమైన విధానం ఆదర్శనీయం. భారతీయలు అందరిని ఏకైక పరిచే హిందుత్వం జరుగుతున్న దాడులు తిప్పి కొట్టాలి అని, భారతీయ దృక్కోణంలో చరిత్ర ను రాసి దేశ ఔనత్యాన్ని తిరిగి సాధించాలి అని అన్నారు.

ఈ సమావేశంలో జరిగిన చర్చలో మీడియా రంగంలో ఎదురవుతున్న వివిధ సమస్యల పట్ల, హిందూ సంస్కృతి పై జరుగుతున్న దాడిని దృష్టికి తీసుకొని వచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులు మరియు మహిళా రచయితలు పాల్గొన్నారు. సమాచార భారతి కార్యదర్శి శ్రీ ఆయుష్ సమాచార భారతి ద్వారా జరుగుతున్నా వివిద్ కార్యక్రామాలని వివరిచారు. కార్యక్రం యొక్క నిర్వహణ శ్రీమతి దేవిక మరియ శ్రీమతి  ఆరాధన చేసారు.