సూర్యసేన్

Posted Posted in Inspiration

“మృత్యువు నా తలుపు తడుతోంది. నా మనస్సు శాశ్వతత్వం వైపుగా ఎగిరిపోతోంది. .ఇలాంటి ఆనందకర, పవిత్ర క్షణంలో నేను మీకు ఏమి ఇవ్వగలను? స్వతంత్ర భారతమనే స్వర్ణ స్వప్నాన్ని తప్ప..18 ఏప్రిల్,1930నాటి చిట్టగాంగ్ తిరుగుబాటును ఎప్పుడు మరచిపోవద్దు…భారత స్వాతంత్ర్యపు హోమకుండంలో తమ జీవితాలను సమర్పించిన దేశభక్తుల పేర్లను మీ గుండెల్లో పదిలంగా దాచుకోండి.’’ – ఇదీ సూర్యసేన్ చివరిసారిగా తన స్నేహితులకు వ్రాసిన లేఖ.

చిట్టగాంగ్ లోని నౌపారాలో 1894 మార్చ్ 22న సూర్యసేన్ జన్మించారు. 1916లో బెహరాంపూర్ కళాశాలలో బి ఏ చదువుతున్నప్పుడు ఒక అధ్యాపకుడి ద్వారా స్వాతంత్ర్యోద్యమ సంగ్రామం గురించి తెలుసుకున్నాడు. విప్లవకారుల లక్ష్యం, ఆదర్శాలకు ఆకర్షితులైన సూర్యసేన్ అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చేరారు.

చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి

1930 ఏప్రిల్ 18న సూర్యసేన్ నాయకత్వంలో కొందరు విప్లవకారులు చిట్టగాంగ్ పోలీసు ఆయుధాగారంపై దాడి చేశారు. ఆయుధాలను చేజిక్కించుకోవడమేకాక టెలిఫోన్, టెలిగ్రాఫ్, రైల్వే మొదలైన వ్యవస్థలను ధ్వంసం చేయడం ద్వారా చిట్టగాంగ్ కు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను పూర్తిగా తెంచివేయడం ఈ దాడి లక్ష్యం. అయితే దాడిలో ఆయుధాలను స్వాధీనపరచుకున్న విప్లవకారులు మందు సామగ్రిని మాత్రం చేజిక్కించుకోలేకపోయారు. ఆయుధాగారంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇది జరిగిన కొన్ని రోజులకే జలాలాబాద్ కొండల్లో ఉన్న విప్లవకారుల స్థావరాన్ని పెద్ద సంఖ్యలో బ్రిటిష్ బలగాలు చుట్టుముట్టాయి. అప్పుడు సాగిన పోరులో 12మంది విప్లవకారులు అమరులయ్యారు. అనేకమంది పట్టుబడ్డారు. సూర్యసేన్ తో సహా మరికొంతమంది మాత్రం తప్పించుకున్నారు.

అరెస్ట్, మరణం

జలాలాబాద్ నుంచి తప్పించుకున్న సూర్యసేన్ చాలా కాలం పోలీసులకు చిక్కకుండా వేరువేరు ప్రాంతాల్లో తిరిగారు. కార్మికుడిగా, రైతుగా, పూజారిగా, ఇంట్లో పనివాడుగా వివిధ అవతారాలలో పోలీసుల కన్నుగప్పి తిరిగారు. ఒకసారి ఆయన నేత్రసేన్ అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. సూర్యసేన్ తమ ఇంట్లో ఉన్నడంటూ నేత్రసేన్ పోలీసులకు సమాచారం అందించడంతో 1933 ఫిబ్రవరి లో పోలీసులు అరెస్ట్ చేశారు. విప్లవకారుడిని పట్టిచ్చినందుకు బ్రిటిష్ వారి నుంచి బహుమానం అందుకోవచ్చని నేత్రసేన్ అనుకున్నాడు. కానీ ఆ బహుమతి అందుకోవడానికంటే ముందే అతను చేసిన మోసానికి శిక్ష అనుభవించాడు. ఒక విప్లవకారుడు అతని తలనరికి చంపాడు. ఉరి తీయడానికి ముందు బ్రిటిష్ వాళ్ళు సూర్యసేన్ ను అమానుషంగా హింసించారు. నోట్లో పళ్ళన్ని పీకారు. గోళ్ళను ఊడబెరికారు. ఎముకలను విరిచారు. ఈ దారుణ హింసకు స్ఫృహ తప్పిన సూర్యసేన్ ను అలాగే ఉరికంబం దగ్గరకు ఈడ్చుకుని వచ్చారు. 1934 జనవరి 12న సూర్యసేన్ ను ఉరి తీశారు.

