ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి గారి పత్రిక ప్రకటన

Posted Posted in News, Submit News

భారతదేశము సదా వ్యవసాయ ప్రధాన దేశము మరియు భారతీయ గోవులు వ్యవసాయానికి ఆధారముగా వుండేవి. రసాయనక ఎరువులు మరియు రసాయనక క్రిమి సంహారక మందుల అత్యధిక ప్రయోగము వలన కలిగే దుష్ప్ర్రభావాలను ప్రపంచము ఎదురుకుంటున్నది. ఈ  సమయములో గోవు ఆధారిత సేంద్రీయ వ్యవసాయానికి ఎంతో ప్రాముఖ్యత కలదు. ఇందువలన గోసేవ మరియు గోరక్ష విషయములో హిందూ సమాజము మరియు ఇతర సామాజిక బంధువులు చూపే శ్రధ్ధ ఎంతో మహత్వపూర్ణమైనది.  మహత్మా గాంధీ గారు, వినోబా గారు మరియు మాలవీయ గారు మొదలైన ప్రముఖులు ఈ పవిత్ర కార్యాన్ని తమ జీవితములోని అత్యంత ముఖ్యమైన విషయముగా భావించారు.

గోరక్ష అనే ముసుగులో  సమాజములోని కొందరు అరాచక శక్తులు చట్టాన్ని తమ చేతులలోకి  తీసికొని హింసా పూరితమైన చర్యల వలన సమాజములోని సుహృద్భావనను విచ్చిన్నం చేసే ప్రయత్నము చేస్తున్నారు. ఇందువలన గోరక్ష మరియు గోసేవా అనే పవిత్ర కార్యముల పట్ల అనుమానాలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. గోరక్ష పేరుమీద కొందరు అవకాశవాదులు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలను నిజంగా గోరక్ష వంటి పవిత్ర కార్యములో పాల్గొంటున్న దేశవాసులతో జోడించరాదు. అటువంటి విచ్చిన్నకర  శక్తుల నిజ రూపాన్ని బయటపెట్టాలనీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశవాసులకు పిలుపునిస్తున్నది.  ఈ విషయములో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి  అసాంఘిక శక్తులను గుర్తించి చట్టరీత్యా తగిన  చర్య తీసికోవలసినదనీ మరియు నిజమైన గోరక్షకులను గానీ గోసేవ చేసేవారికి ఇబ్బందులు కలగించారాదని  ఇందుమూలముగా కోరడమైనది.

జారీ చేసిన వారు

డా. మన్మహన్ వైద్య

(అఖిల భారత ప్రచార ప్రముఖ్)

ఢిల్లీ

8 ఆగష్టు, 2016

రాష్ట్ర సేవికా సమితి పత్రికా ప్రకటన

Posted Posted in News

రాష్ట్ర సేవికా సమితి, వర్ధా కేంద్రము

కుమారి ప్రియాంక చతుర్వేది మరియు కుమారి శోభా ఓఝా (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రవక్తలు) ల ద్వారా ఈ రోజు అనగా 30.7.16 రోజున ‘రాష్ట్ర సేవికా సమితి ద్వారా మైనరు బాలికల అపహరణ ’ అన్న శీర్షికన వెలువడిన ప్రకటన అసత్యము మరియు బాధ్యతా రహితమైనది. ‘ఔట్ లుక్’ వార పత్రిక యొక్క ముఖచిత్ర కధనము కూడా అసత్యము, నిరాధారము మరియు ప్రక్కదారి పట్టించేదిగా వున్నది.

