సరిహద్దులు వద్దన్నది ‘సంపన్నుల’ నీతి..

Posted Posted in News
FacebookTwitter

అమాయకంగా కొందరు, అయోమయం గా కొందరు, అజ్ఞానంతో కొందరు, విద్రోహబుద్ధితో మరికొందరు భరతమాత ధ్యాసను కోల్పోవడం శతాబ్దుల చరిత్ర. ఈ శతాబ్దుల విదేశీయ దురాక్రమణ సాగిన నాటివి, భావదాస్యం వదలని నేటివి…‘‘్భరత్ మాతా కీ జై’’ అని అన్నందుకు ఒక విద్యార్థిని కొందరు చితకబాదడం ప్రతీక మాత్రమే. రోగం దీర్ఘకాలికమైంది. అలా చితకబాదిన ముష్కరులు రోగ లక్షణాలు…జీవన వ్యవహారం ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, పరిమార్చడానికి కూడ దోహదం చేస్తుండడం వాస్తవం. ఇది భౌతిక ఆరోగ్యానికి, బౌద్ధిక ఆరోగ్యానికి సమానంగా వర్తించే వాస్తవం. భౌతిక అనారోగ్యం ఒక్కొక్కడిని విడివిడిగా పాడు చేస్తుంది, తాత్కాలికమైనది. బౌద్ధిక అనారోగ్యం అధికాధిక జనాన్ని సమష్టిగా పాడుచేస్తోంది. ఇది దీర్ఘకాలికం. క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాశిమ్ అనే జిహదీ హంతకుడు మనదేశంపై దాడి చేసి బీభత్సకాండ జరిపిననాడు రోగం అంకురించింది. రోగం ముదిరిన వారు ఇప్పుడు ‘‘మా మెడపై కత్తిపెట్టి బెదిరించినప్పటికీ కూడ భారతమాతకు జయకారం సేయము’’ అని విద్రోహపు విషాన్ని కక్కుతున్నారు. క్రీస్తుశకం 1498లో వాస్కోడిగామా అనే తెల్ల రాక్షసుడు మనదేశంలోకి చొరబడినప్పటి నుంచీ వ్యాధి మరింతగా విస్తరించింది. భరతమాతకు జయహారం చేసిన వారిపై దౌర్జన్యం చేసిన వారు ఈ వ్యాధి ముదిరినవారు, ‘‘స్మృతి లేకపోవడం మృతి..’’ అని ప్రముఖ సంస్కృత విద్వాంసుడు తెలకపల్లె విశ్వనాథశర్మ చెప్పి ఉన్నాడు. ఆయన చెప్పిన ఈ వాస్తవం సనాతనతత్వానికి పునరావృత్తి. ఇది వ్యక్తిగత స్మృతికి సంబంధించినది. వైయక్తిక ఆత్మకు సమష్టి విస్తరణ జాతీయ ఆత్మ అన్న…జాతీయ ఆత్మస్మృతిని కోల్పోవడం జాతీయులకు మరణంతో సమానం. శతాబ్దుల పాటు విదేశీయ దురాక్రమణదారులు ఈ దేశపు స్వజాతీయ బుద్ధిని కొట్టి గాయపరిచారు. జాతీయ ఆత్మస్మృతిని లేకుండా చేయడానికి యత్నించారు. అలా ఆత్మ విస్మృతిని కోల్పోయినవారు, వారి వారసులు భరతమాతకు జయనాదం చేయడం లేదు. కొందరికి విస్మృతి రాలేదు, కొందరు విద్రోహపు ఉన్మాదంలో స్మృతిని నిరాకరిస్తున్నారు. కానీ శతాబ్దులపాటు కొట్టి గాయపరచినప్పటికీ విదేశీయ దురాక్రమణదారులు కొందరిని మాత్రమే విద్రోహపు ఉన్మాదులుగా మార్చి వెళ్లారు. మిగిలిన అధికాధిక జాతీయులకు జాతీయతా స్మృతి నశించలేదు. ఇలా నశించని వారు ‘వందేమాతరం’ అని అన్నారు. ‘్భరత్‌మాతాకీ జయ్’ అని అంటున్నారు. వీరి సంఖ్య పెరుగుతోంది. విద్రోహపు రోగగ్రస్తుల సంఖ్య తగ్గుతోంది.

