లెఫ్ట్‌.. పాలిటిక్స్‌

Posted Posted in Articles
కళలో అయినా ఏదో ఒక ఆకట్టుకునే ఆటుండాలి. పట్టి నిలబెట్టే గట్టి ఘాటుండాలి. బీభత్సమైన బీటుండాలి. గజ్జెకట్టినట్టు ఘల్లుమనిపించాలి. వెన్నులో ఝల్లుమనిపించాలి. వీరంగం వేసేవారు లేకుంటే రంగం రసహీనమైపోదూ! 
 
ఒక్క కళ కళకళలాడడానికే ఇన్నుండాలంటే, మరి నవరసాల సమ సమాహారమైన చతుర రాజకీయం రక్తి కట్టి, రంజిల్లడానికి ఎన్నుండాలి? ఎందరు కావాలి?! దుమ్ములేపాలంటే దమ్మున్న వారు కావాలి కదా!
అందుకే అనితర సాధ్యమైన ఈ గురుతర బాధ్యతను, సకల లోకాలను సర్వ సమానంగా చూసే లౌకికవాద ఛాంపియన్లు, భూభాగ సరిహద్దులకు అతీతంగా భూత దయ చూపే భౌతిక వాదులు, అకుంఠిత ప్రపంచ భక్తులు, అపజయ పరంపరను లెక్కచేయకుండా దూసుకెళ్లే అద్వితీయ పోరాట శక్తులు, జాతి జన మనోభావాలతో నిమిత్తం లేకుండా ముందుకుపోయే సిద్ధాంత అనురక్తులు అయిన కొందరు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వారందరినీ కలిపి మూకుమ్మడిగా వామపక్ష వాదులు అంటారు!! పూర్వం రాజుకు ఎడమ (లెఫ్ట్‌) వైపు ఉండేవారు కనుక వారిని లెఫ్టిస్టులు అనేవారట! ఇప్పుడు ప్రజలకు ఎడంగా ఉండేవి కనుక లెఫ్ట్‌ (జనం వదలిపెట్టిన) పార్టీలని అంటారు గిట్టనివారు.
కమ్యూనిస్టు మార్క్సిస్టు రష్యా, మావోయిస్టు చైనాలు ఈ పార్టీల మాతృ దేశాలు. ఇప్పుడు రష్యాలో కమ్యూనిజం, చైనాలో మావోయిజం, నేతి బీరకాయలో నెయ్యంత ఉన్నాయి. సిద్ధాంత రాద్ధాంతాలు దాటి ఆ రెండు దేశాలూ, మిగతా ప్రపంచంతో పాటు ఎంతో ముందుకు, ఎక్కడికో వెళ్లి పోయాయి. కానీ నాటి భావజాలంతో పుట్టిన భారత వామపక్షాలు మాత్రం పుట్టినచోటే ఆగిపోయాయి. పురిటి వాసననే కొడుతున్నాయి. వామపక్ష సామూహిక సమారోహంలో మనుషులెందరున్నారో చెప్పవచ్చు. కానీ పార్టీలెన్నో, సంఘాలెన్నో, వర్గాలెన్నో, మార్గాలెన్నో, పంతాలెన్నో, పంథాలెన్నో చెప్పలేం. ఏదేమైనా నిరంతర పోరాటశీలురైన వామన వాదులకు కలిసి ఉండడం నచ్చదు. అందుకే తమలో తామూ కలవరు.వేరేవారినీ కలసి ఉండనివ్వరు. గిరీశం చెప్పినట్టు, సమాజంలో వర్గాలంటూ ఉంటేనే కదా… వర్గ పోరాటాలు జరపగలిగేది!
వామపక్షవాదులు దేన్నైనా వ్యతిరేకించగలరు. ఎవరినైనా ధిక్కరించగలరు. స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్విట్‌ ఇండియా ఘట్టాన్ని, సాయుధ పోరాటమే పరిష్కారమని నమ్మిన నేతాజీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను… అక్కడిదాకా ఎందుకు? మూడు కోట్ల మంది ముక్తకంఠంతో కోరుకున్న ప్రత్యేక తెలంగాణను (సీపీఎం)… ఇలా వారువ్యతిరేకించనిది ఏదైనాఉందా? అలనాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా? చాలా? అని స్టాలిన్‌ అనుమతి అడిగిన సర్వ స్వతంత్రులు వీరు. జనం ఒకవైపుంటే వారు మరోవైపు! ఏదో ఒక దానిపై పోరాడక ఉండలేని మనస్థితి వాటిది! పోరాడితే పోయేదేముంది మరిన్ని ఓట్లు తప్ప అన్నది తాజా నినాదం.
ఎప్పుడూ వ్యతిరేకించడమేనా అని అనుమానపడకండి! వారు గట్టి మద్దతు కూడా ఇవ్వగలరండోయ్‌! ఎవరికి? భారతదేశం మీద దండెత్తి వచ్చిన చైనా దళాలకు, దేశం నుంచి విడిపోతామంటున్న కశ్మీర్‌ వేర్పాటు వాదులకు, పార్లమెంటుపై, ముంబై నగరంపై దాడికి దిగిన ఉగ్రవాద సమర్థకులకు, మెడపై కత్తి పెట్టినా భారతమాతకు జైకొట్టను అన్నవారికి వంత పాడగలరు. అంతెందుకు? ప్రతి భాషా ఒక జాతి అని సిద్ధాంతీకరించి… ఉర్దూ మాట్లాడేవారు ప్రత్యేక దేశం కోరుకుంటే సమర్థిస్తామని కూడా ఒక దశలో ప్రకటించారు!
