డాక్టర్‌జీ ఒక యుగ ద్రష్ట

Posted Posted in Articles
FacebookTwitter

Hedgewar

ఉగాది డాక్టర్‌జీ జయంతి  సందర్భంగా ప్రత్యేక వ్యాసం

తెలంగాణ ప్రాంతంలోని ఇందూరు జిల్లాలో గోదావరి, మంజీరా, హరిద్రా నదుల సంగమ స్థలము కందకుర్తి గ్రామము. శతాబ్ధాలకు పూర్వము ఆ గ్రామంలో వేద అద్యయనము, శాస్త్రాధ్యయనము వృత్తిగా కలిగిన ఒక కుటుంబం.  నైజాము పాలనలో పరిస్థితులు అనుకూలంగా లేక ఆ కుటుంబానికి చెందిన నరహరిశాస్త్రి కుటుంబము నాగపూర్‌ వెళ్ళిపోయింది. ఆ వంశంలోని బలీరాం పంత్‌ కుమారుడే డా॥ కేశవరావు. హిందూ సమాజ సంఘటనలకు తన జీవితాన్ని సమర్పించుకొన్న వారు డాక్టర్‌జీగా పివబడే కేశవరావు బలీరాంపంత్‌ హెడ్గేవార్‌.

డాక్టర్‌జీ ఉగాది పండుగ రోజు 1889 సం॥ ఏప్రిల్‌ 1వ తేది నాడు జన్మించారు. డాక్టర్‌జీ ఏ పని చేసిన దేశహితం అనే గీటురాయి మీదనే జీవితాంతం పనిచేశారు. డాక్టర్‌జీ నాగపూర్‌ నుండి కలకత్తా వెళ్ళి అక్కడ డాక్టర్‌కోర్సు చదువుతూ అనుశీలన సమితిలో చేరి పనిచేసారు. విప్లవ కార్యకలాపాలో పాల్గొన్నా రు. వైద్య విద్య పూర్తి అయిన తరువాత నాగపూర్‌ తిరిగి వచ్చి కాంగ్రెస్ సంస్థలో చేరి స్వాతంత్య్ర పోరాట ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. ఆ రోజుల్లో దేశం బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల చేతులలో ఉంటే, ఈరోజు ఆర్థిక సామ్రాజ్యవాదుల మధ్య నలుగుతున్నది. ఈ సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొవాలంటే జన సామాన్యము చైతన్యవంతమై శక్తివంతం కావాలనేది డాక్టర్‌జీ ఆలోచన.

భారతదేశ చరిత్రలో 1857 సం॥ తరువాత ఈస్టిండియా కంపెనీ పాలన అంతమయ్యింది. బ్రిటిష్‌ పార్లమెంట్‌ నేరుగా భారతదేశాన్ని పరిపాలించటం ప్రారంభమైంది. ఆ సమయంలో బ్రిటిష్‌ పార్లమెంట్‌ భారత్‌లో కూడా పార్లమెంటరీ పరిపాలనను అంచెలంచెలుగా ప్రారంభించింది.  దానికి అనుగుణంగానే 1885 సం॥లో కాంగ్రెసు సంస్థ ప్రారంభమైంది. 1905 సం॥ ముస్లిం లీగ్‌ ప్రారంభమైంది. 1920 సం॥ నాటి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. అదే సమయంలో హిందూ మహాసభ కూడా ప్రారంభమైంది. ఈ సంస్థలు ఒక ప్రక్క దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాటము చేస్తూనే మరోప్రక్క ఎన్నికలలో పాల్గొని పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేవారు.

ఒక ప్రక్క ఇది నడుస్తుంటే రెండవ ప్రక్క ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేచింది. ఆ సంఘర్షణ ఈరోజున కూడా కొనసాగుతున్నది. ఆ సంఘర్షణకు ఇంకా తెరపడలేదు. ముస్లిం దండయాత్రతో ఈ దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ఒక ప్రక్క ఈ దేశ రాజ్యాధికారాన్ని చేతులలోకి తీసుకొంటూ రెండవ ప్రక్క పెద్ద ఎత్తున మత మార్పిడులు చేస్తూ ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేసే ప్రయత్నం ప్రారంభించారు. అది ఈ రోజున కూడా కొనసాగుతున్నది. బ్రిటిష్‌ వారి ప్రవేశంతో ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనాయి.