రాష్ట్ర సేవికా సమితి ద్వారా నడుపబడే విద్యార్ధి వసతి గృహాలన్నీ చట్టబద్ధము మరియు చట్టప్రకారము నడుపబడుతున్నవి.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రవక్తలు ఔట్ లుక్ వారపత్రిక సంపాదకులు మరియు ‘ఆపరేషన్ బేటీ బచావో’ శీర్షికన వెలువడిన వ్యాస రచయిత్రి నేహా దీక్షిత్ గారి చర్యలను రాష్ట్ర సేవికా సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఒక వార పత్రిక యొక్క ముఖచిత్ర శీర్షికన వెలువడిన వ్యాసము వారి రాజకీయ భావాలను వెల్లడిస్తుంది.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రవక్తలు మరియు ఔట్ లుక్ వారపత్రికలోని వ్యాసము ద్వారా వ్యక్తీకరించిన భావాలు అసత్యము మరియు నిరాధారము. గత 80 సంవత్సరాలుగా సమితి చేసిన నిస్వార్ధ సేవ, వ్యక్తిత్వ నిర్మాణము, నిరంతరం దేశభక్తిని ప్రేరణ చేసే రాష్ట్ర సేవికా సమితి మీద ఉద్దేశపూర్వకముగా చేసిన దుష్ప్రచారముగా భావించబడును.

పైన తెలిపిన వ్యక్తులు రాష్ట్ర సేవికా సమితి పై చేసిన ఆరోపణలు మానహానిగా భావించబడినందువలన వారు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పవలసినదిగా ఇందుమూలముగా కోరడమైనది. లేని యెడల చట్టపరమైన చర్యలను ఎదుర్కొనడానికి సిధ్ధముగా వుండవలెను.

అన్నదానం సీత

ప్రముఖ్ కర్యవాహిక – రాష్ట్ర సేవికా సమితి

All India General Secretary, Rashtra Sevika Samiti

30.7.2016

నిఘా నీడలో జకీర్ నాయక్

Posted Posted in Articles

ముంబయకి చెందిన ఇస్లామిక్ బోధకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆయన వివాదాస్పద ప్రసంగాలు ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశాలయ్యాయి. యధావిధిగా ఆయన్ను బలపరిచే వాళ్లు ప్రస్తుతించేవాళ్లు బయలుదేరారు. మక్కా వెళ్లిన ఆయన ఈ తంతు చూసి ముంబయ రావడం మాని ఆఫ్రికా దేశాలకు వెళ్లాడు. మక్కానుంచి స్కైప్‌లో మీడియాతో మాట్లాడతానన్నాడు. అదీ రద్దయింది. ఆయనలో భయం ఎక్కువైంది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఆయన కదలికలపై దృష్టి పెట్టింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పేర ఆయన ప్రచారంలోకి వచ్చా డు. ఇటీవల ఢాకాలో పేలుళ్లు జరిపిన తీవ్రవాదుల విచారణలో ‘ఆయన ప్రసంగాలవల్లనే మేము ఉగ్రవాదులమయ్యామన్నారు’ నిందితులు. ఆ ప్రసంగాల కర్త, చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న అపర మేథావియే జకీర్ నాయక్. 51 ఏళ్ల ఈ బోధకుడు భారత్‌ను విడిచి చాలా కాలమైంది. గత ఏప్రిల్‌లో ఈయన మలేసియాలో ఉన్నాడు. ఈయన ‘ఉమ్రా’ కోసం మక్కా వెళ్లాడు. తరువాత జెడ్డా వెళ్లాడు. ఇది ముస్లింలు పవిత్రంగా నిర్వహించే తీర్ధయాత్ర. కాని జకీర్‌నాయక్‌కు ఇది తీవ్రవవాదుల సంకల్ప సిద్ధియాత్ర. బంగ్లాదేశ్‌లో పీస్‌టీవీ చానల్‌ను నిర్వహిస్తున్న ఈ ప్రబుద్ధుడు తన ప్రసంగాల్లో మాత్రం పచ్చి మతతత్వం, మతోన్మాదం ప్రజలకు నూరిపోస్తాడు. ఆయన నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు వస్తున్న నిధుల విషయంపై ప్రస్తుతం భారత హోంమంత్రిత్వశాఖ ఆరా తీస్తోంది.