 

 

 

 

ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

Posted Posted in News

గగనతలంలో సంచరిస్తున్న ఉపగ్రహాన్ని భారత్‌ బుధవారం నేలకూల్చివేసింది. తద్వారా ఈ రకమైన సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం మన వద్ద ఉందని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది. బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించారు. అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత ఈ టెక్నాలజీ సొంతం చేసుకున్న నాలుగో దేశంగా భారత్‌ అవతరించిందన్నారు. ఆపరేషన్‌ ‘మిషన్‌ శక్తి’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో.. స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (యాంటీ శాటిలైట్‌) ఏ-శాట్‌ ను ఉపయోగించారు. ఇది కేవలం మూడు నిమిషాల్లో నేల నుంచి నింగిలోకి దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తు వరకూ దూసుకెళ్లి, కచ్చితత్వంతో నిర్దేశిత ఉపగ్రహాన్ని ఛేదించింది. ఈ పరీక్ష దేశానికి కొత్త బలాన్ని ఇచ్చిందని మోడీ తెలిపారు.

ఏ-శాట్ గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా:

– ఏ-శాట్ పరీక్ష విజయవంతం కావడంతో అంతరిక్ష సైనిక శక్తులుగా పరిగణింపబడుతున్న అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ నిలిచింది.
– ఈ ప్రయోగానికి అమెరికా సుమారు లక్ష కోట్ల రూపాయలు (భారత కరెన్సీ రూపంలో) ఖర్చు చేయగా భారత్ కేవలం 8వేల కోట్ల రూపాయల ఖర్చుతోనే ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
– అమెరికా, చైనా దేశాలు సుమారు 4-5 సార్లు ఈ ప్రయోగాన్ని చేసి ఆఖరిసారి విజయం సాధించగా భారత మాత్రం తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకుంది.
– వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం, అక్రమంగా గగనతలంలో తిరిగే శత్రు ఉపగ్రహాల ధ్వంసం వంటి అవసరాల కొరకు దీన్ని ఉపయోగిస్తారు.
– ఈ శాటిలైట్ పరీక్ష కోసం డిఆర్డీవో శాస్త్రవేత్తలు భారత దిగువ భూభాగంలో సంచరిస్తున్న ఉపయోగం లేని సొంత ఉపగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు.
– ఈ తరహా సామర్థ్యాన్ని 2012లోనే భారత్‌ సమకూర్చుకున్నప్పటికీ ఈ పరీక్ష కోసం అప్పట్లో రాజకీయ నాయకత్వం నుంచి అనుమతి రాలేదని డీఆర్‌డీవో మాజీ అధిపతి వి.కె.సారస్వత్‌ పేర్కొన్నారు.
– ఆపరేషన్‌ శక్తి పేరుతో భారత్‌ చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంవెనుక హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) కీలకపాత్ర పోషించింది.
– శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చే క్షిపణి సాంకేతికతను శాస్త్రవేత్తలు ఇక్కడ అభివృద్ధి చేశారు.
– 70 మంది శాస్త్రవేత్తలు దాదాపు రెండేళ్ల పాటూ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశారు.
– అత్యంత రహస్యంగా, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి నాయకత్వం వహించారు.
– ఏ శాట్‌ను భూ ఉపరితలంపై నుంచి కానీ, యుద్ధ విమానాల నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది.
– దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాలను పేల్చివేసే సామర్థ్యం ఏ-శాట్ కు ఉంది.

శ్యాం జీ కృష్ణ వర్మ

Posted Posted in Inspiration

భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి విదేశాలలో ఉంటూ ఎంతో సహకరించిన ప్రఖర జాతీయవాది, దేశభక్తుడు శ్రీ శ్యాం జీ కృష్ణ వర్మ.
ఆయన తన క్రియాశీలక జీవితాన్ని, భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నపుడు యూరోప్ ఖండంలో గడిపారు. ఈ సమయంలో దేశంలోని స్వతంత్ర్య వీరులకు ఒక ప్రధాన సహాయ కేంద్రంగా, వారి కార్యకలాపాలకు కావలసిన వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ కీలక పాత్రను పోషించారు.