ఈ దేశంలో వామపక్షాలంత వైవిధ్య వైరుధ్య భరిత సృజనాత్మక ఎన్నికల పొత్తులు, సిద్ధాంత రచనలు చేసిన పార్టీలు మరొకటి లేవు. మతతత్వ బీజేపీని ఆపడంకోసం లౌకికవాద కాంగ్రె్‌సతో కలుస్తారు. బూర్జువా కాంగ్రె్‌సను ఆపడం కోసం బీజేపీతో కలుస్తారు. ప్రజా కంటక వైఎ్‌సపై పోరాడడానికి టీడీపీతో జట్టుకడతారు. అవినీతిమయ తెలుగుదేశాన్ని అడ్డుకోవడానికి ఎంతో నీతిమంతమైన వైసీపీతో మిలాఖత అవుతారు. తాజాగా చూడండి. కేరళలో కాంగ్రె్‌సతో పోరాటం. బెంగాల్‌లో స్నేహం! వారేం చేసినా పొద్దుటికల్లా సిద్ధాం తం సిద్ధమవుతుంది. కాదూ కూడదంటే.. పదేళ్ల తర్వాతో, పాతికేళ్ల తర్వాతో చెప్పడానికి చారిత్రక తప్పిదపు క్షమాపణ ఉండనే ఉంది!
తాజా వ్యవహారాలే చూడండి. ముంబాయిలో 150 మంది పౌరులను కాల్చేస్తే తప్పు కాదు. ఆ కేసులో నిందితుడైన యాకూబ్‌ మెమన్‌ను ఉరితీయడం తప్పు. పార్లమెంటుపై దాడి తప్పు కాదు. ఆ కేసులో నేరగాడుగా సుప్రీంకోర్టు నిర్ధారించిన అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష వేయడం తప్పు. ఈ ఇద్దరికీ మద్దతుగా వర్సిటీల్లో ఊరేగింపులు తప్పు కావు. వాటిని ప్రశ్నించడం తప్పు. కన్నయ్య కుమార్‌పై లాయర్లు దాడిచేయడం తప్పు. కానీ గోరక్షా సమితి, బీజేపీ కార్యకర్తల్ని చితక్కొట్టడం తప్పు కాదు. అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సుప్రీంకోర్టు విధించిన మరణ శిక్షల్ని ప్రశ్నించడం తప్పు కాదు. కానీ మేజిసే్ట్రట్‌ కోర్టుకు సమానమైన గ్రీన్‌ట్రిబ్యునల్‌ తీర్పును గురు రవి శంకర్‌ ఉల్లంఘించడం తప్పు. ఇది స్వయం ప్రకటిత మేధావుల తీర్పు!
రాజకీయాల్లోనే కాదు; వ్యక్తిగతంగానూ ఈ వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. మతం వద్దు, గితం వద్దు అని నినదించిన మార్క్స్‌ సైద్ధాంతిక పునాదుల మీద నిలబడిన వారు బెంగాల్‌లో ఓట్ల కోసం చర్చిలు, మసీదుల్ని సందర్శిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం విధించిన శిక్షల్ని వ్యతిరేకిస్తూనే.. రాజ్యాంగహక్కుల పరిరక్షణ సదస్సుల్ని నిర్వహిస్తారు. అదేమని మనం అడగ్గూడదు! చైనాలో లక్షలాది మందిని ఖాళీ చేయించి ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు కడుతున్నారు కదా? ఇక్కడ మీరెందుకు వద్దంటున్నారు? ఇక్కడ వాదించినట్టే, చైనాకు వెళ్లి, తైవాన్‌, హాంకాంగ్‌ చైనావి కాదని వాదించగలరా? వాదించి బతికి రాగలరా?
కొన్ని ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయి.. ఉఫ్‌ మని చల్లారిపోతాయి.. ఎందుకు? ఒక్కసారి కూడా కేంద్రంలో పూర్తిస్థాయిలో అధికారంలోకి రాకున్నా వామపక్ష వర్గీయులకే ఇన్ని అవార్డులు (వాపసీ వల్ల అసలు సంగతి బయటపడింది) ఎలా వచ్చాయి? ఇంతకాలం మీ ప్రాబల్యమున్న వర్సిటీల్లో కుల వివక్ష ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది? లెఫ్ట్‌ కూటమి అత్యధిక కాలం అధికారంలో ఉన్న బెంగాల్‌ మంత్రివర్గంలో దళితుల వాటా ఎంత? బడుగులకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్‌ అడిగే మీరు మీ పార్టీ పొలిట్‌ బ్యూరోలో ఒక్క సీటైనా ఎందుకివ్వరు? వంటి చొప్పదంటు ప్రశ్నలు మనం వేయకూడదు. ఎందుకంటే ప్రశ్నించే హక్కు వారికే తప్ప మనకు లేదు! భాషను బట్టి వ్యాకరణం రావాలి. వ్యాకరణాన్ని బట్టి భాష రాదు అనేవారు పీవీ నరసింహారావు.
లెఫ్ట్‌ పార్టీలు మాత్రం ప్రజల కోసం సిద్ధాంతం కాకుండా, సిద్ధాంతం కోసం ప్రజలు అని భావిస్తుంటాయి. అందుకే ప్రజలు ఆ సిద్ధాంతానికి దూరమవుతున్నారు. జీవితమంతా భావజాలానికే ధారపోసిన భోళా శంకరుడు సీపీఐ నారాయణ, ఎయిర్‌పోర్టు దాకా వెళ్లి విద్యార్థి నేత కన్నయ్యకు స్వాగతం పలికి, చేతులు కట్టుకుని ఒదిగి నిలబడ్డ తీరు చూసి వామపక్షాల పరిస్థితిపై అనేకమంది జాలిపడ్డారు. అరువు సిద్ధాంతాలు, పడికట్టు నినాదాలు, పరదేశీ భావజాలాలు వదిలి భారతీయీకరణకు సిద్ధమైతేనే వామపక్షాలకు మనుగడ! ఎరుపు వెలిస్తే వచ్చేది కాషాయమే కదా!

