News

పాకిస్తాన్ లో బాంబు దాడి

Posted

పాకిస్తాన్ దేశం లోని లాహోర్ గుల్షన్-ఏ-ఇక్బాల్ పార్కులో  మార్చ్ 27 నాడు సాయంత్రం క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న సందర్బంగా పార్క్ గేటు వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది కి పైగా మృతి చెందారు, ౩౦౦ కు పైగా గాయపడట్టు గా భావిస్తున్నారు. ఈ దాడిలో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలు మృతి చెందారు.

క్రైస్తవులను ద్యేయంగా చేసుకొని మార్చ్ 27 నాడు లాహోర్ లో జరిగిన బాంబు దాడిలో దాదాపు 70 కి పైగా మృతి చెందారు, గాయపడిన వారి సంఖ్య ౩౦౦ మంది వరకు ఉండొచ్చు అని భావిస్తున్నారు. లాహోర్ లోని  గుల్షన్-ఏ-ఇక్బాల్ పార్కులో  సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో గేటు వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో అక్కడ ఈస్టర్ పండుగ సందర్బంగా సరదాగా గుడుపుతున్న పిల్లలు, మహిళలు ఎక్కువగా చనిపోయనారు.

ఈ చర్యను ఖండిస్తూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ప్రధాన, విపక్ష పార్టీ నేతలందరు గూడా ఖండిచారు. ఈ దాడికి బాధ్యతగా జమాత్-ఉల్-ఆహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్నది.

ఈ చర్యను ఖండిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ట్ట్విట్టర్లో సానుభూతి తెలిపారు.