జాతీయపతాకాన్ని గౌరవిద్దాం

Posted Posted in Articles
FacebookTwitter

 

సాధారణ ప్రజానీకం కూడా తమ ఇళ్ళలో, వ్యక్తిగతంగా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం 2002లో స్పష్టం చేసింది.

అప్పటినుంచి కాగితం, ప్లాస్టిక్ జెండాల తయారీ, అమ్మకాలు పెరిగాయి. జాతీయదినోత్సవాల రోజున ప్రజలు ఎంతో ఉత్సాహంగా, దేశభక్తి ఉట్టిపడుతూ ఈ జెండాలను కొనడం, విరివిగా ఉపయోగించడం చూస్తున్నాము. కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే ఆ మర్నాడు ఈ జెండాలన్నీ వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉంటాయి. అంతకుముందు రోజు గర్వంగా తమ గుండెలపై వాటిని ధరించినవాళ్లే కాళ్లతో తొక్కుకుంటూ తిరుగుతుండటం కనిపిస్తుంది. చెత్తకుండీలలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇలా తమ జాతీయపతాకాన్ని తామే అవమానిస్తున్నామని వాళ్ళు గ్రహించడంలేదు. కొన్నిసార్లు ఈ జెండాలను మిగతా చెత్తతోపాటు కలిపి తగలబెడుతుంటారు. జాతీయపతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాధమిక కర్తవ్యం. కనుక జాతీయపతాకం విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం –

 • జాతీయపతాకాన్ని తగిన ఎత్తులో సరిగా ఎగురవేయాలి
 • పిల్లలు జెండాను ఆట వస్తువుగా చూడకుండా జాగ్రత్తవహించాలి
 • ప్లాస్టిక్ జెండాలను కొనకూడదు.
 • అలంకరణ కోసం జాతీయజెండాను ఉపయోగించకూడదు.
 • జెండా నలిగిపోకుండా,చిరిగిపోకుండా చూడాలి
 • జాతీయపతాకాన్ని ఎవరు తొక్కకుండా జాగ్రత్తవహించాలి
 • జెండా నేలపై పడకుండా చూసుకోవాలి
 • జాతీయజెండాను పోలిఉండేట్లుగా బట్ట ముక్కలను కలిపి కుట్టకూడదు.

ఇలా జాతీయపతాకాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయడం, తొక్కడం నేరమని చాలమందికి తెలియదు. ఒకవేళ జెండా చిరిగిపోతే, పాడైపోతే దానిని ఎలా తీసివేయాలన్నది కూడా తెలియదు. ఈ నియమాలు 2002 జాతీయపతాక నిబంధనావళిలో పొందుపరచారు.

ఏం చేయాలి?

 1. చొరవతీసుకోవాలి: జాతీయపతాకానికి పైన చెప్పిన పద్దతిలో ఎలాంటి అవమానం జరగకుండా ఉండేందుకు దీనిగురించి ఇతరులకు అవగాహన కలిగించడంలో మనం చొరవ తీసుకోవాలి.
 2. జెండాను తొలగించడం: పాడైపోయిన జెండాను జాగ్రత్తగా తీసివేసి,ఎక్కడైనా పాతిపెట్టడమో,కాల్చివేయడమో చేయాలి.  పాడైపోయిన జెండాను మడతపెట్టి గౌరవపూర్వకంగా మంటలో వేయాలితప్ప నిర్లక్ష్యంగా విసిరివేయకూడదు. ఇలా చేయకుండా జెండాను చేతిలో పట్టుకుని ఒక పక్క మంట పెట్టడం చట్టరీత్యా నేరం. పాడైన జెండాలను పూడ్చిపెట్టలంటే వాటన్నిటిని ఒక చెక్క పెట్టెలో పెట్టాలి.
 3. అవగాహన కల్పించాలి: జాతీయజెండా విషయంలో ఏమి చేయాలి,ఏమి చేయకూడదన్నది పాఠశాలలు,కళాశాలల్లో తెలియచెప్పాలి.
 4. అలాగే మన స్నేహితులు,బంధువులకు కూడా ఈ విషయాలు చెప్పాలి.
 5. జాతీయపతాకం విషయంలో మన అనుచిత వ్యవహారాన్ని గురించి హెచ్చరించేందుకు,సరైన పద్దతిని  తెలియచేయడానికి ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలి.

 

 

FacebookTwitter

సుహృద్భావనను పాడుచేస్తున్న శక్తుల పట్ల జాగరూకులై ఉండాలి: ఆర్.ఎస్.ఎస్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి

Posted Posted in Articles, News, Submit News
FacebookTwitter

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి గారి పత్రికా ప్రకటన

ప్రస్తుతము దేశవ్యాప్తంగా షెడ్యూలు కులాల బంధువులపైన జరుగుతున్న అత్యాచారాలు మరియు ఉత్పీడన కలిగించే సంఘటనలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా గర్హిస్తున్నది మరియు వ్వతిరేకిస్తున్నది. చట్టమును తమ చేతిలోకి తీసికొని తమ సమాజములోని వ్యక్తుల పట్ల చేస్తున్న ఇటువంటి చర్యలు అన్యాయమే కాకుండా అమానుష చేష్టలుగా ప్రకటిస్తాయి.

bhayya ji joshu

ప్రసార మాధ్యమాలు ఇటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొన్న విషయాలను ఆధారం చేసికొని సమాజంలో సుహృద్భావనను పెంపొందించడానికి బదులుగా అవిశ్వాసము, అశాంతి మరియు సంఘర్షణ పెంచడానికే పని చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ పరిస్థితి శోచనీయము. విభిన్న రాజకీయ దళాలు, జాతి, కుల ప్రాతిపదిక మీద తమతమ అవకాశవాదముతో అసంపూర్ణమైన విషయాలను తెలిపి సమాజములో అల్లకల్లోలములను రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సమాజ సమరసతకు అహితము. రాజకీయ దళాలు మరియు కుల పెద్దలు సమాజములో ప్రస్తుతము వున్న ఇటువంటి పరిస్థితులను జన సహకారంతో చక్కదిద్ది అటువంటి పీడిత ప్రజలపట్ల సంవేదన వ్యక్తంచేసి అటువంటి సంఘటనలు పునరావృత్తము కాకుండా చూడవలసినదని సంఘ్ విజ్ఞప్తి చేస్తున్నది.