“ఇండియన్ సోషియాలజిస్ట్” అనే మాసపత్రిక ను ప్రారంభించి విప్లవ భావాలను ప్రచారం చేశారు. ఫిబ్రవరి 1905 లో ఆయన “ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ” ని స్థాపించి, భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు.
స్వామి దయానంద సరస్వతి “సత్యార్థ ప్రకాశం ” మొదలైన అనేక పుస్తకాలవల్ల ఆయన సిద్ధాంతాలకు, రచనలకు, జాతీయవాద భావనలకు ఎంతో ప్రభావితులైన శ్యాంజీ కృష్ణవర్మ ఆయనకి అభిమానిగా మారారు. దయానంద సరస్వతి స్పూర్తితో ఇంగ్లాండ్ లో “ఇండియా హౌస్” ను ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్ లో పర్యటించే భారతీయులకు ఇది ఎంతో సహాయంగా ఉండేది. వినాయక దామోదర్ సావర్కర్, లాలా హరదయాల్, బీరెన్ చటోపాధ్యాయ, వివి అయ్యర్ మొదలైనవారు చాలామంది ఈ ఇండియా హౌస్ ద్వారా ప్రయోజనం పొందారు.
శ్యాం జీ కృష్ణ వర్మ తన ఉపన్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా, కరపత్రాల ద్వారా భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూ ఉండేవారు. తాను నిర్వహిస్తున్న రాజకీయ కార్యకలాపాల కారణంగా ఆయన ఇంగ్లాండ్ ను వీడవలసి వచ్చింది. అక్కడి నుండి ఆయన పారిస్ కు వెళ్లి, భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని సమర్థిస్తూ తిరిగి తన కార్యక్రమాలను నిర్వహించారు.
మొదటి ప్రపంచ యుద్దం కారణంగా పారిస్ లో కూడా ఎక్కువ కాలం ఉండలేక పోయారు. అక్కడి నుండి స్విట్జర్లాండ్ లోని జెనీవాకు వెళ్లి తన శేష జీవితాన్ని అక్కడే గడిపారు. జెనీవాలో మార్చ్ 30, 1930 న శ్యాం జీ కృష్ణ వర్మ పరమపదించారు.

 

అంతఃశక్తి, త్యాగానికి ప్రతిరూపం శివరాం రాజగురు (23 మార్చ్ – బలిదాన్ దివస్)

Posted Posted in Inspiration

విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట.

మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో ఉన్న సాధారణమైన వ్యక్తి. `నీ సోదరి కోసం ఒక ఉపకారం చేస్తావా?’ అని అడిగింది ఆమె, అతను చిరునవ్వుతో `తప్పకుండా అక్కా, ఏమిటో చెప్పు’ అన్నాడు. `నీ గాయాల మచ్చలు చూపిస్తావా?’ అంది.

***
1930లో ఇదే రోజున, ముగ్గురు విప్లవయోధులు భారతమాత కోసం అమరులయ్యారు. భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ మిగతా ఇద్దరు, వారిలో రాజగురుకి ప్రజాకర్షణ తక్కువ. కానీ ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట.

బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్.ను అంతం చేసి, లాలా లాజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాక, భగత్ సింగ్ దొర వేషంలో, మరొక విప్లవకారుని భార్య దుర్గావతి దొరసాని వేషంలో తప్పించుకున్నపుడు, రాజగురు సేవకుడి వేషంలో వారి సామాన్లు మోస్తూ రైలు ఎక్కాడు. ప్రతి చిన్న విషయoలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, భగత్ సింగ్ దుర్గావతి ఎంత చెప్పినా వినకుండా, ఆనాటి కాలoలో సేవకుని లాగానే టాయిలెట్ పక్కనే పడుకునేవాడు. రాజగురు మంచి నైపుణ్యం కల వస్తాదే కాక, తర్క శాస్త్రం, లహు సిద్ధాంత కౌముది చదువుకున్న సంస్కృత పండితుడు కూడా.