1920 సంవత్సరంలో ప్రారంభóమైన కమ్యూనిజం నుంచి నక్సలిజం పుట్టుకొచ్చింది. అది ఈ రోజున మావోయిజం పేరుతో నడుస్తున్నది. బ్రిటిష్‌ వారు సృష్టించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాల నుంచి పుట్టిన మేధావి వర్గం కూడా పనిచేస్తున్నది. వీటన్నింటి మధ్య ఈ రోజున కూడా ఈ దేశం నలుగుతున్నది. డాక్టర్‌జీ ఈ పరిస్థితులపై ముందుగానే విశేష అధ్యయనం చేసారు. భవిష్యత్‌లో రాజ్యాధికారశక్తిని నియంత్రించే జాతీయ శక్తి నిర్మాణం జరగాలని సంకల్పించారు.

అందుకే కాంగ్రెస్‌ సంస్థ నుంచి బయటపడి 1925 సంవత్సరం విజయదశమి నాడు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘాన్ని ప్రారంభించారు. భారతదేశంలో వేల సం॥ నుంచి రాజ్యవ్యవస్థ సమాజ వ్యవస్థలో ఒక భాగంగా ఉండేది. అదే సర్వస్వం ఎప్పుడూ కాలేదు. ఆధునిక కాలంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వస్వం అయ్యే ప్రమాదంగా కనబడుతున్నది. దాని అనుభవం ఈ రోజున కూడా చూస్తూన్నాం. అందుకే డాక్టర్‌జీ హిందూ సమాజ సంఘటన కార్యానికి శ్రీకారం చుట్టారు. హిందూ సమాజసంఘటన కార్యానికి రెండు విశేషాలు జోడించారు. 1. సంఘకార్యం ఈశ్వరీయ కార్యము 2. సంఘకార్యం రాష్ట్రీయ కార్యము. ఈ రెండు మాటలతో సమాజ సంఘటన కార్యం గురించి డాక్టర్‌జీకి గల కల్పన మనకు అర్థమవుతోంది.

సంఘకార్యం ద్వారా సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశమంతట తయారు కావలనేది వారి లక్ష్యం. తద్వారా దేశమంతట దేశహితం గురించే ఆలోచించే వ్యవస్థ నిర్మాణమై అదే ఈ దేశానికి శ్రీరామరక్ష కావాలి. ఈరోజున దేశమంతటా వారి ఆలోచనలు సాకార రూపంలో మనకు కనబడుతున్నాయి. ఈ రోజున దేశంలో యాబైవేలకు పైగా గ్రామాలలో సంఘం ప్రవేశించి పనిచేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే లక్ష గ్రామలకు చేరుకోవాలనేదే సంఘం లక్ష్యం. హిందూ సమాజంలో విద్వేషాలు నిర్మాణం చేసే పనిని కొందరు ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నారు.దాని పర్యవసానాలు నేడు దేశంలో మనం చూస్తున్నాము. విద్వేషాల మూల కారణాలు అర్థం చేసుకొని వాటినుంచి హిందూసమాజం బయటప డాలి. మనమందరం ఒకేజాతివారం అనే భావన నిర్మా ణం కావాలి. ఇటువంటి ఆలోచనలు మనకు కలిగించిన డాక్టర్‌జీ ఒక యుగద్రష్ట.

