నారదుడు జోకర్ కాదు, విజ్ఞానఖని, తొలి పాత్రికేయుడు

Posted Posted in Narada Jayanti

మన సినిమాలలో చూపించిన విధంగా నారదుడు కలహ ప్రియుడు, హాస్యం అందించే జోకర్ కాదని అద్భుతమైన విజ్ఞాన ఖని అని, త్రిలోక సంచారంతో ధర్మ రక్షణ, లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించిన గొప్ప పాత్రికేయుడు అని సమాచార భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన నారద జయంతి ఉత్సవంలో పలువురు కొనియాడారు.

భక్తికి, విజ్ఞానానికి, న్యాయసూత్రాలకు పెట్టింది పేరని, పలువురు రాజులు, ఋషులు, సాధువులు, చివరకు దేవుళ్ళకు సహితం ధర్మం, న్యాయం గురించి వివరణ ఇచ్చి లోక కళ్యాణం కోసం పనిచేసిన నారదుడు అద్భుతమైన సమాచారం అందించిన వ్యక్తి అని, ప్రపంచంలో తొలి పాత్రికేయుడు అని వివరించారు.

ప్రజ్ఞ ప్రవాహ జాతీయ సంయోజక్ నంద కుమార్ ప్రధాన వక్తగా మాట్లాడుతూ స్వతంత్రంకు ముందు కేవలం సేవా భావంతో ఉండే  పత్రికా రచన నేడు పూర్తి వ్యాపారంగా మారిపోయినదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అనేకమంది పాత్రికేయులు అంకితభావంతో, తమ వృత్తిధర్మం పట్ల నిబద్దతతో పనిచేస్తున్నారని కొనియాడారు. నారద జయంతి సందర్భంగా అటువంటి కొందరు జర్నలిస్ట్ లను గౌరవించుకోవడం జరుగుతున్నదని అన్నారు.

సమాచార కమీషనర్ పి విజయబాబు ముఖ్యఅతిధిగా పాల్గొంటూ నేటి పత్రికారంగంలో తరిగిపోతున్న విలువల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార భారతి అధ్యక్షులు గోపాల రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయులు డా. సంకర నారాయణ (ఈనాడు) , అరుణ రవి కుమార్ (జెమినీ టివి) లను వడ్లమూడి రామమోహన్ రావు స్మారక పురస్కార్, శివ కుమార్ (గతంలో ది హిందూ), విద్యారణ్య (హిందీ మిలాప్) లను బండారు సదాశివరావు పురస్కార్ లతో సత్కరించారు.

 

Decolonize Journalism – Narada Jayanti 2017

Posted Posted in Narada Jayanti
For the last 10 years, Vishwa Samvad Kendra , Samachara Bharati Cultural Association has been conducting Narada Jayanti as World Journalists Day.
We are happy that over the years, this program has caught up in other parts of the country and is being celebrated with lots of enthusiasm.
Each year we felicitate some senior journalists too. This year 4 senior journalists Sri SankaraNarayana of Eenadu, Smt. Aruna Ravi Kumar of Gemini TV were felicitated with Sri Vadlamudi RamMohan Rao Smaarak Puraskar. Sri Shiv Kumar (formerly with The Hindu )  and Sri Vidyaranya of Hindi Milap were felicitated with Sri Bhandaru Sadasiva Rao Smaaraka Puraskar. All of them shared their insights on this occasion.
Sri Vijay Babu, State Information Commissioner  was the chief guest. Speaking on the occasion, he recollected the special association he has with all the 4 senior journalists who were felicitated. He said that these 4 have stood against a lot of pressure to present truth as it stands. He mentioned Narada has been demeaned by films as a comedian and therefore the nation does not know of the great knowledge as a mass communicator that Narada shared.

State Information Commissioner Sri Vijay Babu

Sri Nanda Kumar, Akhil Bharateeya Samyojak of Pragna Pravaah recalled his life as a journalist in Kerala. He said there is a difference between having a Successful life and having Meaningful Life . People have begun to compare success with how high in the ladder one has climbed whereas a meaningful life is built on values. Journalism has to be saved by journalists themselves from the falling standards by standing for Truth.
He said there is a need for de-colonising the entire education system including history and Media education. If Narada Sutras are included in journalism courses, the journalist fraternity and thereby the nation as a whole will stand enlightened. He said the journalists are the soul, the Aatma of the nation.
The program was attended and appreciated by over 200 journalists and friends from the mass communication fraternity.