FacebookTwitter

నిఘా నీడలో జకీర్ నాయక్

Posted Posted in Articles
FacebookTwitter

ముంబయకి చెందిన ఇస్లామిక్ బోధకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆయన వివాదాస్పద ప్రసంగాలు ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశాలయ్యాయి. యధావిధిగా ఆయన్ను బలపరిచే వాళ్లు ప్రస్తుతించేవాళ్లు బయలుదేరారు. మక్కా వెళ్లిన ఆయన ఈ తంతు చూసి ముంబయ రావడం మాని ఆఫ్రికా దేశాలకు వెళ్లాడు. మక్కానుంచి స్కైప్‌లో మీడియాతో మాట్లాడతానన్నాడు. అదీ రద్దయింది. ఆయనలో భయం ఎక్కువైంది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఆయన కదలికలపై దృష్టి పెట్టింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పేర ఆయన ప్రచారంలోకి వచ్చా డు. ఇటీవల ఢాకాలో పేలుళ్లు జరిపిన తీవ్రవాదుల విచారణలో ‘ఆయన ప్రసంగాలవల్లనే మేము ఉగ్రవాదులమయ్యామన్నారు’ నిందితులు. ఆ ప్రసంగాల కర్త, చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న అపర మేథావియే జకీర్ నాయక్. 51 ఏళ్ల ఈ బోధకుడు భారత్‌ను విడిచి చాలా కాలమైంది. గత ఏప్రిల్‌లో ఈయన మలేసియాలో ఉన్నాడు. ఈయన ‘ఉమ్రా’ కోసం మక్కా వెళ్లాడు. తరువాత జెడ్డా వెళ్లాడు. ఇది ముస్లింలు పవిత్రంగా నిర్వహించే తీర్ధయాత్ర. కాని జకీర్‌నాయక్‌కు ఇది తీవ్రవవాదుల సంకల్ప సిద్ధియాత్ర. బంగ్లాదేశ్‌లో పీస్‌టీవీ చానల్‌ను నిర్వహిస్తున్న ఈ ప్రబుద్ధుడు తన ప్రసంగాల్లో మాత్రం పచ్చి మతతత్వం, మతోన్మాదం ప్రజలకు నూరిపోస్తాడు. ఆయన నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు వస్తున్న నిధుల విషయంపై ప్రస్తుతం భారత హోంమంత్రిత్వశాఖ ఆరా తీస్తోంది.

భారత్‌కు చెందిన ఎన్‌ఐఎ అరెస్టు చేసిన అగంతకులలో ఐఎస్ అనుమానితుడు ఇబ్రహీం యజ్‌దానీ కూడా జకీర్ నాయక్ ప్రసంగాలు వినేవాడు. మోదీ తన ఆఫ్రికా పర్యటనలో కెన్యాలో మాట్లాడుతూ అన్యాపదేశంగా విద్వేషం చిమ్ముతూ ప్రసంగించే కొందరు బోధకులు సమాజాన్ని చీలుస్తున్నారన్నారు. ఆయన నడుపుతున్న పీస్‌టీవీ దుబాయ్‌నుంచి ప్రసారమవుతుంది. బం గ్లాదేశ్ ఈమధ్యనే తమ దేశంలో పీస్ టీవిని నిషేధించింది. భారత్‌లో పీస్ టీవీ చానల్ ఎప్పుడో నిషేధించబడింది. కాని కొందరు చానల్ ఆపరేటర్లు దొంగచాటుగా ప్రసారాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం వారిని తాజాగా హెచ్చరించింది. సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈమేరకు కఠినంగా ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జకీర్‌నాయక్ రాతలు, ప్రసంగాలు, నిధులు అన్నీ నిఘా నీడలో వున్నా యి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ కన్ను వేసి వుంచింది. ఇంగ్లాండ్, కెనడా దేశాలు ఇప్పటికే జకీర్‌నాయక్ ప్రసంగాలను, ఆయన తీవ్రవాదాన్ని ఉసిగొల్పడాన్ని నిం దించాయి. ఆయనపై భారత శిక్షాస్మృతి ఐపిసి 153ఎ, 295ఎల కింద మత సామరస్యానికి భంగం కలిగించిన నేరం మోపే వెసులుబాటు వుంది. ఆయన ప్రసంగాలలో ముస్లింలను తీవ్రవాదులు కమ్మని ఆయన రెచ్చగొడుతున్నాడు.

న్యాయ విశే్లషకుడు అమిత్ దేశాయ్ ఆయన ప్రసంగ పూర్తిపాఠంపై విచారణ జరగాలన్నారు! జకీర్‌నాయక్ విషయమై భారత్‌లో ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా చర్చించింది. సామాజిక మాధ్యమాలలో ఈ చర్చలపై అనేకమంది అనేక రకాలుగా స్పందించారు. తమ మతం నమ్మని వారందరూ కాఫిర్లని వారిపై జిహాద్ నిర్వహిస్తామని హింసను ప్రేరేపించే ఉన్మాదులను ఏరిపారేయాలని కొందరన్నారు. ఈ తరహా ప్రేరేపణలు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నాయ. వారేదో బాగా అధ్యయనం చేసినట్టు ఇతర మత గ్రంథాలకు వారు కువ్యాఖ్యలు, కొత్త అర్ధాలు చెబుతున్నారు. ఇతర మతానుయాయుల్లో అయోమయం సృష్టిస్తున్నారు. యుట్యూబ్‌లో జకీర్‌నాయక్ ప్రసంగాలను ఎవరైనా వీక్షించవచ్చు. ఆయన బాహాటంగా ఒసామా బిన్‌లాడెన్‌ను, తీవ్రవాదాన్ని సమర్ధిస్తున్నాడు. ప్రతి ముస్లిం తీవ్రవాది కావాలి అని కోరుకుంటున్నాడు. దేవాలయాల విధ్వంసాన్ని, బౌద్ధారామాలను పడగొట్టడాన్ని సమర్ధిస్తున్నా డు.యూదులను చంపాలంటున్నాడు. హిందు దేవీ దేవతల్ని అవమానించడం, దూషించడం ఆయన నైజం. మహిళలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడు. బాల లైంగిక నేరాలను ఆయన సమర్ధిస్తున్నాడు. ‘గే’ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వారిని చంపాలంటున్నాడు. ఈయన్ని సమర్ధిస్తున్న కొందరు కుహనా మేధావులు కూడా మీడియాలో వింత వాదనలు చేస్తున్నారు. ఇది మతం పేర దెయ్యాలను ప్రోత్సహించడమే అవుతుందని వారు తెలుసుకోవాలి.