FacebookTwitter

కాల గణన – భారతీయుల విశిష్టత

Posted Posted in Articles
FacebookTwitter

ప్రతి సం॥ చైత్రమాసం పాడ్యమిరోజున ఉగాది పండుగ జరుపుకొంటాము. ఈనెల 8వ తేది ఉగాది పండుగ. ఈ రోజు నుండి దుర్ముఖినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. భారతీయ కాలగణన చాలా శాస్త్రీయమైనది. ఈ కాలగణన గ్రహా సంచారముతో నిర్ణయిస్తారు. భారతీయ కాలగణనలో మనం మూడు పద్ధతులు అనుసరిస్తాము. 1) సూర్యమానం 2) చాంద్రమానం 3) బార్హస్పుృత్య మానము

మన కాలగణన క్రమం చూస్తే 1) మన్వంతరము 2) యుగము 3) శకము 4)ఆయనము 5) ఋతువు 6) సంవత్సరం 7) మాసము 7) తిథి, వారము, నక్షత్రం ఈ క్రమంలో చెప్తాము. వాటి వివరాల్లోకి వెలితే.. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరము. కలియుగము, ప్రథమ పాదము, ఉత్తరాయణము, వసంత ఋతువు, దుర్ముఖి నామ సంవత్సరం, చైత్రమాసము, పాడ్యమి తిథి, శుక్రవారము అశ్వనీ నక్షత్రం.

ఈ సంవత్సరాలకు సంబంధించి ఒక ఆవర్తనం ఉంటుంది. 60 సంవత్సరాలు ఒక ఆవర్తనము. అందులో ఈ దుర్ముఖినామ సంవత్సరం 30వ సంవత్సరం. యుగాలకు సంబంధించి 1) కృతయుగము 2) త్రేతాయుగము 3) ద్వాపర యుగము 4) కలియుగము. ప్రతి యుగానికి నాలుగు పాదాలుంటాయి. ఇప్పుడు కలియుగం ప్రథమ పాదం నడుస్తున్నది.

కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది?
మహా భారత సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. ఆ రోజుల్లో ద్వారకా పట్టణం సముద్రంలో మునిగిపోయింది. భగవాన్‌ శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తమైన రోజు అర్థరాత్రి నుండి కలియుగం ప్రారంభమైంది. అంటే ఇప్పటి క్రీ॥ శకం ప్రకారం చూస్తే క్రి.స్తూకు పూర్వం 3102 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేది అర్థరాత్రి 02.27ని॥ల 30 సె॥ల నుండి కలియుగం ప్రారంభమైంది. దీనికి ప్రమాణం ఖగోళమే. ఖగోళంలోని 1) శని 2) గురువు 3) కుజుడు 4) సూర్యుడు 5) శక్రుడు 6) బుధుడు 7) చంద్రుడు ఈ ఏడు గ్రహాలు మేష రాశితో కూడి ఉన్న సమయంలో కలియుగం ప్రారంభమైంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

ఈ లెక్క గనుక మనం చూసినట్లైతే ఈ సంవత్సరం (2016+3102) 5118వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ కాల గణనలో చారిత్రకంగా మనకు గర్వకారణమైన సంఘటనలు ఆధారంగా శకాలు ప్రారంభమైనాయి. పంచాంగంలో గనక మనం చూసినట్తైతే మూడు శకాలను ప్రముఖంగా చెప్తూ ఉంటారు. అందులో 1) యుధిష్టీర శకం 2) విక్రమార్క శకం 3) శాలివాహన శకం. ఈ మూడింటిలో ఉత్తర భారతంలో విక్రమార్క శకం ఎక్కువగా వాడుకలో ఉన్నది. శాలివాహన శకం దక్షిణ భారతంలో ఎక్కువ వాడకంలో ఉన్నది. ఈ శకాల ప్రాముఖ్యతను గమనిద్దాం.

యుధిష్టీర శకం
ధర్మరాజు కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన తరువాత పట్టాభిషేకం జరిగిన రోజు నుండి యుధిష్టీర శకం ప్రారంభమైంది. కురుక్షేత్ర సంగ్రామం ధర్మం కోసం జరిగినటువంటి ఒక మహా యుద్ధం. ఆ యుద్ధంలో ధర్మం జయించింది. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అంటూ ఉంటారు. మహా భారత కాలంలో మన వేదాలను, ఉపనిషత్తులను క్రమబద్దీకరణ చేసినవాడు వేదవ్యాసుడు. పంచమ వేదమైన మహా భారతం కూడా వేదవ్యాసులు రచించారు. వీటన్నింటి ప్రాశిస్థాన్ని తెలిపేది ఈ యుధిష్టీర శకం. ఈ శకం ప్రారంభమై ఇప్పటికి ఎంతకాలమైంది అని మనం చూసినట్తైతే కలియుగం ప్రారంభమై 5118వ సంవత్సరం దానికి 36 సంవత్సరాలు కలిపినట్లైతే 5154 సంవత్సరాలవుతుంది. అంటే యుధిష్టీర శకం 5154వ సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశించింది.