ఈ జాతీయ ఆత్మ ఈ దేశపు మట్టి నుండి అంకురించింది, పల్లవించింది, పుష్పించింది, పరిమళించింది, ఫలించింది. ఈ అమృత ఫలాలు ఈ దేశపు వరాల బిడ్డలు. ఈ జాతీయ ఆత్మ వికసనం సృష్ట్యాదిగా కొనసాగుతున్న సనాతన తాత్విక పునరావృత్తి…‘‘మాతా భూమిః- భూమి తల్లి’’ అని వేద ద్రష్టలు వాస్తవాన్ని ఆవిష్కరించడం సృష్ట్యాది. ‘మట్టి’ చైతన్యమయమైన మాతృ దేవత…ఒకరికి తల్లి ఒక వ్యక్తి, ఒక జాతికి తల్లి మాతృభూమి, ఒక చైతన్య శక్తి. మనజాతికి తల్లి అయిన మాతృభూమి భరతమాత. మాతృభూమి ఆధారంగానే సమస్తం వికసిస్తోంది. ‘‘ఈ స్మృతి మాకు సుగతి..’’ అని అనుకుంటున్నవారు భరతమాత వరాల బిడ్డలు. ఈ సత్యాన్ని మరచిన వారు ‘‘దేశమంటే మట్టికాదోయ్..’’ అని గతంలో అరచారు. ఇప్పుడు వ్యాధి ముదిరిన విద్రోహపు ఉన్మాదులు ఈ మట్టిని మట్టుబెట్టే కుట్రను సాగిస్తున్నారు. కానీ ‘‘దేశమంటే మట్టి భారుూ, మట్టి మాతృ స్వరూపమోరుూ..’’ అని అనాదిగా వేద ఋషులు వాస్తవాన్ని చెప్పారు. బంకించంద్ర చటర్జీ చెప్పాడు, రాయప్రోలు సుబ్బారావు చెప్పాడు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చెప్పాడు, మహాకవి గుఱ్ఱం జాషువా చెప్పాడు. భండారు సదాశివరావు చెప్పాడు.. మట్టి నుంచి అన్నాన్ని సృష్టించి జాతికి జీవజవాలను ప్రసాదిస్తున్న వ్యవసాయదారులు చెబుతున్నారు! దేశమంటే మట్టి..మన మందరం మట్టి పట్టులం..అద్వితీయ జాతీయ ఆత్మ మట్టి ద్వారా ప్రస్ఫుటింప జేసిన ఆసంఖ్యాక రూపాలం…ఒక ప్రవర్థమాన కవి అన్నట్టు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మట్టి వాసనలు..మాతృభూమీయ సంస్కారాలు.

