సిటిజెన్ జర్నలిజం

ప్రస్తుత సామాజిక పరిస్తితుల్లొ దేశ విద్రోహ వ్యాఖ్యానాలు చేస్తున్న వారిని ఎదుర్కోవడానికి, జాతీయ భావజాలన్ని పెంపొందించి, సానుకూల ధృక్పథాన్ని ఏర్పరచడానికి ప్రతి పౌరుడు నిష్క్రియత్వాన్ని వీడి ఒక సమాజ విలేకరిగా మారాల్సిన సమయం ఆసన్నమయిందని సమాచార భారతి సాంస్కృతిక అధ్యక్షులు విశ్రాంత ఆచార్య శ్రీ గోపాల్ రెడ్డి గారు ఫిబ్రవరి 26, 2017 న హైదరబాద్ లో సమాచార భారతి అనుబంద సంస్థ “విశ్వ సంవాద కేంద్ర, తెలంగాణ” పౌరులే పాత్రికేయులుగా ఎదిగేందుకు ఏర్పాటు చేసిన అర్ద దిన శిక్షణా శిబిరంలో ఉద్ఘాటించారు.
FacebookTwitter

ప్రస్తుత సామాజిక పరిస్తితుల్లొ దేశ విద్రోహ వ్యాఖ్యానాలు చేస్తున్న వారిని ఎదుర్కోవడానికి, జాతీయ భావజాలన్ని పెంపొందించి, సానుకూల ధృక్పథాన్ని ఏర్పరచడానికి ప్రతి పౌరుడు నిష్క్రియత్వాన్ని వీడి ఒక సమాజ విలేకరిగా మారాల్సిన సమయం ఆసన్నమయిందని సమాచార భారతి సాంస్కృతిక అధ్యక్షులు విశ్రాంత ఆచార్య శ్రీ గోపాల్ రెడ్డి గారు ఫిబ్రవరి 26, 2017 న హైదరబాద్ లో సమాచార భారతి అనుబంద సంస్థ “విశ్వ సంవాద కేంద్ర, తెలంగాణ” పౌరులే పాత్రికేయులుగా ఎదిగేందుకు ఏర్పాటు చేసిన అర్ద దిన శిక్షణా శిబిరంలో ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సుమారుగ 65 మంది పాల్గొని శిక్షణ పొందారు.
సమాజంలో జరుగుతున్న దేశ విద్రోహ కార్యకలపాలను పట్టించుకోకుండ ప్రేక్షక పాత్ర వహించవద్దని పునరుద్ఘాటించారు. దురద్రుష్టవశాత్తు కొంత మంది వ్యక్తులు దేశాన్ని దూషించడాన్ని మాట్లాడే స్వేచ్చగా అభివర్నిస్తుండటం, అది మేధావుల చర్యగా భావించడం పూర్తిగా అసంబద్దమని, దేశానికి హానికరమని చెప్పారు.
ఇదే కార్యక్రమంలో, సీనియర్ పాత్రికేయులు “రచన” జర్నలిజం కాలేజి ప్రిన్సిపల్ శ్రీ ఆర్.ఉమమహేశ్వర్ రావు గారు మాట్లాడుతు, వార్తాలు ఏ కోణాల్లో రాస్తారో తెలుపుతూ, పత్రికల యొక్క విధానాలను సంపాదకులకు ఉత్తరాలు రాస్తు ఎలా ప్రభావితం చెయ్యవచ్చో వివరించారు. కార్యక్రమంలొ పాల్గొన్న వారికి కొన్ని రచనా మెలకువలు చెప్తూ ఒక సాధారణ పాఠకుడు సంపాదకులకు ఉత్తరాలు రాసే స్థాయినుంచి వ్యాసాలు, పీఠికలు వ్రాయగలగడమెలాగొ విశదీకరించారు. ఆ తర్వాత సీనియర్ పాత్రికేయులు శ్రీ వేదుల నరసింహన్ గారు మరియు శ్రీ చలసాని నరేంద్ర గారు కార్యక్రమంలొ పాల్గొన్న వారికి మార్గనిర్డేశం చేసారు.
“ది హిందు” పత్రికకు చెందిన శ్రీ పి.వి. శివ కూమార్ గారు మాట్లాడుతూ ఛాయాచిత్రాల యొక్క ప్రాధాన్యతను వివరిస్తు అవి ఎలాంటి సందేశాన్ని,మోసుకెళ్తాయో వాటిని సొషల్ మీడియా లొ ఇతరులకు పంపేటప్పుదు గాని, షేర్ చేసెటప్పుడు గాని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాణాత్మక ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా సమాజం పై చెడు ప్రభావాన్ని చూపే ఫొటోలను ప్రచారం చెయ్యొద్దని ఉద్ఘాటించారు.
సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన శ్రీ ప్రదీప్ వుప్పల గారు వెబ్ టూల్స్ మరియు వాటి ఫీచర్స్, ఉపయోగాల గురించి వివరించారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సొషల్ మీడియా యొక్క ప్రాధన్యతను దాని ప్రభావాన్ని వివరిస్తూ మన యొక్క ఆలోచనలను,అభిప్రాయాలను ఇతరులతొ ఏలా పంచుకొవచ్చో విశదీకరించారు. ఈ సంధర్భంగా వీడియోలు, ఇమేజులతొ పాటు ఇతరసొషల్ మీడియాలు Quora, Wikipedia, personal blogs గురించి వివరించారు.
భారత్ టుడె చీఫ్ ఎడిటర్ శ్రీ వల్లీశ్వర్ గారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సంఘటనలకు సామాన్యులు కూడ స్పందిస్తూ, వార్తల కోసం, పాత్రికేయుల లాగ పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సమాజంలో జరిగే సంఘటనల యొక్క ప్రభావం దీర్ఘకాలం పాటు ఎలా ఉంటుందో ఉదహరించారు.
ఈ సందర్భంగా సమాచార భారతి ప్రదాన కార్యదర్శి శ్రీ ఆయుష్ గారు మాట్లాడుతు స్వాతంత్రసమరయోధులు జాతీయ భావాన్ని పెంపొందించడానికి కలాన్ని వాడుకున్నారని గుర్తుచేసారు. కార్యక్రమములో పాల్గొన్న సభ్యుల్ని ఉద్దేషించి వెంటనే వ్రాయడం ప్రారంభించాలని పిలుపునిస్తూ, కార్యక్రమం పట్ల సలహాలు, సూచనలు కోరారు. కార్యక్రమాన్ని శ్రీ భిక్షపతి గారు కృతజ్ఞత వచనాలతొ ముగించారు.

FacebookTwitter