వాసుదేవ్ బాల్వాంట్ ఫడ్కే

Posted Posted in Inspiration

వాసుదేవ బలవంత్ ఫడ్కే( 4 నవంబర్ 1845 -17 ఫిబ్రవరి 1883) స్వతంత్ర యోధుడు. ఆయన వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. వీరి కుటుంబం అత్యంత దురవస్థ అనుభవిస్తూ ఉండేది. స్వరాజ్య సాధనే పరిస్థితులు మెరుగు పరుచుకుందుకు మార్గమని ఫడ్కే తలచారు.

 

1876 -77 సంవత్సరంలో మహారాష్ట్రలో అత్యంత భయంకరమైన కరువు తాండవించింది. వేలకొలది ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణించారు. మరోపక్క ఆ పంటను చేజిక్కించుకున్న తెల్లదొరలు, మరణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది వాసుదేవ్ బలవంత్ ఫడ్కే భరించలేకపోయారు. అతని మనసు కుతకుత లాడింది. మహారాష్ట్రలోని కోలీలు ,భీల్ లు, ధంగారులు తెగల  వారిని కూడగట్టుకొని ఒక తిరుగుబాటు సేనను తయారుచేసి దానికి ” రామొషి” అని పేరు పెట్టారు. వారంతా ఏకమై బ్రిటిష్ పరిపాలన అంతం చేయడానికి సాయుధ పోరాటాన్ని సాగించారు. మొట్ట మొదట వీరు ధనవంతులైన  బ్రిటిష్ వ్యాపారవేత్తల పై దాడులకు పూనుకున్నారు. ఇలా సాయుధపోరాటానికి అవసరమైన ధనం సంపాదించడానికి ప్రయత్నించారు. ఫడ్కే తన డైరీలో “ఈ దేశ ప్రజలందరూ నాలాగా భరతమాత ముద్దుబిడ్డలే. వారంతా అలమటిస్తూంటే, ఏమీ పట్టనట్టుగా జీవించడమనే ఊహే నాకు  భయంకరమైనది. వారికి స్వతంత్రం ఇవ్వడం కోసం, అవసరం అయితే నా జీవితాన్ని త్యాగం చేస్తాను” అని రాసుకున్నారు. ఫడ్కే ఉద్యమ ప్రభావం చూసి బ్రిటిష్ ప్రభుత్వం చాలా ఇరకాటంలో పడింది. ఫడ్కేను పట్టుకునేందుకు వలను పన్నారు. బొంబాయి ప్రభుత్వ గవర్నర్ అయిన సర్ రిచర్డ్ టెంపుల్ ఫడ్కేను చంపిన లేక బంధించిన వారికి 5వేల రూపాయల బహుమతిని ప్రకటించారు. దీనికి జవాబుగా  బొంబాయి గవర్నర్ సర్ రిచర్జ్ టెంపుల్ తలను తెచ్చిన వారికి పదివేల బహుమతి ఇస్తానని మరో ప్రకటన చేశాడు ఫడ్కే. ఫడ్కేను పట్టుకునేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేసింది . నిజాం ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం రెండూ ఫడ్కేను  పట్టుకునేందుకు వెంటాడుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఫడ్కే నిజాం రాజ్యానికి చేరుకున్నాడు . ఒక రోజు మొత్తం పరిగెడుతూనే ఉండడం వల్ల చాలా అలసిపోయి ఉన్న ఫడ్కేకు జ్వరం కూడా వచ్చింది. హైదరాబాదులోని కలాడిగిన తాలూకాలోని ఒక పల్లెటూరికి చేరారు. విశ్రాంతి కోసం దేవి మందిరంలో పడుకున్నారు. జ్వరంతో సృహతప్పిన స్థితిలో ఉన్నారు. అతనిని వెంటాడుతూ బ్రిటిష్ ఆర్మీ మేజర్ డయనిల్ అక్కడికి చేరుకున్నాడు. తన బలగాలను అక్కడ మోహరించి, ఫడ్కే గుండెలపై తంతూ, మెడ మీద కాలు పెట్టి  ” ఫడ్కే, ఇప్పుడు నీకు ఏం కావాలి” అని అడిగాడు.  “నీతో యుద్ధం చేద్దామనుకుంటున్నాను”అని సమాధానం చెప్పాడు ఫడ్కే. కానీ అందుకు ఒప్పుకోని డానియల్ అతనికి బేడీలు వేసి పూనా తీసుకొని వెళ్ళాడు. ఫడ్కేను అక్కడ నుంచి ఆడిన్ కారాగారానికి తరలించారు.  కానీ ఫడ్కే 13తేది ఫిబ్రవరి 1883 న అక్కడ నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ తరువాత అతి కొద్ది కాలంలోనే తిరిగి పట్టుబడ్డారు. అప్పుడు వాసుదేవ్  బలవంత్  ఫడ్కే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కారణంగా 17 ఫిబ్రవరి 1883 న ఫడ్కే తన తుది శ్వాస విడిచారు.

గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూ భయ్యా

Posted Posted in Inspiration

రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్)  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు.

29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేసారు. అనంతరం 1960 వ దశకంలో ఆ పదవిని త్యజించి తన జీవితాన్నిఆర్ఎస్ఎస్ కార్యానికి అంకితం చేశారు.

రజ్జూ భయ్యా ఎమెస్సీ చదువుతున్నరోజులలో వారికి నోబల్ ప్రైజ్ గ్రహీత సీవీ రామన్ పరీక్ష పర్యవేక్షకునిగా వారి కళాశాలకు వెళ్ళారు. ఆ సమయంలో ఆయన రజ్జూ భయ్యా ప్రతిభాపాటవాలను ఎంతగానో మెచ్చుకున్నారు. వారికి అణుధార్మిక రంగంలో ఉన్నత పరిశోధన కోసం ఫెలోషిప్ కూడా ఇప్పించారు.

భౌతికశాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత స్పెక్ట్రోస్కోపిపై పాఠాలు చెప్పడానికి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరిన రజ్జూ భయ్యా అక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తరువాత భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. రజ్జూ భయ్యా అణుధార్మిక క్షేత్రంలో కూడా నిష్ణాతునిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులలో అంత గొప్ప పేరు సంపాదించుకోగలగడం చాలా అరుదు. తన విభాగంలో ఆయన గొప్ప అధ్యాపకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎంతో క్లిష్టమైన పాఠాలను చాలా సరళంగా చెప్పడం ఆయన ప్రత్యేకత.

ఆరెస్సెస్ తో సహచర్యము:
రజ్జూభయ్యా 1942లో జరిగిన క్విట్ ఇండియా ఆందోళనలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఈ సమయములోనే వారికి ఆర్ఎస్ఎస్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మీద సంఘ్ ప్రభావము ఏర్పడింది. 1966 లో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ప్రాంత ప్రచారక్ గా పూర్తిగా తన సేవలను సంఘ్ కు అర్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా పని ప్రారంభించిన ఆయన 1980లో సర్ కార్యవాహ్ గా, ఆ తరువాత 1994 సంవత్సరంలో బాలసాహెబ్ దేవరస్ తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి 4వ సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లాల్ బహదూర్ శాస్త్రి మొదలైన వారితో కలిసి పనిచేసారు. మురళీమనోహర్ జోషి వారి శిష్యపరమాణువులలో ఒకరు.

వారు పనిచేసిన ఆ ఆరుసంవత్సరాలు కూడా సంఘ్ కి, దేశానికి ఎంతో కీలకమైన సమయము.

రజ్జూభయ్యాకు అందరు రాజకీయ నాయకులతో చక్కటి అనుబంధం, చనువు ఉండేది. వారివారి ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రమేయము లేకుండా అన్నివర్గాల వారితో మమేకమైపోయేవారు.

ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఆరోగ్యం సహకరించక ఆయన సర్ సంఘచాలక్ బాధ్యత నుంచి తప్పుకున్నారు. తన తరువాత సుదర్శన్ జీని సర్ సంఘచాలక్ గా ప్రతిపాదించారు.

ఎమెర్జెన్సీ సమయంలో వారు భారతదేశ పర్యటన చేపట్టారు. 1976లో డిల్లీలో మానవహక్కుల సమ్మేళనం నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ అనే సంస్థ మొదలుపెట్టడంలో కూడా వారు కీలకపాత్ర పోషించారు.

“జన్మతహ మనుషులందరూ మంచివారే. వారితో మాట్లాడేటప్పుడు వారిలోని మంచిగుణాల మీద నమ్మకంతో మాట్లాడాలి. కోపము, అసూయ అనేవన్నీ కూడా వారి పూర్వ అనుభవాల ప్రతిక్రియ. వీటి ప్రభావము మనిషి నడవడిక మీద పడుతుంది. మౌలికంగా ప్రతీ మనిషీ మంచివాడు, విశ్వసించదగినవాడు” అని రజ్జుభయ్యా భావించేవారు. స్వదేశీ మరియు గ్రామీణజీవనాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడంలో ఎంతో విశ్వాసం కలిగి ఉండేవారు.