ఈ విషయమై నిష్పాక్షిక చర్చ చేపట్టిన టైమ్స్‌నౌ చానెల్‌కు చెందిన అర్నబ్ గోస్వామి జకీర్‌నాయక్‌కు సవాలు విసిరారు. ఎందుకు భారత్ రాకుండా పారిపోయావని ప్రశ్నించారు. భారత్‌ను తీవ్రవాద కార్యకలాపాలకు ఎందుకు వాడుకుంటున్నావని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకుంటే భారత్‌కు ఎందుకు తిరిగి రాలేదన్నారు. కొన్ని సందర్భాలలో ఆత్మాహుతితో కూడిన తీవ్రవాదం మంచిదే అని ఎందుకు వ్యాఖ్యానించారని అడిగారు. పైగా జకీర్‌నాయక్ తనను ముంబయలో బహిరంగ చర్చకు రమ్మన్నాడని, గంటసేపు చర్చిద్దామన్నాడని, జకీర్‌నాయక్ డొల్లతనాన్ని దేశప్రజలకు తెలియజేయడానికి తనకు ఒక్క నిముషం కూడా పట్టదని, భారత్ మాత్రమే చర్చకు అనువైన ప్రదేశమని, ఆత్మాహుతి దాడుల పేర వ్యాపారం చేస్తున్న జకీర్ పిరికిపంద అని ధైర్యంగా వ్యాఖ్యానించారు. అర్నబ్ గోస్వామి జరిపిన ఈ చర్చపై అనేకమంది జకీర్ అనుచరులు అర్నబ్‌ను నానా మాటలతో దూషించారు. కొందరు జాతీయ వా దులు జకీర్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించా రు. జులై మొదటి వారంలో నిర్వహించబడ్డ ఈ చర్చకు వేలాదిగా ట్వీట్‌లు వచ్చాయి.

కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆయనతో వేదిక పంచుకున్నారు. వేదాలనుంచి ఆయ న కొన్ని విషయాలను ఉటంకించడం చూసి ఆయన మహా మేధావి అని మెచ్చుకున్నారు. 2006లో శ్రీశ్రీ రవిశంకర్‌తో కలి సి ఆయన ఓసారి వేదిక పంచుకున్నాడు. వేదాల్లో కూడా అల్లా పేరు వుందని, అల్లోపనిషత్ పేర ఒక ఉపనిషత్తు కూడా వుందని ఆయన మెట్టవేదాంతం వల్లె వేసారు. తప్పు ల తడక సందర్భ చర్చ చేసారు. ఆయన గురించి రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ ఆయన తర్కం కంటె వితర్కం చేస్తాడని, పైకి బాగా మాట్లాడుతునే అతిథిగా పిలిచి అవమానిస్తాడని తన ఆధిపత్యం ప్రదర్శిస్తాడని, చెప్పు మనల్ని కరిచిందని మనం వెళ్లి చెప్పును కరుస్తామా? అని ప్రశ్నించారు. మొఘలుల పాలనలో అక్బరు కాలంలో అక్బరును మహమ్మద్ ప్రవక్తగా కీర్తిస్తూ కొందరు వందిమాగధులు రాసిన ‘అల్లోపనిషత్’ గురించి ముస్లింలకు కూడా తెలిసి వుండదు. ‘సత్యార్ధ ప్రకాశం’ రాసిన స్వామి దయానంద సరస్వతి ఆ పుస్తకం ఉపనిషత్తుల కోవలోకే రాదని ఉద్ఘాటించారు. ఇస్లాంకు, హిందు ధర్మానికి గల కొన్ని సామ్యాలను ఉటంకిస్తూ హిందు ముస్లింల సఖ్యతకోసం రవిశంకర్ గురుజీ రాసిన పుస్తకాన్ని జకీర్ అడ్డదిడ్డంగా విమర్శించా డు.‘నేను చెప్పిందే మతం, నాదారే అసలైన దారి’ అని వాదించడం జకీర్ అభిమతం.

‘నప్రతిమే అస్తి’ అని వాఙ్మయంలో వుందని, అందుకే తాను విగ్రహారాధనకు వ్యతిరేకమని జకీర్ వాదన. ప్రతిమలో లేదన్నాడు కానీ, ‘్భగవంతుడు’ ప్రతిమ అనేదే వుంటే అందులోనూ ఆయన వున్నాడు కదా! అంటారు శ్రీశ్రీ రవిశంకర్. అంతటా తానున్నానని గీతాచార్యుడు చెప్పాడు కదా! కేవలం ఇతరులను తప్పుబడితే మనిషి గొప్పతనం తెలియవస్తుందా? అంత తప్పు చేయని వాడే అయితే భారత్‌కు ఎందుకు తిరిగి రాలేదు. పీస్ టీవీ ద్వారా ఆయన వంద మిలియన్ల మందిని మతాంతీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆంగ్లం, ఉరుదు, అరబిక్ భాషలలో అనర్గళంగా ప్రసంగించగలిగిన జకీర్ సూటులో కనిపిస్తాడు.