చివరాఖరు: అనగనగా ఒక రాజుగారు. రోజూ తోటకెళ్లే వారు. ఆ తోటలో ఒక కాకి. ఆ కాకికి ఒకసారి చిల్లుపడ్డ చెల్లని కాసు (పైసా) ఒకటి దొరికింది. ఆ నాణేన్ని తీసుకొమ్మంటూ కాకి రోజూ రాజుగారి వెంటపడేది. చెల్లని కాసు తనకెందుకంటూ రాజు వద్దనేవాడు. చివరికి కాకి నస భరించలేక ఒకరోజు రాజుగారు నాణేన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఆ రోజు నుంచీ కాకి… ‘రాజుగారు నావద్ద డబ్బులడుక్కున్నారు. నేను రాజుగారికే డబ్బులు అప్పిస్తాను. రాజుగారిని కష్ట సుఖాల్లో ఆదుకునేది నేనే. నా వల్లే రాజుగారు ఇలా వైభవంగా ఉన్నారు’ అంటూ ప్రచారం ప్రారంభించింది. వామపక్షాలతో స్నేహం- పర్యవసనాలపై కలైజ్ఞర్‌ కరుణానిధి చెప్పిన కథ ఇది!!

కృ.తి 
kruthi1972@gmail.com
(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో )

హైదరాబాద్ పాత బస్తి లో హిందూస్తాన్ జిందాబాద్

Posted Posted in News

“నా మెడ మీద కత్తి పెట్టిన భారత్ మాతా కి జై” అనను అని చెప్పిన ఎం ఐ ఎం అధినేత, హైదరాబాద్ ఎం. పి అసదుద్దీన్ ఒవైసీ పేరుతో పాత బస్తీలో “హిందూస్తాన్ జిందాబాద్”  అనే నినాదాలతో వాల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

old city

ఇది ఎలాంటి ఎత్తుగడ?