1995లో గ్రామీణాభివృధి మీద దృష్టి కేంద్రీకరించి, గ్రామాలను ఆకలిరహిత, రోగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తీర్మానం చేసారు. ఇవ్వాళ 100 కి పైగా గ్రామాలలో స్వయంసేవకులు చేసిన పనిని చూసి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు ఉత్సాహం పొంది స్వయంసేవకులు చేసిన ప్రయోగాలని వారు అనుసరిస్తున్నారు.

1995 లో రజ్జూభయ్యా విజయదశమి ఉత్సవ సందర్భంగా నాగపూర్ లో జరిగిన కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీని గుర్తుచేసుకున్నారు. ఆ ఇద్దరు మహాపురుషుల కలలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తగిన చిత్తశుద్ధి చూపడం లేదని అన్నారు.రాంప్రసాద్ బిస్మిల్ పేరు మీద ఒక స్మారకచిహ్నాన్ని డిల్లీలో ఏర్పాటు చేయలని రజ్జ్యుభయ్యా అనుకున్నారు.

14 జులై 2003 తేదీన పూనేలోని కౌశిక్ ఆశ్రమంలో రజ్జూ భయ్యా తుదిశ్వాస విడిచారు.

ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ -కాంగ్రెస్ జెండా

Posted Posted in Inspiration

 

ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ -కాంగ్రెస్ జెండా

1937 కాంగ్రెస్ ఫైజాపూర్ సమావేశపు జెండా ఉత్సవంలో, 80అడుగుల కర్రపై కాంగ్రెస్ పతాకం చిక్కుకుపోయింది. ఎంతమంది ప్రయత్నించినా చిక్కు విడలేదు. అంతలో శ్రీ కిషన్ సింగ్ పరదేశి ధైర్యంగా 80అడుగుల కర్రని ఎక్కి, చిక్కుపడిపోయిన జెండాని విడిపించాడు, పతాకo ఎగరవేసినపుడు, అందరూ హర్షధ్వానాలతో స్వాగతించారు. ఒకరు శ్రీ పరదేశిని సత్కరించాలని ప్రతిపాదిస్తే సమావేశం ఆమోదించింది. అయితే తాను ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా అలవరచుకున్న జాతీయ స్ఫూర్తితో ధైర్యం చేయగలిగానని ఆయన చెప్పగానే కాంగ్రెస్ నాయకులు వెనుకాడారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను వారు ఎలా సత్కరిస్తారు? హిందుత్వ దృక్పధం ఉన్న సంస్థల పట్ల కాంగ్రెస్ వివక్ష ఈ సంఘటనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుoది.

   

  

ఒక స్వయంసేవక్ చేసిన సాహసo విని డా.హెడ్గెవార్ ఎంతో సంతోషించారు. సాధారణంగా సంఘ్ కార్యక్రమాలకు ఎటువంటి ప్రచారం ఉండదు. దీనికి భిన్నంగా డా.హెడ్గెవార్, శ్రీ కిషన్ సింగ్ పరదేశిని దేవపూర్ శాఖకు ఆహ్వానించి ఆయనకు ఒక చిన్నవెండి బహుమతినిచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన `అవసరమైతే ప్రాణత్యాగమైనా చేసి, దేశానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం ఒక స్వయంసేవకుడి కర్తవ్యo, అది మన జాతీయ ధర్మం’ అన్నారు.    

ఒక వైపు డా.హెడ్గెవార్ సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తితో కాంగ్రెస్ పట్ల అభిమానం చూపెడితే, కాంగ్రెస్ మాత్రం సంఘ్ మీద ద్వేషం పెంచుకుంది. సంఘ్ సానుభుతిపరుడైన ఒక కాంగ్రెస్ వ్యక్తి డా.కాకాసాహెబ్ తెమ్భే, ఈ విషయంపై కలతచెంది, కాంగ్రెస్ పనితీరు, సైద్ధాంతిక వైఖరిని విమర్శిoచాలని కోరుతూ డా.హెడ్గెవార్ కి లేఖ వ్రాసారు. అలా చేస్తే సంఘ్ కార్యకర్తల అసంతృప్తి కొంతవరకు తగ్గుతుందని డా. తెమ్భే అనుకున్నారు.    