జాతీయతా సంస్కారం కొడికట్టే ‘విక్రియ’ మళ్లీ వెలిగించే ‘ప్రక్రియ’ ఈ దేశంలో సహస్రాబ్దుల సతత సంఘర్షణలో భాగం…వర్తమాన కాలంలో సైతం ఇది సమాంతర విన్యాసం… ‘ప్రపంచీకరణ’ పేరుతో జరిగిపోతున్న వాణిజ్య విన్యాసాల వల్ల స్వజాతీయులలో ప్రధానంగా పారిశ్రామిక విద్యావంతులలో జాతీయతాధ్యాస అడుగంటిపోతోంది. వ్యక్తిత్వ వికాసం, జీవన సాఫల్యం, వీటికోసం అనుసరించే విధి విధానాలు, వ్యూహాలు, శ్రమించే ప్రవృత్తులు మొత్తం వాణిజ్య ప్రగతి కేంద్ర బిందువుగా ప్రపంచీకరణ పరిధిలో గింగిర్లు తిరుగుతున్నాయి. డిజైనింగ్-రూపకల్పన, మార్కెంటింగ్-క్రయవిక్రయ ప్రక్రియ, ఫైనాన్స్- పెట్టుబడులను సాధించడం, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-వాణిజ్య పాలనా వ్యవస్థ వంటి పేరుతో స్నాతకోత్తర విద్యలను బోధిస్తున్న ఉన్నత సంస్థలెన్నో ఉన్నాయి. ఈ విద్యలన్నీ తాము గొప్ప వ్యక్తిగత ప్రగతిని సాధించడానికి మాత్రమే ఉన్నాయన్న చిత్తవృత్తి విద్యార్థులకు ఏర్పడుతోంది. ఎందుకంటె ఇలా ‘ఎమ్‌బిఏ’ ఇతరేతర వాణిజ్య విద్యలను, ఇంజినీరింగ్ తదితర పట్టాలను పొందుతున్నవారికి కేవలం ‘ఉద్యోగుల’ గురించి మాత్రమే అవగాహన పెరిగేవిధంగా బౌద్ధిక శిక్షణ ఇస్తున్నారు. క్యాంపస్ సెలక్షన్-కళాశాల ప్రాంగణంలోనే ఉద్యోగానికి ఎంపిక చేసుకొనడం-స్నాతకోత్తర-పోస్టుగ్రాడ్యుయేట్-విద్యా సంస్థలలో ప్లేస్‌మెంట్- ఉద్యోగ నియామకం-ప్రాతిపదికగా చేర్చుకొనడం వంటివి యువజనులలో ఆర్థిక భద్రతను పెంపొందించవచ్చు. కానీ ఈ విద్యా ప్రాంగణాలలో దేశం, జాతీయత, సామాజిక బాధ్యత ‘మాతృభూమి ఋణం తీర్చుకోవడం’, భూతదయ వంటి విస్తృత సంస్కారాల ధ్యాసను గరువులు, శిష్యులకు కలిగించడం లేదు. ఈవిధంగా యువజనుల ధ్యాస-ఓరియెంటేషన్- వాణిజ్యవంతమైపోతున్నది. ఢిల్లీ, శివారులో ఉన్న వాణిజ్య విద్యా సంస్థలో ఇటీవల స్నాతకోత్తర-పోస్ట్‌గ్రాడ్యుయేట్- యోగ్యతా పత్రాల ప్రదానం జరిగింది. సంస్థలో చదివి ఉత్తీర్ణులైన ఈ స్నాతకోత్తర విద్యార్థినీ విద్యార్థులందరికీ వివిధ వాణిజ్య సంస్థలలో ఉద్యోగాలు లభించేశాయి. కాన్వకేషన్ ప్రొసెషన్-స్నాతకోత్తర శోభాయాత్ర- ప్రాంగణం గుండా సాగి వేదికవద్దకు వచ్చింది. అలా యాత్ర సాగుతున్న సమయంలో వేదమంత్ర-కఠోపనిషత్-ఘోష వినబడింది. ఆ తరువాత సరస్వతీ ప్రార్థన జరిగింది. ఇవి కేవలం లాంఛనాలు. ఎందుకంటె ఆ తరువాత వేదిక పైనుండి వినబడిన ప్రముఖుల ప్రసంగాలో ఎక్కడ కూడా దేశం గురించి మాతృభూమి మమకారం గురించి ప్రసక్తి రాలేదు. శోభాయాత్ర సమయంలో వినబడినది వేదమంత్రమన్న పరిజ్ఞానం కూడ స్నాతకోత్తర విద్యావంతులలో అత్యధికులకు లేదు..దాన్ని గురించి ఎవ్వరిని ప్రశ్నించినప్పటికీ ‘‘నాకు తెలీదు..’’ అన్నది సమాధానం!

