ప్రజా నాయకుడు బిర్సా ముండా

Posted Posted in Inspiration

బిర్సా ముండా 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారు. ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావిస్తారు.

సుగుణా ముండా, కర్మీ హాతుల కుమారుడైన బిర్సా, 1875 నవంబర్ 18వ తేదీన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలీహతు గ్రామంలో జన్మించారు. సాల్గా గ్రామంలో ప్రాధమిక విద్య తర్వాత ఆయన ఛైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆయన ఆ సమయంలో ఎప్పుడూ బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన సమాజం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆలోచించేవారు. ముండా జనజాతివారిని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేసేందుకు ఒక ఉద్యమానికి నేతృత్వం వహించారు. కాలేజీలో, స్కూల్ లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ వనవాసీల నీరు, అడవి, భూమి హక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు.

ఆ రోజుల్లో ఒక క్రైస్తవ ప్రచారకుడు ఫాదర్ నోట్రేట్ అనే ఆయన ముండా సర్దారులు కనుక క్రైస్తవ మతంలోకి మారి, ఆ మతం అనుసరిస్తూ ఉంటే, వారు కోల్పోయిన భూములను తిరిగి ఇప్పిస్తానని ప్రలోభం చూపడం ప్రారంభించాడు. అయితే, 1886-87సంవత్సరాల్లో ముండా సర్దారులు తమ పోయిన భూముల కోసం ఉద్యమం చేస్తే, ఆ నిరసనను అణిచివేయడమే కాదు, క్రైస్తవ మిషనరీల ద్వారా వారివై తీవ్ర దూషణ, దాడి చేయించారు. ఇది బిర్సా ముండాని ఎంతగానో గాయపరిచింది. ఆయన తిరుగుబాటు చూసి, ఆయనను విద్యాలయం నుంచి బహిష్కరించారు. తత్ఫలితంగా 1890లో బిర్సా, ఆయన తండ్రి చైబాసా నుంచి తిరిగి వచ్చారు. 1886 నుంచి 1890 వరకు చైబాసా మిషన్ లో ఉన్న కాలం ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక కీలక దశ.  ఈ కాలంలోనే ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఆత్మాభిమానం అనే దీపం ప్రజ్వరిల్లింది. సంతాల్ ఉద్యమం, చువార్ ఉద్యమం,కోల్ విప్లవం ప్రభావం కూడా ఆయన మీద ఎంతగానో ఉంది. తన జాతి ఏ దుర్దశలో ఉందో, తమ సామాజిక, సాంస్కృతిక,మతపరమైన అస్తిత్వానికి ఎటువంటి ముప్పు ఉందో చూసి, ఆయన మనసులో విప్లవ భావాలు పెల్లుబికాయి. ముండా జాతివారి పాలన వెనక్కి తీసుకురావాలని, తన తోటివారిని జాగృతం చేయాలని ఆయన నిశ్చయించారు. 1894లో అనావృష్టి కారణంగా ఛోటా నాగపూర్ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడి, అంటువ్యాధులు వ్యాపించాయి. ఆ సమయంలో బిర్సా పూర్తి అంకితభావంతో తన వారికి సేవలందించారు.

ముండా సమాజాన్ని ఏకం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బ్రిటిష్ పాలకులకు పెద్ద సవాల్ గా పరిణమించాయి. బిర్సాయిత్ మతాన్ని స్థాపించి ఆయన ప్రజలకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చారు. సాత్వికత, ఆధ్యాత్మికత,పరస్పర సహకారం, ఐక్యత, సౌభ్రాతృత్వం ఆ మతానికి ప్రాతిపదికలు.  ‘తెల్లవాళ్లు వెనక్కి పోవాలి’ అన్న నినాదం ఇచ్చి ఆయన  మన సాంప్రదాయ ప్రజాస్వామ్య స్థాపన జరగాలని పిలుపునిచ్చారు. ‘మహారాణీ పాలన పోతుంది – మన రాజ్యం వస్తుంది’అని ఆయన అంటుండేవారు.

1894  అక్టోబర్ 1 నాడు ఒక యువనేతగా ముండా ప్రజలను ఐక్యం చేసి ఆయన భూమి శిస్తు మాఫీ కోసం బ్రిటిష్ వారిపైన ఒక ఉద్యమం ప్రారంభించారు. 1895లో ఆయనను అరెస్ట్ చేసి, రెండేళ్లు హజారీబాగ్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. కానీ బిర్సా, ఆయన శిష్యులు కరువుపీడిత ప్రజలకు సహాయపడాలన్న సంకల్పాన్ని కొనసాగించి తమ జీవితకాలంలోనే మహాపురుషులుగా ఒక ఘనత సంపాదించుకున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆయనను ధర్తీ బాబా అని పిలుస్తూ ఆయనను గౌరవించేవారు. ఆయన ప్రభావం పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలోని ముండా ప్రజలందరిలో సమైక్యత తో నిలవాలన్న ఒక చైతన్యం బలపడింది.