 

తెమ్భేకి  డా.హెడ్గెవార్ వ్రాసిన సమాధానం, ఆయనకు కాంగ్రెస్ పై ఉన్న అభిప్రాయమేకాక, ఆయన తాత్విక దృష్టిని కూడా తెలుపుతుంది. స్వయంసేవకుల మనసుల్లో కాంగ్రెస్ పట్ల ఎటువంటి విముఖత కలగకూడదని ఆయన భావించారు. ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి- ఆర్ఎస్ఎస్ వేగంగా తన బలం పెంచుకుని, విప్లవo ద్వారా బ్రిటిషువారిని దేశం నుంచి తరిమిగొట్టడం; రెండు కాంగ్రెస్ ఆధ్వర్యంలో  సామ్రాజ్యవాద వ్యతిరేక పోరు కొనసాగించడం. బ్రిటిషువారితో  పోరాటంలో అనేక కేంద్రాలు ఏర్పడడం డా.హెడ్గెవార్ కు ఇష్టం లేదు. ఈ ఆలోచనతోనే ఆయన  తెమ్భేకి  ఈ విధంగా వ్రాసారు –   

 `ప్రపంచంలో ప్రతి వ్యక్తి వారి మనస్తత్వం ప్రకారం ప్రవర్తిస్తుంటారు, ఒక పార్టీకి లేక ఒక సిద్ధాంతానికి వారిని ప్రతినిధిగా అనుకునే అవసరం లేదు. నా అభిప్రాయంలో, ఏ సభ్యుడు ఏ విధంగా మాట్లాడినా, ఆ వ్యక్తి ఉన్నపార్టీని లేక సిద్ధాంతాన్ని పొగడడం లేక ఖండించడం పొరపాటు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా, మరొక పార్టీకి చెడు జరగాలని కోరుకోరు’. 

Source : “Builders of Modern India” – Dr.Keshav Baliram Hedgewar by Publications Division;

 

 

 

 

రజ్జూభయ్యా – రాష్త్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్

Posted Posted in Inspiration

రజ్జూభయ్యా (ప్రొ. రాజేంద్ర సింగ్  – 29 జనవరి 1922 – 14 జులై 2003) రాష్త్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు.

వారు అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేసారు.

కాని 1960 వ దశకంలో ఆ పదవిని త్యజించి వారు తన జీవితాన్నిఆర్ఎస్ఎస్ కి  అంకితం చేశారు.

రజ్జూభయ్యా ఎమెస్సీ  చదువుతూన్నరోజులలో వారికి నోబల్ ప్రైజ్ గ్రహీత సీవీరామన్ ఎక్జామినర్ గా వెళ్ళారు.  అప్పుడు రజ్జూభయ్యా ప్రతిభాపాటవాలను ఎంతగానో మెచ్చుకున్నారు. వారికి అణుధార్మిక రంగంలో ఉన్నత పరిశోధన కోసం ఫెలోషిప్ కూడా ఇప్పించారు.

భౌతికశాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత స్పెక్ట్రోస్కోపిపై పాఠాలు చెప్పడానికి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరారు. ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తరువాత వారిని భౌతికశాస్త్ర  విభాగానికి అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. రజ్జూభయ్యా అణుధార్మికక్షేత్రంలో కూడా నిష్ణాతునిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులలో అంత గొప్ప పేరు సంపాదించుకోగలగడం చాలా అరుదు. తన విభాగంలో ఆయన గొప్ప అధ్యాపకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎంతో క్లిష్టమైన పాఠాలను చాలా సరళంగా చెప్పడం ఆయన ప్రత్యేకత.

RSS తో సహచర్యము :

రజ్జూభయ్యా 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఆందోళనలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఈ సమయములోనే వారికి ఆర్ ఎస్ ఎస్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మీద సంఘ్ ప్రభావము ఎంతో పడింది. 1966 లో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ప్రాంత ప్రచారక్ గా పూర్తిగా తన సేవలను సంఘ్ కు అర్పించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా పని ప్రారంభించిన ఆయన 1980 లోసర్ కార్యవాహ్ గా, ఆ తరువాత 1994 లో బాలసాహెబ్ దేవరస్ తరువాత సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహించారు.