భారత్‌కు చెందిన ఎన్‌ఐఎ అరెస్టు చేసిన అగంతకులలో ఐఎస్ అనుమానితుడు ఇబ్రహీం యజ్‌దానీ కూడా జకీర్ నాయక్ ప్రసంగాలు వినేవాడు. మోదీ తన ఆఫ్రికా పర్యటనలో కెన్యాలో మాట్లాడుతూ అన్యాపదేశంగా విద్వేషం చిమ్ముతూ ప్రసంగించే కొందరు బోధకులు సమాజాన్ని చీలుస్తున్నారన్నారు. ఆయన నడుపుతున్న పీస్‌టీవీ దుబాయ్‌నుంచి ప్రసారమవుతుంది. బం గ్లాదేశ్ ఈమధ్యనే తమ దేశంలో పీస్ టీవిని నిషేధించింది. భారత్‌లో పీస్ టీవీ చానల్ ఎప్పుడో నిషేధించబడింది. కాని కొందరు చానల్ ఆపరేటర్లు దొంగచాటుగా ప్రసారాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం వారిని తాజాగా హెచ్చరించింది. సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈమేరకు కఠినంగా ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జకీర్‌నాయక్ రాతలు, ప్రసంగాలు, నిధులు అన్నీ నిఘా నీడలో వున్నా యి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ కన్ను వేసి వుంచింది. ఇంగ్లాండ్, కెనడా దేశాలు ఇప్పటికే జకీర్‌నాయక్ ప్రసంగాలను, ఆయన తీవ్రవాదాన్ని ఉసిగొల్పడాన్ని నిం దించాయి. ఆయనపై భారత శిక్షాస్మృతి ఐపిసి 153ఎ, 295ఎల కింద మత సామరస్యానికి భంగం కలిగించిన నేరం మోపే వెసులుబాటు వుంది. ఆయన ప్రసంగాలలో ముస్లింలను తీవ్రవాదులు కమ్మని ఆయన రెచ్చగొడుతున్నాడు.

న్యాయ విశే్లషకుడు అమిత్ దేశాయ్ ఆయన ప్రసంగ పూర్తిపాఠంపై విచారణ జరగాలన్నారు! జకీర్‌నాయక్ విషయమై భారత్‌లో ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా చర్చించింది. సామాజిక మాధ్యమాలలో ఈ చర్చలపై అనేకమంది అనేక రకాలుగా స్పందించారు. తమ మతం నమ్మని వారందరూ కాఫిర్లని వారిపై జిహాద్ నిర్వహిస్తామని హింసను ప్రేరేపించే ఉన్మాదులను ఏరిపారేయాలని కొందరన్నారు. ఈ తరహా ప్రేరేపణలు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నాయ. వారేదో బాగా అధ్యయనం చేసినట్టు ఇతర మత గ్రంథాలకు వారు కువ్యాఖ్యలు, కొత్త అర్ధాలు చెబుతున్నారు. ఇతర మతానుయాయుల్లో అయోమయం సృష్టిస్తున్నారు. యుట్యూబ్‌లో జకీర్‌నాయక్ ప్రసంగాలను ఎవరైనా వీక్షించవచ్చు. ఆయన బాహాటంగా ఒసామా బిన్‌లాడెన్‌ను, తీవ్రవాదాన్ని సమర్ధిస్తున్నాడు. ప్రతి ముస్లిం తీవ్రవాది కావాలి అని కోరుకుంటున్నాడు. దేవాలయాల విధ్వంసాన్ని, బౌద్ధారామాలను పడగొట్టడాన్ని సమర్ధిస్తున్నా డు.యూదులను చంపాలంటున్నాడు. హిందు దేవీ దేవతల్ని అవమానించడం, దూషించడం ఆయన నైజం. మహిళలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడు. బాల లైంగిక నేరాలను ఆయన సమర్ధిస్తున్నాడు. ‘గే’ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వారిని చంపాలంటున్నాడు. ఈయన్ని సమర్ధిస్తున్న కొందరు కుహనా మేధావులు కూడా మీడియాలో వింత వాదనలు చేస్తున్నారు. ఇది మతం పేర దెయ్యాలను ప్రోత్సహించడమే అవుతుందని వారు తెలుసుకోవాలి.