ఆ వాణిజ్య స్నాతకోత్తర సభలో ప్రసంగించిన వారందరూ గ్లోబల్ ఛాలెంజెస్-ప్రపంచ వాణిజ్య సమస్యల గురించి-మాత్రమే ముచ్చటించారు. ప్రధాన వక్త ముప్పయి ఏళ్ల క్రితం వాణిజ్య పట్ట్భద్రుడై వడ్డీ వ్యాపారం ప్రారంభించాడట. ఈ వడ్డీ వ్యాపారం చిట్టీల వ్యాపారం- చిట్‌ఫండ్- అయింది. తరువాత చిట్‌ఫండ్ బ్యాంకుగా మారి ప్రపంచమంతటా విస్తరించింది. ఇది ఆ ప్రధాన వక్త, బ్యాంకు అధినేత వ్యక్తిగత వాణిజ్య విజయమన్న స్ఫూర్తి ప్రసంగంలో ప్రస్ఫుటించింది. ‘‘ఇది ఒక భారతీయుడి విజయమన్న’’ జాతీయ ధ్యాస మాత్రం మచ్చుకైనా ఆయన ప్రసంగంలో స్ఫురించలేదు. వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం ఇది. అనాదిగా మిగిలిన జాతీయ వ్యవస్థల వలె వాణిజ్యం కూడ మన దేశంలో సమైక్యతా సమగ్రతలను సంతరించి పెట్టింది. దేహంలోని సిరలు, ధమనులు రక్తప్రసరణ సాగించినట్టుగా దేశంలోని వాణిజ్యరీతులు అన్నాన్ని పంపిణీ చేశాయి. కానీ జాతీయతా ధ్యాస నశించిన వ్యాపారం దోపీడీకి కేం ద్రమయింది. విదేశీయ దురాక్రమణ ఇలా నశింపజేసింది. ప్రపంచీకరణ భారతీయతను సంపూర్ణంగా ధ్వంసం చేసి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల-మల్టీ నేషనల్ కంపెనీస్- దోపిడీని పెంపొందించింది.

ఈ వాణిజ్య ప్రపంచీకరణకు పూర్వం వర్ణద్వేష వాదుల అంతర్జాతీరుూకరణ కొనసాగింది. భారతీయులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని శ్రీరంగం శ్రీనివాసరావు వంటి కవులు ఓండ్ర పెట్టడం ఆ అంతర్జాతీరుూకరణకు ఒక ఉదాహరణ మాత్రమే…ఉదాహరణలు ఎనె్నన్నో ఉన్నాయి. రష్యాకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మహిళలందరూ తనకు అక్కలవలె, చెల్లెళ్లవలె సాక్షాత్కరించినట్టు శ్రీరంగం శ్రీనివాసరావు తన ‘అనంతం’లో చెప్పుకున్నాడట. కానీ ఈయనే భారతీయ మహిళలను ‘సిగరెట్ల’తో పోల్చడం ‘‘అనంతం’’ లోని మరో ఘట్టం. ఇలా వర్గద్వేష వాదుల అంతర్జాతీరుూకరణ, బహుళ జాతి వాణిజ్య సంస్థల ప్రపంచీకరణ, ఒకే నాణెమునకున్న రెండు వికృత ముఖా లు. మొదటి ముఖం వారికి భరతమాత గిట్టదు. రెండవ ముఖం వారికి భారతీయత పట్టదు…

‘‘దేశాల సరిహద్దులు చెరగిపోవాలి’’ ఆని రెండు దశాబ్దులకు పైగా ప్రపంచీకరణ సిద్ధాంత కర్తలు చెబుతూనే ఉన్నారు. అమెరికా మేధావులు, ఐరోపా మేధావులు తమ దేశాలలో ఈ సంగతి చెప్పరు. మనదేశానికి వచ్చి చెప్పిపోతారు..మనదేశపు మేధావులు మాత్రం మనదేశంలో మాత్రమే ఈ సంగతి చెబుతున్నారు.. అమెరికాకు వెళ్లినప్పుడు చెప్పరు. వీళ్లు చెబుతామన్నప్పటికీ వాళ్లు చెప్పనివ్వరు. ఎందుకంటె అమెరికా వారు, చైనావారు ఐరోపా వారు తమ దేశాల సరిహద్దులను మాత్రం భద్రంగా ఉంచుకొని, భారత దేశపు సరిహద్దులను మాత్రమే చెరపి వేయాలని చూస్తున్నారు. ప్రవర్థమాన దేశాల సరిహద్దులు మాత్రమే నశించిపోవాలన్నది సంపన్న దేశాల వ్యూహం.