ఉత్తర్ ప్రదేశ్ లో లాల్ బహదూర్ శాస్త్రి మొదలైనవారితో కలిసి పనిచేసారు. మురళీ మనోహర్ జోషి వారి శిష్యపరమాణువులలో ఒకరు.

వారు పనిచేసిన ఆ ఆరుసంవత్సరాలు కూడా సంఘ్ కి, దేశానికి ఎంతో కీలకమైన సమయము.

రజ్జూభయ్యాకు అందరు రాజకీయ నాయకులతో చక్కటి అనుబంధం, చనువు ఉండేది.  వారివారి ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రమేయము లేకుండా అన్నివర్గాల వారితో మమేకమైపోయేవారు.

ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఆరోగ్యం సహకరించక ఆయన సర్ సంఘచాలక్ బాధ్యత నుంచి తప్పుకున్నారు.  తన తరువాత సుదర్శన్ జీని సర్ సంఘచాలక్ గా ప్రతిపాదించారు.

ఎమెర్జెన్సీ సమయంలో వారు భారతదేశ పర్యటన చేపట్టారు. 1976 లో డిల్లీలో మానవహక్కుల సమ్మేళనం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. దానికి తరువాత జస్టిస్ వి ఏం తార్కుండే చేపట్టారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ అనే సంస్థ మొదలుపెట్టడంలో కూడా వారు కీలకపాత్ర పోషించారు.

జన్మతహ మనుషులందరూ మంచివారే.  వారితో మాట్లాడేటప్పుడు వారిలోని మంచిగుణాల మీద నమ్మకంతో మాట్లాడాలి. కోపము, అసూయ అనేవన్నీ కూడా వారి పూర్వ అనుభవాల ప్రతిక్రియ. వీటి ప్రభావము మనిషి నడవడిక మీద పడుతుంది. మౌలికంగా ప్రతీ మనిషీ మంచివాడు, విశ్వసించదగినవాడు అని రజ్జుభయ్యా భావించేవారు.

రజ్జూభయ్యా స్వదేశీ మరియు గ్రామీణజీవనాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడంలో ఎంతో విశ్వాసం కలిగిఉండేవారు.

1995 లో గ్రామీణఅభివృధి మీద దృష్టి కేంద్రీకరించి, గ్రామాలను ఆకలిరహిత, రోగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తీర్మానం చేసారు. ఇవ్వాళ 100 కి పైగా గ్రామాలలో స్వయంసేవకులు చేసిన పనిని చూసి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు ఉత్సాహం పొంది స్వయంసేవకులు చేసిన ప్రయోగాలని వారు అనుసరిస్తున్నారు.

1995 లో రజ్జూభయ్యా విజయదశమి ఉత్సవ సందర్భంగా నాగపూర్ లో జరిగిన కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీని గుర్తుచేసుకున్నారు. ఆ ఇద్దరు మహాపురుషుల కలలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తగిన చిత్తశుద్ధి చూపడం లేదని అన్నారు.

రాంప్రసాద్ బిస్మిల్ పేరు మీద ఒక స్మారకచిహ్నాన్ని డిల్లీలో ఏర్పాటుచేయలని రజ్జ్యుభయ్యా అనుకున్నారు.

పూనేలోని కౌశిక్ ఆశ్రమంలో 14 జులై 2003 న వారు చనిపోయారు.

 

 

 

 

 

 