1897 నుంచి 1900 వరకు ముండా ప్రజలకు బ్రిటిష్ సిపాయిలు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. బిర్సా, ఆయన సహచరులు తెల్లవారికి పెద్ద తలనెప్పిగా పరిణమించారు. 1897 ఆగస్టు లో బిర్సా, ఆయన వెంట 400 మంది సైనికులు విల్లంబులు ధరించి ఖూన్టీ పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. 1898లో తాంగా నది ఒడ్డున ముండా దళాల బ్రిటిష్ సేనతో ఘర్షణ పడగా ముందు పరాయి సేనలు ఓడిపోయినా ఆ తర్వాత ప్రతీకారంగా ఆ ప్రాంతంలోని అనేకమంది వనవాసి నాయకులను నిర్బంధించడం జరిగింది.

బిర్సా ముండాని మహాత్ములైన దేశభక్తుల సరసన గౌరవిస్తారు. ఆయన వనవాసీలను ఏకం చేసి, శ్వేతా జాతీయుల పాలనను ఎదురొకొనేలా సంసిద్ధులను చేశారు. అంతే కాకుండా ఆయన భారతీయ ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు మతమార్పిడి చేసే క్రైస్తవ మిషనరీలను ఎదిరించారు. క్రైస్తవులుగా మారిన వనవాసీలకు ఆయన మన నాగరికత, మన సంస్కృతి గురించి తెలియచెప్పే, బ్రిటిష్ ప్రభుత్వ కుట్రలు, పన్నాగాల గురించి వారిని అప్రమత్తం చేశారు.

1900 జనవరిలో డొమబాడీ పర్వతంపైన మరొక పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది మహిళలు, పిల్లలు మరణించారు. ఆ ప్రదేశంలో బిర్సా ఒక బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 1900 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన  సెంతారా లో పశ్చిమ అటవీప్రాంతంలో ఒక శిబిరం నుంచి బిర్సాని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా రాంచీ కారాగారంలో బంధించారు. ఆయనతో పాటు మరో 482 మంది నిరసనకారులను కూడా అరెస్ట్ చేశారు. వారి మీద 15 అభియోగాలు మోపారు. మిగిలిన బందీల్లో 98 మందికి వ్యతిరేకంగానే చేసిన ఆరోపణలు మాత్రమే రుజువయ్యాయి. బిర్సాకి అత్యంత సన్నిహితుడైన గయా ముండా, అతని కుమారుడు సాన్రే ముండాకి ఉరి శిక్ష విధించారు. గయా ముండా భార్య మాంకీ కి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

విచారణ ప్రారంభం అయ్యే ముందు ఆయన జైల్లో ఆహారం తీసుకునేందుకు అనాసక్తి చూపించారు. కోర్టులో అనారోగ్యం పాలుకావడంతో ఆయనను మళ్ళీ జైలుకి పంపివేశారు. జూన్ 1వ తేదీన జైలు ఆసుపత్రిలో డాక్టరు బిర్సాకి కలరా వచ్చిందనీ,ఆయన ఇంకా బ్రతికి ఉండే అవకాశం లేదని చెప్పేసాడు.

1900 జూన్ 9వ తేదీన బిర్సా తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఇచ్చారు.

ఆ విధంగా  ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది. బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి.

చిరు వ్యాపారం చేస్తూ.. కొడుకుని బంగారు పతక విజేతను చేసిన తల్లి

Posted Posted in Inspiration

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే నానుడి మనందరికీ తెలిసిందే. ఇటీవల జాకార్తాలో జరిగిన ఆసియన్ పారా-గేమ్స్-2018 పురుషుల 100 మీటర్ల పరుగుపందెం టి-35 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ విషయంలోనూ ఇది నిజమైంది. తన విజయం వెనుక తనను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి పడిన శ్రమ దాగివుందని నారాయణ్ ఠాకూర్ ఉద్వేగంగా తెలియజేశాడు.