హెచ్.సి.యు ఘటనపై కొనసాగుతున్న వివాదం

Posted Posted in News

మార్చ్ 22 నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభమయిన  గొడవలు ఇంకా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పోలీసులు పెట్టిన కేసు పై రాష్ట్ర ప్రభుత్వం తరుపున కే.సి.ఆర్ అసెంబ్లీ లో స్పందిస్తూ తాను కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సమస్యకు తొందరలో పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.

మీడియా ప్రకారం పోలీస్ లు  న్యాయ స్థానానికి కు సమర్పించిన రిపోర్ట్ లో మొత్తం 47 మంది పై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ప్రధాన నిందుతుడుగా మున్నా సన్నాకి, పిహెచ్.డి విద్యార్ధి, పరారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా పౌరసత్వం కలిగిన తులసి అభిలాష్ అనే సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా హైదరాబాద్ లో ఉంటూ మార్చ్ 22 నాడు హెచ్.సి.యు లో జరుగుతున్న సంఘటనలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రకరిస్తున్నప్పుడు అరెస్ట్ చేసారు.

ఈ కేసు లో మిగితా నిందితులుగా రాంజీ, విజయ్ కుమార్, లింగం, సంజయ్, శేషయ్య, వెంకటేష్ చౌహాన్, కేసబాన్ రాయ్ చౌదరి, దొంత ప్రశాంత్ ఉన్నట్లు సమాచారం.  ప్రస్తుతానికి 48 గంటలకు పైగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ప్రొఫెసర్ తథాగత్‌ సేన్‌గుప్తా(31), కొండ ఎసురత్నం (53)  ను యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు  వినికిడి.

వి.సి. అప్పా రావు మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్ళ తల్లి దండ్రులు ఏమైనా సమస్యలు ఉంటె వాళ్ళ వాళ్ళ డిపార్టుమెంటు ఇంచార్జ్ వాళ్ళను సంప్రదించి యాజమాన్యానికి సహకరించాలి కోరినారు.

దేశం పట్ల కన్హయ్యకు ఉన్న అవగాహనా రాహిత్యం

Posted Posted in News

హైదరాబాద్ నగరం సుందరయ్య భవన్ లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమం లో ప్రధాన వక్తగా ప్రసంగించిన జె.ఎన్.యు విద్యార్థి నేత కన్హయ్య కుమార్ సభ నిర్వాహకులను, వచ్చిన ప్రజలకు తన రాజకీయ అపరిపక్వతను ప్రదర్శించే వేదికగా ఉపయోగించుకున్నాడు.

తన ప్రసంగ మొత్తం , దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థను మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వాన్ని, రాష్టీయ స్వయంసేవక్ సంఘ్ ను విమర్శిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టించాడు. మనువదానికి వ్యతిరేకం, దేశంలోని ఆర్థిక అసమానతల పై పోరాటం చేస్తాం అని చెప్తూ పెట్టుబడిదారి విదానాలకు వ్యతిరేకంగా ఒక చిన్న సమూహాన్ని ఏర్పాటు చెయ్యాలి అని అన్నాడు.  గాడ్సే అభిమానుల నుండి  దేశాన్ని కాపాడుకోవడానికి తను గాంధీ వైపు తనతో పటు మిగితా వారు నిలబడాలి అన్నాడు. అంబేద్కర్, మార్క్స్, ఆదివాసులు, సమాజం లో అణగారిన వర్గాలు అందరు ఒక గొడుగు కిందికి వచ్చి తమ హక్కులకై పోరాటం చెయ్యాలి అన్నాడు.

తన ప్రసంగం లో ఇన్ని విషయాలు చెప్పిన  కన్హయ్య అసలు తను ఎందుకు జైలు కి పోవాల్సి వచ్చింది, తను దేశానికి వ్యతిరకంగా చేసిన నినాదాలు చేసిన వాళ్ళ తో చట్టాపట్టలు ఏసుకొని ఎందుకు ఉన్న అనే విషయాన్నీ కనీసం ప్రస్తావించలేదు, భయమా?

ఎమన్నా అంటే మనువాదానికి వ్యతిరేకంగా మా పోరాటం అంటాడు..ఈ కాలంలో అసలు మనువు ఎవరు? ప్రస్తుత ప్రభుత్వాలు దేని ఆధారంగా పరిపాలన సాగుతున్నాయి. అంబేద్కర్ అధ్వర్యంలో తయారు చేయబడిన భారత రాజ్యాంగం ప్రకారం కాదా? దేశాన్ని “దేశాల సమూహం”గా వర్ణించిన ఒక విద్యార్ధి నేతగా చెల్లు బాటు అవుతున్న కన్హయ్య కు దేశం పట్ల ఎంతటి అవగాహనా ఉందొ మనకు అర్ధం అవుతుంది.