సంత రవిదాస

Posted Posted in Inspiration
సంత రవిదాసు  చర్మ కార వృత్తి అవలంబిస్తూనే గొప్ప సాధకుడయ్యాడు.” భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు.ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు అడ్డు గొడలెందుకు? అని ప్రశ్నించారు.తన గుణ కర్మల చేతనే ఉత్తముడవుతాడాని  చాటి చెప్పిన మహాత్ముడు సంత రవిదాసు.
ఆగ్రా పట్టణానికి సమీపం లోని దాస పుర గ్రామం లో చెప్పులు కుట్టే కులం లో జన్మించిన రవిదాస్ క్రీ.శ.1376-1527 మధ్య జీవించాడు. తండ్రి మరియు అన్న పోషణ లో పెరిగాడు.తాను కుట్టిన చెప్పుల జత ను అమ్మడానికి వెళ్లినప్పుడు ఒక బీదవానిని చూసి మనసు చలించి,చెప్పులు అతనికి దానం చేశాడు.దాంతో తండ్రి ఇంటి నుండి తరిమేశాడు . ఊరి చివర ఓ గుడిసె వేసుకుని,దైవ నామ స్మరణ తో కాలక్షేపం చేసేవాడు.ప్రజలలో శాంతి,ప్రేమ లను అందిస్తూ బోధన చేసేవాడు.ఒక రోజు దేవుడే రవిదాస్ ని పరీక్ష చెయడానికి వచ్చాడు.రవిదాస్ వద్దన్నప్పటికి,అన్ని కోర్కెలు తీర్చే “పరుసవేది “అను విలువైన వస్తువును ఇచ్చినా చేతితో ముట్ట లేదు. దేవుడు దానిని గుడిసె చూరు లో పెట్టి వెళ్లి,12ఏళ్లకు తిరిగి    వచ్చినప్పటికి,రవిదాస్ దాని వైపు చూడనైనా చూడలేదు.సామాన్య జీవితంలో అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రవిదాస్ గొప్ప ఙ్ఞాని, గొప్ప కవి.
వారణాసి రాజ దర్బార్ లోనూ,అలాగే ప్రయాగ కుంభ మేలా లోనూ రవిదాసు ససత్సంగం నిర్వహించినట్లు చెప్తారు.చిత్తడ్ రాణి ఝాలీ, మీరాబాయి అలాగే కాశీ రాజు మొదలైన వారు  సంత రవిదాస్ యొక్క శిష్యరికం తీసుకున్నట్లు కూడా చెబుతారు. స్వామి రామానంద్,సంత కబీర్ మరియు ఇతర సాధు సంతు లతో ధర్మ రక్షణ కు యాత్ర లు చేశాడని ప్రతీతి.
సంత రవిదాస్ జన్మించిన కాలం లో    ఇస్లాం వ్యాప్తి కోసం హిందువులపై  మొఘలుల దౌర్జన్యాలకు అంతు లేదు.అలాగే హిందూ సమాజం లోని అగ్రవర్ణాల ఆధిపత్యం కూడా తక్కువేమీ కాదు. భక్తి ఉద్యమం ద్వారా    భేద భావాలు లేని సమాజ నిర్మాణానికి స్వామి రామానంద ఆధ్వర్యంలొ తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. ఆయనకున్న ప్రముఖమైన శిష్యులలో సంత రవిదాస్  ఒకరు.
ఈ శిష్యులందరూ సుమారుగా నిమ్న వర్గానికి చెందిన వారే. వీరందరూ సామాన్య ప్రజల మధ్య సరళమైన భాషలో ధర్మ సందేశం అందించటం విశేషం. సంత రవిదాస్ ‘భగవాన్ నామ స్మరణ’ యే మూల మంత్రం గా జపిస్తూ జీవించారు. రవిదాస్ నామ స్మరణ యే హారతిగా,పూజగా,పూల మాలగా తులసీ చందనం గా భావించారు.చదువుకున్నది తక్కువైనా గురువుల ద్వారా,సాధు సంతుల సాంగత్యము అపరిమిత జ్ణానం పొందాడు. కామ,క్రోధ,మోహ,అహంకారాలు ఎప్పటికీ  అతని దరి చేరలేదు. ప్రపంచంలోని అన్ని ప్రాణులలో పరమాత్మ వున్నాడని విశ్వసించే నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడు సంత రవిదాస్. బ్రాహ్మణులు కూడా రవిదాస్ పాండిత్యాన్ని చూసి సన్మానించారు.
సంత రవిదాస్ సాహిత్యాన్ని ప్రముఖంగా వెలుగులోనికి తెచ్చిన ప్రముఖ రచయిత డా.వేణీ ప్రసాద్ వర్మ ఏమంటారంటే ” రవిదాస్ మనుశ్యుందరినీ కుల భేదం,చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ గౌరవించే వారు.
అలాగే కుల భేదాలు తొలగనంత వరకు మానవులు ఏకం కాలెరని రవిదాస్  విశ్వసించారు. బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర కులాల వారంతా ఒకే జాతి కి చెందిన వారని, పుట్టుకతో కాదు,చేసిన కర్మ ఆధారంగా కులానికి గౌరవం ఏర్పడిందని అంటారు.
 కొద్ది మందీ పండితుల అభిప్రాయం ప్రకారం రవిదాస్ తండ్రి పేరు ‘రఘు’,  తల్లి పేరు దుర్వినియ , భార్య పేరు ‘లేనా , . అతని కుమారుడి పేరు విజయ దాస్’ అని తెలుస్తున్నది.