ప్రసంగాలకు ముందు ఆయన ఒక డాక్టరు. మతాలమధ్య సామ్యాల గురించి మాట్లాడుతూ ఆయన అన్య మతస్తులను బురిడీ కొట్టించడంలో దిట్ట. ఆయన ఇస్లాం ఎంతో అసహనంతో కూడింది అని వొప్పుకుంటాడు, కానీ ఆ అసహనం అవినీతి, వివక్ష, అన్యాయం, కల్తీ, మద్యపానం వంటి దురాచారాలపైనే అంటాడు. సంగీతాన్ని ఆయన ద్వేషిస్తాడు. ఇస్లాంలో నిషేధం కనుక ఆయన సంగీత వాద్యాలను ద్వేషిస్తానంటాడు. శిక్షార్హులకు చేతులు నరికివేసే శిక్ష వేయమంటాడు. మహిళలను కొట్టే అధికారం భర్తలకుందని, యుద్ధ ఖైదీలైన వనితలతో ముస్లింలు లైంగిక వాంఛ తీర్చుకోవచ్చంటూ పరోక్షంగా ఆయన ఐసిస్‌ను సమర్ధిస్తాడు. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఖురాన్‌లో చెప్పిందే నిజమైన సిద్ధాంతమని, విజ్ఞానమని వాదిస్తాడు. ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని, ఏభై ఏళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడాన్ని ఆయన ఒప్పుకుంటాడు. సాల్మన్ రష్డీ, తస్లిమా నస్రీన్ వంటి ఆధునిక భావాలున్న ముస్లిం రచయితలను ఆయన విమర్శిస్తాడు.

ఇస్లాం వ్యతిరేకులే ఐసిస్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఐసిస్‌పై అమెరికా దాడులు కూడా ఖండించదగినవని రెండు గొంతులతో మాట్లాడే మాటల మాయాజాలం జకీర్ సొత్తు. జకీర్‌ను సమర్ధిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఏ తరహా సమాజాన్ని కోరుకుంటున్నారో తేల్చుకోవాలి. భారత్‌ను హురియత్ ప్రకారం పాలించాలన్న పిలుపునిచ్చిన జకీర్‌కు ప్రజాస్వామ్యంలో ఎంత నమ్మకముందో ప్రజాప్రతినిధులు గ్రహించాలి. ఆయనది పిల్లమేధావితనంగా కుష్వంత్‌సింగ్ కొట్టి పారేస్తారు. ఖలీద్ అహ్మద్, షహిర్ ఖ్వాజీ వంటివారు కూడా ఆయన్ను విమర్శిస్తారు. ఆయనపై ‘దారుల్ ఉలూమ్’ ఫత్వా జారీ చేసింది కూడా. జకీర్‌నాయక్ గురించి ఎంతైనా రాయవచ్చు. ఈ డొల్ల మేధావిని నమ్మేదెవరు? ఖర్మ కాల్చుకునేదెవరు?

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్

ఆంధ్ర భూమి సౌజన్యం తో

FacebookTwitter

తెలంగాణ లో ప్రారంభమైన ‘బోనాలు’ పండుగ

Posted Posted in Articles
FacebookTwitter

  Telangana-Festivals

ఆషాడమాసంలో గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం గ్రామ ప్రజల మధ్య విస్తృతంగా కనబడుతుంది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలోను మరియు తెలంగాణా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోను నివసించే హిందువుల అతిపెద్ద పండుగ ‘బోనాలు’ పండుగ.

ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రజలు అతిగొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని ‘ఆషాఢంజాతర’ అని కూడా అంటారు. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో మాత్రమే కాకుండా తెలంగాణాలోని ఇతర ప్రాంతాలలోను ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుపబడుతుంది. ఇది అమ్మవారికి ప్రజలు తమ మొక్కును చెల్లించుకునే తరుణం. 1869లో జంట నగరాలలో ప్లేగువ్యాధి వ్యాపించినప్పుడు, గ్రామ ప్రజలు దైవ ఆగ్రహానికి గురి అయ్యాము అని తలచి భయభక్తుతో అమ్మవారిని శాంతిపచేయడానికి ఈ పండుగను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గ్రామదేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకామ్మ, మారమ్మ, మహాంకాళి మొదలైన పలుపేర్లతో కొలవబడుతున్నారు.

‘బోనాలు’ అంటే ‘భోజనాలు’ అని అర్థం. ఆలయాలలో దేవుళ్ళకు మనం సమర్పించే నైవేద్యమే బోనాలు.

ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్‌ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్‌దర్వాజ’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం`మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో వరుసగా కనుల పండుగగా జరుగుతుంది.

అక్కన్న`మాదన్న మహంకాళీ దేవాలయం, గోల్కొండను పాలించిన తానీషా కాలములో అక్కన్న-మాదన్న అనబడే సోదరుల వల్ల కట్టబడింది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయం 1815లో కట్టబడింది.

బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో సుమారు పదహారు రోజులు జరుపబడుతుంది.

ఈ ఏడాది బోనాల ఉత్సవం హైదరాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో జూలై పది నుండి జూలై ముప్పైదాకా జరుపబడుతుంది. ఇది తెలంగాణా ప్రజల అసలైన తెలుగు పండుగ. ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలో తెలంగాణా ఆలయాలలో బోనాలు జరుపుతారు. జంటనగరాల ప్రజలు మాత్రమే కాకుండా ప్రక్కన ఉన్న తెలంగాణా ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వేరు వేరు ప్రాంతాలనుండి వచ్చేవారు రకరకాలైన ఉయ్యాలలను తయారుచేసి తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.