విక్రమార్క శకం
మన దేశంపైన శకులు దాడులు చేస్తూన్న రోజుల్లో వాళ్ల దాడులను తిప్పిక్రొట్టి అద్భుత విజయాన్ని సాధించినవారు విక్రమార్కుడు. శకులను దేశ సరిహద్దులకు తరిమి వేసినవాడు విక్రమార్కుడు. విక్రమార్కుడు తన 20వ సంవత్సరం వయస్సు నుండి శకుల మీద పోరాటం చేయడం ప్రారంభించాడు. ఆ దాడుల్లో సంపూర్ణ విజయం సాధించింది కలియుగం 3044వ సంవత్సరం. అందుకే ఆ రోజు నుండి విక్రమార్క శకం అని ప్రారంభించబడింది. దీని ప్రకారం ఈ 5118-3044=2074, అంటే విక్రమార్క శకం ప్రారంభమై ఈ సంవత్సరానికి 2073 పూర్తై 2074లోకి ప్రవేశించింది. విక్రమార్కుడు 80 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. శకులపై విజయానికి చిహ్నంగా విక్రమార్క శకం ప్రారంభమైంది.

శాలివాహన శకం
విక్రమార్కుని తరువాత అతని కుమారుడు దేవభక్త రాజ్యపాలన చేశాడు. దేవభక్త కుమారుడే శాలివాహనుడు. అంటే విక్రమార్కుని మనుమడు. శాలివాహనుడు శకులను పూర్తిగా సర్వనాశనం చేసిన ఖ్యాతి దక్కించుకున్నవాడు. శకులను మన దేశ సరిహద్దు దాటించి సంపూర్ణంగా నాశనం చేసినవాడు. శకులు దోచుకునిపోయిన సంపదనంతా తిరిగి తీసుకునివచ్చినవాడు. ఈ అద్భుత విజయం సాధించినది కలియుగంలో 3179వ సంవత్సరంలో. అప్పటి నుండి ఈ శాలివాహన శకం ప్రారంభమైంది. అంటే 5118-3179=1939వ సంవత్సరంలో మనం ఇప్పుడు ప్రవేశించాం.

ఈ విధంగా శకాలను మనం మన చరిత్రకు గర్వకారణంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో మనం చరిత్రలోకి ముందుకు వెళ్తూ మన దేశాన్ని బ్రిటీష్‌ వాళ్లు పాలిస్తున్న రోజుల్లో ఈ జాతిలో ఐక్యమత్యం నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి డా॥ కేశవరావు బలిరాం పంత్‌ హెగ్డేవార్‌ 1889 సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీన ఉగాది పండుగ రోజున జన్మించారు. డా॥ కేశవరావు 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు. ఈరోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని రంగాలోకి ప్రవేశించి పనిచేస్తున్నది. దేశ ప్రజలలో ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేస్తున్నది. గడిచిన 1000 సంవత్సరాల నిరంతర సంఘర్షణల చరిత్ర నుండి పూర్తిగా బయటపడి హిందూ సమాజం శక్తివంతంగా నిలబడటానికి సంఘం కృషి చేస్తున్నది. సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సంఘటనగా నిలబడింది. ఈ రకంగా చరిత్రలో మన జ్యాతికి గర్వకారణమైన సందర్భాలను జ్ఞాపకం చేసుకోవటం మనం సరియైన మార్గంలో ముందుకు వెళ్లటానికి దోహదపడుతుంది.