ఈ విషయమై నిష్పాక్షిక చర్చ చేపట్టిన టైమ్స్‌నౌ చానెల్‌కు చెందిన అర్నబ్ గోస్వామి జకీర్‌నాయక్‌కు సవాలు విసిరారు. ఎందుకు భారత్ రాకుండా పారిపోయావని ప్రశ్నించారు. భారత్‌ను తీవ్రవాద కార్యకలాపాలకు ఎందుకు వాడుకుంటున్నావని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకుంటే భారత్‌కు ఎందుకు తిరిగి రాలేదన్నారు. కొన్ని సందర్భాలలో ఆత్మాహుతితో కూడిన తీవ్రవాదం మంచిదే అని ఎందుకు వ్యాఖ్యానించారని అడిగారు. పైగా జకీర్‌నాయక్ తనను ముంబయలో బహిరంగ చర్చకు రమ్మన్నాడని, గంటసేపు చర్చిద్దామన్నాడని, జకీర్‌నాయక్ డొల్లతనాన్ని దేశప్రజలకు తెలియజేయడానికి తనకు ఒక్క నిముషం కూడా పట్టదని, భారత్ మాత్రమే చర్చకు అనువైన ప్రదేశమని, ఆత్మాహుతి దాడుల పేర వ్యాపారం చేస్తున్న జకీర్ పిరికిపంద అని ధైర్యంగా వ్యాఖ్యానించారు. అర్నబ్ గోస్వామి జరిపిన ఈ చర్చపై అనేకమంది జకీర్ అనుచరులు అర్నబ్‌ను నానా మాటలతో దూషించారు. కొందరు జాతీయ వా దులు జకీర్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించా రు. జులై మొదటి వారంలో నిర్వహించబడ్డ ఈ చర్చకు వేలాదిగా ట్వీట్‌లు వచ్చాయి.

కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆయనతో వేదిక పంచుకున్నారు. వేదాలనుంచి ఆయ న కొన్ని విషయాలను ఉటంకించడం చూసి ఆయన మహా మేధావి అని మెచ్చుకున్నారు. 2006లో శ్రీశ్రీ రవిశంకర్‌తో కలి సి ఆయన ఓసారి వేదిక పంచుకున్నాడు. వేదాల్లో కూడా అల్లా పేరు వుందని, అల్లోపనిషత్ పేర ఒక ఉపనిషత్తు కూడా వుందని ఆయన మెట్టవేదాంతం వల్లె వేసారు. తప్పు ల తడక సందర్భ చర్చ చేసారు. ఆయన గురించి రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ ఆయన తర్కం కంటె వితర్కం చేస్తాడని, పైకి బాగా మాట్లాడుతునే అతిథిగా పిలిచి అవమానిస్తాడని తన ఆధిపత్యం ప్రదర్శిస్తాడని, చెప్పు మనల్ని కరిచిందని మనం వెళ్లి చెప్పును కరుస్తామా? అని ప్రశ్నించారు. మొఘలుల పాలనలో అక్బరు కాలంలో అక్బరును మహమ్మద్ ప్రవక్తగా కీర్తిస్తూ కొందరు వందిమాగధులు రాసిన ‘అల్లోపనిషత్’ గురించి ముస్లింలకు కూడా తెలిసి వుండదు. ‘సత్యార్ధ ప్రకాశం’ రాసిన స్వామి దయానంద సరస్వతి ఆ పుస్తకం ఉపనిషత్తుల కోవలోకే రాదని ఉద్ఘాటించారు. ఇస్లాంకు, హిందు ధర్మానికి గల కొన్ని సామ్యాలను ఉటంకిస్తూ హిందు ముస్లింల సఖ్యతకోసం రవిశంకర్ గురుజీ రాసిన పుస్తకాన్ని జకీర్ అడ్డదిడ్డంగా విమర్శించా డు.‘నేను చెప్పిందే మతం, నాదారే అసలైన దారి’ అని వాదించడం జకీర్ అభిమతం.