బోనాల పండుగఘటం, బోనాలు, వేపాకు సమర్పించుట, ఫలహారంబండి, పోతురాజు విన్యాసం, రంగం, బలి, సాగనంపుట అని ఎనిమిది అంగాలతో కూడినది.

tumblr_m7k3xzfQSo1qlobzqo1_1280

 1. ఘటోత్సవం: ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి, నగరవీధులగుండా ఉరేగింపుగా తీసుకెళతారు. బోనాల ఉత్సవం ప్రారంభించిన మొదటి రోజునుండి పదునాల్గవ రోజుదాకా ప్రతిరోజు ప్రొద్దున, సాయంకాలం అమ్మవారు కలశంలో సూక్ష్మరూపంగా ఆసీనురాలై, నగర, గ్రామ వీధులో ఊరేగి, భక్తుల పూజలను స్వీకరిస్తుంది. ‘ఘటం’ అంటే ‘కలశం’. అమ్మవారి రూపం కలశం మీద గీయబడుతుంది. ఆ ఘటం అమ్మవారిలాగే అలంకరించబడుతుంది. ఆలయ పూజారి శరీరమంతా పసుపు పూసుకుని ఘటాన్ని మోసుకెళతాడు.
 2. బోనాలు: శక్తి స్వరూపిణియైన మహంకాళికి భక్తితో సమర్పించే అన్నమే ‘బోనాలు’. ఎవరివారు ఏఏ రకంగా వండి నైవేద్యం పెడతామని మ్రొక్కుకున్నారో, ఆవిధంగా వండి సమర్పించి తమ కృతజ్ఞతను తెలుపుకోవటం ఆచారంగా ఉన్నది. చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, పసుపుఅన్నం, అని పలురకాలుగా బోనాలు అన్నం ఉంటుంది.ఆషాఢ జాతరలో పదిహేనవరోజు, స్త్రీలు తమ ఇళ్ళను కడిగి శుభ్రపరచి, తలంటుకుని సాన్నంచేసి, శుభ్రమైన కొత్తబట్టలు ధరించి, వ్రతం ఆచరించి నైవేద్యం తయారు చేస్తారు. చక్కగా అలంకరించిన ఒకపాత్రలో అన్నాన్ని ఉంచి, వేపాకులతో చుట్టూకట్టి, దానిమీద మూతపెట్టి, మూతమీద పవిత్రంగా దీపం వెలిగించి, తలమీద పెట్టుకునివచ్చి లక్షలాది మంది ఆడవారు వరుసగా అమ్మవారికి భక్తితో బోనం సమర్పించి తమ మ్రొక్కులను తీర్చుకుంటారు. ఆ రోజు ఆడవారు ముఖంనిండా పసుపు రాసుకుని తడిబట్టలతో రావడం పురాతన ఆచారం. మహిళలు బోనాలను నెత్తిమీద పెట్టుకుని, భేరీ, తప్పెట, కొమ్ము వాద్యాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా రావడాన్ని చూడటానికి రెండుకన్నులు సరిపోవు. దీనికంటూ ప్రభుత్వం ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే ప్రణాళికగా అమలు పరుస్తుంది.
 1. వేపాకు సమర్పించుట: వేపాకులను పసుపునీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారం ముఖ్యమైన క్రియగా భావించబడుతుంది. వర్షాకాలం ప్రారంభమయినప్పుడు సోకే కలరా, మశూచివంటి వ్యాధులను తరిమికొట్టే క్రిమినాశినిగా వేపాకు ఉండటం వల్లనూ, అమ్మవారికి ప్రియమైన వృక్షంగా ఉండటం వల్లనూ వేపాకులను అమ్మవారికి సమర్పించి ఆనందిస్తారు స్త్రీలు.
 2. ఫలహారంబండి: ‘బోనాలు’ జరుపుకునేరోజు భక్తులు తమ ఇళ్ళల్లోనుండి శుభ్రంగా, నియమనిష్ఠలతో తయారుచేసి తెచ్చిన నైవేద్యాలను బండ్లలోపెట్టి ఆలయానికి ప్రదక్షిణం చేయటాన్నే ‘ఫలహారంబండి’ అనే ఉత్సవంగా జరుపుకుంటారు.
 3. పోతురాజు వీరంగం: అమ్మవారి సోదరుడుగా పోతురాజును భావిస్తారు. బోనాలు పండుగ పదిహేనవరోజు తెలంగాణా ప్రాంతంలోని ప్రతి బస్తీనించీ పోతురాజు అమ్మవారి ఆలయానికి లక్షల సంఖ్యలో వీరధీర విన్యాసాలు ప్రదర్శిస్తూ వరదగా తరలివస్తారు. వీరు కాళ్ళకి గజ్జలుకట్టి, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో తడిపిన ఎరుపు వస్త్రం ధరించి, కంటికి కాటుక, నుదుటి మీద కుంకుమ బొట్టుతో, నడుముకు వేపాకులు కట్టి, చేతిలో పసుపు రంగు కొరడా ఝుళిపించి నాట్యంచేస్తూ ఫలహారం బండికి ముందుగా నడచి వెళ్ళడం బోనాలు పండుగయొక్క విశేష ఆకర్షణీయ అంశం.
 4. రంగం: ఇది చివరి రోజున జరిగే ముఖ్యఘట్టం. బోనాలు నైవేద్యం ఆదివారం జరుగుతుంది. సోమవారం త్లెవారుఝామున అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వివాహంకాని ఒక స్త్రీ వచ్చి ఒకమట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనినే ‘రంగం’ అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీల ద్వారా తెలుపుతుంది. ‘రంగం’పలికే ఆ స్త్రీ, ఒక కత్తికి మాంగ్యం కట్టి, తన జీవితాంతం వివాహం చేసుకోకుండానే ఉండటం ఆనవాయితీ.
 5. బలి: రంగం ముగిశాక సోమవారం పోతురాజులు ప్రొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో వీర తాండవం చేస్తూ మైమరచి భక్తి పారవశ్యంతో ఆలయ ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి సన్నిధికి ఎదురుగా వారు ఆడే నృత్యం, మనను భక్తిపారవశ్యంలో ముంచుతుంది. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయవంటి కూరగాయల్ని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. ఇది వరకు ఎద్దు, మేక, కోళ్లను బలిఇచ్చే వారట. ఇప్పుడు మృగబలి నిషేధం కాబట్టి కూరగాయలను పగులగొట్టి పండుగను పూర్తిచేస్తున్నారు.
 6. సాగనంపుట: బలిఇచ్చే కార్యక్రమం పూర్తిఅయ్యాక, సోమవారం ప్రొద్దున పదిగంటల సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించి కలశాలతోపాటు ఏనుగుమీద ఎక్కించి, మంగళ వాద్యాల ధ్వనులమధ్య వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి భక్తులు అమ్మవారిని సాగనంపుతారు.చివరిగా ‘ఘటాన్ని’ నయాపూల్‌ ప్రాంతంలో ప్రవహించే మూసీనదిలో నిమజ్జనం చేసి, పండుగను పూర్తి చేస్తారు.