ఈ ఉగాది పండుగతో త్రేతాయుగంలో జన్మించిన భగవాన్‌ శ్రీరామ చంద్రుని చరిత్ర ముడిపడి ఉంది. శ్రీరామ నవమి ఉత్సవాలు ఉగాది పండుగ నుంచి ప్రారంభమై చైత్రశుద్ధ నవమి వరకు జరుగుతాయి. శ్రీరామ చంద్రుని చరిత్ర మనకు ఏం తెలియజేస్తుంది? శ్రీరామ చంద్రుని ధర్మదేవత ప్రతిస్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాము. అందుకే ధర్మాన్ని రక్షించటమే మన అందరి కర్తవ్యం అని రాముడి చరిత్ర మనకు బోధిస్తుంది. ఈ విధంగా ఉగాది పండుగ అనేక కోణాలలో మనకు ప్రేరణనిస్తున్నది.

అందరికి శ్రీ దుర్ముఖినామ సంవత్సర శుభాకాంక్షులు
ఆర్‌.మల్లికార్జునరావు

FacebookTwitter

సంస్కృతి పదాల చిత్ర కోశం ‘లోకార్పణం’ పుస్తకావిష్కరణ

Posted Posted in News
FacebookTwitter

అత్తలూరి గిరిహరినత గారు రచించిన సంస్కృతి పదాల చిత్ర కోశం ‘లోకార్పణం’ అనే పుస్తకాన్ని భార్కత్ పుర జాగృతి భవన్ లో ద్రావిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉప కులపతి ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లుడుతూ ప్రజలు తమ మాతృ బాష తెలుగు తో పాటు సంస్కృత బాష ను కూడా చదవి అర్ధం చేసుకోవడానికి ‘లోకార్పణం’  లాంటి పుస్తకాలు ఇప్పటికి తరానికి చాల అవసరం అన్నారు. సంసృతం నేర్చోవడం వలన దేశ బాషలతో పాటు, తెలుగు పై గట్టి పట్టు  సాదించవచ్చు అని అన్నారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ సాంస్కృత పరిషత్ సభ్యులు డాక్టర్ రమణ మూర్తి గారు,, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎన్ ఎఫ్ సి విశ్రాంత శాస్త్రవేత్త డా. సోమయాజులు గారు, తెలుగు సంస్కృతి పీఠం ఆచార్య మురళీధర్ శర్మ, జాగృతి పూర్వ సంపాదకులు వడ్డీ విజయ సారథి గారు పాల్గొన్నారు.

FacebookTwitter

ప్రమాదం అబద్ధం.. మరి నేతాజీ ఏమైనట్టు?

Posted Posted in News
FacebookTwitter

అసలు రహస్యం బయటపడనే లేదు.

ప్రపంచంలోకెల్లా పెద్ద మిస్టరీ ముడి ఇంకా విడనే లేదు.
జాతీయ వీరుడు, యావద్భారతానికి ప్రియతమ నాయకుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కొత్తగా బయటపడ్డ కొద్ది వివరాలు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.
నేతాజీ 1945 ఆగస్టు 18న ఫార్మోసా (తైవాన్)లోని తైహోకు వద్ద విమాన ప్రమాదంలో మరణించాడు. ఆయన చితాభస్మాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరిచారు. ఇది ఇనే్నళ్లుగా స్వతంత్ర భారత కాంగ్రెసు ప్రభువులు పాడుతున్న పాట.

ఇది నిజం నిజం అని వారు ఎంత నొక్కి చెబితే – అది నిజం కాదన్న అనుమానం భారత ప్రజలకు అంత ఎక్కువగా బలపడుతూ వచ్చింది. ప్రజాభిప్రాయ తీవ్రతకు తాళలేక 1956లో షానవాజ్ కమిటీని, 1970లో ఖోస్లా కమిషన్‌ను వేసి, విచారణ తతంగం ఆర్భాటంగా నడిపించి, అదే పలుకును ఆ చిలుకల చేతా చెప్పించారు. జనం నమ్మలేదు.

