చట్టంలో ఉన్న లోపాలను- లా కమిషన్ చర్చించాలి

FacebookTwitter

భారత్ కి బార్ భాది తక్ జంగ్ రహేగీ, జంగ్ రహేగీ! భారత్ తెరే తుక్డే  హోంగే, ఇంషా అల్లాహ్ , ఇంషా అల్లాహ్!, అఫ్జల్ కి హత్య నహి సహెంగే, నహి సహెంగే!, ఇండియన్ ఆర్మీ ముర్దాబాద్ ముర్దాబాద్! లాంటి దేశ వ్యతిరేక నినాదాలు ఒక సాంస్కృతిక కార్యక్రమం పేరుతో దేశ రాజధాని లోని జవహర్ లాల్ యూనివర్సిటీ లో తలపెట్టిన, సహకిరించిన వారిపై  కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే.

ఫిబ్రవరి 9 నాడు డిల్లి లో వెలువడ్డ ఈ నినాదాలు ప్రభుత్వం ప్రయోగించిన సెక్షన్ 124A రాజద్రోహం చట్ట పరిధిలోకి వస్తాయా అనే చర్చ ఒక వైపు, లేదా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన  భావ ప్రకటన స్వేచ్చ  కు సంబంధించినదా అని విశ్లేషించాల్సిన సందర్బం.

నాలుగు దశాబ్దాల క్రితమే 1971 సంవత్సరం లో సెక్షన్ 124A పై క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత లా కమిషన్ తన నివేదికలో ఈ చట్టాన్నీ మరింత పటిష్ట పరిచి, పునః సమీక్ష చేసి, ఏకీకృతం చేయాల్సిన అవరసరాన్ని దృష్టికి తీసుకొని వచ్చింది. అదే విధంగా ఈ చట్టాన్నీపునర్ నిర్వచిస్తూ, ఉద్దేశ పూర్వకంగా  దేశ సమగ్రతకు, భద్రతకు హాని తలపెట్టాలి అనుకునే చర్యలను, జాతీయ చిహ్నాలను అవమానించే ధోరణి  కూడా దీని పరిధిలోకి తీసుకొని రావాలి అని సూచించింది.

దేశ సమగ్రతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, భద్రతా దళాలను దూషించడం లాంటి వాటిని కేవలం కొద్ది మంది, లేదా లా కమిషన్ లాంటివి మాత్రమే పసిగట్టి సెక్షన్ 124A లాంటి చట్టం యొక్క పరిధి విసృత పరచాలని కోరింది.

జె.ఎన్.యు మరియు జాధవపూర్ యూనివర్సిటీ లో జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నినాదాలు, వాటినే సమర్ధించే ర్యాలీలు భారత్ దేశం పై ప్రత్యక్షంగా దాడి చేయడమే. ఇవి మన రాజ్యాంగ మూలాలు అయిన పౌరుల భద్రత, ఐక్యత పై సవాలు విసరడమే, దాంతో పాటు రాజ్యాంగం ద్వార సంక్రమించబడిన భాద్యతలను ఉద్దేశ పూర్వకంగా భంగ పరచడము.

42 వ లా కమిషన్ తన సిఫారుసులో దేశ సరిహద్దులు, న్యాయ, పార్లమెంటరీ వ్యవస్థపై ప్రశ్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరింది. ప్రస్తుతం మన ఎదుర్కుంటున్న  జె.ఎన్.యు సంఘటన లు కూడా మన రాజ్యాంగ విలువలను, దేశ సమగ్రతను, ఐక్యత, న్యాయ వ్యవస్థ, భద్రత దళాలపై మరి ముఖ్యంగా ఎన్నికోబడ్డ ప్రభుత్వం పై దాడిగా పరిగనించాల్సిందే.

దేశ హోం మంత్రి రాజనాథ్ సింగ్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఉన్న చట్టాన్ని పునః సమీక్షిస్తూ, లా కమిషన్ సంప్రదింపులతో చట్ట పరంగా ఉన్న శూన్యతను భర్తీ చేస్తూ, నిందితులను మొగ్గ దశలోనే, దేశ వ్యతిరేక చర్యలకు చరమ గీతం పాడాల్సిందే.

FacebookTwitter