ఆసియన్ పారా-గేమ్స్-2018 పురుషుల 100 మీటర్ల పరుగుపందెం టి-35 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పిన నారాయణ్ ఠాకూర్ ప్రధాని చేతుల మీదుగా సన్మానం పొందాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం మా అమ్మ. చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ నాకు అన్ని విషయాల్లోనూ ఎంతో ప్రోత్సహించింది” అని తెలిపాడు.
ఈ సందర్భంగా నారాయణ్ ఠాకూర్ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. తనను పెంచి ప్రయోజకుడిని చేసేందుకు తన తల్లి సమయాపూర్ బడ్లీ మెట్రో స్టేషన్ వద్ద పాన్ మసాలా దుకాణం నిర్వహిస్తున్నట్టు తెలియజేశాడు.

ఠాకుర్ తల్లి రీమాదేవి మాట్లాడుతూ, “కుటుంబ పోషణ కోసం గత 17 సంవత్సరాలుగా నేను ఈ పాన్ మసాలా దుకాణం నడుపుతున్నాను. ఒక మహిళ,
అందులోనూ వితంతువు ఇలా బయటకి వచ్చి దుకాణం నిర్వహించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ నీకు వేరే దారి లేదు.  మొదట్లో ఎంతో ఇబ్బందిపడ్డాను. కానీ నా పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం న్యాయమార్గంలో ఎలాంటి కష్టాన్నైనా భరిస్తాను” అని తెలిపారు.

తన కొడుకు దేశ ప్రధాని నుండి సత్కారం పొందడంపై ఆమె స్పందిస్తూ.. “నారాయణ్ ఠాకూర్ వంటి కొడుకు తనకు కలిగినందుకు ఈరోజు నేను ఎంతో గర్విస్తున్నాను. అతడి విజయం నాకు మాత్రమే కాదు, ఈ దేశానికి కూడా ఎంతో గర్వకారణం. నేను చెప్పదలచుకున్నదల్లా ఒకటే. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. దేవుడు మన కోసం ఉంటాడు. మనం చేయాల్సిందల్లా.. మనం సాధించాలన్న దాని కోసం కష్టపడి ప్రయత్నించడమే” అని  అన్నారు.

27 ఏళ్ల నారాయణ్ ఠాకూర్ బీహార్లోని దర్భంగా పట్టణంలో జన్మించాడు. చిన్నతనంలోనే బ్రతుకుతెరువు కోసం అతడి కుటుంబం ఢిల్లీకి పయనమైంది.

హోటల్ వెయిటర్, బస్ క్లీనరుగా జీవితం ప్రారంభం:
నారాయణ ఠాకూర్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. పుట్టుకతోనే అతడు ఎడమ భాగంలో సగం పక్షపాతం (hemiparesis) సోకింది. బ్రతుకుతెరువు కోసం ఎన్నో ఆశలతో దేశ రాజధాని చేరుకున్నారు. కానీ అప్పుడే ఊహించని విధంగా విధి వారి ఆశలను తలక్రిందులు చేసింది. అతనికి 8ఏళ్ల వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ కారణంగా తండ్రి మరణించారు. దీంతో వారి ప్రపంచమే పూర్తిగా మారిపోయింది. అతడి తల్లి నిస్సహాయురాలైంది. ముగ్గురు పిల్లల పెంపకం, పోషణ ఆమెకు ఎంతో కష్టంగా మారింది. కానీ ఆమె ఆ కష్టాలన్నీ భరించింది.

అదే సమయంలో పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచిందేది. పిల్లలకు మంచి చదువు, వసతి, ఆహరం అందుతాయనే ఉద్దేశంతో వారిని సమీపంలోని ‘రాణి దత్త ఆర్య విద్యాలయం’లో చేర్పించాలనుకుంది.

ఎనిమిది సంవత్సరాల పాటు ఆ అనాథాశ్రమంలో గడిపిన నారాయణ ఠాకూర్ 2010లో ఆశ్రమాన్ని వీడి బయటకు వచ్చాడు. తిరిగి తన కుటుంబంతో కలిసి సమాయాపూర్ బడ్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతంలోని తాత్కాలిక నివాసాలు కూల్చివేతకు గురయ్యాయి. అందులో వీరి నివాసం కూడా ఉంది. దీంతో వారు సమీపంలోని మరో ప్రాంతానికి వెళ్లారు.