1999లో వచ్చిన ఎగస్పార్టీ ప్రభుత్వం రహస్యాన్ని ఛేదించేందుకు వేసిన ముఖర్జీ కమిషన్ విమాన ప్రమాదం కట్టుకథ అని తేల్చింది. కాని దాని నివేదిక చేతికందేలోపే వాజపేయి సర్కారుకు నూకలు చెల్లాయి. తరవాత వచ్చిన సోనియా దొరసానిగారి బినామీ ప్రభుత్వం ఆ నివేదికను కొనగోటితో బుట్టదాఖలు చేసింది. గుట్టు రట్టు కాకుండా జాగ్రత్తపడ్డామన్న కాంగ్రెసానందం ఎంతోకాలం నిలవకుండా మళ్లీ జమానా మారింది. గద్దెనెక్కిన నరేంద్ర మోది ప్రభుత్వ పాత దస్త్రాలను బయటపెట్టసాగటంతో కందిరీగల తుట్టె కదిలింది.

జనవరి 23న నేతాజీ జయంతి నాటి నుంచి మొదలుపెట్టి మోదీ సర్కార్ దఫాలవారీగా బహిరంగపరుస్తున్న సీక్రెట్ ఫైళ్లలో బ్రహ్మాండం బద్దలయ్యేంత గొప్ప సత్యాలయితే లేవు. అంతటి దేవరహస్యాలను వాటి నుంచి ఆశించిన వాడు అవివేకి. ఎందుకంటే నేతాజీ మిస్టరీ హఠాత్తుగా ఇప్పుడు లేచినది కాదు. అది డెబ్బయ్యేళ్ల పాతది. ఇనే్నళ్లూ రాజ్యమేలిన వారికి నిజమేమిటో తెలుసు. దాన్ని బయటికి రాకుండా ఎలా తొక్కిపెట్టాలో ఇంకా బాగా తెలుసు. తాము కట్టకట్టి అటకమీద పెట్టించిన ఫైళ్లలో ఏ కాగితాల్లో ఏమున్నదీ వారు బాగా ఎరుగుదురు. వారి కొంపముంచే విషయాలేవైనా వాటిలో ఉంటే పగవాళ్లొచ్చి వాటిని బయట పెట్టేంతవరకూ చేతులు ముడుచుకుని కూచోరు. మరీ ఇబ్బందికరమైన పత్రాలను అధికార దీపం చేతిలో ఉండగానే తగలెయ్యటం మంచిదని వారికి ఒకరు చెప్పక్కర్లేదు.

అలాగే చేశారు కూడా. 1999లో మనోజ్‌కుమార్ ముఖర్జీ కమిషన్ విచారణ మొదలు పెట్టేనాటికే కీలకమైన దస్త్రాలు గల్లంతు అయ్యాయి. 1960’ల్లో, 70’ల్లో చాలా ఫైళ్లను నాశనం చేసినట్టు ఆ కమిషన్ దృష్టికి వచ్చింది. కనీసం తగలబెట్టిన ఫైళ్ల తబిసీళ్లయినా ఒక చోట రాసి ఉంచారా అని కమిషన్ ఆరాతీస్తే ప్రధానమంత్రి కార్యాలయం చెప్పిన వివరాల్లో మచ్చుకు ఒకటి:
One file No.12(226) 56 – PM has been destroyed on 6.3.1972. Certain documents of file No.23(156) 51-PM have been destroyed. One file No.2(381) 60-66 PM is not readily traceble in our records. [12(226) 56P PM ఫైలు 6.3.1972న నాశనం చేయబడ్డది. 23(156) 51P PM
12(226) 56- – ఫైలు 6.3.1972న నాశనం చేయబడ్డది. 23(156) 51- – నెంబరు ఫైలులోని కొన్ని డాక్యుమెంట్లను ధ్వంసం చేయడమైనది. 2(381) 60-66 – అనే ఫైలు రికార్డులలో కనపడుట లేదు.