‘‘ భూమి నాది కావడానికి పూర్వమే నేను ఈ భూమికి చెందినవాడను- ఐ బిలాంగ్‌డ్ టు దిస్ ల్యాండ్ బిఫోర్ ఇట్ బిలాంగ్‌డ్ టుమి!’’ అని జాన్ ఫిట్జురాల్డ్ కెన్నడీ అన్న అమెరికా అధ్యక్షుడు క్రీస్తుశకం 1960వ దశకంలో చెప్పాడు. ఇది జాతీయతకు గొప్ప స్ఫూర్తిగా అమెరికావారు ఇప్పటికీ డప్పు వాయించుకుంటున్నారు. మనవాళ్లు కూడా కెన్నడీ దేశభక్తిని ఉటంకించడం చరిత్ర…నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా ఇలా భూమిపై మమకారం చూపుతోంది. నాలుగు వందల ఏళ్లకు పూర్వం ఆ భూమి ఇప్పటి అమెరికావారిది కాదు. వీరి పూర్వీకులదీ కాదు…యుగాలుగా, మహాయుగాలుగా, మన్వంతరాలుగా మనదైన భరత భూమి. వరాల బిడ్డలం మనం. మనమాటలను మనం పలుకుతున్నామా?

హెబ్బార్ నాగేశ్వర్ రావు

(ఆంధ్ర భూమి సౌజన్యం తో)

FacebookTwitter

RSS Changes Uniform

Posted Posted in News
FacebookTwitter

Change is the constant process in the evolution of RSS. Though khaki knickers become external identity of RSS swayamsevaks with expanding horizons within society. RSS has now adopted brown color trousers.

201630031611

FacebookTwitter

గిన్నిస్‌ గూటిలోకి గాన కోకిల

Posted Posted in News
FacebookTwitter

దక్షిణభారత సినీ గానకోకిల పి.సుశీలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అత్యధిక సంఖ్యలో పాటలు పాడినందుకు ఆమెకు ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కింది. సుశీల ఆరుకు పైగా భాషల్లో 17,695 సోలో, యుగళ, బృంద గీతాలు పాడారని ఆమెకు ప్రదానం చేసిన ధ్రువపత్రంలో గిన్నిస్‌ ప్రశంసించింది. ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంతో ఆమె ఆలపించిన యుగళగీతాల సంఖ్య.. రికార్డు స్థాయిలో 1,336 ఉండటం విశేషం.

కొత్తతరం గాయనులకు సుశీల ఒక రోల్‌మోడల్‌, స్ఫూర్తి. ఏ పాటకైనా ప్రాణం పోసే అద్భుత గాయని ఆమె. విడిగా చూస్తే… మామూలుగా అనిపించే గీతాలెన్నో ఆమె గళమాధుర్యంతో జీవం పోసుకున్నాయి.

సుశీల పాటంటే తరగని మాధుర్యం… ఆహ్లాదపరిచే శ్రావ్యత! పాటలోని ప్రతి పదం చక్కగా వినపడేంత స్పష్టత ఆమె ముద్ర. సన్నివేశానుగుణంగా భావయుక్తంగా, సహజంగా, తీయగా పాడటంలో ఆమెది తిరుగులేని ప్రజ్ఞ. ఏ హీరోయిన్‌కు పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించే గానం మరో విశిష్టత.

ఏ రకమైన పాటకైనా ఒదిగే గొంతు ఆమెది. అల్లరి పాటలైనా, హాయి పాటలైనా, హాస్యం, విషాదం, వలపు, తలపు… వేటినైనా సరే, ఆ కంఠం అలవోకగా అనువదించుకుంటుంది. అనుపమానంగా ఆలపిస్తుంది. దైవభక్తి, దేశభక్తి గేయాలు, జానపద గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ గీతాలు, పిల్లల జోల పాటలూ, పండగల పాటలూ, క్లబ్‌ పాటలూ… ఇలా వైవిధ్యభరితమైన వేల పాటలు! తరతరాల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షక శ్రోతలను తన గానామృతంతో ఓలలాడించారు.