అదే సమయంలో ఆర్ధిక సమస్యలను అధిగమించడం కోసం నారాయణ్ ఠాకూర్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థలో బస్సుల క్లీనర్ గా చేరాడు. ఈ పని వల్ల తన క్రీడలపై దృష్టి పెట్టడం ఇబ్బందిగా మారడంతో రోజుకి 250 రూపాయల సంపాదనతో హోటల్ వెయిటరుగా రెండు సంవత్సరాల పాటు పనిచేశాడు.

రోజూ రన్నింగ్ ప్రాక్టీస్ కోసం తాను ఉంటున్న ప్రాంతం నుండి రోజూ జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి వెళ్లాల్సి వచ్చేది. అందుకోసం 40-50 రూపాయల ఖర్చుతో మూడు బస్సులు మారాల్సి వచ్చేది. ఈ ఆర్ధిక ఇబ్బంది అధిగమించేందుకు తన ప్రాక్టీస్ వేదికను  సమీపంలోని త్యాగరాజ స్టేడియానికి మార్చుకున్నాడు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అయ్యే క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు అంటారు నారాయణ్ ఠాకూర్.

2015 పారా-ఒలింపిక్స్ క్రీడల్లో నారాయణ్ ఠాకూర్ రజత పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. అప్పటినుండి  అతడి విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగుతున్నాయి.

“దేశానికి పతకం తీసుకురావడం ఎంతో గొప్ప అనుభూతి. ఆసియన్ పారా-గేమ్స్ లో బంగారు పతకం సాధించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. 2020లో టోక్యోలో జరిగే పారాలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించడం నా లక్ష్యం అంటాడు నారాయణ్ ఠాకూర్.

Source: Organiser

Film Festival

Posted Posted in Film Festival

Samachara Bharati Cultural Association is organising the 2nd Edition of “KAKATIYA FILM FESTIVAL”, a short film festival on 22nd December 2018 at Hyderabad. The purpose is to promote Social responsibility , Social values and Family ethos which are the core of Bharat’s Culture. The Film festival offers the new generation filmmakers to present their views through Short-Films.

The festival aims to bring to fore creative talent of the youth and provide them with an opportunity to showcase their thoughts, empathy and breadth of vision on the themes like The themes for this competition are:

  • Bharatiya Culture and Values
  • National and Social Awareness
  • Women Empowerment
  • Constructive Work
  • Environment

 

Registration for the short film competition is free. As a gesture of encouragement, we are awarding prize money for the following categories ..

Short Film :

Best Short Film : Rs 51,000/- ;

2nd Best Short Film – Rs 21,000/-

3rd Best short film – Rs.11,000/-

This year, 2 new categories have been started viz.,

 

Documentaries and Campus films / Quickies.

Prize Money for Best documentary – Rs.21,000/-

Prize Money for Best Campus Film/ Quickie – Rs.11,000/-

The films & documentaries can be made in Telugu, Hindi, English or can also be silent. Short films shall not exceed 20 minutes in time & documentaries 30 minutes or less . The content submitted must be her/his original work. The submission of entries ends on 30th November 2018. The selected films will be screened on 22nd December, 2018 at Prasad Labs Preview Theatre.

Website of Film Festival http://kakatiyafilmfestival.com

For More details, please contact

S.Chandrasekhar, 7680884181 (M)

Convener, Kakatiya Film Festival

An initiative of Samachara Bharati Cultural Association

No. 3-4-852, Keshava Nilayam, Barkatpura, Hyderabad – 500027.

Tel : 040- 27550869; e-mail : kakatiyafilmfestival@gmail.com

ప్రెస్ రిలీజ్ -కాకతీయ ఫిలిం ఫెస్టివల్

Posted Posted in Film Festival, Press release

డా . గోపాల్ రెడ్డి (9849642868)
ప్రెసిడెంట్

ఆయుష్ నడింపల్లి (9848038857)
సెక్రటరీ

ప్రెస్ రిలీజ్

25 అక్టోబర్ 2018

హైదరాబాద్ : సమాచార భారతి సాంస్కృతిక సంస్థ “2వ కాకతీయ ఫిలిం ఫెస్టివల్ ” పేరుతో లఘు చిత్రాల ప్రదర్శన ను 22 డిసెంబర్ నాడు నిర్వహిస్తోంది. భారతీయత కు పునాదులు అయిన సామాజిక భాధ్యత, కుటుంబ విలువలు, సామాజిక విలువలు పెంపొందించటం ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం. నూతన చిత్ర దర్శకులకు తమ అభిప్రాయాలను లఘు చిత్రాల ద్వారా నలుగురికి తెలియజెప్పగలిగే గొప్ప అవకాశం ఇది. యువత యొక్క సృజనాత్మకతను వెలికితీసే వేదిక ఇది.