6.3.1972 తేథీన ప్రధానమంత్రిగా ఉన్నది నెహ్రూగారి అమ్మాయి. ఆ సమయాన ఖోస్లా కమిషన్ నేతాజీ మరణంపై విచారణ జరుపుతున్నది. సరిగ్గా అప్పుడే ఫైళ్ల నిర్మూలన కార్యక్రమం ముమ్మరంగా జరిగినట్టు పై వివరాలు తెలుపుతున్నాయి. కీలక రహస్యాల వెల్లవేత, ఏరివేతలు కడు జాగ్రత్తగా సాగాక, ఎవరు చూసినా ఫరవాలేదు లెమ్మని వెనకటి ప్రభువులు బతకనిచ్చిన కాగితాలే ఫైళ్లలో మిగులుతాయి, ఇప్పుడొచ్చిన మోదీ గవర్నమెంటు వాటిని బయటపెట్టినంత మాత్రాన భూమి తలకిందులయిపోదు. నిజమే.

కాని అలా బతికి బయటపడ్డ పత్రాల్లోనే దేశాన్ని నివ్వెరపరిచే నిజాలున్నాయి. ఉదాహరణకు విమాన ప్రమాదంలో బోసుబాబు మరణించినట్టుగా నెహ్రూగారు, వారి అమ్మాయిగారు, వారి వారసులు అధికారికంగా నొక్కి వక్కాణించినట్టి 1945 ఆగస్టు 18 తేదీ తరవాత కూడా ఆ మహానాయకుడు బతికే ఉన్నాడు. 1945 డిసెంబర్, 1946 జనవరి, 1946 ఫిబ్రవరిల్లో ఆయన రేడియోలో మాట్లాడాడు. భారతదేశం కోసం తన గుండె మండుతున్నదనీ, త్వరలో తాను విజయవంతంగా తిరిగి రాగలననీ అప్పుడు చెప్పాడు. ఆ ప్రసారాలను బెంగాల్ గవర్నరుకు సహాయకుడైన పి.సి.కర్ అనే అధికారి మానిటర్ చేశాడు. ఆ వివరాలు 870/11/-/16/92/-్జ/ నెంబరుగల ప్రధాని కార్యాలయం ఫైలులో ఉన్నది. తరవాత కొద్ది కాలానికే జవాహర్‌లాల్ నెహ్రూగారు దేశాధినేత అయ్యాడు. దేశంలో ప్రతి ఒక్కరూ ఆందోళన పడుతున్న నేతాజీ క్షేమం గురించిన ఈ సమాచారం ఆయనకు తెలియదని నమ్మలేము. 1945 ఆగస్టులోనే సుభాష్ బోస్ మరణించాడన్న అబద్ధాన్ని ఆయనా, ఆయన ఉత్తరాధికారులూ బుద్ధిపూర్వకంగా వ్యాప్తి చేశారనే అనుకోవాలి.

స్వతంత్ర రాజ్యాధినేతగా పనె్నండు దేశాల గుర్తింపు పొందిన సుభాష్‌చంద్రబోస్ తన మిత్ర క్షేత్రంలో విమాన ప్రమాదంలో మరణిస్తే దానికి సంబంధించిన ఏ రికార్డూ ఎక్కడా ఉండకుండా పోతుందా? ఆయన మరణించాడనటానికి పిసరంత రుజువు లేదు. ఆయన మరణించలేదని, వేరే దేశానికి రహస్యంగా తరలిపోవటానికే విమాన ప్రమాదం కథ అల్లాడని అప్పుడే వైస్రాయి మొదలుకుని బ్రిటిష్ ఉన్నతాధికారులెందరో చెప్పారు. అనంతరకాలంలో నెహ్రూ కాబినెట్‌లో చేరిన షానవాజ్ నడిపింది బూటకపు విచారణ; తన దర్యాప్తులో బయటపడ్డ కీలక సాక్ష్యాలను తొక్కిపెట్టి ఖోస్లా కమిషన్ చేసింది వాస్తవానికి వక్రీకరణ – అన్న సంగతి ఇప్పుడు ప్రజలముందుకు వచ్చిన క్లాసిఫైడ్ ఫైళ్లవల్ల మరోసారి ధ్రువపడింది.