శ్రీమతి రాజీరఘునాథన్‌

ఋషిపీఠం సౌజన్యంతో…

FacebookTwitter

భారత్ లో ఎఫ్.డి.ఐ పెట్టుబడులు, ఆర్.బి. ఐ గవర్నర్ అంశాలపై ఎస్. గురుమూర్తి గారి ఇంటర్వ్యూ

Posted Posted in Articles
FacebookTwitter

ఎస్. గురుమూర్తి గారు, వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్, RSS ఆలోచన పరుడు  (ఆయన సంస్థలో ఎలాంటి అధికారిక పాత్ర కలిగి ఉండనప్పటికీ) పరిశోధనాత్మక వ్యాస రచయిత మరియు శక్తివంతమైన వ్యాపార సలహాదారుడు.

తన ఆధ్యాత్మిక గురువు సలహా మేరకు ఎన్నికల రాజకీయాల చెత్తని ఏరి వేయడానికి నిశ్చయించుకుని భారతీయ రాజకీయాలు మరియు వ్యాపారాలపై తన అత్యంత ప్రభావవంతమైన స్వరాన్ని వినిపిస్తున్నారు . అనేక మందికి RSS యొక్క ఆర్ధిక మరియు వ్యాపార సంబంధిత విషయాలపై గురుమూర్తి గారి ముద్ర బాగా కనిపిస్తుంది. ఆర్.బి.ఐ గవర్నర్  రఘురామ్ రాజన్ న్నిష్క్రమణ కోసం సంఘ పరివార్ నాయకులలో ఒక విభాగం ఇటీవల చేసిన డిమాండ్ వెనుక స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM), సహ కన్వీనర్ అయినా గురుమూర్తి గారు కూడా ఒక స్ఫూర్తి.

ప్రవీణ్. ఎస్. తంపి కు యిచ్చిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ లో,  గురుమూర్తి గారు తన పోరాటం వ్యక్తులకు వ్యతిరేకంగా కాదని వాదించారు. జ్ఞాన సముపార్జనకై బయట దేశాల్లో నివాసముంటున్న భారతీయ నిపుణులు భారతదేశం యొక్క విధి విధానాలను రూపొందించే ముందు భారతదేశంలో కొంతకాలం ఉండి దేశ స్థితిగతులను సమగ్ర అధ్యయనం చేస్తే బావుంటుంది.  (ఎలాగైతే దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే సలహా తీసుకున్నట్లు ).

ఈ అరుదైన ఇంటర్వ్యూలో నుండి అంశాలు:

పెరుగుతున్న FDI పెట్టుబడులు భారతదేశ బహుళ ప్రయోజనాలపై  ఆసక్తా ? లేక విదేశీ పెట్టుబడిదారుల ( విదేశీ ఆయుధాల సప్ప్లై మరియు పౌర విమానయానాల లాంటి ) కు ప్రయోజనాలు చేకూర్చేవా ?

దీనిపై కొంత చర్చ అవసరం. FDI  తెరవబడడం ఆర్ధికంగా  మరియు  వ్యూహాత్మకంగా జరిగింది. 1990-1995 మధ్యలో ఇది నెరవేరలేదు. తప్పనిసరిగా అవసరమైన డాలర్లు పొందడానికి నిస్సహాయంగా ఉండి ఏ వ్యూహాత్మక అవకాశం లభించలేదు. 1998 పోక్రాన్ అణుపరీక్ష  భారత దేశాన్ని మొట్ట మొదట సారిగా ప్రపంచ దృష్టికి తీసుకునివచ్చింది. భారతదేశం పై ఆంక్షలు విధించ బడ్డాయి. శక్తివంతమైన పాశ్చాత్య దేశాలు భారతదేశం తో సంప్రదింపులకు తెరతీశాయి. 2000 సం. ప్రారంభం నుంచి కూడా అమెరికా మరియు పాశ్చాత్య  దేశాలు క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ని ఎదురుకుంటుంటే  ఆసియా ఖండంలోని దేశాలకు కొంత ఆర్ధిక అభివృద్ధి వేగాన్ని  పుంజుకున్నాయి . Dr .మన్మోహన్ సింగ్  గారి నేతృత్వం లో భారతదేశం-అమెరికా కుదుర్చుకున్న అణుఒప్పందం విశేషమైన వ్యూహాత్మక చర్య. ఇప్పుడు మోడీ నేతృత్వంలో భారత దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం వలన భారత దేశం యొక్క ప్రాముఖ్యత ప్రపంచ చిత్రపటంలో గణనీయంగా పెరిగింది .

దీని యొక్క పరిణామమే  2016 భారత దేశ పరిస్థితికి 1996 లో భారత దేశ పరిస్థితికి తేడాను మనం స్ఫష్టంగా చూడగలుగుతున్నాము. ఇప్పుడు మనం ఎంతటి పెద్ద దేశంతో నైనా ఆర్ధిక వ్యూహాత్మక సంబంధాలు ఏర్పరచుకోగలం. కాబట్టి ఇప్పుడు ‘Make in India’ మరియు ‘Made  in  India’ తో కూడిన FDI పెట్టుబడులను మనం ఆర్ధికంగా వ్యూహాత్మకంగా చూడగలం.

వ్యాపారము మరియు పెట్టుబడులు బేరీజు వేసుకున్నప్పుడు దిగుమతులు కన్నా FDI  మంచి ఎంపిక.  ఆటొమొబైల్ ను FDI అనుమతించడం వలన భారతదేశాన్ని ఒక ఎగుమతి కేంద్రం గా చేసింది. ఇటీవల  FDI విధానాలతో రెండు విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదటిది , ఎయిర్ ఇండియా భవితవ్యాన్ని నిశ్చయించకుండా పౌర విమానయాన రంగం లోకి FDI ను అనుమతించడం. రెండు, దేశీయ ఆహార విక్రయ సంస్థలను బలపడడానికి సమయం ఇవ్వకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. కొత్త విధానాల వలన భారత దేశ ఆయుధాల తయారీ పరిశ్రమను బలపరచి ప్రపంచ ఆయుధ వ్యాపార దిగ్గజంగా నిలిచే అవకాశం ఉంది.

