అంబేద్కర్‌ ఒక జాతీయ నాయకుడు

Posted Posted in Articles

366688523-brambedkar_6అది మహారాష్ట్ర ప్రాంతంలో రత్నగిరి జిల్లాలోని అంబావాడి అనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. తరగతి గదిలో  విద్యార్థులంతా ఒకవైపు హాయిగా కలిసిమెసి కూర్చుంటే ఒక మూన ఎవరితో సంబంధం లేకుండా చాలా దూరంగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ తోటి బాలుర సూటిపోటి మాటను, అవమానాను భరిస్తూ కూర్చున్నాడు ఆ పిల్లవాడు. విరామ సమయంలో అందరూ మంచినీళ్ళు త్రాగుతుంటే ఆ ఛాయకు కూడా వెళ్ళలేక దూరంగా నిబడి జాలిగా మంచినీళ్ళు కావాని ప్రాధేయపడుతున్నట్లున్నాడు. ఎవరో ఒకరు దూరంగా నిబడి పైనుండే ఎత్తుగా పోస్తుంటే చేతిలోకి పట్టుకుని త్రాగుతూ చిందు వేరే మనిషిపై పడకుండా ఉండటానికి రెండో చేతిని అడ్డు పెట్టుకుంటూ దాహం తీర్చుకున్నాడు ఆ బాలుడు. ఇంతకీ ఆ బాలుడెవరు? ఎందుకలా అవమానాకు గురవుతున్నాడు? అతడే భీమారావు అంబావాడేకర్‌. 1891 ఏప్రిల్‌14న అంబావాడి అనే గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుకు అతడు పధ్నాలుగో సంతానం. తండ్రి రాంజీ సక్పాల్‌ కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. వీరిది మహర్‌ కులం. ఆ రోజుల్లో ఈ కులాన్ని అంటరానికులంగా భావిస్తుండేవారు. భీమరావుకు పాఠశాలోను అనేక సందర్భాలో జరుగుతున్న అవమానా బాధ ఆ చిన్నారి మనస్సుపై చెరగని ముద్రవేశాయి. అలా ఎందుకు జరుగుతుందో ఒక పట్టాన అర్థమయ్యేది కాదు. నెమ్మది నెమ్మదిగా తెలుస్తూ వచ్చింది. వేదకాలంలో కు వ్యవస్థ ఉండేది కాదు. అస్పృశ్యత అనేది అసలే లేదు. అలాంటిది అది ఈ సమాజంలోకి ఎలా చొరబడిందో ఊహకే అందట్లేదు. అయితే ఈ అస్పృశ్యత హిందూ ధర్మానికి ఒక మాయని మచ్చ. దీనిని ఎలాగైనా తొగించానే ఒక మంచి నిర్ణయానికి వచ్చాడా బాలుడు. బాల్యంలో మనస్సులో కలిగిన సంకల్పం, వజ్రంలా నిలిచిపోయింది. ఉన్నత పాఠశా చదువుకు వచ్చేసరికి పాఠశాలో అగ్రకులానికి చెందిన బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమరావులోని చురుకుదనాన్ని చూసి చేరదీసి ప్రేమాభిమానాను పంచుతూ అతనిలోని న్యూనతాభావాన్ని తొగిస్తూ చేయూతనిచ్చి అనేక మంచి పనుకు ప్రోత్సాహాన్నిచ్చాడు. ఆయన భీమారావుని ఇంటి పేరుతో అంబేడ్కర్‌ అని ప్రేమగా పిలిచేవాడు. ఆ పేరే శాశ్వతంగా నిలిచిపోయింది. భీమరావు అంబేద్కర్‌ అయినాడు.

కులానికి తెలివితేటకు సంబంధం లేదని చెప్పడానికి అంబేద్కర్‌ జీవితమే గొప్ప ఉదాహరణ. ఈయన సంపాదించినన్ని డిగ్రీలు బహుశ: మన దేశంలో మరొకరు సంపాదించలేదని చెప్పడం అతిశయోక్తికాదేమో. 1912లో బి.ఎ. పూర్తి చేశాడు అంబేద్కర్‌. బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్‌ ఆర్థిక సహాయంతో అమెరికా వెళ్ళి రాజనీతి శాస్త్రంలో యం.ఎ, పి.హెచ్‌.డి సంపాదించాడు. లండన్‌ వెళ్ళి 1922లో బారిష్టరు పట్టా పొందాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విజ్ఞానశాస్త్ర, మానవశాస్త్ర, నీతిశాస్త్రాలో మూడు డాక్టరేట్లు, గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు. ఇంత మేధావి అయినా అంటరానితనమనే భూతం వెంటాడుతూనే ఉంది. అందుకు తన విజ్ఞానాన్ని విస్తృత పరచుకొని సామాజిక దోషాను రూపుమాపడానికి నడుం కట్టాడు.

