ఒకే వ్యక్తి మూడు జాతీయతలు

mansoor ali
FacebookTwitter

51960179

1947 ఆగస్టు 14వ తేది నాడు భారతదేశం నుంచి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్‌ ప్రజల జాతీయత ఒక్కరోజులోనే మారిపోయింది. అంటే జాతీయత అనేది ఒక్కరోజులోనే మారిపోతుంది అనేది భారతదేశ చరిత్ర చెప్పిన పాఠం.  ఆ తదుపరి కాలంలో అనేక రకాల సమస్యలు రావటానికి అదే కారణమైంది. పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయిన తరువాత ఆ బంగ్లాదేశ్‌ ప్రజల జాతీయత మారిపోయింది.  ఒకే వ్యక్తి తన జీవితకాలంలో మూడు జాతుల వ్యక్తిగా గుర్తింపుపొందాడు. అట్లాంటి వేల ఉదాహరణలు మనకు కనబడతాయి. అలాంటి తాజా ఉదాహరణ 77 సంవత్సరాల వయస్సు కలిగిన మన్‌సూర్‌ అలి. బంగ్లాదేశ్‌ సరిహద్దులో నివసిస్తున్నారు. ఆయన జీవితంలో మూడు జాతీయతలు మారారు. పశ్చిమబెంగాల్‌లో ఉన్న గ్రామంలో పుట్టాడు. దేశ విభజన తరువాత ఆ భాగం పాకిస్తాన్‌లో కలిసింది. అప్పుడు పాకిస్తానీ అయ్యాడు. ఆ తరువాత 1971లో బంగ్లాదేశ్‌ ఏర్పడిరది. అప్పుడు బంగ్లాదేశీ అయినాడు. అప్పుడు కూడా సమస్యలే ఎదుర్కొన్నాడు. ఈ మధ్య భారత్‌ బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా ఆ గ్రామం పశ్చిమబెంగాల్లో కలిసింది. ఇప్పుడు అతను భారతీయుడు అయినాడు. రేపు మే5న పశ్చిమబెంగాల్ ఎన్నికలలో ఓటు వేయాబోతున్నాడు. అది మన దేశ విభజన పరిణామము.

FacebookTwitter