ఈ పోటీ కి పంపు చిత్రాలకు నిర్దేశించబడిన నేపధ్యాలు:

1. భారతీయ సంస్కృతి మరియు విలువలు
2. జాతీయ మరియు సామాజిక అవగాహన
3. మహిళా సాధికారత
4. నిర్మాణాత్మక పనులు
5. పర్యావరణం

ఈ లఘు చిత్రాల పోటీ కి ప్రవేశము ఉచితం .

యువతని ప్రోత్సహించేందుకు క్రింద చెప్పబడిన విభాగాలలో బహుమతులు కలవు :

ఉత్తమ లఘు చిత్రం: రూ . 51,000/-
రెండవ ఉత్తమ లఘు చిత్రం: రూ . 21,000/-
మూడవ ఉత్తమ లఘు చిత్రం: రూ . 11,000/-

ఈ ఏడాది కొత్త్తగా మరో రెండు విభాగాలు మొదలు పెట్టడం జరిగినది: డాక్యుమెంటరీ, క్యాంపస్ ఫిలిమ్స్

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: రూ . 21,000/-
ఉత్తమ క్యాంపస్ చిత్రం: రూ . 11,000/-

ఈ పోటీ కి పంపే చిత్రాలు తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ భాషలలో తీయాలి. మూకీ చిత్రాలకు కూడా ప్రవేశం కలదు. లఘు చిత్రాల యొక్క నిడివి 20 నిముషాలు, డాక్యుమెంటరీ చిత్రాల నిడివి 30 నిముషాలు మించరాదు. పోటీ కి పంపే చిత్రాలు తమ స్వంతం అయి ఉండాలి . చిత్రాలని పంపుటకు ఆఖరు తేదీ 30 నవంబర్ 2018.
ఎంపిక చేయబడిన చిత్రాలు 22 డిసెంబర్ 2018న ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శింపబడతాయి.

ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ : http://kakatiyafilmfestival.com

మరిన్ని వివరాల కోసం :
ఎస్ చంద్రశేఖర్, 7680884181 (ఫోన్)
కన్వీనర్ , కాకతీయ ఫిలిం ఫెస్టివల్
సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్
3-4-852, కేశవ నిలయం, బర్కత్ పుర, హైదరాబాద్ – 500027
ఫోన్ : 040- 27550869; ఈ -మెయిల్ : kakatiyafilmfestival@gmail.com

Press Release of Kakatiya Film Festival

Posted Posted in Film Festival, Press release

Dr.Gopal Reddy
President – 9849642868(M)

Ayush Nadimpalli
Secretary – 9848038857 ( M )

Press Release

31st October 2018

HYDERABAD : Samachara Bharati Cultural Association is organising the 2nd Edition of “KAKATIYA FILM FESTIVAL”, a short film festival on 22nd December 2018 at Hyderabad. The purpose is to promote Social responsibility , Social values and Family ethos which are the core of Bharat’s Culture. The Film festival offers the new generation filmmakers to present their views through Short-Films.

The festival aims to bring to fore creative talent of the youth and provide them with an opportunity to showcase their thoughts, empathy and breadth of vision on the themes like The themes for this competition are:

  • Bharatiya Culture and Values
  • National and Social Awareness
  • Women Empowerment
  • Constructive Work
  • Environment

Registration for the short film competition is free. As a gesture of encouragement, we are awarding prize money for the following categories ..

Short Film :

Best Short Film : Rs 51,000/- ;

2nd Best Short Film – Rs 21,000/-

3rd Best short film – Rs.11,000/-

This year, 2 new categories have been started viz., Documentaries and Campus films / Quickies.

Prize Money for Best documentary – Rs.21,000/-

Prize Money for Best Campus Film/ Quickie – Rs.11,000/-

The films & documentaries can be made in Telugu, Hindi, English or can also be silent. Short films shall not exceed 20 minutes in time & documentaries 30 minutes or less . The content submitted must be her/his original work. The submission of entries ends on 30th November 2018. The selected films will be screened on 22nd December, 2018 at Prasad Labs Preview Theatre.

Website of Film Festival http://kakatiyafilmfestival.com

For More details, please contact

S.Chandrasekhar, 7680884181 (M)

Convener, Kakatiya Film Festival

An initiative of Samachara Bharati Cultural Association

No. 3-4-852, Keshava Nilayam, Barkatpura, Hyderabad – 500027.

Tel : 040- 27550869; e-mail : kakatiyafilmfestival@gmail.com