కాశీలో సంస్కృతంలో `ఉత్తమ’ పట్టా అందుకునే లోపు, విప్లవోద్యమం పట్ల రాజగురు ఆకర్షితుడయాడు. వీరసావర్కర్ సోదరుడు బాబారావుసావర్కర్.ని కలిసిన తరువాత అతను విప్లవమార్గం ఎంచుకున్నాడు. యువకులను శారీరకంగా మానసికంగా ధృడంగా తయారు చేసే `హనుమాన్ ప్రసారక్ మండల్’ లో చేరాడు. అతని శారీరక శక్తి, స్నేహశీలత వల్ల ఎంతోమంది స్నేహితులు ఏర్పడ్డారు. ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు కేశవ్ బలిరాం హెడ్గెవార్ తో కూడా రాజగురుకి ఇక్కడే పరిచయం అయింది.

ప్రముఖ విప్లవవీరుడు చంద్రశేఖర్ఆజాద్.ను కలిసిన తరువాత, రాజగురు హిందూస్తాన్ విప్లవ సైన్యంలో చేరాడు, అదే తరువాత హిందూస్తాన్ సామ్యవాద రిపబ్లికన్ సైన్యం (HSRA)గా మార్పు చెందింది. బ్రిటిషువారు మతపరమైన హింసను ప్రేరేపించడం వీరు పూర్తిగా వ్యతిరేకించేవారు. ప్రముఖ జాతీయవాది, భారత స్వాతంత్రోద్యమoలో అమరుడైన అష్ఫాకుల్లా ఖాన్ కూడా ఇందులో సభ్యుడే. మతవిద్వేషాలు వీరు సహించేవారు కాదు. చంద్రశేఖర్ఆజాద్ రాజగురుకి అప్పజెప్పిన మొదటి పని, ఢిల్లీలో హస్సన్ నిజామీ అనే మత విద్వేషవాదిని అంతం చేయడo, రాజగురు తుపాకి గురి తప్పకపోయినా, నిజామీ మామగారైన సోమాలీని, నిజామీ అనుకుని చంపాడు.

17 డిసెంబర్ 1928 తేదీన, లాలా లాజపత్ రాయ్ మరణానికి కారకుడైన జేమ్స్ స్కాట్ట్ ను విప్లవకారులు చంపదలుచుకున్నా, రాజగురు సహాయకుడు జైగోపాల్ పొరపాటుగా ఇంకొక పోలీసు అధికారి జాన్ సాండర్స్.ని చూపించి సైగ చేయగా, మరొకసారి గురి సరిపోయినా, లక్ష్యం నెరవేరలేదు. మరునాడు, విప్లవకారులు జరిగినదానికి విచారం వ్యక్తపరుస్తూ, వేరొకరిని చంపినా, అతను కూడా `ఆన్యాయమైన క్రూర వ్యవస్థ’ లో భాగమే అని ప్రకటన ఇచ్చారు. రాజగురు తమాషాగా తలకి గురిపెడితే చాతికి తగిలింది అన్నారు.

ఇతర విప్లవకారుల మాదిరిగా రాజగురుకి శారీరక ఆకర్షణ లేకపోవచ్చు, అతనే ఆ విషయం వేళాకోళం చేస్తుండేవాడు. ఒకసారి అతను ఓక అందమైన యువతి చిత్రం గోడకి వేళ్ళాడదీస్తే, అతను లేనప్పుడు ఆజాద్ ఆ చిత్రాన్ని చిoపేసాడు. అది చూసాక, వాళ్ళిద్దరి మధ్య వేడి చర్చ జరిగింది, ఉపయోగం లేని సౌందర్యం అవసరం లేదని ఆజాద్ అన్నాడు, అప్పుడు రాజగురు తాజ్మహల్ కూడా ధ్వంసం చేస్తావా అని అడిగితే, చేయగలిగితే చేస్తాను అని ఆజాద్ జవాబిచ్చాడు. రాజగురు మౌనంగా ఉండిపోయి తరువాత మెల్లిగా అన్నాడు `ప్రపంచాన్ని అందంగా చక్కగా తయారు చేయాలని అనుకుంటున్నాము, అందమైన వస్తువులని నాశనం చేయడం వలన అది జరగదు’ అన్నాడు. ఆజాద్ తన కోపానికి పశ్చాత్తాపపడి, తన ఉద్దేశం కూడా అది కాదని, దేశ స్వాతంత్ర్యo కోసం విప్లవకారులు తదేక దీక్షతో పనిచేయాలని చెప్పడమే అని అన్నాడు.