మన రాజ్యాంగం లో “ఇండియా దట్ ఇస్ భరత్” అని వ్రాసి ఉంది, కాని కన్హయ్య దేశాల సమూహం అంటే ఏంటిదో వివరించి ఉంటె బాగుండేది. భారత మాతను, జాతీయ పతాకాన్ని, దేశ సైనుకులను, రైతులను  గౌరవిస్తాను అంటూనే ఇది దేశం కాదు ఉంటె దేశాల సమూహం అనటము అజ్ఞ్యనమో అర్ధం కాని ప్రశ్న.

రాజ్యాంగం ద్వార ఉరి తీయబడ్డ దేశ ద్రోహి యాకుబ్ మెమొన్ ను కీర్తించిన రోహిత్ వేముల ఆదర్శం ఏ విదంగా కన్హయ్య కు ఆదర్శామో?

ఈ మద్య కాలంలో దేశం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తునటువంటి వాళ్ళ జాబితాలో కన్హయ్య కూడా చేరిపోయాడు.

స్వభూమిపై వికసించిన స్వభావం…

Posted Posted in Articles

Akhand Bharat

రాజ్యాంగం ఒక జాతి స్వభావాన్ని వివరించే నిర్వచన పత్రం. ఒక జనసముదాయం, లేదా అనేక జనసముదాయాల సమాహారం జాతిగా వికసించిన తరువాత ఏర్పడే వివిధ వ్యవస్థలలో రాజ్యాంగం అతి ప్రధానమైంది. అందువల్ల రాజ్యాంగం జాతీయతను వ్యక్తం చేసే ఒక మాధ్యమం. ఒక జాతి తన ప్రస్థాన క్రమంలో రాజ్యాంగాన్ని రాసుకుంటుంది, మార్చుకుంటుంది, రద్దు చేసుకుంటుంది, కొత్త రాజ్యాంగాన్ని వ్రాసుకుంటుంది. ఈ రాజ్యాంగ ప్రక్రియకు పూర్వం కూడ జాతి ఉంది. ఈ రాజ్యాంగ ప్రక్రియకు పూర్వం కూడ జాతి ఉంది, ఈ ప్రక్రియ రద్దయి కొత్త ప్రక్రియ మొదలయినప్పుడు కూడ జాతి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగం అంతకుపూర్వం నుంచి ఉన్న జాతీయతకు ఒక ధ్రువీకరణ మాత్రమే. జాతి ఏర్పడిన తరువాతనే రాజ్యాంగం ఏర్పడుతోంది. రాజ్యాంగ రచనతో జాతి ఏర్పాటు ఆరంభం కావడం లేదు. ఒక జాతి ఏర్పడిన తరువాత రాజ్యాంగం అనేకసార్లు ఏర్పడవచ్చు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు, మరో రాజ్యాంగ వ్యవస్థకు మధ్య దశాబ్దులు గడచిపోవచ్చు, సహస్రాబ్దులు సాగిపోవచ్చు, యుగాలు, మహాయుగాలు గడచిపోవచ్చు, మన్వంతరాలు కదలి పోవచ్చు…ఒక జాతి ఏర్పరచుకొనే వ్యవహార నియమావళి రాజ్యాంగం. అందువల్ల అత్యంత వినూతన నియమావళిని జాతీయులు సహజంగానే పాటిస్తారు, పాటించాలి. రాజ్యాంగ నిబద్ధత అంటే ఇదీ. ఈ రాజ్యాంగ నిబద్ధత మరింత విస్తృతమైన వౌలికమైన జాతీయతా నిబద్ధతలో భాగం. భారతజాతికి అనాదిగా అనేక రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడినాయి. కొన్ని సహజంగా అంతరించాయి, కొన్నింటిని జాతీయులు మార్చుకున్నారు, కొన్నింటిని విదేశీయుల ధ్వంసం చేశారు. అందువల్ల 1947లో విదేశీయులు చివరిగా నిష్క్రమించిన తరువాత అనాది భారతజాతి క్రీస్తుశకం 1950 జనవరి 26 నుండి కొత్త రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరచుకుంది. అప్పటినుంచి ఈ కొత్త రాజ్యాంగ నియమాల ప్రకారం మన సనాతన జాతీయ ప్రస్థానం కొనసాగుతోంది. అందువల్ల ఈ సనాతన జాతీయ ప్రస్థానంలో 1950 జనవరి 26వ తేదీ ఒక శుభంకరమైన