‘నప్రతిమే అస్తి’ అని వాఙ్మయంలో వుందని, అందుకే తాను విగ్రహారాధనకు వ్యతిరేకమని జకీర్ వాదన. ప్రతిమలో లేదన్నాడు కానీ, ‘్భగవంతుడు’ ప్రతిమ అనేదే వుంటే అందులోనూ ఆయన వున్నాడు కదా! అంటారు శ్రీశ్రీ రవిశంకర్. అంతటా తానున్నానని గీతాచార్యుడు చెప్పాడు కదా! కేవలం ఇతరులను తప్పుబడితే మనిషి గొప్పతనం తెలియవస్తుందా? అంత తప్పు చేయని వాడే అయితే భారత్‌కు ఎందుకు తిరిగి రాలేదు. పీస్ టీవీ ద్వారా ఆయన వంద మిలియన్ల మందిని మతాంతీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆంగ్లం, ఉరుదు, అరబిక్ భాషలలో అనర్గళంగా ప్రసంగించగలిగిన జకీర్ సూటులో కనిపిస్తాడు.

ప్రసంగాలకు ముందు ఆయన ఒక డాక్టరు. మతాలమధ్య సామ్యాల గురించి మాట్లాడుతూ ఆయన అన్య మతస్తులను బురిడీ కొట్టించడంలో దిట్ట. ఆయన ఇస్లాం ఎంతో అసహనంతో కూడింది అని వొప్పుకుంటాడు, కానీ ఆ అసహనం అవినీతి, వివక్ష, అన్యాయం, కల్తీ, మద్యపానం వంటి దురాచారాలపైనే అంటాడు. సంగీతాన్ని ఆయన ద్వేషిస్తాడు. ఇస్లాంలో నిషేధం కనుక ఆయన సంగీత వాద్యాలను ద్వేషిస్తానంటాడు. శిక్షార్హులకు చేతులు నరికివేసే శిక్ష వేయమంటాడు. మహిళలను కొట్టే అధికారం భర్తలకుందని, యుద్ధ ఖైదీలైన వనితలతో ముస్లింలు లైంగిక వాంఛ తీర్చుకోవచ్చంటూ పరోక్షంగా ఆయన ఐసిస్‌ను సమర్ధిస్తాడు. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఖురాన్‌లో చెప్పిందే నిజమైన సిద్ధాంతమని, విజ్ఞానమని వాదిస్తాడు. ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని, ఏభై ఏళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడాన్ని ఆయన ఒప్పుకుంటాడు. సాల్మన్ రష్డీ, తస్లిమా నస్రీన్ వంటి ఆధునిక భావాలున్న ముస్లిం రచయితలను ఆయన విమర్శిస్తాడు.

ఇస్లాం వ్యతిరేకులే ఐసిస్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఐసిస్‌పై అమెరికా దాడులు కూడా ఖండించదగినవని రెండు గొంతులతో మాట్లాడే మాటల మాయాజాలం జకీర్ సొత్తు. జకీర్‌ను సమర్ధిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఏ తరహా సమాజాన్ని కోరుకుంటున్నారో తేల్చుకోవాలి. భారత్‌ను హురియత్ ప్రకారం పాలించాలన్న పిలుపునిచ్చిన జకీర్‌కు ప్రజాస్వామ్యంలో ఎంత నమ్మకముందో ప్రజాప్రతినిధులు గ్రహించాలి. ఆయనది పిల్లమేధావితనంగా కుష్వంత్‌సింగ్ కొట్టి పారేస్తారు. ఖలీద్ అహ్మద్, షహిర్ ఖ్వాజీ వంటివారు కూడా ఆయన్ను విమర్శిస్తారు. ఆయనపై ‘దారుల్ ఉలూమ్’ ఫత్వా జారీ చేసింది కూడా. జకీర్‌నాయక్ గురించి ఎంతైనా రాయవచ్చు. ఈ డొల్ల మేధావిని నమ్మేదెవరు? ఖర్మ కాల్చుకునేదెవరు?

