ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి గారి పత్రిక ప్రకటన

FacebookTwitter

భారతదేశము సదా వ్యవసాయ ప్రధాన దేశము మరియు భారతీయ గోవులు వ్యవసాయానికి ఆధారముగా వుండేవి. రసాయనక ఎరువులు మరియు రసాయనక క్రిమి సంహారక మందుల అత్యధిక ప్రయోగము వలన కలిగే దుష్ప్ర్రభావాలను ప్రపంచము ఎదురుకుంటున్నది. ఈ  సమయములో గోవు ఆధారిత సేంద్రీయ వ్యవసాయానికి ఎంతో ప్రాముఖ్యత కలదు. ఇందువలన గోసేవ మరియు గోరక్ష విషయములో హిందూ సమాజము మరియు ఇతర సామాజిక బంధువులు చూపే శ్రధ్ధ ఎంతో మహత్వపూర్ణమైనది.  మహత్మా గాంధీ గారు, వినోబా గారు మరియు మాలవీయ గారు మొదలైన ప్రముఖులు ఈ పవిత్ర కార్యాన్ని తమ జీవితములోని అత్యంత ముఖ్యమైన విషయముగా భావించారు.

గోరక్ష అనే ముసుగులో  సమాజములోని కొందరు అరాచక శక్తులు చట్టాన్ని తమ చేతులలోకి  తీసికొని హింసా పూరితమైన చర్యల వలన సమాజములోని సుహృద్భావనను విచ్చిన్నం చేసే ప్రయత్నము చేస్తున్నారు. ఇందువలన గోరక్ష మరియు గోసేవా అనే పవిత్ర కార్యముల పట్ల అనుమానాలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. గోరక్ష పేరుమీద కొందరు అవకాశవాదులు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలను నిజంగా గోరక్ష వంటి పవిత్ర కార్యములో పాల్గొంటున్న దేశవాసులతో జోడించరాదు. అటువంటి విచ్చిన్నకర  శక్తుల నిజ రూపాన్ని బయటపెట్టాలనీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశవాసులకు పిలుపునిస్తున్నది.  ఈ విషయములో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి  అసాంఘిక శక్తులను గుర్తించి చట్టరీత్యా తగిన  చర్య తీసికోవలసినదనీ మరియు నిజమైన గోరక్షకులను గానీ గోసేవ చేసేవారికి ఇబ్బందులు కలగించారాదని  ఇందుమూలముగా కోరడమైనది.

జారీ చేసిన వారు

డా. మన్మహన్ వైద్య

(అఖిల భారత ప్రచార ప్రముఖ్)

ఢిల్లీ

8 ఆగష్టు, 2016

FacebookTwitter