ఘట్టం. అంతేకాని 1950 జనవరి 26న మనం ఒక జాతిగా ఏర్పడలేదు, భారతీయులు సృష్ట్యాదిగా ఒక జాతిగా ఏర్పడి ఉండటం వాస్తవ చరిత్ర.. పాఠశాలలో చేరిన పిల్లవాడు, పాప, తమ ఇంటిపేరును నమోదు చేసుకుంటారు. తాము పుట్టినప్పటినుంచి ఆ ఇంటిపేరు తమకు ఉంది. అలా ఉండడానికి పాఠశాలలో జరిగే నమోదు ఒక ధ్రువీకరణ మాత్రమే. అంతేకాని పాఠశాలలో నమోదు చేసుకొనడం వల్ల ఆ పిల్లలకు ఆ ఇంటిపేరు, ఇంటితనం ఏర్పడడం లేదు. అంతేకాదు ఈ పిల్లలు ఆ ఇంటిలో పుట్టకపూర్వం కూడ వందల లేదా వేల ఏళ్లుగా ఆ ఇంటితనం ఉంది. అలాగే భరతమాత బిడ్డలైన భారతీయులు తమకు అనాదిగా ఉన్న ఇంటితనాన్ని-జాతీయతను-1950 జనవరి 26 నాడు రాజ్యాంగ పత్రం ద్వారా నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకొనడానికి పూర్వం అనాదిగా ఇంటితనం, ఇంటిపేరు-్భరత జాతీయత-కొనసాగుతోండడం చరిత్ర. అందువల్ల మనది సనాతన జాతి. సనాతన జాతి అని అంటే ఆద్యంతము లేని శాశ్వతమైన జాతి…అందువల్ల వర్తమానంలోని మనం లేని సుదూర గతంలోను, మనం ఉండని సుదూర భవిష్యత్తులోను మన జాతి ఉంది, మన జాతీయత ఉంది! ‘‘తేరా వైభవ్ అమర్ రహే మా హమ్ రహే, న రహే..’’- నీ వైభవము నిరంతరం నిలచిపోవాలి, మేము ఉండవచ్చు, ఉండకపోవచ్చు-అన్న హిందీ కవిత భారత జాతి సనాతన తత్వానికి లేదా శాశ్వత తత్వానికి ఆధునిక ప్రతీక. ఇంటితనం అన్న వైయక్తిక వాస్తవానికి సమష్టి విస్తృతి జాతీయత…ఈ భారత జాతీయత ‘‘రక్షతి బ్రహ్మేదం భారతం జనమ్..’’ అని సృష్ట్యాదిలో వైదిక ఋషులు ప్రార్థించిన నాటిది, అప్పటి నుంచి కొనసాగుతున్నది, అనంతంగా కొనసాగుతున్నది. ఈ ఆద్యంత రహిత ధ్యాస సహజమైన మాతృభక్తికి పితృభక్తికి ప్రాతిపదిక. జాతికి ‘‘తల్లిదండ్రులు భూమి, ఆకాశం’’ అన్నది వౌలిక ప్రాతిపదిక. అందుకే తొలి భారతీయులు, తొలి మానవుడు, ‘‘తండ్రీ ఆకాశమూ, తల్లీ భూమీ! మిమ్ములను ప్రార్థిస్తూ నేను చేస్తున్న అభ్యర్థన నిజమగు గాక…మమ్ములను మాతో పాటు సమస్త జీవజాలమును మీరు రక్షించాలన్నది ఈ అభ్యర్థన..మీ ఇరువురి అనుగ్రహము వలన మేను జీవమును పెంపొందించునట్టి అన్నమును పొందుతున్నాము!’’ అని ప్రార్థించాడు. ఈ తొలి ప్రార్థన జాతీయతకు ప్రాతిపదిక. ఈ ప్రార్థనను ఇప్పుడు కూడ చేయడం ఎప్పుడూ చేస్తూ ఉండడం సహజమైన జాతీయత…
‘‘ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్మాతర్యది హోపబ్రువేవామ్ భూతం దేవానాం అవమే అవోభిః విద్యామేషం వృజనం జీరదానుమ్’’ ఈ వైదిక ఆకాంక్ష బంకించంద్రుని వందేవమాతరం లోను, రవీంద్రుని జనగణమన గీతంలోను పునరభివ్యక్తమైంది. వందేమాతరంలో మాతృభక్తి, జనగణమన గీతంలో పితృభక్తి ప్రస్ఫుటిస్తున్నాయి. ఈ సనాతన ‘జాతిపిత’ ఆకాశం..జాతీయ మాత భూమి..్భరత మాత! ఈ జాతి ప్రజలు ఈ మాతా పితరుల వరాల బిడ్డలు. ఈ పుత్రభావం సహజమైన జాతీయత. ‘‘ద్యౌర్యఃపితా, పృథివీ మాతా..’’ ఆకాశం తండ్రి, భూమి తల్లి!