మీరు నరేంద్రమోడీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల అజెండాను బిజెపి, SJM అనుసరిస్తున్నభారతీయతనుసిద్ధాంతానికి తగినట్లుగా ఉందని అని భావిస్తున్నారా?  

ఇక్కడ భారతీయత అంటే ఒక గిరిగీసుకుని ఉండటం కాదు . భారతీయత అంటే భారత దేశానికి అనుకూలంగా సమతుల్యతను కలిగి ఉండటం. ఇక్కడ “సంస్కరణ” అనే పదం కన్నా “మార్పు” అనే పదాన్ని ఇష్టపడతాను. 1990 లో అమెరికా యొక్క అనియంత్రిత ఆర్ధిక విధానం ఒక్కప్పుడు ప్రపంచ దేశాలకు కొలమానం, కానీ ఇప్పుడు అమెరికానే నియంత్రిత ఆర్ధిక విధానంపై మొగ్గు చూపుతోంది. మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఆర్థికవేత్తలు దీనిని అర్థం చేసుకుంటే అనేక అపార్ధాలను తొలగించవచ్చు.

 

సుబ్రమణ్య స్వామి గారురఘు రాంరాజన్ మానసికంగా పూర్తిగా భారతీయుడు కాదుఅన్న ఆయన వ్యాఖ్యలతో అంగీకరిస్తున్నారా? మీకు RBI గవర్నర్ తో ప్రాధమిక విభేద కారణాలు ఏమి ఉన్నాయి?

నా ప్రధాన విభేదం ఆయన విధానాలు. జ్ఞాన సముపార్జనకై ఎక్కువ కాలం విదేశాలలో ఉన్న భారతీయ నిపుణులు భారతదేశం యొక్క విధి విధానాలను రూపొందిచే ముందు మొదట  భారతదేశంలో కొంత కాలం ఉండి భారత దేశ స్థితి గతులను సమగ్ర అధ్యయనం చేస్తే (ఎలాగైతే దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీ ,గోపాల కృష్ణ గోఖలే గారి సలహాను తీసుకున్నట్లు) బాగుంటుంది అని నా అభిప్రాయం.

కొన్ని సంవత్సరాల క్రితం ఆర్థిక సలహాదారుడు అరవింద్  సుబ్రహ్మణ్యం గారు మేధో సంపత్తి హక్కులు మీద భారత దేశానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ కు  మద్దతుగా వ్యవహరించినట్టుగా తెలుపుతూ  అరవింద్  సుబ్రహ్మణ్యం ను తొలగించాలని స్వామి డిమాండ్ చేశారు. మీరు స్వామితో అంగీకరిస్తున్నారా ?

నేనుఅంగీకరించను.  అరవింద్  సుబ్రహ్మణ్యం నేడు అదే అభిప్రాయంతో ఉన్నారని నేను భావించడంలేదు. అతను అలాంటి పని చేసి ఉంటే, మోడీ ప్రభుత్వంలో ఉండే వారే కాదు.

సాంకేతిక నిపుణలకు భారతీయత అనే అంశం వారి ఉద్యోగ నిర్వహణలో ఎంత వరకు సంభందిత అంశం?

భారతీయత అంటే భారతీయమైన మనసు అని అర్థం. భారతదేశం పట్ల ప్రేమ మరియు భారత దేశం యొక్క అనుభవం – ఇది రెండు అంశాలను కలిగి ఉంది. ఒకటి లేకుండా మరొకటి లేదు . జవహర్ లాల్ నెహ్రు నికోలస్ కల్దర్ ను  తీసుకున్నట్లుగా , ఒక పర్యాయం సలహాదారులుగా విదేశీ సాంకేతిక నిపుణులు తీసుకోవచ్చు – (ఎంపిక తప్పు అయినప్పటికీ). విదేశీ సాంకేతిక నిపుణులు యొక్క సలహా సరిపోయేందుకు ఉంటుంది లేదో మాత్రమే ఒక భారతీయమైన మనసు నిర్ణయిస్తుంది. డెంగ్జియావోపింగ్ అన్ని ఆలోచనలు పరిశీలించడానికి ఒప్పుకున్నాడు కానీ ఏ ఆలోచన చైనాలో పనిచేస్తుందో అది మాత్రమే తీసుకోవాలని ఆయన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోడీ ప్రభుత్వం  NITI Aayog  కి ఇచ్చిన సలహాలో భారత దేశానికి మరియు భారత దేశం పని చేసే విధానాలను మాత్రమే పరిగణించాలి .   సూచనలు అందరి నుంచి తీసుకోవచ్చు కానీ అవి భారత దేశానికి ఎంత వరకు సరి పోతాయో లేదో భారతీయ అనుభవం ఉన్న వారు మాత్రమే నిర్ణయించగలరు.

మీ దృష్టిలో రాజన్ స్థానంలో ఆదర్శ అభ్యర్ధి ఎవరు ? తదుపరి ఆర్.బి.ఐ గవర్నర్ కు  ఎలాంటి లక్షణాలు ఉండాలి ?

మనకు ప్రముఖులు ఎవరు అవసరం లేదు. మనకు  RBI గవర్నరు అయ్యాక ప్రముఖుడైన డాక్టర్   Y.V.రెడ్డి లాంటివారు , లోతుగా భారత దేశ స్థితిగతులు తెలిసిన వారు మరియు తలవంచి పని చేసేవారు కావాలి .

ఆర్థిక సరళీకరణ ప్రారంభమైనప్పటి నుండి ఈ  25 సంవత్సరాలలోభారతదేశం యొక్క ఆర్థిక స్థితి సంబంధించినంత వరకు ఒక గ్లాస్ తో పోలిస్తే మరొక గ్లాస్ ను ఎలా చూస్తారుసగం పూర్తిగానా లేక సగం ఖాళీగానా ?