నేతాజీ మిస్టరీకి సంబంధించిన ఫైళ్లను బహిరంగపరచాలని డిమాండు వచ్చిన ప్రతిసారీ – అలా చేస్తే శాంతిభద్రతలకు పుట్టి మునుగుతుంది. ప్రజా క్షేమం మంట కలుస్తుంది. ఇతర దేశాలతో మన స్నేహసంబంధాలకు కొంపలంటుకుంటాయి – అని ఇప్పటిదాకా రాజ్యమేలిన ప్రతి ప్రభుత్వమూ అరిగిపోయిన రికార్డును వినిపించేది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మీద కన్నుతోనే కావచ్చు – మొదట మమతాబెనర్జీ, తరవాత నరేంద్ర మోదీ చొరవచూపి తమతమ కచేరీల్లోని ఫైళ్లను బయటపెట్టాక కూడా శాంతి, భద్రత సజావుగానే ఉన్నాయి. ప్రజా క్షేమం ప్రమాదంలో పడలేదు. మిత్ర దేశాలేవీ కొట్లాటకు రాలేదు.

విమాన ప్రమాదంలో నేతాజీ మరణం అబద్ధం అని తేలాక అనివార్యంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు – అయితే ఆయన ఏమయ్యాడు? ఎలా బతికాడు? ఏమి చేశాడు? ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మరణించాడు- అని. దేశవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమాచారం అది. ఇప్పటికి బహిర్గతమైన ఫైళ్లలో ఆ ఊసులు లేవు. ఉండవు కూడా. అవి దొరకాలంటే వెతకాల్సింది ఢిల్లీలో, కోల్‌కతాలో సర్కారీ అటకల మీద కాదు. ఆ సమయాన నేతాజీ తిరుగాడిన, ఆయన అజ్ఞాతంగా వెళ్లినట్టుగా తెలిసిన, లేక అనుమానం ఉన్న దేశాల్లో! అప్పటి ఘటనలకు సంబంధించిన ఆయా ప్రభుత్వాల పాత రికార్డుల్లో! వాటికి సంబంధించి ఇప్పటికే వెలికి వచ్చిన దిగ్భ్రాంతకర కథనాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాల తీగ పట్టుకుని లాగితే మొత్తం డొంక కదులుతుంది. ఏ దుర్మార్గుల ప్రేరేపణతోనో ఏ సైబీరియా చెరలోనో, భారత మహా నేతను ఎవరు ఎలా నిర్బంధించారో, ఎలా హింసించారో, ఆకాలాన ఆయనను మన మహానుభావులు ఎవరెవరికి చూపించారో, అసలు నిజం ఎక్కడ బయటపడుతుందోనని నేతాజీ బంధుమిత్రుల మీద నిఘా పెట్టి ఏళ్ల తరబడి నీడలా ఎలా వెంటాడారో, నీచ రాజకీయ స్వార్థం కోసం ఎందరిని బలి తీసుకున్నారో, దార్శనికులు, దేశానికి మార్గదర్శకులు అనుకున్న పెద్దలే ఎంతటి కుత్సితాలకు పాల్పడ్డారో లోకానికి వెల్లడవుతుంది. అది నెరవేరాలంటే అరకొర ఫైళ్లను బయట పెడితే సరిపోదు. అత్యున్నత

స్థాయిలో సమగ్ర విచారణ సత్వరం జరిపించాలి. వీలైనంత వేగంగా నివేదిక తెప్పించాలి. మొగమాటం లేకుండా దాని మీద కదలాలి.
జాతి కోరేది, మోదీ ప్రభుత్వం నుంచి అవశ్యం ఆశించేది అది! నేతాజీ మిస్టరీని మొదలంటా కుళ్లగించే క్రమంలో లాల్ బహదూర్ శాస్ర్తి మరణం వెనుక మర్మమూ బయటపడితే మరీ మంచిది!

ఎం.వి.ఆర్ శాస్త్రి

(ఆంధ్ర భూమి సౌజన్యం తో)

FacebookTwitter