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్

ఆంధ్ర భూమి సౌజన్యం తో

సరస్వతీ నది పునరుద్ధరణ

Posted Posted in News
  • ఈ నెల 30న నీటి విడుదల
  • నది పుట్టిన చోట డ్యాం నిర్మాణం
  • హరియాణా ప్రభుత్వం నిర్ణయం
సరస్వతీ నది! రుగ్వేదంలో పేర్కొన్న పుణ్య నది! వేద కాలంలో ప్రజలు ఈ నదీతీరంలోనే జీవించారని కూడా చెబుతూ ఉంటారు! రుగ్వేదం నుంచి మహా భారతం వరకూ పురాణ ఇతిహాసాల్లో ఈ నది ప్రస్తావన ఉంటుంది. సరస్వతీ నది ఎడారిగా మారిపోయిందని మహా భారతంలోనే పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నదిని పునరుద్ధరించాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.10.5 కోట్లను మంజూరు చేసింది. ఈ నెల చివర్లోనే ఈ నదీ మార్గంలో నీళ్లు వదలడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సన్నాహాలు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
saraswathi river
హరియాణాలోని దాదుపూర్‌ ఫీడర్‌ ద్వారా ఈనెల 30వ తేదీన ఉంచా చందన గ్రామం నుంచి నదీ మార్గంలోకి నీటిని వదలాలన్న ప్రతిపాదనకు సరస్వతీ హెరిటేజ్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు (ఎస్‌హెచ్‌డీబీ) ఇప్పటికే ఆమోదించింది. సరస్వతీ నది రాజస్థాన్‌ వరకూ ప్రయాణించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయని, దీనిని ఇస్రో కూడా గుర్తించిందని ఎస్‌హెచ్‌డీబీ ఉపాధ్యక్షుడు ప్రశాంత భరద్వాజ్‌ చెప్పారు. యమునానగర్‌, కురుక్షేత్ర, కైథాల్‌ జిల్లాల ద్వారా ఈ నీరు ప్రవహించనుంది. ప్రస్తుతం దాదుపూర్‌ ఫీడర్‌ను శుభ్రం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఒకసారి కనక నది ప్రవహించడం మొదలైతే, ఆ తర్వాత వర్షాలతో నీటి ప్రవాహం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక, సరస్వతీ నదిని పునరుద్ధరించాలనే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, నది పుట్టిందని భావిస్తున్న ఆది బద్రి వద్ద డ్యాం నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నది పునరుద్ధరణలో 69 సంస్థలు భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ఐఐటీతో కన్సార్షియం ఏర్పాటుకు కూడా చర్చలు సాగుతున్నాయి.
ఇక, యమునా నగర్‌లో ఆరు, ఆది బద్రి, ముగాల్వలీల్లో రెండు చొప్పున బోర్‌ వెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. హిందువుల ఆత్మను సజీవంగా ఉంచాలనే ప్రయత్నాల్లో భాగంగానే అంతర్దానం అయిపోయిన సరస్వతీ నదిని పునరుద్ధరించాలని భావిస్తున్నామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వ్యాఖ్యానించారు. నిజానికి, సరస్వతీ నదిని గుర్తించి పునరుద్ధరించాలని 2002లో వాజపేయి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కానీ, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు దీనిని రద్దు చేసింది. మళ్లీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుమయూన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేఎస్‌ వాల్దియా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, సరస్వతీ నదిని గుర్తించాలని నిర్దేశించింది.
(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో )

రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటాడా?