దేశంలో ఒకవైపు స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా సాగుతోంది. ఇంకొకవైపు అంబేద్కర్‌ నిమ్నజాతుల ఉద్ధరణకు, సమానతను సాధించడానికి ఉద్యుక్తుడైనాడు.

ఈ రోజున భారతదేశంలో అందరికంటే ఎక్కువగా ఎక్కువ గ్రామాలో అంబేద్కర్‌ విగ్రహాలు స్థాపించబడి ఉన్నాయి. అంబేద్కర్‌ అంటే అందరికీ తెలుసు. కాని ఆయన గురించి తెలిసినవారు మాత్రం బహుకొద్ది మంది మాత్రమే. అంబేద్కర్‌ దళిత జనోద్ధరణకై పనిచేయగ వ్యక్తును, సంస్థను కలుపుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. 1920 మేలో 18 ఉపకులా ప్రతినిధును కలిపి నాగపూరులో సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించాడు. 1918లో మాంటేగ్‌చేమ్స్‌పర్డ్‌ సంస్కరణ ఒప్పందంలో జనాభా నిస్పత్తి కనుగుణంగా దళితుకు శాసనసభలో స్థానాలు కేటాయించాని సూచించాడు. ప్రత్యేక నియోజకవర్గాను ఆ రోజున కోరకపోవడం అంబేద్కర్‌ విశిష్టత. అయితే తరువాతి కాలంలో అది ప్రత్యేక నియోజకవర్గాకు దారితీసింది.

అంబేద్కర్‌ నేతృత్వంలో 1927లో మహద్‌ గ్రామంలోని చదావర్‌ చెరువునీటిని ఉపయోగించుకొనే ప్రయత్నంలో దళిత ప్రజతో కలిసి ఆ నీటిని స్పృశించాడు. 1930లో నాసిక్‌లోని కాలారాం మందిరంలో ప్రవేశం కోరుతూ భజనలు చేస్తూ ద్వారా వద్ద భైఠాయించారు. నెలు గడిచినా ద్వారాలు తెరవలేదు. దర్శనం కలగదే. ఏడాదిపాటు దేవాయం మూసి ఉంచారు. మహద్‌ చెరువు నీరు ముట్టుకున్నారని అగ్రకుస్థులు పంచగవ్యాతో శుద్ధి చేశారు.  ఈ సంఘటను అంబేద్కర్‌ను కతకు గురిచేశాయి. ఈ పోరాటా వల్ల అంబేద్కర్‌ ఒక గొప్ప దళిత నాయకుడుగా ప్రపంచంలో గుర్తింపు పొందాడు.

1930 మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి డాక్టర్‌ అంబేద్కర్‌ని ఆహ్వానించినప్పుడు దళిత ప్రతినిధిగా మాట్లాడుతూ అస్పృశ్యు కూడా ప్రస్తుత ప్రభుత్వ స్థానంలో అంటే ఆంగ్ల ప్రభుత్వస్థానంలో తమను తామే పరిపాలించుకునే స్వాతంత్ర భారత ప్రజా ప్రభుత్వం కావాని స్పష్టం చేసిన దేశభక్తుడు అంబేద్కర్‌.  స్వతంత్ర భారత దేశంలో తొలి న్యాయశాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1947 ఆగస్టు 29న ఏర్పడిన భారత రాజ్యాంగ సమితికి డా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చైర్మన్‌గా నియుక్తులైనారు. దేశాభివృద్ధికనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించడంలో అభినవ మనవులుగా ప్రసిద్ధి చెందారు. మానవతా దృక్పథంతో అంటరానితనాన్ని నిర్మూలించే చట్టాన్ని రూపొందించి సామాజిక న్యాయం కల్పించాడు. నిమ్న జాతులు, వెనుకబడినవారి అభివృద్ధికి హక్కు కల్పించాడు.