ఆకాశానికి మానవులకూ మధ్య గల ఈ పితాపుత్ర భావం, భూమికీ మానవులకూ మధ్య గల ఈ మాతా పుత్ర భావం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచానికి సకల జీవజాలానికి వర్తించే సృష్టిగత సత్యం ఇది. ఈ సత్యాన్ని భారతీయులు అనాదిగా గుర్తించడం తుది మొదలు లేని సనాతన సంస్కారం. అందువల్లనే భారతీయులది సనాతన జాతి-ఎటర్నల్ నేషన్- అయింది. ఈ సంస్కారం యుగాల తరబడి ప్రపంచమంతటా వ్యాపించి ఉండడం చరిత్ర! ఈ సంస్కారాన్ని భారత దేశానికి వెలుపలగల మానవులు మరచిపోవడం కూడ చరిత్ర. అలా మరచిపోయిన వారు రకరకాల వికృతులకు గురయ్యారు. అలా మరచిపోయిన విదేశీయులు కోట్లాది ఏళ్ల చరిత్రను కూడ మరచిపోయి ప్రపంచ చరిత్రను వేల ఏళ్లకు కుదించారు. ఇలా కుదించిన వారు ప్రచారం చేసిన చరిత్రను గత కొన్ని వందల ఏళ్లుగా మనదేశ ప్రజలు కూడ విశ్వసించి ప్రచారం చేయడం చారిత్రక వైపరీత్యం. ‘జాతి’, ‘జాతీయభావం’, ‘దేశభక్తి’, ‘ప్రజాస్వామ్యం’, ‘రాజ్యాంగ వ్యవస్థ’ వంటివి మనకు విదేశీయుల పాలన కారణంగా సంక్రమించాయన్న వక్రీకరణలు వాస్తవాలుగా చెలామణి అవుతుండడం కొనసాగుతున్న వైపరీత్యం. మానవులు భారతదేశంలో పుట్టి పెరిగి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం వాస్తవ చరిత్ర. తొలి మనువు నుంచి అభినవ మనువైన బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ వరకు గల భారతీయులెందరో ధ్రువీకరించిన చరిత్ర ఇది. మనువుకు సంబంధించిన వారు మానవులు, మానవులకు సంబంధించిన మానవీయ సంస్కారాలు కూడ భారతదేశం నుండి ఇతర ప్రపంచ ప్రాంతాలకు వ్యాపించడం చరిత్ర. అందువల్లనే భారత జాతి, మానవజాతికి ప్రతిరూపమైంది. ఈ దేశపు సనాతన సంస్కారమైన హిందుత్వం మానవ సంస్కారమైంది. ఈ దేశం నుంచి క్రమంగా బయటకు పోయిన ప్రజలు వేల ఏళ్లుగడిచిన తరువాత ఈ మానవీయ సంస్కారాలను మరచిపోయారు. అలా మరచిన వారు మనదేశానికి వచ్చి సంస్కారాలను నేర్చుకొని వెళ్లిన కాలఖండం కూడ చరిత్రలో ఉంది. కానీ భారతదేశం నుంచి బయటకి వెళ్లిన వారు భారతీయ సంస్కారాలను పూర్తిగా మరచిపోయి కొత్త జనసముదాయాలుగా ఏర్పడిన కాలఖండం కూడ ఉంది. ఈ కాలఖండం కలియుగం ఆరంభం నుంచీ కొనసాగుతోంది. కలియిగంలో ప్రస్తుతం 5,117వ సంవత్సరం నడుస్తోంది.
ఇలా భారతీయతను మరచి, ‘గ్రీకులుగా, రోమన్లుగా ఏర్పడిన వారికి, ఐరోపాలోని వారి వారసులకు కొన్ని శతాబ్దుల క్రితం వరకూ జాతి అంటే తెలియదు. భూమిని తల్లి అన్న అంశాన్ని తండ్రి అన్న వాస్తవాల పట్ల ధ్యాస లేదు. అందువల్లనే భారత దేశంలో సనాతన జాతి స్వర్ణశోభలతో వెలుగొంది సకాలంలో గ్రీకులు, రోమన్లు, నగర రాజ్యాలకు పరిమితమయ్యారు. ఆ తరవాత వారు తమకు నాగరికతను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నాగరికతలకు జాతి అంటే తెలీదు, జాతీయత తెలీదు. భూమి పట్ల మమకారం