దీని సమాధానం మీ మొదటి ప్రశ్న కే చెప్పాను. మనం భారత దేశం యొక్క ఆర్థిక స్థితిని మరియి మన వ్యూహాత్మక స్థితిని విడివిడిగాచూడలేము. ఈ రెండు కలిస్తేనే ఒక దాని కొకకటి బలం చేకూరుస్తాయి. నేను భారతదేశం ఈ రెండు విషయాలలో బాగా ఉన్నత స్థాయికి చేరుకుందని అనుకుంటున్నాను.

రామ్ దేవ్ బాబా వంటి వారు బాబా నుంచి వ్యాపారవేత్తగా పెరగడాన్ని మీరు ఎలా పరిగణిస్తారు ? మీ ఉదేశ్యంలో వారు HUL మరియు పి&జీ లాంటి భారీ పరిశ్రమలకి పోటీని ఇవ్వగలరా?

 రామ్ దేవ్ బాబా వ్యాపార విజయం వలన మనకు స్వదేశీ వస్తువులపై ఉన్న ఆర్ద్రత, ఆకర్షణ తెలుస్తోంది. దీని వల్ల బహుళ జాతి సంస్థలు కూడా మారుతున్నాయి. కోల్గేటు వారి ప్రకటన చూసినట్లయితే వాళ్ళు పేస్టలో ఉన్న వేప ఉప్పు శాతం గురించి మాట్లాడుతున్నారు.

కంపెనీలు మరియు వాటి ఆర్ధిక అంశాలలో మీకున్న అవగాహనతో చాలా బాగున్నా జీడీపీ గణాంకాలను చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది?

నాన్ కార్పోరేట్ రంగం ,దేశీయ వినియోగం మరియు పొదుపు భారత దేశం యొక్క అభివృద్ధికి ముఖ్య కారణాలు. కార్పోరేట్ రంగం పూర్తిగాఎప్పుడు భారత దేశ అభివ్రుదికి కారణం కాదు . ‘క్రెడిట్ సుస్సి’

అధ్యయనం చెప్పినట్టు  కార్పోరేట్ సంస్థలు భారత దేశ ఆర్ధిక వ్యవస్థ యొక్క తోక మాత్రమే. కానీ శరీరం కాదు .కానీ బహుళ జాతి సంస్థలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో భారత దేశాన్ని అనుసంధానం చేస్తున్నాయిల , 2008 కి ముందు భారీగా పెట్టుబడులు పెట్టిన కార్పోరేట్ దిగ్గజాలు దెబ్బతిన్నాకా కూడా మూర్ఖంగా అదే వరవడిని కొనసాగిస్తున్నారు.

ఆచరణాత్మక పరిష్కారానికి పిలుపునిచ్చే అవసరం ఏర్పడింది. దీనికి విరుద్దంగా ఆర్.బి.ఐ భారత దేశనికి తగిన ఎన్.పి.ఏ  నిబంధనలు బలవంతంగా ప్రవేశపెట్టింది .దీని వలన భారత దేశ కార్పోరేట్ రంగం దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచ నిబంధనలను మూడు కారణాల వలన వాయిదా వేయవలసి వచ్చింది. మొదటిది ,భారత దేశంలో పెట్టుబడి వైపు పరివర్తనీయత, రెండవది బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, మూడవది మూడో వంతు బ్యాంక్ డిపాజిట్లు ప్రభుత్వ సెక్యూరిటీ లలో పెట్టుబడి పెట్ట బడ్డాయి.

1990 లో జపాన్ మరియు 2008 లో అమెరికా లాంటి దేశాలలో బ్యాంకింగ్ సంక్షోభం ఏర్పడినప్పుడు ఇటువంటి చర్యలు చాలా సామాన్యంగా తీసుకోబడతాయి. కాబట్టి RBI ఈ విధానాన్ని ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది .

ప్రపంచీకరణ కాలం మరియు తాజాగా అమెరికా నుంచి యూకె వరకు అనుసరిస్తున్న రక్షణ విధానం నేపధ్యంలో స్వదేశీ ఎంత వరకు సమంజసమైన అంశం?

స్వదేశీ అన్నది వస్తు రక్షణ విధానం కాదు. సంస్కృతి మరియు అర్థ శాస్త్రలను అనుసంధానం చేసే తత్వ శాస్త్రం . అభివృద్ధికి “అన్నిటికి సరిపోయే” ( “fit all ”) విధానం సరి కాదు కాబట్టి అభివృద్ధి సంస్కృతి పరంగా అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఇది భవిషత్తు ప్రపంచ ఆలోచన.

 October 15-16 2005 న ఆర్ధిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ లు పాల్గొన్న జి-20 శిఖరాగ్ర సమావేశాల్లో  “Fit all ” ఆర్ధిక విధానాన్ని తోసిపుచ్చారు.” ప్రతి దేశం తనకు తగిన అభివృద్ధి విధి విధానాలను ఏర్పరుచుకోవాలని తీర్మానించారు”.

తరువాత వరల్డ్ బ్యాంక్  2008 న ఇదే విషయాన్ని సమ్మతించి ఇలా చెప్పింది   ” వివిధ దేశాల్లో మన పని చూసాక వరల్డ్ బ్యాంక్ కూడా ఒకే పద్దతి అన్ని చోట్ల సరిపోదు అని అర్థం చేసుకుంది. అభివృద్ధి అంటే సర్వోత్తమమైన ఆలోచనలు తీసుకోవాలి , వాటిని కొత్త కొత్త పరిస్థితులలో పరీక్షించాలి మరియు సరిపోని వాటిని తోసిపుచ్చాలి”

2015  లో ఐక్య రాజ్య సమితి అధికారులు పేదరికం తగ్గింపు మరియు సమర్థవంతమైన వృద్ధి మీద సంస్కృతి యొక్క కీలక పాత్రను గుర్తించడం, మరియు అది 2015 తరువాత అభివృద్ధి ఎజెండాకు సంకలనముగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. కాబట్టి స్వదేశీ ఇప్పుడు ప్రపంచ ఆలోచనా లేక స్థానిక ఆలోచనా?

FacebookTwitter