అంబేద్కర్‌ తన జీవితంలో బౌద్ధమతాన్ని స్వీకరించడంలోనే వారి దేశభక్తి ప్రస్ఫుటమౌతుంది. ఆనాడు దేశంలో వ్యక్తిగతంగా తనకు, తొటి దళిత సోదరుకు జరుగుతున్న అవమానాను భరించలేక తాను హిందూమతస్థునిగా చావబోవడం లేదని ప్రకటించాడు.  దేశంలో ఈ వార్త ప్రకంపనను సృష్టించింది. ముస్ల్లింలు, క్రైస్తవులు తమ మతంలోకి రమ్మంటూ అనేక బహుమతుతో, ప్రలోభాతో స్వాగతం పలికారు. మతం మారవద్దని అనేక మంది హిందూ సంస్కరణ వాదులు నచ్చచెప్పారు. అయినా అంబేద్కర్‌ భారతదేశంపై భక్తి శ్రద్ధలు లేకుండా విదేశీ మతాలైన క్రైస్తవం, ముస్లిం మతాను స్వీకరించలేదు. అలాగే జాతీయ ప్రయోజనాను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లాభాకోసం కార్మికును ఎరగా వాడుకొనే కమ్యూనిస్టుకు తాను బద్ధ వ్యతిరేకినని ప్రకటించాడు. బౌద్ధం హిందూ ధర్మంలో అంతర్భాగం. హిందూ సంస్కృతికి అతి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ దేశం సంస్కృతిని నష్ట పరచకుండా నేను జాగ్రత్త వహించడానికే బౌద్ధమతం స్వీకరిస్తున్నాను అని చెప్పారు. ఇందులో ఉన్నా కూడా మన సమానత్వం కోసం పోరాటం సాగించవసిందే అన్నారు. ఈ రోజుల్లో ఇస్లాం, క్రైస్తవాలు రెండూ అంబేద్కర్‌ను తమ కౌగిట్లోకి తీసుకోవాని తీవ్ర ప్రయత్నం చేశాయి. కాని ఆయన ఆ పూతన వలో పడలేదు. అదే జరిగి ఉంటే ఈనాడు దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే అంబేద్కర్‌ ఒక గొప్ప దేశభక్తుడు. ఆయనను మనం గౌరవించాలి. అనుసరించాలి కూడా. డా అంబేద్కర్‌ థాట్స్‌ ఆన్‌ పాకిస్తానీఅనే గ్రంథంలో ముస్లిం మనస్తత్వాన్ని విశ్లేషించి భారతదేశంలోప ఉండివారు ఈ దేశాన్ని దేష్వించడంకంటే బయట ఉండి వ్యతిరేకించడమే మేలు అని స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పి దేశ విభజనను పరోక్షంగా సమర్థించారు.

జాతీయ పతాకం విషయంలో డాక్టర్‌ అంబేద్కర్‌ గారికి ఒక నిర్దిష్టమైన అభిప్రాయముండేది. మనది రూపొందుతున్న జాతి అని గాని అంబేద్కర్‌ అంగీకరించలేదు. పతాక నిర్ణయ సమితిలో అంబేద్కర్‌ అంగీకరించలేదు. పతాక నిర్ణయ సమితిలో అంబేద్కర్‌కూడా సభ్యులు. జాతీయ పతాకం కాషాయ వర్ణంలో ఉండాని విజ్ఞాపన పత్రం సమర్పించని హిందూ మహాసభ కార్యకర్తతో వారు మాట్లాడుతూ ప్రతిష్ట, లుకుబడి ఉన్న వ్యక్తులు దీనికోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే సమితిలో నేను కాషాయపతాకం ఉండాని ప్రతిపాదిస్తాను అని నిస్సంకోచంగా చెప్పిన జాతీయ వాది.

డా అంబేద్కర్‌ ఈ దేశ, ధర్మ, సంస్కృతుతో తాదాత్మ్యం చెందిన ధన్యజీవి. రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నప్పుడు 310 ఏ (1) అధికరణంలో భారతదేశానికి సంస్కృత భాష అధికార భాష అని పేర్కొన్నారు. శ్రీ.బి.వి.కేస్కర్‌, శ్రీ నసీరుద్దీన్‌ అహ్మద్‌ అనే ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని సమర్థించారు. డా అంబేద్కర్‌ గారి దూరదృష్టి, మేధాసంపత్తి, దేశహిత కరమైన నిర్ణయాలు, మన కెల్లవేళలా అనుసరణీయం. నిరుపేద కుటుంబంలో జన్మించి అభినవ మనువునిగా వినతికెక్కి భారతరత్న స్థాయికి ఎదిగిన డా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనకు ఆదర్శం. అంతేకాదు నిత్య స్మరణీయుడు కూడా.