తొలి పాట…: ఆమె సినీరంగ ప్రవేశం చేసింది 1952లో. అప్పటికే బాలసరస్వతీదేవి, జిక్కి, పి.లీల, ఎం.ఎల్‌. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులైన గాయనులుండేవారు. వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు. దాన్ని ఆమె కొద్దికాలంలోనే సాధించగలిగారు.

ఆమె మొదటి పాట ‘కన్నతల్లి’ చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ‘ఎందుకు పిలిచావెందుకు’ అన్న ఆ పాటను ఎ.ఎం. రాజాతో కలిసి పాడారు.

1956వ సంవత్సరం సుశీల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. అంతవరకు చిన్నచిన్న పాత్రలకు తన కంఠాన్నిస్తూ వచ్చిన సుశీల మొదటిసారిగా కథానాయిక (సావిత్రి) పాత్రకు ‘తోడికోడళ్ళు’ చిత్రంలో పాడారు. ఆ పాటతో సుశీల ప్రాచుర్యం ఎంతగానో ఇనుమడించింది.

అందుకే తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ ఆమె పాట లేని సినిమా దాదాపు లేదని చెప్పొచ్చు. 1960ల నుంచి 1970ల తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతాభిమానులు భావిస్తారు.

పన్నెండు భాషల్లో…: ఆరు దశాబ్దాల్లో 12 భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, పడుగు, సింహళీస్‌, మరాఠీ) ఆమె పాటలు పాడారు. విజయనగరం మహారాజా కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద అభ్యసించిన శాస్త్రీయ సంగీతం దీనికి పునాదిగా పనిచేసింది.

ఒకే కుటుంబంలోని రెండు తరాలతో కలిసి సుశీల పనిచేశారు. నటి జయచిత్రకూ, ఆమె తల్లి అమ్మాజీకీ నేపథ్యగానం అందించారు. ఎస్పీ బాలుతో, ఆయన కొడుకు చరణ్‌తో; కె.జె. ఏసుదాసుతో, ఆయన కుమారుడు విజయ్‌ ఏసుదాస్‌తో కలిసి పాడారు. ఇళయరాజా, ఆయన కొడుకు కార్తీక్‌రాజా… ఇద్దరి సంగీత దర్శకత్వంలో పాడారు. సహ గాయని ఎస్‌. జానకితో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింహళీస్‌ భాషల్లో పాడారు. తెలుగులో వీరిద్దరూ కలిసి పాడిన పాటలు 90కి పైగా ఉన్నాయి.

ఏమీ తెలియని భాషలోని పాటలో కవి పొదిగిన భావం సంపూర్ణంగా వ్యక్తమయ్యేలా, ఆ భాషలోని శ్రోతలను మైమమరిపించేలా పాడటం ఎంత కష్టం! అరుదైన ఆ ఫీట్‌ను సుశీల అలవోకగా సాధించారు.

పురస్కారాలెన్నో: 2008లో సుశీలను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించారు. 2001లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య పురస్కారం పొందారు. ఐదుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికయ్యారు. 1969, 1971లలో తమిళ పాటలకు ఆ పురస్కారం వచ్చింది. 1978లో ‘ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), 1982లో ‘ప్రియే చారుశీలే’ (మేఘసందేశం), 1983లో ‘ఎంత బీదవాడే గోపాలుడు వేణుగోపాలుడు’ (ఎం.ఎల్‌.ఎ. ఏడుకొండలు) పాటలకు జాతీయ అవార్డును అందుకున్నారు.

తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రలో సుశీలది ఘనతర అధ్యాయం!