అసెంబ్లీ బాంబు సంఘటనలో 7 ఏప్రిల్1929 తేదీన భగత్ సింగ్ అరెస్ట్ అయాడు, తనూ వెంట వస్తానని రాజగురు పట్టుబట్టాడు, అయితే భగత్ సింగ్ ఒప్పుకోలేదు. 15ఏప్రిల్ తేదీన జరిగిన రైడ్ లో సుఖదేవ్ కూడా అరెస్ట్ అయాడు. రాజగురు కాశి వదిలేసి అమరావతి, నాగపూర్ మరియు వార్ధా ప్రాంతాల్లో తిరుగుతూ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర సురక్షితంగా ఉన్నాడు, అపుడే డా.హెడ్గెవార్ ని కూడా కలుసుకున్నాడు. అప్పుడప్పుడు భోజనానికి అతను తన సోదరుడి ఇంటికి వెళ్తుండేవాడు, అక్కడ వాళ్ళ అమ్మ ఒకసారి అతని దగ్గర తుపాకి చూసి, అది ఒక `పండితుడి దగ్గర ఉండదగిన వస్తువా’ అని అడిగింది. అపుడు రాజగురు వృద్దురాలైన తన తల్లితో నిజాయితీగా ఓపికగా ఇలా అన్నాడు.

`దేశం, ధర్మం ప్రమాదంలో పడితే, అపుడు అస్త్ర శస్త్రాలు అవసరం అవుతాయి. బ్రిటీషువారు మన మీద అనేక దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. మనము అర్ధిoచినంతమాత్రాన, వాళ్ళు ఆ పనులు మానుకోరు. ఒకసారి విష్ణు సహస్రనామo గుర్తు చేసుకుంటే, దానిలో విష్ణువు ఒక నామం `సర్వప్రహరణాయుద్ధ’ అంటే ఎప్పుడూ అస్త్రాలతో అలంకరించబడిన వాడు అని’

ముగ్గురు విప్లవయోధుల్లో భగత్ సింగ్ అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్నవాడు. అయితే ఎక్కువ మౌనంగా ఉన్నా, అందరి ఆలోచనా సరళిపై రాజగురు ప్రభావం చాలా ఉండేది. వీర్ సావర్కర్ `హిందూ పద్ పాదషాహి’ పుస్తకం నుంచి భగత్ సింగ్ కొన్ని వాక్యాలను ఉల్లేఖిoచాడని, భగత్ సింగ్ `జైలు నోట్బుక్’ అధ్యయనం చేసిన మాల్విoదర్జిత్ సింగ్ మరియు హరీష్ జైన్ తెలియచేసారు. భగత్ సింగ్ వ్రాసుకున్న కొన్ని వీర్ సావర్కర్ వ్యాఖ్యలు:

`ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కాని, సహేతుకంగా ఆలోచించిన తరువాత, విజయానికి తప్పనిసరిగా త్యాగం అవసరం అయినప్పుడే, ఆ త్యాగానికి విలువ గౌరవం. విజయానికి బాట వేయలేని త్యాగం, ఆత్మహత్యతో సమానం, దీనికి మరాఠా యుద్ధరీతిలో స్థానం లేదు’.

`ధర్మ మార్గంలో జరిపే సంఘర్షణ- క్రూరత్వాన్ని, నియంతృత్వాన్ని నిర్వీర్యం చేయగలుగుతుంది, మరింత హాని జరగకుండా నివారించగలుగుతుంది, విజయాన్ని అందించగలుగుతుంది; అది ఎటువంటి ప్రతిఘటనలేని బలిదానం కన్నా ఎంతో మిన్న’.

`మతమార్పిడి కన్నా మరణం మేలు …..(అప్పటి హిందువుల నినాదం అది)  
అయితే రామదాస్ లేచి నిలబడి ఇలా పిలుపునిచ్చాడు.
`మతమార్పిడి కన్నా మరణం మేలు అనేది బాగానే ఉన్నా, మతమార్పిడి జరగకుండా, చంపబడకుండా బ్రతకడం ఇంకా మేలు. అదీ హింసాత్మక శక్తులను ఓడించి హతమార్చాలి. అవసరం వస్తే చావడానికి వేనుకాడము, కాని ధర్మ పోరాటంలో విజయం సాధించడానికి చేసే యుద్ధంలోనే అది జరగాలి’.