Posted Posted in News

rahul-gandhi

మహారాష్ట్రలోని సోనాలే లో 2015 మార్చి 6వ తేది నాడు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌పై అర్థంలేని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మహాత్మాగాంధీని చంపింది.. ఇప్పుడేమో బీజెపి వారు గాంధీజి గురించి మాట్లాడతారు. గాంధీజిని, సర్దార్‌పటేల్‌ను వారు వ్యతిరేకించారు అని అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో థానేలో భీవండి మెజిస్ట్రేట్‌ కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రాజేశ్‌ కుంతే రాహుల్‌పై నేరపూరిత పరువునష్టం దావా వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు నిన్ననే రాహుల్‌కు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరికలో మీరు ఆర్‌ఎస్‌ఎస్‌కు క్షమాపణ అయినా చెప్పండి లేదా కోర్టులో విచారణ ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉండండి. ఈ కేసుకు సంబంధించి ఇంతకు మించి మరో మార్గం లేదు అని వ్యాఖ్యానించింది. దీని విషయంలో మరికొన్ని రోజుల్లో విచారణ చేపట్టేందుకు కూడా కోర్టు నిర్ణయించింది.
కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన వాళ్లు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంపైన ఇటువంటి ఆరోపణలు చేయటం దశాబ్దాలుగా సాగుతోంది. 1948 సంవత్సరం జనవరి 30వ తేది నాడు మహాత్మాగాంధీజిని నాథురాంగాఢ్సే హత్య చేశాడు. దానిపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణలో నాథురాంగాఢ్సేకు ఉరిశిక్ష కూడా విధించబడింది. సుప్రీంకోర్టు తీర్పులో ఈ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి ఎటువంటి సంబంధం లేదు అని కూడా తీర్పునిచ్చారు. ఈ తీర్పు కారణంగానే ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంపైన విధించిన నిషేధాన్ని ఎటువంటి షరతులు లేకుండా తొలగించిన విషయం అందరికి తెలిసిందే. అయినా కాంగ్రెస్‌ సంఘంపైన గాంధీజి హత్య నేరాన్ని ప్రచారం చేయటం 1948 నుంచి కొనసాగిస్తూనే ఉంది. ఇంతకు పూర్వం అర్జున్‌సింగ్‌ కూడా ఇటువంటి ఆరోపణలు తీవ్రంగా చేసినప్పుడు కోర్టు నుండి విచారణను ఎదుర్కొవలసి వచ్చిన విషయం కాంగ్రెస్‌కు జ్ఞాపకం ఉండి ఉంటుంది. అయినా ఇట్లా మాట్లాడడం అనేది బహుశా కాంగ్రెస్‌ ఒక ఎత్తుగడగా భావిస్తున్నట్లు ఉన్నది.
వాస్తవంగా గాంధీజి హత్యను కాంగ్రెస్‌ తన అవసరాలకు ఏ రకంగా ఉపయోగించుకుందో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఒక ప్రక్క దేశంలో శక్తివంతంగా ఎదుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకు తీవ్ర ఆటంకం అవుతుందేమో అనే ఆలోచనతో ఆ సంస్థను ఆదిలోనే బలహీనం చేయాలి, లేక తొక్కిపెట్టాలి అని కాంగ్రెస్‌ భావించి గాంధీజి హత్యకు ఎటువంటి సంబంధం లేకుండానే సంఘంపై నిషేధం విధించింది. మరో ప్రక్క 1947 ఆగస్టు 14న జరిగిన దేశ విభజన సమయంలో విడిపోయిన భూభాగాల్లో హిందువులపైన విపరీతమైన దాడులు జరిగాయి. ఆ దాడుల్లో లక్షల మంది చనిపోయారు. దేశ విభజన సమయంలో జరిగిన సంఘర్షణ చరిత్ర తెరమరుగు చేసేందుకు కాంగ్రెస్‌ గాంధీజి హత్యను ఉపయోగించుకుంది. గాంధీజి హత్య కారణంగా హిందూవులు తీవ్రవాదులుగా వ్యవహరిస్తున్నారు అది ఈ దేశానికి ప్రమాదం. అంతే కాకుండా ఈ దేశంలో మైనార్టీలకు ప్రమాదం అని ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తూ వచ్చారు. దానికారణంగా దేశ విభజన అనే విషయంపైన ఎంత తీవ్రంగా చర్చ జరగాలో అది జరగలేదు. అంతే కాకుండా దేశ విభజనపైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు చేయవల్సిన ప్రయత్నాలు కూడా అంతగా జరగలేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఇది ఒక కఠోరమైన సత్యం. అందుకే దేశ విభజనపైన వచ్చిన పుస్తకాలు కొద్దిగా కనబడతాయి. కాంగ్రెస్‌ ఆరోజు నుంచి ఈరోజు వరకు హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ సంఘంపైన నిందలు, ఆరోపణలు చేస్తూనే వస్తున్నది. సుప్రీంకోర్టులో గాంధీజి హత్యకు సంబంధించిన తీర్పు స్పష్టంగా ఉన్నది. సంఘానికి గాంధీజి హత్యకు సంబంధం లేదు అని ఆ తీర్పులో ఉంది. ఇది తెలిసి కూడా మాట్లాడుతున్నారు, కోర్టులో విచారణను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధపడుతున్నారు అంటే ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.