– సిహెచ్‌. వేణు
(ఈనాడు సౌజన్యం తో)

 

FacebookTwitter

చట్టంలో ఉన్న లోపాలను- లా కమిషన్ చర్చించాలి

Posted Posted in News
FacebookTwitter

భారత్ కి బార్ భాది తక్ జంగ్ రహేగీ, జంగ్ రహేగీ! భారత్ తెరే తుక్డే  హోంగే, ఇంషా అల్లాహ్ , ఇంషా అల్లాహ్!, అఫ్జల్ కి హత్య నహి సహెంగే, నహి సహెంగే!, ఇండియన్ ఆర్మీ ముర్దాబాద్ ముర్దాబాద్! లాంటి దేశ వ్యతిరేక నినాదాలు ఒక సాంస్కృతిక కార్యక్రమం పేరుతో దేశ రాజధాని లోని జవహర్ లాల్ యూనివర్సిటీ లో తలపెట్టిన, సహకిరించిన వారిపై  కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే.

ఫిబ్రవరి 9 నాడు డిల్లి లో వెలువడ్డ ఈ నినాదాలు ప్రభుత్వం ప్రయోగించిన సెక్షన్ 124A రాజద్రోహం చట్ట పరిధిలోకి వస్తాయా అనే చర్చ ఒక వైపు, లేదా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన  భావ ప్రకటన స్వేచ్చ  కు సంబంధించినదా అని విశ్లేషించాల్సిన సందర్బం.

నాలుగు దశాబ్దాల క్రితమే 1971 సంవత్సరం లో సెక్షన్ 124A పై క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత లా కమిషన్ తన నివేదికలో ఈ చట్టాన్నీ మరింత పటిష్ట పరిచి, పునః సమీక్ష చేసి, ఏకీకృతం చేయాల్సిన అవరసరాన్ని దృష్టికి తీసుకొని వచ్చింది. అదే విధంగా ఈ చట్టాన్నీపునర్ నిర్వచిస్తూ, ఉద్దేశ పూర్వకంగా  దేశ సమగ్రతకు, భద్రతకు హాని తలపెట్టాలి అనుకునే చర్యలను, జాతీయ చిహ్నాలను అవమానించే ధోరణి  కూడా దీని పరిధిలోకి తీసుకొని రావాలి అని సూచించింది.

దేశ సమగ్రతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, భద్రతా దళాలను దూషించడం లాంటి వాటిని కేవలం కొద్ది మంది, లేదా లా కమిషన్ లాంటివి మాత్రమే పసిగట్టి సెక్షన్ 124A లాంటి చట్టం యొక్క పరిధి విసృత పరచాలని కోరింది.

జె.ఎన్.యు మరియు జాధవపూర్ యూనివర్సిటీ లో జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నినాదాలు, వాటినే సమర్ధించే ర్యాలీలు భారత్ దేశం పై ప్రత్యక్షంగా దాడి చేయడమే. ఇవి మన రాజ్యాంగ మూలాలు అయిన పౌరుల భద్రత, ఐక్యత పై సవాలు విసరడమే, దాంతో పాటు రాజ్యాంగం ద్వార సంక్రమించబడిన భాద్యతలను ఉద్దేశ పూర్వకంగా భంగ పరచడము.

42 వ లా కమిషన్ తన సిఫారుసులో దేశ సరిహద్దులు, న్యాయ, పార్లమెంటరీ వ్యవస్థపై ప్రశ్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరింది. ప్రస్తుతం మన ఎదుర్కుంటున్న  జె.ఎన్.యు సంఘటన లు కూడా మన రాజ్యాంగ విలువలను, దేశ సమగ్రతను, ఐక్యత, న్యాయ వ్యవస్థ, భద్రత దళాలపై మరి ముఖ్యంగా ఎన్నికోబడ్డ ప్రభుత్వం పై దాడిగా పరిగనించాల్సిందే.

దేశ హోం మంత్రి రాజనాథ్ సింగ్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఉన్న చట్టాన్ని పునః సమీక్షిస్తూ, లా కమిషన్ సంప్రదింపులతో చట్ట పరంగా ఉన్న శూన్యతను భర్తీ చేస్తూ, నిందితులను మొగ్గ దశలోనే, దేశ వ్యతిరేక చర్యలకు చరమ గీతం పాడాల్సిందే.

FacebookTwitter