రచయితలు సింగ్ మరియు జైన్ అభిప్రాయం ప్రకారం, సావర్కర్ గారి రచనలు భగత్ సింగ్ ను ఎంతగానో ప్రభావితం చేసి స్ఫూర్తినిచ్చి ఉంటాయి. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్.ల ఇచ్చాపూర్వక బలిదానం వారి భావావేశాల ఫలితం కాదు; అది దేశ ప్రజలను ఉత్తేజ పరిచి, భారత స్వాతంత్ర్య సమరంలో వారిని క్రియాశీలక కార్యాచరణ వైపు నడిపించడానికి, ఆ ఉత్తమ సందేశం ఇవ్వడానికి వారెంచుకున్న మార్గం త్యాగం. పోలీస్ దాడుల్లో సుఖదేవ్ వద్ద కూడా సావర్కర్ హిందుత్వ గ్రంథం `హిందూ పద్ పాదషాహి’ లభించింది, ఇది HRSA విప్లవకారుల పుస్తకాల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవకారుల పైన రాజగురు ప్రభావం మరువలేము.

30 సెప్టెంబర్ 1929 తేదిన పోలీస్ డిఎస్పి సయ్యద్ అహ్మద్ షా రాజగురుని అరెస్ట్ చేసాడు. మరణశిక్షకై ఎదురుచూస్తూ జైల్లో ఉండికూడా రాజగురు తన హాస్యధోరణి మానలేదు. రాజగురు జైల్లో చేసిన నిరాహారదీక్ష తరువాత, దీక్ష విరమిoపచేయడానికి పాలు తీసుకెళ్ళిన భగత్ సింగ్, రాజగురుతో `నన్ను దాటి వెళ్లిపోదామనుకున్నావా, అబ్బాయ్?’ అని అడిగాడు. రాజగురు సమాధానం అందరికి నవ్వు తెప్పించింది, `నీకన్నా ముందే వెళ్లి నీకు ఒక గది ఏర్పాటు చేద్దామనుకున్నాను, కానీ ఈ ప్రయాణంలో కూడా నీకు నా సేవలు అవసరమేమో అనిపిస్తోoది’.

******

విప్లవ వర్గాల్లో ఈ గాయపు మచ్చలు ప్రసిద్ధమైనవి. పోలీసులు విప్లవకారులను పెట్టే చిత్రహిoసల గురించి చంద్రశేఖర్ ఆజాద్ చెప్పగా విన్న రాజగురు తట్టుకోలేక, ఎవరూ చూడకుండా వంటింట్లో పట్టకారుని ఎర్రగా కాల్చి ఛాతి మీద ఏడు సార్లు వాతలు పెట్టుకుని కూడా మౌనంగా ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత గాయాలు బొబ్బలేక్కి, నిద్రలో నొప్పితో మూలుగుతుంటే చంద్రశేఖర్ ఆజాద్ చూసాడు. స్వాతంత్రోద్యమoలో పాల్గొన్న మరొక గొప్ప విప్లవకారిణి సుశీలా దీదీ, జైల్లో రాజగురుని చూడడానికి వచ్చి, ఆ గాయాల గురించి అడుగగా, వెలిగే ముఖంతో ఆ విప్లవ యోధుడు ఆ మచ్చలని ఆమెకి చూపించాడు.

– అరవిందన్ నీలకందన్

Source: Swarajya

Shivaji Maharaj’s Jayanti

Posted Posted in Inspiration
#Naman on Shivaji’s Jayanti . Phalguna Krishna Tritiya (Amavasyant).
“More than any other step by Shivaji, the developments following his passing away and the unbelievably inhuman martyrdom of Sambhaji denoted the vision and mission that Shivaji had bequeathed to posterity. Finding that the dreaded Shivaji was no more, Aurangzeb himself descended on his kingdom and over-ran it forcefully. But soon enough, the whole area seemed to be on fire. Every house became a fort and every able-bodied youth a soldier of Hindavi Swaraj. New commanders displaying unparallel heroism and ability in guerilla warfare rose up to launch fierce attacks on the enemy’s force. One, Dhanaji, pierced right up to Aurangzeb’s royal tent, but as luck would have it, the latter was away, so Dhanaji carried away the golden insignia on his royal tent! In spite of a four-year-long struggle with a vast army and able war veterans, Aurangzeb succumbed to the attack to eat the dust of Swaraj and was buried at Aurangabad in the south, now named Sambhaji Nagar. Along with him lay forever buried the glory and power of the mighty Mughals. It also heralded the saffron morning of the rising sun of Swaraj”. – Shradheya Sri H.V.Seshadri