The Spirit of Collective Legacy

Posted Posted in Articles

India was the motherland of our race, and Sanskrit the mother of Europe’s languages: she was the mother of our philosophy; mother, through the Arabs, of much of our mathematics; mother, through the Buddha, of the ideals embodied in Christianity; mother, through the village community, of self-government and democracy. Mother India is in many ways the mother of us all – Will Durant, American Historian

‘Freedom from fear is the freedom, I claim for you my motherland!’ was the earnest zeal of Gurudev Rabindranath Thakur. This yearning for Bharat being a ‘Motherland’ is not a modern phenomenon but flowing down from the spirit of Vedas and Ramayan.

Many foreign scholars like Will Durant also considered it as the cradle of civilisation. This is possible not just because it is one of the oldest living civilisations, but because it has provided with the life based on the principle of ‘spiritual democracy’ where everyone is allowed to find his or her own path to reach to the Supreme Divine. It is hailed as a motherland not just because it has allowed diversity of faiths to originate and flourish but also connecting the geographical and cultural diversities in an integral whole. This is the land where all aggressions ended in assimilation. But most importantly, the ethos of this nation can be considered as the Motherland because of the children who tried to serve this society and people with the spirit of being a family based on human interests rather than parochial ones. And feather in the cap in this tradition of devout children is Dr Babasaheb Bhimrao Ambedkar.

It is unfortunate that the people who thrive on a foreign, divisive and violent ideology, conveniently trying to appropriate the legacy of Dr Ambedkar, forgetting the fact that it was Babasaheb who revived the reformist zeal of our ancient civilisation in the modern era, along with Dr Hedgewar. The people, who considered him as the most ‘outstanding bourgeois revolutionary democrat’ in his lifetime, are trying to convert him into another divisive figure for political ends. On the other hand, a more sinister attempt is being made by the people who were responsible for the Partition of this motherland, to forge an alliance with some Ambedkarite groups.

While dealing with both these forces we have to remind them that though Babasheb criticised and denounced the rotten customs of Hinduism, when he had to find an alternative path, instead of going for foreign originated Semitic religions or divisive ideologies, he preferred the path of Buddha, simply because he was aware of the cultural spirit of his Motherland.

It was not a coincidence that along with justice, liberty and equality, fraternity was the most cardinal belief in Ambedkar’s constitutionalism. Unless there is this spirit of brotherhood, the desired results of Constitution can not be achieved was his firm conviction. While devising the instrument of reservation on the basis of caste also, his main goal was to avoid the feeling of alienation and separation on the basis of caste. To ascertain the social and economic democracy, he was well aware of the prerequisite, the core cultural principle of this land that is ‘Spiritual Democracy’, and therefore, the temple entry movement and the reformist path of Buddha was carried forward.

When heinous attempts are being made to combine Ambedkar with Marx or to limit his leadership to a caste group, there is a need to develop a spirit of consensual legacy. There is a need to implement the spirit of reservation more vigorously and genuinely, beyond short term political considerations, so that we can attain the social equality and fraternity expected by Babasaheb as early as possible. From Vedas to the Modern Constitutionalism propounded by Dr Babasaheb Ambedkar, is our collective legacy, it is the heritage of this Motherland. As children of this revered tradition, it is our duty not only to cherish but to nurture this legacy.

@PrafullaKetkar

Times of India Touches New Lows of Journalism Ethics

Posted Posted in News

The Times of India is breaking its own records in reaching the lowest standards of journalism while reporting the acts of visiting dignitaries of other countries.

On 12-April, in its front page published an image when Kate Middleton, wife of British Prince William, together laying a wreath at Amar Jawan Jyothi at India Gate. Ignoring this significance, editors at Times of India were eager to inform the readers about the direction of Kate’s skirt is moving to gust of wind.

The netizens have blasted the paper for its out of the context comment and image on social media.

 

కేరళలో జరిగిన అగ్ని ప్రమాద సహాయక కార్యక్రమాలలో స్వయంసేవకులు

Posted Posted in News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన సంపూర్ణ సహకారాన్ని పుట్టింగల్ ఆలయం లో జరిగిన అగ్ని ప్రమాద బాదితులకు అందిస్తుంది. స్వయంసేవకులు సహాయ కార్యక్రమాలతో పాటు ఒక హెల్ప్ డెస్క్ ను కొల్లం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. చికిత్స పొందుతున్న బాదితులకు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది కి మంచి నీళ్ళు, ఆహారం ఏర్పాటు చేస్తున్నారు.

kerala

 

kerala2

kerala 3

kerala 4

kerala 5

kerala6

kerala 7

kerala 8

kerala 9