ప్రాతిపదికగా ఒక జనసముదాయం, లేదా జనసముదాయాలు జాతిగా వికసించిన భారతీయ సంతతి వారికి అర్థం కాలేదు. ఇలా అర్థం కాని ఐరోపా వారు మన దేశాన్ని దురాక్రమించడం, దురాక్రమణ దురహంకారంతో ఈ సనాతన జాతికి పాఠాలు చెప్పడం చరిత్రకు జరిగిన అన్యాయం, సృష్టికి జరిగిన అన్యాయం. భారతదేశంలోని ప్రజలు ఇతర దేశం నుంచి వచ్చిపడిన చిత్ర విచిత్రమైన తండాల వారసులన్నది ఐరోపా అజ్ఞానులు అహంకారంతో మనకు చెప్పిన అబద్ధాల పాఠం. ఈ పాఠం నమ్మిన వారికి ‘‘ఈ దేశం అనాదిగా తమదన్న’’ జాతీయ నిష్ఠ లేకుండా పోయింది. భరతమాతకు జయం కోరని దేశద్రోహులు ఐరోపావారు చెప్పిపోయిన అబద్ధపు పాఠానికి వారసులు. తాము దురాక్రమణను కొనసాగిస్తున్న కాలం నాటికి ‘‘్భరత దేశం ఒక జాతిగా ఏర్పడ లేద’’న్నది ఐరోపా ఆంగ్లేయులు నేర్పిన మరో అబద్ధపు పాఠం. ఈ పాఠం ఫలితంగా బ్రిటిష్ వ్యతిరేక సమరం జరిగిన సమయంలో, ‘‘మన దేశం పూర్వం ఒక జాతి-నేషన్-గా ఏర్పడి ఉండలేదని చరిత్రలో మొదటిసారిగా మన దేశ ప్రజలు ఒక జాతిగా ఏర్పడే ప్రక్రియ కొనసాగుతోంద’’ని ఈ సనాతన జాతీయులు విశ్వసించే దుస్థితి ఏర్పడింది. సురేంద్రనాథ బెనర్జీ వంటి మహనీయులు మేధావులు సైతం ఈ బ్రిటిష్ వారి అజ్ఞానపు అబద్ధాన్ని విశ్వసించారు.‘‘ఆవిర్భవిస్తున్న జాతి-ఏ నేషన్ ఇన్ ది మేకింగ్’’- అన్న పరిశోధక పత్రాన్ని సురేంద్రనాథ్ బెనర్జీ వ్రాయడానికి ఈ భ్రాంతి కారణం. ఇలా ‘‘మనదేశం ఒక జాతిగా ఏర్పడడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను బ్రిటిష్ వారు ఇంగ్లీషు భాష ద్వారా, రైళ్లద్వారా సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయడం కారణమన్న’’ ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది! ‘బావి’ని సైతం చూడని వారు ‘మహానది’ని వర్ణించినట్టుగా ఐరోపావారు మనకు జాతీయత గురించి జాతి గురించి బోధించారు. భావదాస్యగ్రస్తులైన వారు ఇప్పటికీ ఈ బ్రిటిష్ వారి అబద్ధాలను నిజాలుగా విశ్వసిస్తున్నారు. అందుల్లనే ‘జాతీయత’, ‘దేశభక్తి’, బ్రిటిష్ ‘పాలన’ వల్ల ఏర్పడిన ‘ప్రభావాత్మక’ లేదా ‘ప్రతిక్రియత్మక’ భావోద్వేగాలని ప్రచారమైంది. దేశంలో స్వభావాత్మక జాతీయత అనాదిగా ఉండడం వాస్తవం…
ఇంగ్లీషు పుట్టడానికి పూర్వం అనేక యుగాలుగా ఈ జాతిని సంస్కృత భాష అనుసంధానం చేసింది. కలియుగాది నుంచి మూడువేల ఏళ్లకు పైగా ఈ దేశంలో ఏకీకృత రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉండేది. జాతీయ రాజమార్గాలు, భౌగోళిక అనుసంధానాన్ని కూర్చాయి. కానీ ఈ వ్యవస్థలన్నీ జాతీయతలోని కొన్ని విభాగాలు మాత్రమే. ఈ స్వభావాత్మక జాతీయతకు ప్రాతిపదిక మాతృభూమి పట్ల బిడ్డలకు సహజంగా ఏర్పడే మమకారం. ఈ మమకారం నిండిన గుండెలవారు జాతీయులు, భారతీయులు, హిందువులు….

హెబ్బార్‌ నాగేశ్వరరావు,

సెల్ః 9951038352

ఆంద్రభూమి సౌజన్యంతో