నారదుడు ఏది చేసిన లోక కళ్యాణం కోసమే…

FacebookTwitter
మే 28వ తేది నాడు సమాచార భారతి ఆధ్వర్యం లో  నారద జయంతి ని  పాత్రికేయ దినోత్సవంగా నిర్వహించింది. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హై స్కూల్‌ లో నిర్వహించబడిన ఈ నారద  జయంతి కార్యక్రమానికి శ్రీ మండలి బుద్ధదేవ్‌ప్రసాద్ (ఏపి అసెంబ్లీ -సభాపతి) ముఖ్య అతిథిగా, శ్రీ కిస్మత్ కుమార్‌గారు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.  శ్రీ నర్సింహమూర్తిగారు (సమాచార భారతి -అద్యక్షులు) ఈ సభకు అద్యక్షత వహించారు. సభ ప్రారంభం లో అంబేద్కర్ జాతీయ దృక్పథం అనే అంశం పై చర్చా కార్యక్రమం జరిగింది. దీన్ని శ్రీ మురళీగారు (ఎక్స్‌ప్రెస్ టీవీ) ప్రారంభించగా, శ్రీ విజయ సారథి గారు (జాగృతి మాజీ సంపాదకఁలు) ముగింపు వాక్యం పలికారు. నారద జయంతి సందర్భంగా నలుగురు పాత్రికేయులను సన్మానించటం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాన్ని శ్రీ క్రాంతిదేవ్ మిత్ర (టివి9) నిర్వహించారు. ఇందులో  130 మంది జర్నలిస్టులు మరియు 30 మంది ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Narada jayanthi, Hyderabad

కార్యక్రమ వివరాలు:
 
ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ ద్వితియ నాడు నారద జయంతి కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతుంటుంది. గడిచిన దశాబ్దానికి పైగా భాగ్యనగర్‌లో సమాచార భారతి ఈ దీన్ని నిర్వహిస్తూ పత్రికా రంగానికి సంబంధించిన కొద్ది మంది జర్నలిస్టులను సన్మానించటం కూడా చేస్తుంటుంది.
ఈ 2016 సంవత్సరం కార్యక్రమానికి  శ్రీ మండలి బుద్ధదేవ్‌ప్రసాద్ (ఏపి అసెంబ్లీ – సభాపతి) ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నారదుడు ప్రపంచ పాత్రికేయులకు ఆదర్శప్రాయుడు అని అన్నారు. నారదుడు అనగానే తగాదాలు  సృష్టించేవాడనే  అభిప్రాయం కలుగుతుంటుంది. అయితే నారదుడు ఏది చేసిన లోక కళ్యాణం కోసమే చేసారు.  ఎక్కడ చెడు ఉంటె దాన్ని రూపుమాపేందుకే  కంకణం కట్టుకొని పనిచేసి లోక కల్యాణం కోసం కృషి చేశారు. నారదుడుని  నారద మహర్షి అని, విజ్ఞణ గని అని ప్రస్తుతించారు. నారదుడికి అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉండేది అని చెప్పారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలు  విలువలు కోల్పోతున్నాయి అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్రికా వ్యవస్థ  విలువలు కోల్పోరాదు  అని గుర్తు చేస్తూ,  ఒకవేళ కోల్పోతే సమాజానికి మంచి-చెడు పై విశ్లేషణ అందించేందుకు  ఆస్కారం లేకుండా పోతుంది అని ఆయన తెలిపారు. శాసన, న్యాయవ్యవస్థ  దారిలో  పెట్టేది పత్రికా రంగమే అని, పాత్రికేయులు ఎక్కడా రాజీ పడకుండా సమాజానికి దిశానిర్దేశం  చేయావల్సింది అని ఆయన కోరారు. పాత్రికేయులు మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పత్రికా రంగం విలువలు పెంచేందుకు  కృషిచేయాలని  చెప్పారు.
DSCN3703
ఈ కార్యక్రమం లో నలుగురు పాత్రికేయులను సన్మానించటం జరిగింది. 1) శ్రీ. కె. రాకా సుధఃకర్, సాక్షి వెబ్ ఎడిటర్ 2) శ్రీమతి. సుప్రశాంతి దేవి (రేడియో న్యూస్ ఎడిటర్) 3) శ్రీ. ఎర్రం నర్సింగరావు (ఈనాడు రిపోర్టర్) 4) శ్రీ. సతీష్‌ కుమార్ (సాక్షి ఛానెల్). వీరందరిని బుద్ధదేవ్‌ ప్రసాద్ , కిస్మత్ కుమార్ గారు తదితరులు సన్మానించారు . జాగృతి పూర్వ సంపాదకులు శ్రీ భండారు సదాశివ రావు గారి పేరు మీద ఉన్న భండారు సదా శివరావు స్మారక పురస్కారం శ్రీ. కె. రాకా సుధాకర్ గారికి, శ్రీమతి సుప్రశాంతి దేవి గారికి ఇవ్వటం జరిగింది. శ్రీ వడ్లమూడి రాంమోహన్‌రావుగారి స్మారక పురస్కారం, శ్రీ. నర్సింగరావు గారికి, శ్రీ సతీష్ కుమార్‌ గారికి ఇవ్వటం జరిగింది. సన్మానంతరం సన్మాన గ్రహితలు తమ స్పందనను తెలియజేశారు.
DSCN3681
DSCN3695
ఈ సందర్భంగా రాకా సుధాకర్‌గారు మాట్లాడుతూ, ఈ సన్మానం నాకు  తల్లి తన కుమారుడుకి పెట్టిన ముద్దు లాంటిది. నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే సైద్ధాంతిక సంఘర్షణలో కమ్యునిజం  అంతం అయిన తరువాత, 1992వ సంవత్సరంలో హిందుత్వ భావం జాగృతమవుతున్న సమయంలో నేను పత్రికా రంగంలోకి ప్రవేశించాను. తర్వాత టెక్నాలజీ మారిపోయిన సమయంలో నేను పని చేసుకుంటూ  పోతున్నాను. ఇదంతా కాలం వల్ల వచ్చిన మార్పు. అందరికీ ఆదర్శ జర్నలిస్ట్ కేశవ బలిరాం హెడ్గేవార్. వారు హిందురాష్ట్ర అనే పత్రికను నడిపించారు. పత్రిక నడుపడంలో వారికి అనుభవాలతో పాటు, దాన్ని నడుపడంలో ఉండే సాధక బాధకాలు కూడా వారికి బాగా తెలుసు. అటువంటి కేశవ బలిరాం పంత్‌ హెడ్గేవార్‌ గారు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో నేను స్వయం సేవకుడిగా చేరడం నాకు ఎంతో గర్వకారణం. నేను చేస్తున పనిలో సక్రమంగా ముందుకు  పోయేందుకు ఒక ప్రేరణగా ఈ సన్మానాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను అని వివరించారు. 
DSCN3687
శ్రీమతి సుప్రశాంతి దేవిగారు మాట్లాడుతూ పాత్రికేయురాలిగా తనకు  డిఫెన్స్ కు సంబంధించిన  పత్రిక జీవితంలో ఎంతో మలుపుతిప్పింది అన్నారు. ఆ తదుపరి రేడియో స్టేషన్లో చేరిన తరువాత అనేక స్ఫూర్తి దాయకమైన అనుభవాలు నాకు ఎన్నో  తగిలాయి. ప్రదాన మంత్రితో ప్రయాణించి ప్రపంచంలో మిగతా దేశాలలో జరిగిన కారఁక్రమాల రిపోర్టింగ్ కూడా చేశాను. విలువలను ప్రధానంగా ప్రసారం చేయటంలో నా వంతు కృషి నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను అని చెప్పారు.
శ్రీ నర్సింగ్‌రావుగారు మాట్లాడుతూ పాత్రికేయరంగంలో తన అనుభవాలను వివరించారు. ఈనాటి పరిస్థితుల్లో మంచి పాత్రికేయుడిగా బలపడాలంటే కలంతో పాటు గళం కూడా ఉండాలి అని అన్నారు. సమాజంలో ఒక మార్పుకోసం మనం కూడా ఎంతో కృషిచేయవచ్చు అంటూ వారు నివసించే ప్రాంతం కవాడిగూడ కు  సంబంధించిన ఒక ఉదాహరణను తెలియ చేసారు . కవాడిగూడలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గురుంచి ఎవరయినా  ఎక్కడ  అని అడిగితే తెలీదు అనేవారు, మరీ మరీ అడిగితే అరే “చెత్త కుండి స్కూలా ” అని అనేవారు. స్కూలును చెత్తకుండి స్కూలుగా పిలవబడటం నాకెంతో బాధ కలిగించింది. ఆ చెత్త కుండి అక్కడి నుండి తీసేసి ఆ స్కూలుకు  ఆ పేరు లేకుండా  చేయాలి అని సంకల్పించుకొని ఆ ఏరియాకు  సంబంధించిన పోలీస్ అధికారితో మాట్లాడి వారి సహకారంతో స్థానికులు, స్థానిక రాజకీయ నాయకుల  సహకారంతో కొన్ని రోజులపాటు కృషిచేసి ఆ చెత్త కుండిని అక్కడి నుంచి తొలగించాం. కాబట్టి పాత్రికేయుడికి కళంతో పాటు గళం ఉంటె సామాజిక అవసరాలను కూడా తీర్చేందుకు పని చేయవచ్చు. అట్లా చేస్తూ ఒక ఆదర్శ పాత్రికేయుడిగా మనం నిలబడాలి. నేను అట్లా నిలబడేందుకు  ఈ సన్మానం నాకొక ప్రేరణగా నేను భావిస్తున్నాను అని  చెప్పారు.
శ్రీ సతీష్ కుమార్‌ గారు మాట్లాడుతూ ఒక మంచి పాత్రికేయుడిగా నిలబడేందుకు  అనేక మందితో -మంది తో సంభంధాలు ఉపయోగపడుతూ  ఉంటాయి. నాకు  ఈ సన్మానం ఒక మంచి పాత్రికేయుడిగా నిలబడేందుకు ఒక ప్రేరణగా దీన్ని నేను భావిస్తున్నాను. 
ముఖ్య అతిథిగా పాల్గొనవల్సిన స్వామిగౌడ్‌ (కౌన్సిల్) గారు  రాలేకపోయినందుకు తన అసక్తతను వ్యక్తం చేస్తూ వారు ఒక సందేశం ఈ  పంపించారు. సందేశం సంక్షిప్తంగా..”లోక కల్యాణం కోసం నారద మహర్షి చేసిన గొప్ప కార్యక్రమాల  గురించి తన సందేశంలో వివరించారు.
ఈ కారఁక్రమం చివర్లో వందన సమర్పణ శ్రీమతి దేవిక చేశారు. శ్రీ నీలేష్ పాడిన జాతీయగీతం జనగణమనతో కార్యక్రమం ముగిసింది. ఇంకా ఈ కార్యక్రమం లో  సమాచారా భారతి ఉపాధ్యక్షుడు  బి. నర్సింహమూర్తి, కిస్మత్‌ కుమార్, విజయ సారథి తదితరులు పాల్గొన్నారు. 
IMG_20160528_114822
FacebookTwitter